all

Friday, November 23, 2012

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ బిర్యాని-క్యాలీఫ్లవర్ బిర్యానీ

సాధారణంగా బిర్యానీ రకరకాలుగా చేస్తుంటారు. కొంచెం వెరైటీగా వెజిటేరియన్ ఆహారాలతో కూడా బిర్యానీ చేస్తే రుచి, ఆరోగ్యం కూడా. క్యాలీప్లవర్ లో విటమిన్ సి అధికంగా ుంటుంది. విటమిన్ సి'ని తక్కువగా తీసుకుంటే డోపమైన్ తయారీని తగ్గిస్తుంది. ఆరోగ్య భావనలను కలిగిస్తుంది. క్యాలీఫ్లవర్ లో ఉత్పాత స్ఫూర్తిని పెంచే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాలీఫ్లవర్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనంతో తీసుకోవడం చాలా ఆరోగ్యకరం....
cauliflower biryani

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
మీడియం సైజ్ క్యాలీఫ్లవర్: 1
నీరు: 3cups
ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి: ఈ రెండిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి
టొమాటో గుజ్జు: 1/2cup
పచ్చిబఠాణీ: 1/4cup
నెయ్యి లేదా నూనె: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: కొద్దిగా
మసాలాకోసం
జీలకర్ర: 1/2tsp
ధనియాల పొడి: 1tsp
ఏలకులపొడి: 1/4tsp
పసుపు: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
బిరియానీ మసాలా: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు కప్పుల నీటిలో బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి. ఉడుకుతుండగా కొద్దిగా ఉప్పు వేసి ఉడికిన అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, వేడిఅయ్యాక అందులో ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ ను వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత మసాలాదినుసులు వేసి, ఘుమ ఘుమలాడే వాసన వచ్చేవరకు వేయించాలి.
3. తరవాత టొమాటో గుజ్జు, పచ్చిబఠాణీ, క్యాలీఫ్లవర్ తరుగు వేసి కలపాలి. ఈ పదార్థాలన్నీ మెత్తబడేవరకు మీడియం మంట మీద ఉడికించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీరు చిలకరించాలి.
4. తరవాత ఉడికించుకున్న అన్నంలో ఈ పదార్థాలను కలపాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే క్యాలీఫ్లవర్ బిర్యానీ రెడీ.

No comments: