ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో ఆలూ బోండా చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం....
కావలసిన పదార్థాలు:
ఉడికించిన బంగాళదుంపలు(ఆలూ): 2-4(ఉడికించి చిదిమి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6
శెనగపిండి: 1cup
కారం: 1tsp
గరం మసాలా: 1/4tsp
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప, మరియు ఉప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, మరియు పచ్చిమిర్చి వేసి బాగా కలగలుపుకోవాలి.
2. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శెనగపిండి తీసుకొని, దానికి కొద్దిగా ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్ళు పోసి బోండా పిండిలా కలుపుకోవాలి. (చిక్కగాను లేదా కొద్దిగా పలుచగా కూడా కలుపుకోవచ్చు)
3. ఇప్పుడు ఆలూ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోనికి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లో చేసుకోవాలి. ఇలా కొన్ని బాల్స్ చేసుకొన్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు, ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి, బాగా కాగిన తర్వాత మంట మీడియంగా పెట్టి ఆలూ బాల్స్ శెనగ పిండి మిశ్రమంలో వేసి, ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి ఒక ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడిగా చట్నీ లేదా టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అలాగే ఉడికించిన బోండాను రెండుగా కట్ చేసి మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం కొద్దిగా చిలకరించి సర్వ్ చేయొచ్చు.
No comments:
Post a Comment