all

Friday, December 21, 2012

ప్రసవం తర్వాత అధిక బరువును తగ్గించడం ఎలా...!

సాధారణంగా మహిళలు ప్రసవం తర్వాత బరువు పెరుగుతారా? సిజేరియన్ అయినా? సాధారణ డెలివరీ అయినా బరువు పెరగాల్సిందేనా? అంటే.. కాదని అంటున్నారు వైద్యులు. ఆహార నియమాలు, వ్యాయామంతో నాజూగ్గా ఉండొచ్చని పేర్కొంటున్నారు. డెలివరీ తర్వాత 4-5 నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం, నెయ్యి, స్వీట్లు లాంటి కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నిత్యం వ్యాయామం చేస్తూ, పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవచ్చు.

best tips postnatal weight loss

గర్భందాల్చిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు బిడ్డ బరువుతో కలిపి మహిళలు 9-12 కిలోలు బరువు పెరుగుతారు. డెలివరీ తరువాత తల్లి గర్భంలో ఉండే ఉమ్మనీరు, యూట్రస్ వల్ల 5-6 కిలోల వరకు బరువు అధికంగా ఉంటారు. ఈ బరువు కూడా ఆరు నెలల్లో తగ్గిపోయి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు. డెలివరీ అయిన తర్వాత పూర్తిగా విశ్రాంతి కల్పిస్తారు. ఈ సమయంలో ఎక్కువగా కార్బోహైవూడేట్లు ఉండే ఆహారం తీసుకున్నా.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

అధిక బరువుతో అనర్థాలు:

సాధారణ డెలివరీ అయితే వారం రోజుల తర్వాత, అదే సిజేరియన్ అయితే 10 రోజుల తరువాత సాధారణంగా అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం కూడా చేయడం వల్ల బరువు పెరగకుండా జాగ్రతపడొచ్చు. సిజేరియన్ అయిన వాళ్లలో ఇంటి పనులు చేసినా, వ్యాయామం చేసినా మంచిది కాదనే అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో పెరిగిన బరువులో 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల మధుమేహం, హైపర్‌టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వొచ్చు.వ్యాయామం ఉత్తమం: వ్యాయామంతో శరీరంలో రక్తవూపసరణ, జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడంతో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వ్యాయామం చేయలేనివారు రోజుకు కనీసం గంటపాటు వాకింగ్ చేయాలి. ఇవి కాకుండా థైరాయిడ్ సమస్య వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రతలు:

1. సాధారణ డెలివరీ అయితే వారం రోజులు, సిజేరియన్ అయితే పది రోజుల తరువాత వ్యాయామం, వాకింగ్ చేయవచ్చు.

2. డెలివరీ అయిన ఆరువారాల తరువాత మళ్లీ సాధారణ వైవాహిక జీవితం గడపొచ్చు.

3. డెలివరీ తరువాత 10 రోజులకు మించి విశ్రాంతి తీసుకోవద్దు.

4. కార్బోహైవూడేట్లు తక్కువగా ఆహారం తీసుకోవాలి.

4. ప్రొటీన్లు, పాలు, గుడ్లు, చేపలు, నానబెట్టిన గింజలు తీసుకోవాలి.

5. పండ్లు, పళ్లరసాలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.

ఏ సమయంలో ఏం తినాలి:

1. ఉదయం:
అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉన్న పదార్థాలుంటే మేలు. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ, ఉప్మా, రొట్టెలు, దోశ, పాలు, ఏదైనా పండు తింటే మంచిది.పీచుపదార్థాలు: యాపిల్స్, నారింజ, క్యారెట్ ముక్కలు, బాదం, పిస్తా వివిధ రూపాల్లో తీసుకోవాలి.

2. మధ్యాహ్నం:
అన్నం, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. ఐరన్, కార్బోహైవూడేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చటి కూరగాయలు తినాలి.

సాయంత్రం:
పండ్ల రసాలు, పుచ్చకాయ, క్యారెట్ రసం, పాలు తీసుకోవాలి.

3. రాత్రి: బియ్యం, పప్పుధాన్యాలుతో పాటు కోడిగుడ్డు తీసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఆహారం తీసుకోవద్దు.

పని చేసుకోవచ్చు:
డెలివరీ అయిన వారం, పది రోజుల తరువాత అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం చేస్తూ.. ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. మోడలింగ్, సినిమా రంగానికి చెందినవారు లైపోసక్షన్, ప్లాస్టిక్ సర్జరీల వల్ల మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు.

ఊబకాయం వున్నవాళ్ళు ఆహారం, వ్యాయామం ఎలా ఉండాలి?

ఊబకాయం వున్నప్పుడు ఆహార నియమావళికి, వ్యాయామానికి మారడం అసాధ్యంలా అనిపిస్తుంది. ఐతే ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ప్రతిబంధకాల నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం దాన్ని ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, మంచి వ్యాయామ నియమావళి తో ఎదుర్కోవడమే.

How Diet Exercise With Obesity

చర్యలు:

1. మొట్టమొదటి చర్య ఈ సవాలుకు భయపడకుండా ఉండడమే. ఒక పర్వతం అధిరోహించాలంటే ఎవరికైనా భయమేస్తుంది, కానీ మీ లక్ష్యం కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదని తెలుసుకోవడం మిమ్మల్ని ఒక సానుకూల ధోరణి లోకి తీసుకువెళ్తుంది.

2. తరువాత మరింత అభివృద్ది చేసేలా మొదట్లో చిన్న చిన్న చర్యలు తీసుకోండి. బాగా తీవ్రంగా ఆహార వ్యాయామ ప్రణాళిక లోకి వెళ్ళిపోవడం చాలా ప్రలోభ పెడుతుంది కానీ మీరు పరిగెత్తలేనంత వేగంగా వెళ్ళడ౦ వల్ల ఉపయోగం వుండదు.

3. వ్యాయామాన్ని దైనందిన చర్యగా మార్చుకోండి. చర్విత చర్వణమే అయినా వాహనాలపై వెళ్ళే కంటే నడవడం, లిఫ్ట్ ఎక్కే బదులు మెట్లు ఎక్కడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చాల తేడా చూపిస్తాయి.

4. భోజనం మానేయకండి. అది అనారోగ్యకరమే కాక అరుదుగా పనిచేస్తుంది.

5. క్రమంగా మీరు రోజూ తినే పరిమాణాన్ని తగ్గిస్తూ, మీ పని స్థాయిని పెంచుకుంటూ వెళ్ళండి.

6. మీకు నచ్చే ఆరోగ్యకరమైన ఆహారం తినండి. చాలా పళ్ళు రుచిగా వుండి మిఠాయిలకు ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.


చిట్కాలు:

1. వ్యాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు గుర్తుంచుకోండి. వ్యాయామం చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు, అది ఎటువంటి ప్రయోజనాలు కలిగించట్లేదని కూడా అనిపించవచ్చు; కానీ వ్యాయామం మీ జీవ క్రియను వేగిరపరుస్తుంది - అంటే చేయడం ఆపివేసిన చాలా సేపటి తర్వాత కూడా అది మీ కాలరీలు కరిగేలా చేస్తుంది.

2. వ్యాయామం, ఆహారం మీ శరీరంలోకి ఎండార్ఫిన్ లను వదిలి మీకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మీరు మరింత ఆరోగ్యంగా తయారై మీ రూపం మీ ఆత్మ విశ్వాసం స్థాయిని పెంచుతుంది.

3. క్రమంగా, మీరు తక్కువ తినడం వల్ల, మీ ఉదరం తక్కువ పరిమాణంలో ఆహారానికి సర్దుకుని సైజు తగ్గుతుంది. దీని వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపించి మీకు ఆకలి తక్కువగా వేస్తుంది.

హెచ్చరికలు :

1. ఇది జీవన శైలిలో మార్పని గుర్తుంచుకోవడం ముఖ్యం. సమస్య కాస్త తగ్గినట్టు అనిపించగానే మీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే ఈ ప్రయత్నం అంతా చేయడం వ్యర్ధమే అవుతుంది.

2. మీ కుటుంబం, స్నేహితులు మీ కొత్త రూపం మీద వ్యాఖ్య చేయడానికి చాలా నెలలు పట్టవచ్చు. ఈ సమయం వల్ల నిరుత్సాహ పడకండి ఎందుకంటే వ్యాయామం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీరు ఆరోగ్యంగా చురుగ్గా వున్నట్టు అనిపిస్తుంది.మీ పైన మీరు మరీ వత్తిడి పెంచుకోకండి. మీకు అనుకూలమైన వేగం లోనే వెళ్ళండి.

 

వ్యాయామం తర్వాత తినకూడని ఆహారాలు...

సాధారణంగా ప్రతి రోజూ వ్యాయామం తర్వాత తీసుకొనే ఆహారం ఆరోగ్యపరంగా శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది.వ్యాయామం రూపంలో బాగా శారీరక శ్రమ చేశాక ఏం తినాలో, ఏం తినకూడదో అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. చెమటలు కక్కుతూ జిమ్ బయటకు రాగానే పొగలు కక్కుతూ ఉండే తమకిష్టమైన ఆహారం తీసుకోవచ్చా లేదా అని తికమకపడుతుంటారు. ఈ విషయంలో కొమ్ములు... అదే... కండలు తిరిగిన వీరులు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి సందేహాలను తీర్చడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

వ్యాయామం తర్వాత ఏం తినాలి, ఏ వేళలో తినాలి అన్న విషయం చాలా ప్రధానం. అది తెలుసుకోకపోతే చాలా సందర్భాల్లో కండలూ, బరువునే కాదు... శక్తినీ, పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మంచి వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉంటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం.

ఆకుకూరలు, చేపలు, చికెన్, జ్యూసులు, నీళ్ళు, ఉప్పు కలిపిన నిమ్మరసం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది వీటితో వ్యాయామం తర్వాత మన శరీరానికి ప్రోటీన్లు అవసరమని గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తలచుకుంటే తొలుత స్ఫురించేవి చికెన్, చేపలు. వాటిలోని పోషకాలు బాడీబిల్డింగ్‌కు, కండరాల టోన్ నిర్వహణకు ఉపయోగపడతాయి. మరి వ్యాయమం తర్వాత తీసుకొనే ఆహరం గురించి తెలుసుకొన్నాం. వ్యాయామం తర్వాత తీసుకోకూడని ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

 
చీజ్


చీజ్ లో శాచురేటెడ్ పదార్థాలు ఎక్కువగా కలిగి ఉండం చేత, వ్యాయామం చేసి వచ్చిన వెంటనే కొంత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం తర్వాత చీజ్ తో తయారు చేసిన ఎటువంటి ఆహారాలను తీసుకోకపోవడానికి ఆరోగ్యానికి చాలా మంచిది.


ఫ్రైడ్ చికెన్

వ్యాయామం చేసిన వెంటనే ఫ్రై చేసిన మాంసాహారాన్ని తినకూడదు. అంతే కాదు మాంసాహారంతో తయారు చేసి స్నాక్స్ కు దూరంగా ఉండాలి. అలా కాకుండా ఉడికించిన చికెన్ లేదా ఉడికించిన చేపలు నిరభ్యంతరంగా తినబోదు.


ధాన్యాలు



తణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వ్యాయామం చేసిన వెంటనే వీటిని తినకూడదు. వీటి బదలు నట్స్, పండ్లను తినవచ్చు.


బ్రెడ్


బ్రెడ్, సాండ్ విచ్ వంటి స్నాక్స్ తినడం వల్ల శరీరంలోని రక్తంలోనికి చక్కరెలు త్వరగా అందుతాయి. వ్యాయం తర్వాత వెంటనే తినే ఆహారాల వల్ల విడుదలయ్యే చక్కెర స్థాయిలు శరీరానికి హానీ కలిగిస్తాయి.

 

పండ్ల రసం
వ్యాయామం చేసి వెంటనే చెమటు ఎక్కువగా బయటకు నెట్టబడుతాయి. అందుకోసం జ్యూస్ తాగాలనుకోవడం చాలా పొరపాటు. ఈ జ్యూస్ లలో ఉన్న చక్కర పదార్థాలు దేహంలో త్వరగా చేరుతుంది. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉండటం చేతా వ్యాయం చేసిన వెంటనే పండ్లరసం తీసుకోకపోవడమే మంచిది.

గుడ్డు
గుడ్డు ఆరోగ్యానికి మంచిది. అయితే వ్యాయామం తర్వాత దీన్ని ఫ్రై చేసి తినకూడదు. ఫ్రై చేసి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో నూనె పదార్థాలు కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.



మిక్క్ షేక్


మిల్క్ షేక్ తాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది, అయితే వ్యాయమం తర్వాత ఈ మిల్క్ షేక్ ను తాగడం వల్ల వ్యాయమం చేసినంత ప్రయోజనం శరీరానికి ఉండదు.



పచ్చి కూరగాయలు

పచ్చికూరగాల్లో అధిక పోషకపదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని వ్యాయామం చేసిన వెంటనే తినకూడదు. పచ్చికూరగాయలను వ్యాయామం తర్వాత వెంటనే తినడం వల్ల కండర శక్తి తగ్గిపోతుంది.

గ్రిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్-క్రిస్మస్ స్పెషల్

సాధారణంగా ఫిష్ వంటలంటే చాలా మాసాహారులకు చాలా ఇష్టం. అందులోనూ ఫిష్ మసాలా అంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఎర్రగా ఉండే గ్రేవి, డీఫ్ ఫ్రై చేసిన ఫిష్ ఫిల్లెట్..ఇలా ఒకటేమిటి. వివిధ రుచులు. అయితే ఎప్పుడూ రొటీన్ గా తయారు చేసే ఫిష్ వంటకాలకు భిన్నంగా ఇండియన్ స్టైల్ లో తయారు చేసుకొని గ్రిల్డ్ ఫిష్ మసాలా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందులోనూ ఇండియన్ మసాలాలు వాడటంతో మరింత టేస్టీగా ఉంటుంది.

గ్రిల్డ్ స్నాక్స్ అన్నీ కాంటినెంటల్ స్టైల్లో వండుతారు. అదే స్టైల్లో గ్రిల్డ్ మసాలా ఫిష్ అద్భుతమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం....

christmas special grilled masala fish fillets

కావలసిన పదార్థాలు:

పాంప్రెట్ ఫిస్ ఫిల్లెట్: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1 pinch
అజ్వైన్(ఇంగువ): 1/2 tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీల వరకూ వేడి చేయాలి.

2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి. శుభ్రం చేసిన ఫిష్ ఫిల్లెట్ మీద ఉప్పు, పసుపు చిలకరించు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియాలపొడి మరియు జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు శుభ్రం చేసి ఉప్పు పట్టించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మ్యారినేట్(చేపమొత్తానికి బాగా పట్టించాలి)చేసి దాని మీద కొంచె అజ్వైన్ మరియు నిమ్మరసం చిలకరించి ఇరవై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

5. ఇరవై నిముషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఫిష్ ఫిల్లెట్ మీద నూనెను చిలకరించి ఓవెన్ గ్రిల్లింగ్ రాక్ మీద పెట్టాలి.

6. 60డిగ్రీల హీట్ పెట్టి 15-20నిముషాల పాటు ఫిఫ్ ను గ్రిల్(బేక్) చేయాలి. మద్య మద్యలో ఫిష్ ను అన్ని పక్కలకూ తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి. అంతే గిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్ తయారైన వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

పది నిముషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - ఫ్రూట్ వ్రాప్

గుడ్లు, సాండ్ విచ్ మరియు పోహ వంటి అతి సులభంగా, అతి త్వరగా తయారైయ్యే బ్రేక్ ఫాస్ట్ రిసిపీలన్నీ మనం ప్రయత్నించే ఉంటాం. అయితే వీటిలో ఏ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరం. త్వరగా అయ్యే రిసిపి మాత్రమే కాదు ఆరోగ్యానికి, ఉపయోగపడే ఈ ఫ్రూట్ వ్యాప్ చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ ఫ్రూట్ వ్రాప్ రిసిపి పది నిముషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, అయితే బ్రేక్ ఫాస్ట్ మాత్రం మిస్ చేయకూడదు అనుకొనే వాళ్ళకి ఇది ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకు ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ పండ్లను అన్నింటిని ఉపయోగించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసేయవచ్చు.

మరి మీరూ ప్రయత్నించండి. టేస్ట్ చూడండి...



easy fruit wrap breakfast 10 mins

కావలసిన పదార్థాలు:


రోటీ: 2
ఆపిల్: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ద్రాక్ష: 5
దానిమ్మ(గింజలు): 2tbsp
పీయర్(బేరికాయ): 1/2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అరటి పండు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మొయోనైజ్: 1tbsp
చాల్ మసాలా: 1/2tsp


తయారు చేయు విధానం:

1. చాలా మంది ఇళ్ళలో ముందు రోజు రాత్రి తయారు చేసిన చపాతీలు ఒకటో రెండో మిగిలే ఉంటాయి. వాటితో తయారు చేసుకోవచ్చు. బిజీ లైఫ్ లో ఆఫీసుల, స్కూల్స్, కాలేజ్ లు అని టైమ్ లేని వాళ్ళు బయట రెడీమేడ్ లో దొరికే చపాతీలను తీసుకొచ్చు స్టాక్ పెట్టుకోవచ్చు.

2. పైన ఇచ్చిన వస్తువుల్లో పండ్లు అన్నింటీని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

3. కొన్ని గింజలున్న కాయలను పూర్తిగా కట్ తీసేయకండి గుప్పెడు అయితే సరిపోతాయి. కాబట్టి ఎంత అవసరమో అంతమాత్రం కాయనుండి గింజలను వేరు చేసి పెట్టుకోండి.

4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు చపాతీలకు మొయోనైజ్ ను రాసి, దాని మీద కొంచె ఉప్పును చిలకరించాలి.

6. తర్వాత ఒక్కో చపాతీ మీద పండ్ల మిశ్రమాన్ని కావల్సినంత స్ప్రెడ్ చేయాలి.

7. ఈ ప్రూట్ చపాతీని రోల్ చేసి తినేయాలి అంతే సింపుల్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.

మీకు మంచి సువాస కావలనుకొంటే పుదీనా ఆకులను కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు.