all

Friday, November 23, 2012

పెళ్ళికి ముందు వీటికి దూరం..ఆరోగ్యానికెంతో క్షేమం..!


కార్తీక మాసంతో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. పెళ్ళిలో అందంగా కనబడటం కోసం ఇటు పెళ్ళి కుమార్తె, అటు పెళ్ళి కుమారుడు ఇద్దరూ పడరాని పాట్లు పడుతుంటారు. డైయట్ చేయడం మొదలుకొని జిమ్, వ్యాయామం, బ్యూటీ టిప్స్ ఒక్కటేంటి అన్ని పెళ్ళి కొద్ది రోజులుందనంగా మెదలెట్టాస్తారు. పెళ్ళి అనేది ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైరన ఘట్టం. అలాటి పెళ్ళి వేడుకలో పెళ్ళి కుమార్తె, పెళ్లి కుమారుడు అందంగా, ఆనందంగా కనిపించడం చాలా ముఖ్యం. ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా..


జంక్ ఫుడ్: ముఖ్యంగా జంక్ ఫుడ్స్ లో బర్గర్లకు మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ కు బైబై చెప్పండి. వీటిలో ఎక్కువ శాతం క్యాలరీ ఉండటమే కాకుండా అతి త్వరగా బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.



సోడా: పెళ్ళి సమయంలో షాపింగ్ చేసి చేసి అలసిపోయినప్పుడు షోడా లేదా చల్లచల్లా ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండి. సహజమైన పండ్ల రసాలను తాగడం వల్ల డయట్ కు ఉపయోగపడటమే కాకుండా శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది.



డైరీ ప్రొడక్ట్స్: పాలు మరియు వెన్న వంటివి జీర్ణం అవ్వడానికి కొంచెం కష్టం. వీటి వల్ల గ్యాస్ సమస్య కూడా ఏర్పడుతుంది. అంతే కాదు వెన్న, పెరుగు వంటివి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. మీగడ తీసిన పాలు, లోఫ్యాట్ చీజ్ ఆరోగ్యానికి మంచిది.


తీపి పదార్థాలు: లవ్ క్యాండీస్ మరియు చూయింగ్ గమ్స్?వంటివి మీ పళ్ళను ఆనారోగ్యానికి గురి చేస్తాయి. నోటి దుర్వాసనకు దారితీస్తుంది. వీటికి బదులు దంతాలను తెల్లగా మార్చే క్యాండీస్ ను తీసుకోవడం మంచిది.

  కెఫిన్: ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది. అయితే కాఫీలో ఉన్న కెఫిన్ శరీరంలోని నీటిశాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పెళ్ళికి ముందు డైయట్ ఆచరిస్తుంటే కెఫిన్ కలిగినటువంటి డ్రింక్స్ ను తాగకపోవడమే మంచిది. దీనికి బదులు ఎక్కువ నీరు మరియు పండ్ల రసాలను తీసుకోవడం ఆరోగ్యం.

ఉప్పు: ఆహారంలో ఎక్కువగా ఉప్పు చేర్చుకోవడాన్ని పూర్తిగా తగ్గించాలి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగేలా చేస్తాయి. ఇంకా డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. కాబట్టి ఉప్పును తగిన మోతాదులో మాత్రమే తగ్గించాలి.



బీన్స్: సాధారణంగా బీన్స్ ఆరోగ్యకరమే. అయితే వీటిని తీసుకోవడం వల్ల పొట్టలో అధికంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాంతో కడుపు ఉబ్బరం మెదలవుతుంది. ఇంకా ఇందులో ఉన్న చెక్కర స్థాయి జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనివ్వదు. కాబట్టి పెళ్ళికి ముందు వీటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది.


షాపేన్(వైట్ గ్రేప్ వైన్): ఇది కార్బోహైడ్రేట్ డ్రింక్. దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థనకు భంగం కలిగిస్తుంది. ఇంకా గ్యాస్ ను ఏర్పడటానికి దారితీస్తుంది.



పాస్తా: దీని టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అయితే వీటిని తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. కడుపు ఉబ్బరాన్ని పెంచుతుంది అందువల్ల గ్యాస్ ఉత్ప్రేరకాలైన పిండి పదార్థాలకు అంటే పాస్తా, బియ్యం, మరియు బంగాళదుంపలు వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.



డిజర్ట్స్: పిండి వంటలు మరియు ఆర్టిఫిషియల్ స్వీట్ వంటి వాటికి దూరంగా ఉండకపోతే అతి త్వరగా బరువు పెరిగే చాన్సెస్ ఎక్కువ.

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. పెళ్లికి కొంతమంది చేసే హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. అమ్మాయిలు కూడా పెళ్లి కుదిరిన సంబరంలో ఒక్కసారిగా కొవ్వు పదార్థాలు అధికశాతంలో ఉన్న ఆహారం తీసుకుని మరీ లావెక్కిపోతారు. ఎప్పుడో ఎంగేజ్మెంట్లో మల్లెతీగలా కనిపించిన పెళ్లి కూతురు ఒక్కసారిగా పదికిలోలు పెరిగి పెళ్లికూతురుగా బొద్దుగా కనిపించేసరికి పెళ్లికొడుకు అతని తాలూకు బంధువులు అవాక్కయిపోతారు. మరికొందరు పెళ్లి కుదిరిందని మరింత అందంగా కనిపించాలని ఉపవాసాలతో మరీ డైటింగ్ చేసి పెళ్లి సమయానికి నీరస పడిపోవడమో లేక పేషెంట్లానో తయారవుతుంటారు. పెళ్లిలో తప్పనిసరిగా తీసే వీడియో, కెమెరాలలో పెళ్లి కూతుళ్లు అందవిహీనంగా కనిపిస్తుంటారు. మరి ఆ ఫొటోలు, వీడియోలు జీవితాంతం చూసుకోవాల్సిన తీపిగుర్తులు. ఒకరి కోసం కాకపోయినా మనకోసమైనా జాగ్రత్తపడాలి.
పెళ్ళికి ముందు ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి అనేదాని మీద అవగాహాన కల్పించుకోండి. కాబట్టి కాబోయే పెళ్ళిజంట కోసం కొన్ని డైయట్ ఫ్లాన్ టిప్స్...ప్రతి రోజూ తినే ఆహారంతో పాటు ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, మినరల్స్ మొదలైనవి మెండుగా ఉండేట్లు చూసుకోవాలి. ఇందులో మీకు డైటీషియల్ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలను తాగితే మంచి నిద్ర వస్తుంది. సరైన నిద్ర లేకుంటే కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి చూడటానికి అసహ్యంగా తయారవుతారు. ఇదిలా ఉంచితే మరి ముఖ్యంగా ఎటువంటి ఆహారానికి దూరంగా ఉండాలో చూద్దాం...

No comments: