all

Tuesday, December 18, 2012

హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. హైదరాబాదీ చేపల బిర్యాని చాలా టేస్టీ గా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీని రకరకాలుగా వండుతారు. వాటిలో ఈ ఫిష్ బిర్యానీ కూడా ఒకటి. ఏ సినిమాలోనైనా సరే... ఏ కథలోనైనా సరే... ఎవరికోసమైనా ఏదైనా ప్రత్యేకంగా వండారంటే అది తప్పకుండా చేపల పులుసే అయ్యుంటుంది.

 అనగా అర్థమేమి...? ఐటమ్స్ అన్నిటా చేపల ఐటమ్స్ వేరయా అని తాత్పర్యం. మన ‘ఫ్యామిలీ'లో మీరు వెరీ వెరీ స్పెషల్. మీ కోసం మేం రెడీ చేసిన ఫిష్ బిర్యానీ ఇది. ఈ స్పెషల్ ఫిష్ డిష్‌ తినండి... ఖుష్ అవ్వండి...



కావలసినపదార్థాలు:

 బోన్‌ లెస్ ఫిఫ్ పీసెస్: 500grms
 పెరుగు: 1cup
నిమ్మకాయ: 1
 నిమ్మరసం: 2tsp
ఉల్లిపాయ తరుగు: 1cup(వేయించినది)
నూనె: 1/2cup
కొత్తిమీర తరుగు: 1కట్ట
 పుదీనా తరుగు: 1కట్ట
 పచ్చిమిర్చి: 10(నిలువుగా చీరాలి)
 గరం మసాలా: 1tsp
 కారం: 1tsp
 పసుపు: 1/2tsp
బాస్మతీ రైస్: 2cups
 కెవ్రా వాటర్: 1tsp(మార్కెట్‌లో దొరుకుతుంది),
 నెయ్యి: 2tbsp
 డాల్డా: 2tsp
 బిర్యానీ ఆకు: రెండు
 జాజికాయ పొడి: 1/2tsp
 ఏలుకల పొడి: 1/2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
 లవంగాలు: 4
 రోజ్ వాటర్: 1tsp
 అల్లం తరుము: 2tbsp
 కుంకుమ పువ్వు: చిటికెడు
Hyderabadi Masala Fish Biryani Recipe




తయారు చేయు విధానం:

 1. చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు, పెరుగు, నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి.

2. ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.

 3. ఇప్పుడు పాన్‌ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, బిర్యాని ఆకులు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి. అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు, కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి.

4. ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్‌ లో ఉడికిన అన్నం కొంచెం, చేప మిశ్రమం కొంచెం, డాల్డా, నెయ్యి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి. అంతే హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ రెడీ.

5. తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ మసాలా బిర్యానీ రెడీ.


No comments: