all

Tuesday, December 18, 2012

హైపర్ కోలేస్టేరోలీమియా నివారించడం ఎలా ?

రక్తంలో సాధారణ స్థాయికన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడాన్ని హైపర్ కోలేస్టేరోలీమియా అంటారు. 240 ఎం జి కన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ను అధిక స్థాయిగా పరిగణిస్తారు, చాలామందిలో 200 ఎం జి లేదా అంతకన్నా తక్కువ సాధారణ స్థాయిగా ఉంటుంది. గుండేనొప్పి లేదా గుండె పోటు వచ్చే అవకాశం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే వరకు అధిక కొలెస్ట్రాల్ కు ఎలాంటి సంకేతాలూ ఉండవు. వ్యాయామం, పోషకాహార ప్రణాళిక లాంటి సరళమైన ఉపాయాలతో హైపర్ కోలేస్టేరోలీమియా నివారించవచ్చు.
How Prevent Hypercholesterolemia


సూచనలు:
1. తాజా కూరగాయలు, పళ్ళు, తృణధాన్యాలు, పల్చటి మాంసం, కోడి లాంటి తక్కువ కొవ్వుశాతం ఉండే ఆహారాన్ని తీసుకోండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ప్రకారం ఈ ఆహారాలు సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిని నిలపెడతాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినండి, కొవ్వులేని పాల పదార్ధాలు వాడండి. పదార్ధాలపై పట్టికలను చదివి సంతృప్త, అసంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాలు ఎంచుకోండి. ఆహారంలో పీచు పదార్ధాలను తీసుకోండి, ఆకు కూరల సలాడ్ లు ఎక్కువగా తినండి. ఐతే సలాడ్లపై డ్రస్సింగ్ ని తేలికగా ఉండేలా చూసుకోండి.

2. బరువుని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకుంటూ కనీసం వారానికి ఐదు రోజులు పుష్కలంగా పనిచేయండి. వారంలో ఎక్కువ రోజులు కనీసం 30 నిమిషాల పాటు నడవండి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుకోవడానికి ఈత, బైకింగ్, వ్యాయామం, నాట్యం లాంటి ఇతర పనులు కూడా చేయండి.

3. మీరు పొగ తాగేవారైతే వెంటనే దాన్ని మానేయండి, అలాగే పరోక్షంగా పొగ తాగడం కూడా మానేయండి. వీలైనంతలో పొగ త్రాగే ప్రదేశాలకు వెళ్ళడం మానేయండి.

4. కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోండి. మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి పరగడుపున రక్త పరీక్షకు మీ వైద్యుడి దగ్గరకు వెళ్ళండి లేదా ఆయన సూచిస్తే అంతకంటే ఎక్కువసార్లు వెళ్ళండి.

5. మీ కుటుంబ చరిత్ర తెలుసుకొని దాని గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి. అధిక కొలెస్ట్రాల్ జన్యువుల వల్ల కూడా రావచ్చు. మీ వైద్యుడితో చర్చించి, మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యల ప్రమాదాలని అంచనా వేయండి.చిట్కాలు & హెచ్చరికలు ఆరోగ్య స్థితిని నిర్ణయం చేసి చికిత్స ఇవ్వాల్సింది కేవలం వైద్యుడు మాత్రమె.మీ వైద్యుడి అనుమతి లేకుండా ఎటువంటి కొత్త వ్యాయామం మొదలుపెట్టకండి.

 

No comments: