all

Friday, November 23, 2012

స్వీట్ : స్పైసీ టర్కిష్ పులావ్

ప్రపంచంలో చాలా దేశాల్లో రైస్ ను ఆహారంగా తీసుకొంటారు. ఆయా దేశాల్లో రైస్ ను వివిధ రకాలు, వైరీటీగా వండుకొని తింటారు. మన భారత దేశంలో రైస్ ప్రాధాన ఆహారం. ఒక్క రోజులో రైస్ తినకపోతే ఆ భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంది. టర్కిష్ రైస్ చాలా డిఫరెంట్ గా కారంగా కొద్దిగా తియ్యగా ఉంటుంది. అయితే తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. టర్కిష్ రైస్ ఏదైనా చట్నీ లేదా మంచూరియన్ సాస్ మంచి కాంబినేషన్. రైస్ ఐటమ్స్ లో మీరేదైనా కొత్తగా తయారు చేయాలనుకొనేవారు. ఇలా చేసి చూడండి.
turkish pulao sweet spicy rice recipe

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1cup
క్యారెట్, బీన్స్: 1cup
ఉల్లిపాయలు: 2(chopped)
పచ్చిమిర్చి: 6(chopped)
టమోటో: 1(chopped)
బెల్లం తురుము: 3-4tsp
వేరుశెనగలు: 5-8 pieces
జీడిపప్పు: 8-10 pieces
పసుపు: 1tsp
కారం: 2tsp
గరం మసాలా: ½tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నీళ్ళు: 1.5 cups
turkish pulao sweet spicy rice recipe
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారెట్, బీన్స్ ను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బాస్మతి రైస్ ను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో టమోటో, బెల్లం తురుము, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, క్యారెట్, బీన్స్ ముక్కలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి 5-10నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ ను పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక అందులోపచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి.
5. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేరుశనగపప్పు, జీడిపప్పు పలుకులు వేసి మరో కొద్దినిముషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
6. ఇప్పుడు టమోటో, క్యారెట్, బీన్స్ మ్యారినేట్ చేసి మసాలా మిశ్రమాన్ని కూడా అందులో వేసి మరో రెండు నిముషాలు వేయించాలి.
7. టమోటో మెత్తబడ్డాక అందులో కడిగి పెట్టుకొన్న బాస్మతి రైస్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక నిముషం అలా బియ్యాన్ని కూడా వేయించిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు, మూడు విజిల్స్ వచ్చాక స్టౌ ఆఫ్ చేసి దింపుకోవాలి. (రైస్ బాగా పలుగా రావాలంటే ఒక విజిల్ వచ్చిన వెంటనే మంటను మీడియంగా పెట్టుకోవాలి) అంతే స్వీట్ అండ్ స్పైసీ టర్కిష్ పులావ్ రెడీ..
 

No comments: