all

Tuesday, December 18, 2012

మ్యాంగో(మామిడి) కోవా ..

కావలసిన పదార్థాలు; 

మామిడిపండ్లు: 2(బాగా పండినవి)
 పాలు: 4cups
 పంచదార: 1/2cup
 నెయ్యి: 1tbsp
Mango Kova

 
తయారు చేయు విధానం:

1. ముందుగా బాగా పండిన మామిడి పండ్లను పొట్టుతీసి గుజ్జును వేరుచేసుకోవాలి. తర్వాత ఈ మామిడిపండు ముక్కలను ముక్కలుగా లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి.

 2. తర్వాత ఒక బౌల్ లేదా పాన్ లేదా పాల కుక్కర్ లో పాలు పోసి, బాగా కాగనివ్వాలి. పాలు బాగా కాగి, సగబాగానికి వచ్చే సమయంలో అందులో మామిడి గుజ్జును వేసి, మంట ఎక్కువగా పెట్టి బాగా కలపాలి. చిక్కటి పాలు, మామిడి పండు రెండూ ఒకదానితో ఒకటి బాగా మిక్స్ అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి.

3. ఒక్కసారిగా మామిడిపండు, పాలు మిశ్రమం గట్టిపడే సమయంలో పంచదార, నెయ్యిని కలుపుకోవాలి. పంచదార, నెయ్యి కూడా బాగా కలిసిపోయేలా మిక్స్ చేయాలి.

4. ఇప్పుడు మంట తగ్గించి మరి కొద్దిసేపు స్టౌ మీదనే పెడితే మిశ్రమం అంత గట్టి పడుతూ కోవా మృదువుగా తయారవుతుంది. స్టౌ ఆఫ్ చేసి పాన్ ను క్రింది దింపుకోవాలి.

5. ఒక ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి అందులో కోవా మిశ్రమాన్ని పోసి గోరు వెచ్చగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కావలసిన ఆకారంలో కట్ చేసుకొని, తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల కోవా చల్లారే కొద్ది గట్టిపడుతుంది. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి కావల్సినప్పుడు బయటకు తీసి కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవచ్చు.
అంతే మ్యాంగో కోవా రెడీ.

 సూచన:
1.పాలు కాచేటప్పుడు పాలు గిన్నె మాడకుండా కలబెడుతూనే ఉండాలి.
2. మామిడి పండ్లు రుచిని బట్టి పంచదారను ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.
3. కావాలనుకొంటే కొద్దిగా పచ్చి కోవాను, యాలకుల పొడిని కూడా మిక్స్ చేసుకోవచ్చు. 


No comments: