all

Tuesday, January 15, 2013

నాటు కోడి 65


కావలసినవి: నాటుకోడి మాంసం - 250 గ్రా.; గుడ్డు - 1; కార్న్ ఫ్లోర్ - 5 టీ స్పూన్లు; మైదా - 3 టీ స్పూన్లు; నూనె - 200 గ్రా.; పంచదార - చిటికెడు; మిరియాల పొడి - అర టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 4; పెరుగు - ఒక కప్పు; ఉప్పు - తగినంత; అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; చిల్లీసాస్ - టీ స్పూన్; టొమాటో సాస్ - టీ స్పూన్

తయారి: నాటు కోడి ముక్కలను ఒక్క గిన్నెలోకి తీసుకొని, దానిలో కార్న్‌ఫ్లోర్, మైదా, గుడ్డుసొన వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి, కాగాక, కలిపి పెట్టిన కోడి ముక్కలను రెండు వైపులా వేయించి తీయాలి.

మరొక కడాయిలో కొద్దిగా నూనె వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని సగానికి విరిచి వేయాలి. వేగిన తర్వాత పెరుగు, చల్లీసాస్, టొమాటో సాస్, మిరియాలపొడి వేసి కలపాలి.

మంట తీసేసి పై మిశ్రమంలో వేయించిన కోడి ముక్కలను వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

No comments: