మీల్ మేకర్ గోంగూర
|
|
|
|
|
|
వీకెండ్స్ అయినా... వీక్ స్టార్ట్ అయినా... డే అయినా, నైట్ అయినా... బ్రేక్ ఫాస్ట్ అయినా, ఈవెనింగ్ స్నాక్స్ అయినా వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా... గెస్ట్‌లొచ్చినా, గెట్ టు గెదర్ అయినా... మీల్ మేకర్ ఉంటే నో ఫికర్! మీల్ మేకర్ అంటే నో ఫియర్! మీల్ మేకర్ వండితే టేస్ట్ వండర్! మీల్ మేకర్ పోషకాల లిస్ట్‌లో ఆల్‌రౌండర్! ఈ సండే మీల్ మేకర్‌ని మేకింగ్ చేయండి... మా ఇంటి ‘వెల్ మేకర్’ అనే పేరును మీ సొంతం చేసుకోండి. కావలసినవి: మీల్‌మేకర్ - 15 , గోంగూర - 2 కట్టలు, గసగసాలు - టీ స్పూన్, ఎండుకొబ్బరి - 10 గ్రా., గరమ్ మసాలా- అర టీ స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్, కారం - 3 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, జీలకర్రపొడి - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, పసుపు - పావు టీ స్పూన్, జీడిపప్పు - 25 గ్రా., పచ్చిమిర్చి - 5, టొమాటో - 3, ఉల్లిపాయలు - 2, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్ తయారి: మీల్‌మేకర్‌ని వేడినీళ్లలో తడిపి, నీళ్లు పిండి, పక్కన పెట్టాలి. గోంగూర, పచ్చిమిర్చి, జీలకర్ర మూడు కలిపి పేస్ట్ చేయాలి. జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి, వేగనివ్వాలి. అందులో గోంగూర పేస్ట్ కలిపి, ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం కలిపి, ఉడికించి, చివరగా మీల్‌మేకర్‌ని కలపాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
|
మీల్ మేకర్ కబాబ్
|
|
|
|
|
|
కావలసినవి: మీల్‌మేకర్ - 50 గ్రా., అల్లం - చిన్న ముక్క(కచ్చాపచ్చాగా దంపాలి)., వెల్లుల్లి -5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంపాలి)., పచ్చిమిర్చి - 4 (సన్నగా కట్ చేయాలి), కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు., బంగాళదుంప - 2 (ఉడికించి, ముక్కలుగా కట్ చేయాలి), వేయించిన శనగలు - టేబుల్ స్పూన్., బ్రెడ్ పౌడర్ - రెండు టీ స్పూన్లు., ధనియాల పొడి - అర టీస్పూన్, ఆమ్‌చూర్ పౌడర్ (డ్రై మ్యాంగో పౌడర్) - పావు టీస్పూన్, తెల్ల మిరియాల పొడి - పావు టీ స్పూన్, పసుపు - కొద్దిగా, ఉప్పు- సరిపడ, నూనె- సరిపడ తయారి: ముందుగా మీల్‌మేకర్‌ని మిక్సర్‌లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేడినీళ్ళలో కలిపి, పిండి, నీళ్లను వేరు చేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక, అల్లం, వెల్లులి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించాలి. తరువాత మీల్ మేకర్ పొడి, బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేయాలి. స్టౌ మీద నుంచి దించి, చల్లారిన తరువాత, కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని ఉండలా చేసి, చేత్తో అదమాలి. వాటిని నూనెలో రెండువైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి, తీసి, ప్లేట్లో సర్దాలి. పైన చాట్ మసాలా చల్లి సర్వ్ చేయాలి.
|
మీల్ మేకర్ చిల్లీ
|
|
|
|
|
|
కావలసినవి: మీల్‌మేకర్ -15, కార్న్ ఫ్లోర్ - 20 గ్రా., మైదా - 20 గ్రా., టేస్టింగ్ సాల్ట్ - పావు టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి - పావు టీ స్పూన్, ఉప్పు- సరిపడ, నూనె - సరిపడ, సోయాసాస్ - 3 చుక్కలు, రెడ్ చిల్లీ సాస్ - టీ స్పూన్, అల్లం తరుగు - అర టీ స్పూన్, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్., పచ్చిమిరపకాయలు - 4(సన్నగా తరగాలి), క్యాప్సికమ్ తరుగు - అర టీ స్పూన్, ఉల్లిపాయల తరుగు - అర, టొమాటో కెచప్ - అర టీ స్పూన్, గుడ్డు - 1, ఉల్లికాడల తరుగు - టీ స్పూన్. తయారి: ముందుగా మీల్‌మేకర్‌ని వేడినీళ్లలో నానబెట్టాలి. నానిన మీల్‌మేకర్‌ని పిండి, రెండు పీసులుగా కట్ చేసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేయాలి. దానిలో కార్న్‌ఫ్లోర్, మైదా, టేస్టింగ్ సాల్ట్, మిరియాలపొడి, గుడ్డు, ఉప్పు, రెడ్ చిల్లీ సాస్... వేసి కలపాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి, మీల్‌మేకర్ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత వేరొక బాణలిలో నూనె వేసి, వేడయ్యాక అందులో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటో కెచప్, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, కొద్దిగా నీళ్లు, ఉప్పు, టేస్టింగ్ పౌడర్, మిరియాలపొడి, ఉల్లికాడల తరుగు సూప్ తయారుచేసుకోవాలి. ముందుగా తయారు చేసిన మీల్‌మేకర్ ఫ్రైని ఈ సూప్‌లో కలిపి వేరే బౌల్‌లో పోయాలి. దానిపైన గార్నిష్ కోసం ఉల్లికాడల తరుగు, సాస్ వేసి, సర్వ్ చేయాలి.
|
మీల్ మేకర్ పకోడి
|
|
|
|
|
|
కావలసినవి: మీల్‌మేకర్ - 10, పచ్చి బఠానీలు - 50 గ్రా., బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు, శనగపిండి - 2 టీ స్పూన్లు, కారం - టీ స్పూన్, ధనియాల పొడి - అర టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, మెంతిపొడి - అర టీ స్పూన్ తయారి: మీల్‌మేకర్ నీళ్లలో నానబెట్టి, మెత్తగా అయిన తరువాత, పిండి నీళ్లను తీసివేసి, వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బఠానీలను పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మీల్‌మేకర్ ముక్కలు శనగపిండి, బియ్యప్పిండి, బఠానీపేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి, సరిపోయినంత నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి. తరువాత కడాయిలో నూనె మరిగాక, దానిలో చిన్న చిన్న పిండి ముద్దలు వేసి, ఫ్రై చేసి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. పకోడినిసాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మీల్ మేకర్ పాయసం
|
|
|
|
|
|
కావలసినవి: మీల్‌మేకర్ - 50గ్రా., పాలు - అరలీటరు, పంచదార - 50గ్రా., జీడిపప్పు -10గ్రా., కిస్‌మిస్- 10గ్రా., బాదాం పప్పు - 5, కుంకమ పువ్వు - కొద్దిగా (కలర్ కోసం), నెయ్యి - టీ స్పూన్, పచ్చ ఏలకులు - 2, పిస్తాపప్పు - టీ స్పూన్. తయారి: మీల్‌మేకర్‌ను వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలి. మందంపాటి గిన్నెలో పాలను మరిగించాలి. మీల్‌మేకర్‌ని నీళ్ల నుంచి బయటకు తీసి, గట్టిగా పిండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బాగా కాగిన పాలలో పంచదార, కుంకమ పువ్వు, ఏలకులు, కిస్‌మిస్, జీడిపప్పు వేసి, కలిపి మరికాసేపు మరిగించాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మీల్‌మేకర్‌ని పాలలో వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడేంత వరకు ఉంచి, తరువాత వేరే గిన్నెలోకి పోయాలి. గార్నిష్ కోసం పిస్తా, బాదం పప్పు పలుకులు పైన వేయాలి.
మీల్ మేకర్ కీమా మసాలా
|
|
|
|
|
|
కావలసినవి: మీల్‌మేకర్ - 20, ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి), టొమాటో - 1 (సన్నగా తరగాలి), పచ్చిమిరపకాయలు - 4 (సన్నగా తరగాలి), జీడిపప్పు - 25 గ్రా., పిస్తాపప్పు - 10 గ్రా., అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రా., జీలకర్ర - అర టీ స్పూన్, గరం మసాలా - అర టీ స్పూన్, కారం - టీ స్పూన్, ధనియాల పొడి - అర టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూన్, పసుపు - అర టీ స్పూన్, నూనె - సరిపడినంత, నెయ్యి - అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ - అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు - టీ స్పూన్, ఉప్పు - తగినంత తయారి: ముందుగా మీల్ మేకర్ బాల్స్‌ని వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి, పిండి నీళ్లు తీసేయాలి. తర్వాత కీమా లాగ కటింగ్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, టొమాటో, పసుపు వేసి కలిపి, వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. జీడిపప్పు, పిస్తా పప్పు పేస్ట్ చేసి ఇందులో కలపాలి. మీల్‌మేకర్ మిశ్రమం, కీమా, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ వేసి, అన్నీ కలుపుతూ వేగనివ్వాలి. కూర పూర్తయిన తర్వాత వేరొక పాత్రలోకి తీసి, అలంకరణకు కొత్తిమీర తరుగు, ఫ్రెష్‌క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.
మీల్ మేకర్ చిట్కాలు
|
|
|
|
|
|
మీల్ మేకర్‌ని సోయా చంక్స్ అంటారు. సోయా పిండి, గోధుమలు, ఓట్స్, కాటన్ సీడ్ పౌడర్స్‌తో రకరకాల షేపుల్లో, సైజుల్లో మిషనరీ ద్వారా వీటిని తయారుచేస్తారు. మీల్ మేకర్ పూర్తిగా ప్రొటీన్ ఫుడ్. దీనిని కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారంతోనూ కలిపి వండచ్చు. మీల్ మేకర్‌ని కొనుగోలు చేసేముందు ప్యాకేట్ మీద వెజ్ లేదా నాన్‌వెజ్, ప్రొటీన్ కంటెంట్, ధర, తయారీ తేదీ, గడువు తేదీలను పరిశీలించి తీసుకోవాలి. మరిగే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, మీల్‌మేకర్ వేసి, పైన సగం వరకు మూత పెట్టాలి. మీల్ మేకర్ పరిమాణాన్ని బట్టి 5,10,15 నిమిషాల సమయం ఉంచాలి. తర్వాత మీల్‌మేకర్ బాల్‌ని చేత్తో పిండి, మరొక ప్లేట్‌లో పెట్టి, కూరకు సిద్ధం చేసుకోవాలి. చెఫ్: మొహమ్మద్ సాజిద్, కర్టెసీ: ప్యాపిరస్ పోర్ట్ తిమ్మాపూర్, మహబూబ్‌నగర్
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
No comments:
Post a Comment