అక్టోబర్ 22 తేదిన అనగా ఈ రోజ ప్రపంచంలోని చాలా దేశాలు నేషనల్ నట్స్ డే గా సెలబ్రేట్ చేసుకొంటారు.
ఈ నట్స్ డే ఎకె లో లాంచ్ చేయబడింది మరియు యుఎస్ లో సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకొంటారు.
మనందరికీ తెలుసు నట్స్ మనం రోజూ తీసుకొనే ఆహారంలో ఎంతటి ప్రాధాన్యత కలిగినవో. మన శరీరానికి కావలసిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందించడంలో నట్స్ బాగా ఉపయోగపడుతాయి.
నిజానికి ఎండు ఫలాలు డ్రైప్రూట్స్ అంటే మనకు తెలిసినవి ఎండు ద్రాక్ష, ఖర్జూరాలే. కాని ఇప్పుడు అన్ని రకాల పండ్లు డ్రైప్రూట్స్‌గా దొరుకుతున్నాయి.
జీడిపప్పు, బాదం, పిస్తా వంటివి పోషకాల పరంగా ఎండిన పండ్లను పోలి ఉండటంతో ఇవీ డ్రైప్రూట్స్ డబ్బాలో చేరిపోయాయి.
బాదం పప్పులు - ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి.
జీడిపప్పులు - ప్రతిరోజూ జీడిపప్పులు తింటే....డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది. జీడిపప్పులో ఓలెక్ యాసిడ్ వుంటుంది ఇది గుండెకు మంచి కొవ్వు. వీటిలో జింక్, కాపర్ మెగ్నీషియం, ఐరన్ మొదలైనవి వుండి ఎర్రరక్త కణాలను, గుండె కండరాలను బలపరుస్తాయి.
పెకాన్స్ - వీటిలో విటమిన్లు అదికంగా వుండి రక్త నాళాలలో కొవ్వు డిపాజిట్లను కరిగిస్తుంది. గుండెకవసరమైన 15 రకాల విటమిన్లు వుంటాయి. విటమిన్లు ఎ,బి మరియు ఇ ఫోలిక్ యాసిడ్, మినరల్స్, కాల్షియం, పొటాషియం కూడా వుంటాయి. వీటిలో వుండే మెగ్నీషియం, జింక్ లు గుండెకు మాత్రమే కాక ఎముకలను, కండరాలను కూడా బలపరుస్తాయి.
పిస్తా: వీటిలో కావలసినంత పీచుపదార్ధముంటుంది. గుండెకు చాలా మంచిది. అధిక కొవ్వు కరిగిస్తుంది. కేన్సర్ ను నిరోధిస్తుంది. ప్రొటీన్లు వుండటం వలన మంచి ఎనర్జీ లభిస్తుంది.
వాల్ నట్స్ - వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
అంజీర(ఫిగ్): రక్తహీనత (అనీమియా)ను నివారించాలంటే సాధారణంగా మాంసాహారమైన కాలేయం, గుడ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది శాకాహారులకు ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. కేవలం శాకాహారం తీసుకోవడం ద్వారానే మాంసాహారం తిన్న ఫలితాలను పొందాలంటే ఎండిన ఫిగ్స్‌పై ఆధారపడండి. దీనిలోని ఐరన్, విటమిన్-సి వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిల్లో చెక్కర శాతం ఎక్కువ. అనారోగ్యంతో నీరసించిన వాళ్ళు ఇవి కాసిని తింటే వెంటనే కోలుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవాళ్ళు -రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను గ్లాసు నీళ్లలో రోజంతా నానబెట్టి ఉదయాన్నే తాగి, పండ్లను తినేస్తే సరి. చిన్న పిల్లలకి ఈ నీళ్లు మరీ మంచిది. వయస్సును బట్టి ఆరునుంచి పది ఎండు ద్రాక్షను నానబెట్టి పట్టించాలి. ఇందులో ఐరన్‌కూడా ఎక్కువ. బరువు తక్కువుగా ఉన్నవాళ్లకీ, రక్తహీనతతో బాధపడే వాళ్లకీ మంచిది.
ఎండు ఖర్జూరం: ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి. ఎవరిలోనైనా చక్కెర పాళ్లు తక్కువగా (లో గ్లైసీమిక్ ఇండెక్స్) ఉండి బాగా నీరసంగా ఉండి, అన్నం దొరకని పరిస్థితుల్లో నిస్సత్తువ తగ్గించేందుకు వెంటనే ఎండు ఖర్జూరాలు తినాలి.
డ్రై ఆప్రికాట్(ఎండు ఆప్రికాట్): అరటిపండులో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఒక అరటి పండులో కంటే ఒక ఎండిన ఆప్రికాట్‌లో మూడు రెట్ల కంటే ఎక్కువ పొటాషియమ్ ఉంటుంది. ఇది హైబీపీ తగ్గించడానికి బాగా ఉపకరిస్తుంది. ఇటీవలే అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థలో నిర్వహించిన అధ్యయనంలో సోడియం కంటే పొటాషియమ్ ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీ నియంత్రిస్తుందని తేలింది. అందుకే హైబీపీ నియంత్రణకు ఎండిన ఆప్రికాట్ ఎంతైనా మంచిది.
పల్లీలు: వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మంచివని మీరనుకుంటున్నట్లయితే అది నూటికి నూరుపాళ్లూ కరెక్టే. మోనో శాచ్యురేటెడ్ కొవ్వుకు ఇది మంచి దారి. ఇది గుండెకు మంచిది. ఇది రోగాలను దరిచేరనివ్వదు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో మెండు. విటమిన్ ఇ, నియాసిన్, ఫక్షలేట్, ప్రోటీన్, మాంగనీసు వేరుశెనగల్లో అత్యధికంగా వున్నాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులు దరికి చేరనీయదు. జీర్ణసంబంధ వ్యాధులు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పేగు కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కృషిచేస్తుంది. వీటిలో కేల్షియమ్, విటమిన్ డి తక్కువ మోతాదులో వున్నా గానీ, అవి ఎముకపుష్టికి దోహదపడతాయి. ముఖ్యంగా ముఫ్ఫైనిండిన వ్యక్తులకు దీని అవసరం ఎంతైనా వుంది!
మనకు తెలిసిన డ్రైప్రూట్స్, నట్స్‌లో ప్రదానంగా ఎండు ద్రాక్ష, ఖర్జూరం, జీడిపప్పు, బాదంపప్పుల వాడకమే ఎక్కువ. చూడడానికి ఎంతో చిన్నవిగా ఉండే ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిల్లో చెక్కర శాతం ఎక్కువ. అనారోగ్యంతో నీరసించిన వాళ్ళు ఇవి కాసిని తింటే వెంటనే కోలుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవాళ్ళు -రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను గ్లాసు నీళ్లలో రోజంతా నానబెట్టి ఉదయాన్నే తాగి, పండ్లను తినేస్తే సరి.
చిన్న పిల్లలకి ఈ నీళ్లు మరీ మంచిది. వయస్సును బట్టి ఆరునుంచి పది ఎండు ద్రాక్షను నానబెట్టి పట్టించాలి. ఇందులో ఐరన్‌కూడా ఎక్కువ. బరువు తక్కువుగా ఉన్నవాళ్లకీ, రక్తహీనతతో బాధపడే వాళ్లకీ మంచిది. జీడిపప్పు లో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువుగా ఉండటంతో ఇవి గుండెకు మేలుచేస్తాయ. పోటాషియం, మెగ్నీషియం, ఫాస్పర్, సెలీనియం, కాపర్, విటమిన్‌లు ఇందులో అధికం. ఖర్జురాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజోలు ఎక్కువ. నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గింజల్ని తీసేసి కనీసం వారానికి రెండుసార్లు తింటే గుండె పదిలమే. ఇందులో కొద్ది పాళ్లలో ఉన్న నికోటిన్ పేగుల్లోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. బాదం బోలెడు పోషకాలకు నిలయం.