all

Tuesday, December 18, 2012

మ్యాంగో(మామిడి) కోవా ..

కావలసిన పదార్థాలు; 

మామిడిపండ్లు: 2(బాగా పండినవి)
 పాలు: 4cups
 పంచదార: 1/2cup
 నెయ్యి: 1tbsp
Mango Kova

 
తయారు చేయు విధానం:

1. ముందుగా బాగా పండిన మామిడి పండ్లను పొట్టుతీసి గుజ్జును వేరుచేసుకోవాలి. తర్వాత ఈ మామిడిపండు ముక్కలను ముక్కలుగా లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి.

 2. తర్వాత ఒక బౌల్ లేదా పాన్ లేదా పాల కుక్కర్ లో పాలు పోసి, బాగా కాగనివ్వాలి. పాలు బాగా కాగి, సగబాగానికి వచ్చే సమయంలో అందులో మామిడి గుజ్జును వేసి, మంట ఎక్కువగా పెట్టి బాగా కలపాలి. చిక్కటి పాలు, మామిడి పండు రెండూ ఒకదానితో ఒకటి బాగా మిక్స్ అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి.

3. ఒక్కసారిగా మామిడిపండు, పాలు మిశ్రమం గట్టిపడే సమయంలో పంచదార, నెయ్యిని కలుపుకోవాలి. పంచదార, నెయ్యి కూడా బాగా కలిసిపోయేలా మిక్స్ చేయాలి.

4. ఇప్పుడు మంట తగ్గించి మరి కొద్దిసేపు స్టౌ మీదనే పెడితే మిశ్రమం అంత గట్టి పడుతూ కోవా మృదువుగా తయారవుతుంది. స్టౌ ఆఫ్ చేసి పాన్ ను క్రింది దింపుకోవాలి.

5. ఒక ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి అందులో కోవా మిశ్రమాన్ని పోసి గోరు వెచ్చగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కావలసిన ఆకారంలో కట్ చేసుకొని, తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల కోవా చల్లారే కొద్ది గట్టిపడుతుంది. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి కావల్సినప్పుడు బయటకు తీసి కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవచ్చు.
అంతే మ్యాంగో కోవా రెడీ.

 సూచన:
1.పాలు కాచేటప్పుడు పాలు గిన్నె మాడకుండా కలబెడుతూనే ఉండాలి.
2. మామిడి పండ్లు రుచిని బట్టి పంచదారను ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.
3. కావాలనుకొంటే కొద్దిగా పచ్చి కోవాను, యాలకుల పొడిని కూడా మిక్స్ చేసుకోవచ్చు. 


ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ వెజిటేబుల్ ఉప్మా ........

సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ వంటకాల్లో ఉప్మా చాలా ఫేమస్. ఎందుకంటే చాలా సింపుల్ గా, చాలా సులభంగా, అతి తక్కువ సమయంలో తయారు చేసేస్తారు కాబట్టి. టైమ్ లేనప్పుడు చటుక్కున గుర్తుంచేస్తుంది. చిటికెలో చేసేస్తారు ఉప్మాను. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తింటారు. మరియు మధ్యాహ్నాన లంచ్ బాక్స్ లలోనికి సర్దేసుకొంటారు. ఉప్మాను తయారు చేయడంలో చాలా పద్దతులు ఉన్నాయి. దీన్ని గోధుమ రవ్వతో తయారు చేస్తారు. అయితే కొంచెం ఢిఫరెంట్ గా బ్రెడ్, వెజిటేబుల్ తో తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా కంటే అతి తొందరగా తయారు చేసేయెచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం... bread vegetable upma filling breakfast

కావలసిన పదార్థాలు:

 రవ్వ: 1cup
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యారెట్: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
 క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
 పచ్చిబఠాణీ: 2tbsp
 టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బ్రెడ్ స్లైస్: 8-10(చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
ఆవాలు: 1tsp
 శెనగపప్పు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
 గరం మసాలా: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
నీళ్ళు : 2cups
 కొత్తిమీర: 2tsp(చిన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:

 1. ముందుగా పాన్ వేడి చేసి అందులో నూనె వేసి వేడిఅయ్యాక అందులో రవ్వ వేసి అతి తక్కువ మంట మీద వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి.

 2. ఇప్పుడు పాన్ లో సరిపడినంత నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులో కరివేపాకు, శెనగపప్పు వేసి సన్నని మంటమీద ఒక నిముషం వేయించుకోవాలి.

3. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిముషం వేయించి, వెంటనే క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలను కూడా వేసి, వెజిటేబుల్స్ మెత్తబడేంతవరకు తక్కువ మంట మీదు వేయించుకోవాలి.

4. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిబఠాణీలు, వేసి వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, గరం మసాలా, మరియు కారం వేసి మరో రెండు నిముసాలు వేయించి, టమోటో ముక్కలను కూడా వేసి టమోటో మెత్తబడేంత వరకూ వేయించాలి.

5. వెజిటేబుల్స్ అన్ని మెత్తబడ్డాక అందులో సరిపడా నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.

6. నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి, తర్వాత ముందుగా వేయించి పెట్టుకొన్ని రవ్వ మరియు బ్రెడ్ ముక్కలను వేసి బాగా కలగలపాలి. అందు వల్ల రవ్వ, బ్రెడ్ రెండు నీటిలో కలిసిపోయి వెజిటేబుల్స్ తో పాటు ఉడుకుతుంది. ఉప్మా పొడిపొడిగా ఉండాలనుకుంటే అరగ్లాసు వాటర్ తక్కువగా వేస్తే సరిపోతుంది.

 అంతే బ్రెడ్ వెజిటేబుల్ ఉప్మా రెడీ.

వేడి.. వేడి.. ఆలూ పోహా.. పసందైన బ్రేక్ ఫాస్ట్

పోహా(అటుకులు)లోఫ్యాట్. ఇవి తినడానికి చప్పగా ఉన్నా, ఆరోగ్యానికి చాలా మంచిది. మన భారతదేశంలో పోహాతో వివిధ రకాల వంటలు తయారు చేసి తింటారు. పోహాను వెజిటేబుల్స్, బంగాళదుంప మిక్స్ చేయడంతో మరింత రుచిగా ఉండటమే కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో కడుపునింపేస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. న్యూట్రిషియన్స్ అధికంగా ఉండటం వల్ల ఈ ఆలూ పోహాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంకాలపు స్నాక్ గాను తినవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టమైన ఈ పోహ అంధించడం వల్ల వారి ఎనర్జీ వస్తుంది. మరీ ఈ ఆలూ పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం... aloo poha filling breakfast recipe

పోహ(అటుకులు): 2 cups
 ఆవాలు: 1/2tsp
 కరివేపాకు: రెండు రెమ్మలు
 పచ్చిమిర్చి: 2 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
 బంగాళదుంప: 1 (cut into small pieces)
 వేరుశెనగగింజలు: 10
శెనగపప్పు: 1tsp
 నిమ్మరసం: 1tbsp
పసుపు: 1 pinch
 కొత్తిమీర: 1 sprig (chopped)
 పొడవుగా సన్నగా ఉండే మిక్చర్: 2tbsp
 ఉప్పు: as per taste
 నూనె: 1tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేయించాలి.

2. ఒక నిముషం తర్వాత తరిగిన ఉల్లిపాయముక్కలు, వేరుశెనగ గింజలు వేసి వేయించాలి.

 3. ఉల్లిపాయ, పల్లీలు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను, పచ్చిశెనగపప్పు వేసి రెండు మూడు నిముషాలు వేయించాలి.

4. తర్వాత అందులోనే అటుకులను కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఐదు నుండి పది నిముషాలు తక్కువ మంట మీద వేయించాలి.

 5. తర్వాత అందులోనే పసుపు మరియు నిమ్మరసం, ఉప్పు కూడా వేసి మూత పెట్టి, తక్కువ మంటమీద మరో ఐదు నిముషాలు ఆవిరి మీద ఉడికించి క్రిందికి దింపుకోవాలి.

6. దించిన వెంటనే కొత్తిమీర తరుగు, సన్నని మిక్చర్ తో గార్నిష్ చేసి, వేడివేడిగా వెంటనే తినేయాలి. లేదంటే సాగులా తయారవుతుంది. తినడానికి అంత రుచిగా అనిపించదు.


గజగజ వనికించే చలిలో నోరూరించే వెజ్ కబాబ్స్ ,,,,,,,,,,,,

చలికాలం వచ్చేసింది. చలిలో గజగజ వనికిపోతుంటే ఓ పక్క మంచు, మరోప్రక్క చల్లని కఠినమైన గాలులు.. చీకటి పడేసరికిసాయంకాలం మనసు చిరుతిళ్ళ మీదకు మళ్ళుతుంది. మంచుకు నకనకలాడిన ప్రాణానికి ఏదైనా అందించమంటుంది. చలిలో వేడి వేడిగా కాఫీ తాగుతూ.. బజ్జీ... బోండా... పకోడా వంటివి తింటే ఎంత బాగుండనిపిస్తుంది. అలాంటప్పుడు మనం సాధారణంగా చేసుకొనే రుచులనే కొంచెం బిన్నంగా చేసుకొంటే చాలా రుచికరంగా తింటుంటి చలి అనేదే తెలియకుండా గడిచిపోవాల్సిందే.

 మరి ఈ ఈవెనింగ్ స్నాక్ లో వెరైటీగా వెజిటేరియన్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూడండి...

కావల్సిన పదార్థాలు:

 బంగాళదుంపలు: 1/2kg
అరటి కాయలు: 2
 బీట్ రూట్: 1(పెద్దది)
 ఉల్లిపాయలు: 4
 శెనగపిండి: 1/2cup
 బ్రెడ్ ముక్కల పొడి: 1/2cup
బ్రెడ్ స్లైస్: 12
 ఫ్రెష్ క్రీమ్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

మసాలా తయారీ కోసం:
 వెల్లుల్లిపాయలు: 8
 అల్లం: చిన్న ముక్క
 గసగసాలు: 2tsp
కారం: 1.5tsp
 జీలకర్ర: 1/2tsp
 పచ్చిమిర్చి: 6-8
సోపు: 1/2tsp
 యాలకులు: 4
 పెప్పర్: 1/2tsp
వెనిగర్: 4tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
 లవంగాలు: 4
vegetarian kabab winter special

తయారు చేయు విధానం:

 1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి.

2. తర్వాత క్యారెట్, బీట్ రూట్ చెక్కు తీసి సన్నగా కట్ చేసి మెత్తగా ఉడికించాలి. అలాగే ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత అరటికాయను కూడా కుక్కర్ లో ఉడికించి తొక్క తీసి ముద్ద చేసి ఉంచాలి.

4. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. మసాలా ముద్దని కూడా వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించి దింపేయాలి.

5. తర్వాత పిండిలో శెనగపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని తీసుకుని పిండిలో డిప్ చేసి కాగుతున్న నూనెలో వేయించుకోవాలి.

 6. బ్రౌన్ కరల్ వచ్చేంత వరకూ వేయించి పక్కకు తీసి వీటిపై వెన్న రాసి టమోటో కెచప్ తో మిరియాలపొడి వేసి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయాలి. అంతే వెజ్ కబాబ్స్ 
రెడీ...

వెజిటబుల్ బ్రెడ్ బాత్ ,,,,

కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసులు-12
 క్యారెట్: 2
పచ్చిబఠాణీలు-1cup
 పచ్చిమిర్చి: 6-8
 ఉల్లిపాయలు: 2
కరివేపాకు: రెండు రెబ్బలు
 కొత్తిమీర: 1cup
బీన్స్: 1/4cup
 బీట్ రూట్: 1
జీడిపప్పు: 1/2cyo
 అల్లం: చిన్న ముక్క
మినపప్పు, శెనగపప్పు: 2tbps
ఆవాలు: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
 పసుపు: చిటికెడు
 నూనె : తగినంత

vegetable bread bath

తయారు చేయు విధానం:

1. ముందుగా కుక్కర్ లో కూరగాయల ముక్కలు, బఠాణీలు ఉడికించుకోవాలి.

2. తర్వాత బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

3. తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి.

4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో జీడిపప్పు దోరగా వేయించి విడిగా తీసుకోవాలి.

 5. తర్వాత అదే పాన్ లో బ్రెడ్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత ఉడికించిన కూరముక్కలు, బఠాణీలు వేసి బ్రెడ్ ముక్కలకు పట్టేలా కలపాలి.

 6. ఐదు నిముషాల తర్వాత దింపేసి వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలతో గార్నిష్ చేస్తే చాలు. చివరగా ఆవాలు, శెనగపప్పు, మినపప్పుతో తాలింపు పెట్టాలి.
 వెజిటబుల్ బ్రెడ్ బాత్ సిద్ధం. రుచికోసం అదనంగా నిమ్మరసమూ చేర్చుకోవచ్చు.

 వేడివేడిగా తింటే బాగుంటుంది.


స్పైసీ బీన్స్ ఉస్లీ ..

బటాననిల్లో మాంస కత్తులు మాంసాహార పోషకాలకు సరిసమానం అని చెప్పవచ్చును. వీటి లో పీచు పదార్ధము ఎక్కువ. బటానిలోని సి-విటమిన్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంపొందితుంది ... కాన్సర్ రాకుండాను, కీళ్ళ జబ్బులు రాకుండా కపుడుతుంది . . . యాన్తి ఆక్షి డెంట్ గా కానాల స్ఖీనతను తగ్గిస్తుంది. రక్తకణాల... ముఖ్యము గా ఎర్ర రక్త కణాలూ అభివృద్దికి దోహదపడి.. రక్తహీనతను రాకుండా కాపాడును. ప్రోటీన్లు పుస్కలముగా ఉన్నందున శరీర కండరాలను అభివృద్ధి చేయును .Spicy Beans Usili


 
కావలసిన పదార్థాలు:

తెల్ల లేద పచ్చిని బఠాణీలు: 1/2kg
పచ్చిమిర్చి: 6-8
చాట్ మసాలా: 1tsp
 టమోటో: 2
 పెప్పర్(మిరియాలు) పౌడర్: 1tsp
 ఉల్లిపాయలు: 2
 కొత్తిమీర తరుగు: 1cup
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
 కారం: 1tsp

 తయారు చేయు విధానం:

 1. ముందుగా తెల్లని లేదా పచ్చని బఠాణీలు ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టి, తర్వాత ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన బఠాణీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఛాట్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కారం వేసి కలపాలి.

4. చివర్లో నిమ్మరసం పిండితే చాలు. దీన్ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి చుట్టూ గుండ్రంగా, చక్రల్లా కోసిన టమోటో ముక్కలతో అలంకరించి పిల్లల ముందు పెడితే క్షణాల్లో ప్లేట్లు ఖాళీ చేస్తారు..

 అఫ్ కోర్స్ పెద్దలైనా సరే..... 

పచ్చిమిరపకాయ తో ఊరగాయ

గ్రీన్ చిల్లీ పికెల్ చాలా స్పైసీ గా ఉండే పికెల్. ఇది అన్ని రకాల భోజనంలోనికి తినగలిగినటు వంటి ఊరగాయ. సాధారణంగా ఇండియన్ ఫుడ్ అనగానే పక్కన ఏ ఊరగాయలేకుండా వంటలను వడ్డించరు. అలాగే భోజనం కూడా ఊరగాయ లేకుండా పూర్తి అవ్వదు.
 అన్ని ఊరగాయల్లో కంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. చాలా కారంగాను ఉంటుంది.
Green Chilli Pickle

కావలసిన పదార్థాలు:

 తాజాగా ఉండే పచ్చిమిరపకాయలు: 20(పొడవుగా పచ్చగా ఫ్రెష్ గా ఉండాలి)
 ధనియాలు: 2tbsp
సోపు(సోంపు): 1tbsp
 మెంతులు: 1tsp
ఉప్పు రుచికి సరిపడా
 ఆమ్ చూర్ (మామిడికాయ పొడి): 1tbsp
 పసుపు:1/2tsp
వెనిగర్: 1tbsp
 ఆవాలు: 1tsp
 నూనె తగినంత

 తయారు చేయు విధానం:

1. ముందుగా పచ్చిమిరప కాయలను మంచి నీళ్ళలో శుభ్రం చేసి, పొడి బట్టతో బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాత పచ్చిమిరపకాయను నిలువుగా ఒక సైడ్ లో కట్ చేసుకోవాలి.

2. తర్వాత ధనియాలు, సోపు, మెంతులు తీసుకొని వీటి గరుకుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక పోపుకు వేయాల్సిన పదార్థాలు, గ్రైడ్ చేసుకొన్న పొడి అందులో వేసి దానికి వెనిగర్ చేర్చి బాగా మిక్స్ చేయాలి.

4. తర్వాత మద్యకు కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చిలో పోపుతో తయారు చేసి పెట్టుకొన్న పొడి మిశ్రమాన్ని నింపుకోవాలి.

5. ఇలా నింపుకొన్న పచ్చిమిర్చినీ గాజు జార్ లో వేసి మూత పెట్టి బయట ఎండలో ఒకటి లేదా రెండు రోజుల పాటు పెట్టాలి. తర్వాత దీన్ని ఇంట్లో కి తీసుకొచ్చి ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు
ఇది ఒక నెల పాటు తాజాగా ఉంటుంది.
 అంతే గ్రీన్ చిల్లి పికెల్ రెడీ.

దొండకాయ -రోటి పచ్చడి

Dondakaya Roti Pachadi  Aid0069


కావలసిన పదార్థాలు:

 దొండకాయ ముక్కలు:1cup(సన్నగా తరిగినవి)
 కొబ్బరిముక్కలు: 1/2cup
టొమాటో : 1
 పచ్చిమిర్చి: 4
 చింతపండు: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
 పసుపు: చిటికెడు
 కొత్తిమీర: కొద్దిగా
 నూనె :2tsp
 మినప్పప్పు : 1tsp
శనగపప్పు : 1tsp
 ఆవాలు: 1/2tsp
 జీలకర్ర : 1/2tsp
ఎండుమిర్చి: 5

తయారు చేయు విధానము:

1. పాన్ లో నూనె వేసి కాగాక, పోపు సామాను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

 2. అదే పాన్ లో మరికాస్త నూనె వేసి వేడయ్యాక దొండకాయముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో వేసి వేయించి తీసేయాలి.

 3. మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న పోపును వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

 4. తరవాత వేయించిపెట్టుకున్న ముక్కలు, తగినంత చింతపండు, ఉప్పు, పసుపు వేసి మరోమారు గ్రైండ్ చేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

రైస్-ఇడ్లీ-దోస గుడ్ కాంబినేషన్- దొండకాయ కొబ్బరి పచ్చడి.

Dondakaya Kobbari Pachadi  Aid0069


కావలసిన పదార్ధాలు:

 దొండకాయలు: 1/2kg
కొబ్బరి తురుము: 1cup
కొత్తిమీర: ఒక కట్ట
 పచ్చిమిర్చి: 10
 చింతపండు: కొంచెం
జీలకర్ర: 1/2tsp
 వెల్లుల్లి రెబ్బలు: 4
 ఉప్పు : రుచికి తగినంత
 పసుపు: చిటికెడు
 నూనె: రెండు టేబుల్ స్పూన్లు
 తాలింపుకు
 శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు

తయారు చేయు విధానం:
 1. మొదటగా చక్రాల్లా తరిగిన దొండకాయలు, మిర్చి కలిపి ఒక స్పూన్ నూనె వేసి వేయించాలి.

 2. తర్వాత మిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

 3. ఇప్పుడు దొండకాయ ముక్కలు, కొబ్బరి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కోరులా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసుకుని, అందులో ఈ పచ్చడి, చిటికెడు పసుపు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బావుంటుంది. కారం తక్కువ కావాలంటే మిర్చి తగ్గించుకోవచ్చు.
 దొండకాయ కొబ్బరి పచ్చిడి రెడీ..రైస్, ఇడ్లీ, దోస, చపాతీలకు మంచి కాంబినేషన్. 


దొండకాయ-మామిడి తురుము ఆవకాయ...

వేసవిలో అరుదుగా దొరికే మామిడికాయ అన్నంతో మొదలయ్యే ఆవకాయ పెరుగున్నదాకా కొనసాగుతుంది. అంతే కాదు అన్నంలో కూడ పలురకాలుగా చేసుకొంటారు. కావాల్సినవన్నీ ఉన్నా పెరుగన్నంతో నంజుకుని కడుపారా తినేందుకు మామిడికాయ తొక్కు కావాల్సిందే. ఎండాకాలంలో వచ్చే పుల్లటి మామిడికాయల ముక్కలతో చేసే పచ్చడి రుచే వేరు. దీనిని ఆంధ్రోళ్లు అయితే ఆవకాయ అని, మాగాయ పచ్చడి అని రకరకాలు చేసుకొంటారు. మామిడికాయ ఆవకాయను కొంచెం వెరైటీగా దొండకాయ చేర్చి ఏలా తయారు చేసుకోవాలో చూద్దాం....Mango Tindora Pickle


 
కావలసిన పదార్థాలు:

 దొండకాయలు: 6-8
 పచ్చి మామిడికాయ: 1
 కారం: 2tbsp
 ఆవాలు: 1tsp
 మెంతి పొడి: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup


 తయారు చేయు విధానం:

 1. ముందుగా దొండకాయలను నీళ్ళలో వేసి కడిగేసుకొని తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని పొడి బట్టతో తేమను పూర్తిగా తుడిచేసుకోవాలి. తేమను తుడిచిన తర్వాత కూడా పది పదిహేను నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి.

2. పదిహేను నిమిషాల తర్వాత దొండకాయలను రెండు భాగాలుగా మద్యలోనికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

 3. తర్వాత పచ్చి మామిడి కాయను కూడా శుభ్రం చేసే తడి ఆరిన తర్వాత తురుముకోవాలి. లేదా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

 4. తర్వాత ఆవాలను దోరగా వేయించుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పౌడర్ ను రెడీ చేసుకోవాలి.

 5. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఆవాల పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా దొండకాయ ముక్కలు, మామిడి తురుము(మామిడి ముక్కలు), నూనె కూడా వేసి బాగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.

 6. అంతే దొండకాయ-మ్యాంగో పికెల్ రెడీ. దీన్ని రెండు మూడు గంటలన్నాస్పైసీస్ లో ఊరనివ్వాలి. తర్వాత వాడుకోవాలి. ఇది వేడి వేడి అన్నం, లేదా రోటీ, దోశ లోనికి చాలా రుచికరంగా ఉంటుంది.

 సూచన:
పచ్చి కాయలతో పికెల్ నచ్చని వాళ్ళు, నూనె తప్పా మిగిలిన పదార్థాలన్నీ పై చెప్పినట్టు మిక్స్ చేసుకొని చివరగా కడాయిలో నూనె పోసి అందులో మరి కొద్దిగా ఆవపొడి, మెంతిపొడి, కారం, ఉప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేగించి అందులో దొండమామిడి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూత వున్న డబ్బా లేదా బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకొంటే వారం పది రోజుల పాటు ఉంటుంది.

జీరా రైస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ దొండకాయ రైతా

ఇండియన్ స్పెషల్ వంటకాల్లో దొండకాయ పెరుగు పచ్చడి కూడా ఒకటి. ఇది సైడ్ డిష్ గానే కాదు. స్పెషల్ గా తయారు చేసుకొని గీ రైస్, జీరా రైస్ కు ఓ అద్భుతమైన కాంబినేషన్. ఆంధ్రా స్టైల్లో కొంచె స్పెషల్ గా, పెప్పర్, అల్లం చేర్చి వండటం వల్ల ఓ స్పెషల్ టేస్ట్ వస్తుంది.

 సాధారణంగా రైతాను వివిధ కూరగాయలతో విడి విడిగా వండతుంటారు. అయితే ఇది కూడా ఓ వెరైటీ రైతా. ఈ రైతా సాధారణ మీల్స్ తో బోరు కొట్టినప్పుడు ఇటువంటి సింపుల్ టేస్టీ వంటకాలను ప్రయత్నించవచ్చు. దొండకాయను ఇష్టపడని వారు కూడా ఈ రైతా తినడం వల్ల వెంటేనే దొండకాయకు ప్రియులు కావాల్సిందే. ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినాల్సిందే. మరి మీరు ప్రయత్నించి, దొండకాయ స్పెషల్ రైతాను మీ ఇంటిల్లిపాదికి అంధించండి.
Tindora Rita Jeera Rice Special Combination


కావలసిన పదార్థాలు:

 దొండకాయలు: వందగ్రాములు(సన్నగా పొడవుగా తరగాలి)
 పెరుగు: 1cup(చిలకాలి)
 అల్లం: చిన్న ముక్క(సన్నగా తరగాలి)
 ఉల్లిపాయ: 1/2cup(సన్నగా తరగాలి)
మిరియాల పొడి: 1/2tsp
 ఉప్పు: రుచికి తగినంత
 చక్కెర: 1/2tsp
 నూనె: వేయించడానికి తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడిఅయ్యాక అందులో సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొన్న దొండకాయ ముక్కలను డీప్ ఫ్రై చేయాలి.

 2. తర్వాత దొండకాయ ముక్కలు మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఒక మోస్తరుగా వేయించి తీసుకోవచ్చు.

3. ఇప్పుడు వేయించిన దొండకాయ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు, చక్కెర వేసి సమంగా కలిసేటట్లు చేయాలి.

 4. తర్వాత దొండకాయ మిశ్రమంలో పెరుగు వేసి కలపాలి. దీనికి పోపు అవసరం లేదు. దొండకాయ రైతా జీరారైస్‌ లోకి మంచి కాంబినేషన్.    

ఫిష్ తందూరి మసాలా :పంజాబి రిసిపి

మాంసాహారులైయుండి, చేపలు తినని వారు ఉంటారు. అయితే చేపలు తినడ ఇష్టమే అయితే వాటి వాసన, సరిగా వండటం చేత కాకనో చేప వంటకాలకు దూరంగా ఉంటారు. ఫస్ట్ టైమ్ చేప వంటకాన్ని రుచి చూడాల్సి వచ్చినప్పుడు తందూరి మసాలా చాలా సులభం, మరియు టేస్టీ. ఈ వంటకానికి కావల్సి ముఖ్యమైనటువంటి పదార్థా తందూరి మసాలా పౌడర్.

 ఫిష్ తందూరి మసాలా పంజావీ రిసిపి. ట్రెడిషినల్ వంటకం. ముఖ్యంగా తందూరి ఫిష్ మసాలాను చేపముక్కలకు పట్టించి తయారు చేస్తారు. మరికొంత మంది తందూరి మసాలా పట్టించి తర్వాత మైక్రోవోవెన్ లో ఫ్రై చేసుకొని తర్వాత తందూరి మసాలా తయారు చేస్తారు. తందూరి మసాలా గ్రిల్డ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం...
fish tandoori masala from punjab


కావల్సిన పదార్థాలు:

 ఫిష్ ఫిల్లెట్: 8(పాంప్రెట్, బెట్కి, లేదా బోన్ లెస్ ఫిఫ్)
 తందూరి మసాలా: 3tbps
 పెరుగు: 100grams
పచ్చిమిర్చి: 5
 ఉల్లిపాయలు: 1(కట్ చేసుకోవాలి)
 అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tbsp
 కారం: 1tsp
 నిమ్మరసం: 1tbsp
 ధనియాల పొడి: 1tsp
 కొత్తిమీర తరుగు: 2sprigs
 నూనె: 2tbsp
 ఉప్పు : రుచికి సరిపడా

 తయారు చేయు విధానం:

1. ముందుగా మూడు పచ్చిమిర్చి మరియు కొద్దిగా కొత్తిమీర ను పేస్ట్ చేసుకోవాలి.

 2. ఇప్పుడు ఈ పేస్ట్ లో రెండు చెంచాలా పెరుగు కలపాలి, అలాగే రెండు చెంచాల తందూరి మసాలా, ఉప్పు, వేసి బాగా మిక్స్ చేయలి.

3. తర్వాత చేపముక్కలను శుభ్రం చేసుకొని తడి ఆరిన తర్వాత పైన తయారు చేసుకొన్న తందూరి మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కావలంటే కొంచెం నిమ్మరసం చేపముక్కలపైన చిలకరించుకోవచ్చు.

 4. ఇప్పుడు బేకింగ్ పాన్ తీసుకొన్ని స్టౌ మీద పెట్టి వేడయ్యాక నూనె వేసి వేడి అయిన తర్వాత చేపముక్కలను వేసి పైన మరొకొంత మసాలా మిశ్రమాన్ని మారినేట్ చేయాలి.

 5. తర్వాత కొద్దిసేపు ఎక్కువ మంట మీద తర్వాత మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. దీన్ని మైక్రోవోవెన్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చేపముక్కలను మద్య మద్యలో పైకి క్రిందికి మార్చుతుండాలి. అప్పుడే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతుంది.

 6. ఇప్పడు బాటమ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కులు వేసి ఐదు నిముషాల పాటే వేయించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.

 7. ఇప్పుడు అందులోనే తందూరి మసాలా పౌడర్, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి.

 8. తర్వాత అందులోనే మిగిలిన పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత గ్రిల్డ్ ఫిష్
 (ఫ్రైచేసుకొన్న ఫిష్ ను, ఉడుకుతున్న మసాలా కర్రీలో వేసి రెండు మూడు నిముషాల ఉడికించాలి. అంతే తందూరి ఫిఫ్ మాసాలా రెడీ.


నాటు కోడి షోరువా----- చికెన్ స్పెషల్-----(స్పెషల్ టేస్ట్)

సాధారణంగా మాంసాహార ప్రియులకు అంత్య ఇష్టమైనది చికెన్ తో తయారు చేసే రుచికరమైన వంటలు. చికెన్ వివిధరాకాలు వండుకొని తింటుంటారు. అయితే నాటుకోడి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ షోరువా భలే రుచిగా ఉంటుంది. ఇది రోటీ, రైస్, పులావ్, కుష్కా వంటి వాటికి మరింత రుచిని అందిస్తుంది. ఈ షోరువాను చికెన్ సూప్ తో తయారు చేస్తారు.

 చికెన్ సూప్ తో తయారు చేసే చికెన్ షోరువా ఇండియన్ మసాలాలు, కొద్దిగా ఘాటైనా మసాలా ధినుసులు వేయడంతో మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ చికెన్ షోరువాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి. అందుకు ఏమేమికావాలో ఒక సారి చూసి మీరు ఈ సండే స్పెషల్ వంటకాన్ని ఎంజాయ్ చేయండి.
Chicken Shorba

 కావలసినపదార్థాలు:

 చికెన్: 750grms,
 మిరప్పొడి: 3tbsp (కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు),
పసుపు: 1tsp
 అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున
 (కడిగిన చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి పక్కన ఉంచాలి),
నూనె: 4tbsp
 కరివేపాకు: రెండు రెమ్మలు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 2cups
కాశ్మీరీ మిరప్పొడి: 2tsp
 మసాలా పౌడర్: 4tsp
ఉప్పు: తగినంత
 కొత్తిమీర: గుప్పెడు (సన్నగా తరగాలి)

 తయారు చేయు విధానం:

 1. ముందుగా నాన్‌ స్టిక్ పాన్‌ లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.

 2. ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.

3. చికెన్ ముక్కల్లో ఎరుపుదనం పోయి నీరు వెలువడడం మొదలయ్యాక మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి.

 4. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి. మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. ఇది అన్నం, గారెలలోకి బాగుంటుంది.


[ మసాలా పౌడర్ తయారి: ఆరు స్పూన్ల ధనియాలు, పది లవంగాలు, ఎనిమిది ఏలకులు, దాల్చినచెక్క రెండు అంగుళాల ముక్క, స్టార్ లవంగం ఒకటి, పాపీ సీడ్స్ రెండు టీ స్పూన్లు తీసుకుని పొడిచేయాలి. ]


హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. హైదరాబాదీ చేపల బిర్యాని చాలా టేస్టీ గా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీని రకరకాలుగా వండుతారు. వాటిలో ఈ ఫిష్ బిర్యానీ కూడా ఒకటి. ఏ సినిమాలోనైనా సరే... ఏ కథలోనైనా సరే... ఎవరికోసమైనా ఏదైనా ప్రత్యేకంగా వండారంటే అది తప్పకుండా చేపల పులుసే అయ్యుంటుంది.

 అనగా అర్థమేమి...? ఐటమ్స్ అన్నిటా చేపల ఐటమ్స్ వేరయా అని తాత్పర్యం. మన ‘ఫ్యామిలీ'లో మీరు వెరీ వెరీ స్పెషల్. మీ కోసం మేం రెడీ చేసిన ఫిష్ బిర్యానీ ఇది. ఈ స్పెషల్ ఫిష్ డిష్‌ తినండి... ఖుష్ అవ్వండి...



కావలసినపదార్థాలు:

 బోన్‌ లెస్ ఫిఫ్ పీసెస్: 500grms
 పెరుగు: 1cup
నిమ్మకాయ: 1
 నిమ్మరసం: 2tsp
ఉల్లిపాయ తరుగు: 1cup(వేయించినది)
నూనె: 1/2cup
కొత్తిమీర తరుగు: 1కట్ట
 పుదీనా తరుగు: 1కట్ట
 పచ్చిమిర్చి: 10(నిలువుగా చీరాలి)
 గరం మసాలా: 1tsp
 కారం: 1tsp
 పసుపు: 1/2tsp
బాస్మతీ రైస్: 2cups
 కెవ్రా వాటర్: 1tsp(మార్కెట్‌లో దొరుకుతుంది),
 నెయ్యి: 2tbsp
 డాల్డా: 2tsp
 బిర్యానీ ఆకు: రెండు
 జాజికాయ పొడి: 1/2tsp
 ఏలుకల పొడి: 1/2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
 లవంగాలు: 4
 రోజ్ వాటర్: 1tsp
 అల్లం తరుము: 2tbsp
 కుంకుమ పువ్వు: చిటికెడు
Hyderabadi Masala Fish Biryani Recipe




తయారు చేయు విధానం:

 1. చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు, పెరుగు, నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి.

2. ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.

 3. ఇప్పుడు పాన్‌ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, బిర్యాని ఆకులు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి. అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు, కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి.

4. ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్‌ లో ఉడికిన అన్నం కొంచెం, చేప మిశ్రమం కొంచెం, డాల్డా, నెయ్యి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి. అంతే హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ రెడీ.

5. తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ మసాలా బిర్యానీ రెడీ.


మీ గార్డెన్ లోని మట్టిని సారవంతం చేయడం ఎలా ?



విరగకాసే పూదోట లేదా కూరగాయల తోట చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా, కాయగూరల సేద్యంలో అప్పుడే అడుగుపెట్టిన వారైతే, ఆరోగ్యకరమైన మొక్కలు విరగకాస్తే ఆ కూరలు గొప్పగా ఇరుగు పొరుగుకి ఇవ్వాలని కూడా అనుకుంటారు. ఐతే ఆ కల సాకారం కావాలంటే కేవలం నాటడం, విత్తనాలకు నీరు పోయడం కన్నా ఎంతో చేయాలి. ఇందులో విజయం సాధించడానికి సారవంతమైన మట్టి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. పూర్తీ స్థాయిలో ఉత్పాదకత ఇవ్వాలంటే నిత్యం పోషకాలు అందించవలసిన ఒక జీవి గా మట్టిని భావించండి.


 



సూచనలు :
1. మట్టికి సేంద్రియ ఎరువు ను కలపండి. సేంద్రియ ఎరువులలో మట్టికి అత్యవసరమైన నైట్రోజెన్ వుంటుంది. ఎరువును పై పై న చల్లే బదులు ఒక పారతో మట్టిలో బాగా కలియబెట్టడం చాలా ముఖ్యం. ఈ ఎరువును మీరు ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు లేదా నర్సరీలలో కొనవచ్చు.

2. ఆవు లేదా గుర్రం పేడ తెచ్చి మట్టిలో బాగా కలపండి. ఈ ఎరువులో కూడా పుష్కలంగా వుండే నైట్రోజెన్ మొక్కలలో ఆకుల ఎదుగుదలకు ఉపకరిస్తుంది.

3. చీడ పట్టని రాలిన ఆకులను కూడా మట్టికి కలపవచ్చు. తెగులు లేదా కుళ్ళు వున్న ఆకులు కలవకుండా జాగ్రత్త తీసుకోండి, లేదా మట్టి మొత్తం తెగులు బారిన పడుతుంది. తర్వాత, ఆకులను మట్టిలోకి లోపలి పోయేలా ఒక పారతో కలియతిప్పండి. ఒక లాన్ మోవర్ ను మీ లాన్ లోని ఆకుల మీద నడిపితే ఆకులు చిన్న చిన్న ముక్కలుగా మారతాయి.

చిట్కాలు & హెచ్చరికలు :
బాగా తడిగా గానీ, బాగా పొడిగా గానీ వున్న మట్టిలో సేంద్రియ ఎరువులు కలపక౦డి. ముట్టుకుంటే మెత్తగా ఉండేలా తయారయ్యే వరకు వేచి వుండి ఆ మట్టిలో ఎరువును కలపండి.

 

వయసైపోయిన తల్లిదండ్రుల గురించి శ్రద్ధ ఎలా తీసుకోవాలి ?

మీ తల్లిదండ్రుల ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనించారా? ఇంతకు ముందులా స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోలేక పోతూ ఉండవచ్చు. మీ తండ్రిగారి మెయిల్ పేరుకుపోవడం చూసే వుంటారు లేదా మీ తల్లిగారు ఇదివరకట్లా శ్రద్ధగా తయారవుతూ ఉండకపోవచ్చు. ఆవిడ నలిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉండవచ్చు లేదా జడ కూడా సరిగ్గా వేసుకుంటూ ఉండకపోవచ్చు. ఇవన్నీ వారికి సహాయం అవసరమని సూచిస్తాయి. వయసైన తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. మీరు అటు మీ ఉద్యోగాన్ని, ఇంటి పనులను కూడా చక్కబెట్టాల్సి రావచ్చు. కానీ మీ పనిని తేలిక చేసే కొన్ని చర్యలు వున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడాన్ని తేలిక చేసే కొన్ని చర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.


How Care Your Aged Parents

చర్యలు :

1. వారితో సంభాషిస్తూ వుండండి. పెద్ద వాళ్ళు చాలా సున్నితంగా వుంటారు, అందువల్ల వారితో మాట్లాడి వారి పరిస్థితిలో సౌకర్యంగా ఉండేలా చూడాలి. పిల్లలు తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సి వుంటుంది - అదీ కొంచెం ప్రతిఘటన ఎదురైనా సరే.

2. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు వాళ్ళతో పాటు వెళ్ళండి. అలా వెళ్తే వాళ్లకి చాలా సౌకర్యంగాను, సహాయంగాను వుంటుంది. అలాగే మీకు వారి చికిత్స గురించి కూడా తెలుస్తుంది.

3. వారికోసం ఒక షెడ్యూల్ వేయండి. వాళ్ళ అప్పాయింట్ మెంట్ లను ఒక పుస్తకం లోనో లేదా కాలెండర్ లోనో రాస్తే వాళ్ళు సమయానికి తమ పనులు చేసుకోగలుగుతారు.

4. వారితో సమయం గడపండి. మీరు చాలా బిజీగా వున్నా వారితో సమయం గడపండి. వాళ్ళతో కలిసి ఒక ఆట ఆడండి లేదా వారితో కలిసి నడవండి. వారితో బంధం బలపడ డానికి ఇది సహాయ పడుతుంది.

5. వారికి కొంత ప్రత్యెక స్థలం ఇవ్వండి. వాళ్లకి ప్రైవసీ ఉండేలా ప్రత్యేకమైన గది ఇవ్వండి. వాళ్ళు అడిగినప్పుడు మాత్రమె సాయం చేయండి.

6. ఒక కేర్ టేకర్ ను నియమించండి. మీ పెద్ద వారికి కేర్ టేకర్ వుంటే మీకు, వారికి కూడా సాయంగా వుంటుంది. 24 గంటలపాటూ నిరంతరాయంగా పెద్దవారికి, ఇంటి వద్దే నాణ్యమైన

హైపర్ కోలేస్టేరోలీమియా నివారించడం ఎలా ?

రక్తంలో సాధారణ స్థాయికన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడాన్ని హైపర్ కోలేస్టేరోలీమియా అంటారు. 240 ఎం జి కన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ను అధిక స్థాయిగా పరిగణిస్తారు, చాలామందిలో 200 ఎం జి లేదా అంతకన్నా తక్కువ సాధారణ స్థాయిగా ఉంటుంది. గుండేనొప్పి లేదా గుండె పోటు వచ్చే అవకాశం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే వరకు అధిక కొలెస్ట్రాల్ కు ఎలాంటి సంకేతాలూ ఉండవు. వ్యాయామం, పోషకాహార ప్రణాళిక లాంటి సరళమైన ఉపాయాలతో హైపర్ కోలేస్టేరోలీమియా నివారించవచ్చు.
How Prevent Hypercholesterolemia


సూచనలు:
1. తాజా కూరగాయలు, పళ్ళు, తృణధాన్యాలు, పల్చటి మాంసం, కోడి లాంటి తక్కువ కొవ్వుశాతం ఉండే ఆహారాన్ని తీసుకోండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ప్రకారం ఈ ఆహారాలు సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిని నిలపెడతాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినండి, కొవ్వులేని పాల పదార్ధాలు వాడండి. పదార్ధాలపై పట్టికలను చదివి సంతృప్త, అసంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాలు ఎంచుకోండి. ఆహారంలో పీచు పదార్ధాలను తీసుకోండి, ఆకు కూరల సలాడ్ లు ఎక్కువగా తినండి. ఐతే సలాడ్లపై డ్రస్సింగ్ ని తేలికగా ఉండేలా చూసుకోండి.

2. బరువుని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకుంటూ కనీసం వారానికి ఐదు రోజులు పుష్కలంగా పనిచేయండి. వారంలో ఎక్కువ రోజులు కనీసం 30 నిమిషాల పాటు నడవండి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుకోవడానికి ఈత, బైకింగ్, వ్యాయామం, నాట్యం లాంటి ఇతర పనులు కూడా చేయండి.

3. మీరు పొగ తాగేవారైతే వెంటనే దాన్ని మానేయండి, అలాగే పరోక్షంగా పొగ తాగడం కూడా మానేయండి. వీలైనంతలో పొగ త్రాగే ప్రదేశాలకు వెళ్ళడం మానేయండి.

4. కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోండి. మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి పరగడుపున రక్త పరీక్షకు మీ వైద్యుడి దగ్గరకు వెళ్ళండి లేదా ఆయన సూచిస్తే అంతకంటే ఎక్కువసార్లు వెళ్ళండి.

5. మీ కుటుంబ చరిత్ర తెలుసుకొని దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. అధిక కొలెస్ట్రాల్ జన్యువుల వల్ల కూడా రావచ్చు. మీ వైద్యుడితో చర్చించి, మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యల ప్రమాదాలని అంచనా వేయండి.చిట్కాలు & హెచ్చరికలు ఆరోగ్య స్థితిని నిర్ణయం చేసి చికిత్స ఇవ్వాల్సింది కేవలం వైద్యుడు మాత్రమె.మీ వైద్యుడి అనుమతి లేకుండా ఎటువంటి కొత్త వ్యాయామం మొదలుపెట్టకండి.

 

సరైన పద్ధతిలో తలస్నానం చేయడం ఎలా..?

తలస్నానం చెయ్యడం, వినడానికి ఎంతో సులభంగా అనిపించినా, ఎక్కువ మంది తప్పు పద్దతిలో జుట్టుని వాష్ చేస్తారు. అయితే, మెరుస్తున్న, ఆరోగ్యకరమైన జుట్టుని పొందేందుకు తలస్నానం చేసే సరైన పద్దతిని ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.



 



పద్దతులు:
1. షాంపూ, కండిషనర్ మరియు ఒక దువ్వెనని తీసుకోండి.
2. చిక్కు పడకుండా ఉండేందుకు తలస్నానానికి వెళ్ళే ముందు మీ జుట్టుని చక్కగా దువ్వుకోండి.
3. గోరువెచ్చని నీటితో మీ జుట్టుని పూర్తిగా కడగండి. 30 సెకండ్ల పాటు జుట్టుని తడిగా ఉంచుకోండి.
4. మీ అరచేతిలో కొంత షాంపూని తీసుకోండి. మీ జుట్టు పొడుగు మరియు ఒత్తుని బట్టి షాంపూ ని వాడే మొత్తం మారుతుంది. సాధారణంగా ఒక డాలర్ లేదా కాయిన్ సైజులో తీసుకోవచ్చని అంచనా.
5. మీ ముని వేళ్ళతో తలపై నున్న చర్మంపై సుతారంగా మర్దనా చెయ్యాలి. గోర్లని వాడవద్దు. తలపై న భాగంలో మర్దనా చేయండి. షాంపూ తో జుట్టు కుదుళ్ళకి కండిషన్ ని జుట్టు చివర్లకి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
6. గోరు వెచ్చని నీటితో జుట్టుని కడగండి. షాంపూ మొత్తం పోయేవరకు జుట్టుని శుభ్రపరచాలి.
7. ఇప్పుడు కొంత కండీషనర్ ని మీ అర చేతిలోకి తీసుకోండి. మెడ వెనుక భాగంలో నుండి మీ మునివేళ్ళతో జుట్టుని కండీషనర్ తో రాయండి. మీ జుట్టు మొనలని చేరే వరకు ఇలా రాయండి.
8. తరువాత రెండు మూడు నిమిషాలు కండీషనర్ జుట్టుకి పట్టేంతవరకు సమయం ఇవ్వండి. జుట్టు మొత్తానికి కండీషనర్ వ్యాప్తి చెందేందుకు మెల్లగా దువ్వండి.
9. ఇప్పుడు గోరువెచ్చని నీటితో కండీషనర్ మొత్తం తొలగిపోయేవరకు జుట్టుని కడగండి.
10. మీ కేశాలు అందంగా మెరవడం కోసం చల్లని నీటితో మీ జుట్టుని శుభ్రం చెయ్యండి.
11. ఒక తువ్వాలు తీసుకుని జుట్టు తడి అరిపోయేవరకు తుడవండి. జుట్టుని గట్టిగా పిండకండి.
12. జుట్టుని సహజంగా తడి ఆరబెట్టండి. డ్రైయర్ వాడడం మంచిది కాదు.చిట్కాలు: రేడియో వింటూ తలస్నానం చెయ్యడం ఏంటో ఆనందాన్ని కలుగచేస్తుంది. ఎంతో ఆహ్లాదంగా, రిలాక్సింగ్ గా ఉంటుంది. అయితే, మీ రేడియోని లేదా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువుల పై తడి పడకుండా జాగ్రత్తపడండి.హెచ్చరిక: తలస్నానం తరువాత జుట్టుని జాగ్రత్తగా శుభ్రం చెయ్యండి. లేకపోతే జుట్టు జిడ్డుగా ఉంటుంది.తడిగా ఉన్నప్పుడు జుట్టుని దువ్వకండి. జుట్టు చిట్లి, పాడైపోయే అవకాశం ఉంటుంది. జుట్టు బాగా తడి ఆరాక దువ్వితే మంచిది. జుట్టు పైన షాంపూని రాసేటప్పుడు చిక్కు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా తలస్నానం చెయ్యండి.