all

Friday, December 21, 2012

ఊబకాయం వున్నవాళ్ళు ఆహారం, వ్యాయామం ఎలా ఉండాలి?

ఊబకాయం వున్నప్పుడు ఆహార నియమావళికి, వ్యాయామానికి మారడం అసాధ్యంలా అనిపిస్తుంది. ఐతే ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ప్రతిబంధకాల నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం దాన్ని ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, మంచి వ్యాయామ నియమావళి తో ఎదుర్కోవడమే.

How Diet Exercise With Obesity

చర్యలు:

1. మొట్టమొదటి చర్య ఈ సవాలుకు భయపడకుండా ఉండడమే. ఒక పర్వతం అధిరోహించాలంటే ఎవరికైనా భయమేస్తుంది, కానీ మీ లక్ష్యం కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదని తెలుసుకోవడం మిమ్మల్ని ఒక సానుకూల ధోరణి లోకి తీసుకువెళ్తుంది.

2. తరువాత మరింత అభివృద్ది చేసేలా మొదట్లో చిన్న చిన్న చర్యలు తీసుకోండి. బాగా తీవ్రంగా ఆహార వ్యాయామ ప్రణాళిక లోకి వెళ్ళిపోవడం చాలా ప్రలోభ పెడుతుంది కానీ మీరు పరిగెత్తలేనంత వేగంగా వెళ్ళడ౦ వల్ల ఉపయోగం వుండదు.

3. వ్యాయామాన్ని దైనందిన చర్యగా మార్చుకోండి. చర్విత చర్వణమే అయినా వాహనాలపై వెళ్ళే కంటే నడవడం, లిఫ్ట్ ఎక్కే బదులు మెట్లు ఎక్కడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చాల తేడా చూపిస్తాయి.

4. భోజనం మానేయకండి. అది అనారోగ్యకరమే కాక అరుదుగా పనిచేస్తుంది.

5. క్రమంగా మీరు రోజూ తినే పరిమాణాన్ని తగ్గిస్తూ, మీ పని స్థాయిని పెంచుకుంటూ వెళ్ళండి.

6. మీకు నచ్చే ఆరోగ్యకరమైన ఆహారం తినండి. చాలా పళ్ళు రుచిగా వుండి మిఠాయిలకు ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.


చిట్కాలు:

1. వ్యాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు గుర్తుంచుకోండి. వ్యాయామం చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు, అది ఎటువంటి ప్రయోజనాలు కలిగించట్లేదని కూడా అనిపించవచ్చు; కానీ వ్యాయామం మీ జీవ క్రియను వేగిరపరుస్తుంది - అంటే చేయడం ఆపివేసిన చాలా సేపటి తర్వాత కూడా అది మీ కాలరీలు కరిగేలా చేస్తుంది.

2. వ్యాయామం, ఆహారం మీ శరీరంలోకి ఎండార్ఫిన్ లను వదిలి మీకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మీరు మరింత ఆరోగ్యంగా తయారై మీ రూపం మీ ఆత్మ విశ్వాసం స్థాయిని పెంచుతుంది.

3. క్రమంగా, మీరు తక్కువ తినడం వల్ల, మీ ఉదరం తక్కువ పరిమాణంలో ఆహారానికి సర్దుకుని సైజు తగ్గుతుంది. దీని వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపించి మీకు ఆకలి తక్కువగా వేస్తుంది.

హెచ్చరికలు :

1. ఇది జీవన శైలిలో మార్పని గుర్తుంచుకోవడం ముఖ్యం. సమస్య కాస్త తగ్గినట్టు అనిపించగానే మీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే ఈ ప్రయత్నం అంతా చేయడం వ్యర్ధమే అవుతుంది.

2. మీ కుటుంబం, స్నేహితులు మీ కొత్త రూపం మీద వ్యాఖ్య చేయడానికి చాలా నెలలు పట్టవచ్చు. ఈ సమయం వల్ల నిరుత్సాహ పడకండి ఎందుకంటే వ్యాయామం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీరు ఆరోగ్యంగా చురుగ్గా వున్నట్టు అనిపిస్తుంది.మీ పైన మీరు మరీ వత్తిడి పెంచుకోకండి. మీకు అనుకూలమైన వేగం లోనే వెళ్ళండి.

 

No comments: