all

Tuesday, January 15, 2013

చెట్టినాడు ప్రాన్స్


కావలసినవి:
 రొయ్యలు (తోక ఉంచాలి) - 8;
 ధనియాల పొడి- 25 గ్రా.;
 జీలకర్ర పొడి - 20 గ్రా.;
మిరియాల పొడి - 16 గ్రా.;
 స్టార్ అనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) - 25 గ్రా.; కల్పసి (మార్కెట్లో లబిస్తుంది) - టీ స్పూన్; మరాఠీమొగ్గ్గ (మార్కెట్లో లభిస్తుంది) - చిటికెడు; జాజికాయ - 1 (పొడి చేయాలి);
 ఏలకులు - 2 (పొడి చేయాలి);
దాల్చిన చెక్క - చిన్న ముక్క (పొడి చేయాలి); లవంగాలు - 3 (పొడి చేయాలి);
సోంపు (వేయించి పొడి చేయాలి) - 8 గ్రా.;
 హంగ్ కర్డ్ (ఒక పలుచని వస్త్రంలో పెరుగు వేసి, వడకట్టి, నీరు తీసేసినది) - 50 గ్రా.;
 నిమ్మకాయ - 1;
పసుపు - చిటికెడు;
 ఆవనూనె - టీ స్పూన్;
 అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్;
 ఉప్పు - తగినంత

తయారి:
 ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రపరిచిన రొయ్యలను వేసి, అల్లం వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి, కలిపి, కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి. మరొక గిన్నెలో ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, స్టార్ అనైజ్, కల్పసి, మరాఠీమొగ్గ, జాజికాయ పొడి, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి చేయాలి. సోంపు పొడి, ఉప్పు వేసి కలపాలి.

దీంట్లో ఆవనూనె, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించి అరగంట ఉంచాలి. కొబ్బరి పుల్లలకు మ్యారినేట్ చేసిన ప్రాన్స్‌ను గుచ్చి, గ్రిల్ చేయాలి. వీటిని వేడి వేడిగా నచ్చిన చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.

No comments: