ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
ప్లానింగ్ టైమ్‌లో పురుషులు లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం లేదా మొబైల్‌ను ప్యాంట్‌జేబులో ఉంచుకోవడం చేయకూడదు. (ఇవి స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఆ విషయంలో ఆందోళన వద్దు. అయితే స్పెర్మ్ నాణ్యత బాగుండటం కోసం ప్రకృతి శుక్రకణాల ఉత్పత్తి జరిగే చోటుని శరీర ఉష్ణోగ్రతకు దూరంగా ఉంచడం కోసం శరీరం నుంచి దూరంగా వృషణాల సంచిలో ఉంచింది. అక్కడ ఉష్ణోగ్రత పెరిగేలా ల్యాప్‌టాప్‌తో పనిచేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం లేదా అవి మందకొడిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త).
గర్భధారణ వేగంగా జరగడానికి అంటూ పల్లెటూళ్లలో ఇచ్చే నాటుమందులనూ, హెర్బల్ మందులంటూ లభ్యమయ్యే పొడుల వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇలాంటివి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు.
సోయా ఉత్పాదనలు, టోఫూ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు.
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత దంపతుల్దిరూ మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలోనే గర్భధారణ జరగకపోతే అంతలోనే నిరాశ వద్దు. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.
No comments:
Post a Comment