all

Friday, November 23, 2012

కడుపు నిండుగా ఉంచే సెట్ దోసె

దక్షిణాది వారి ఆడపడుచు ఇడ్లీ లాగా దోసె, మినపట్టు, పెసరట్టు, ఉల్లి అట్టు, రవ్వ అట్టు ఇలా ఎన్నో ఉన్నాయి. కర్ణాటకలో మసాలాదోసె, సెట్ దోసె, నీరు దోసె, వెన్నదోసె అని ఏవేవో వచ్చాయి. కేరళకు వెడితే ఊతప్పం నోరూరిస్తుంది. ఇదీ దోసెలాంటిదే. తమిళనాడులో ఇడ్లి, పొంగల్ తర్వాతి స్థానం దోసెదే. ఇంతటి పాపులారిటీ ఉంది దోసెకు. మరి దోసెలో వెరైటీ దోసె సెట్ దోసె ఎలా తయారు చేయాలో చూద్దాం...
South Indian Set Dosa
మినప్పప్పు: 1cup
బియ్యం: 3cups
మెంతులు: 1tbsp
బెంగాళ్ గ్రామ్(శెనగపప్పు): 1tbsp
అటుకులు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
పంచదార: 2tsp
కరివేపాకు: 2 రెబ్బలు
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మినప్పప్పు, బియ్యం, అటుకులు, మెంతులు, బెంగాల్ గ్రామ్ కలిపి ఆరుగంటలు నానబెట్టాలి.
2. బియ్యం మిశ్రం రుబ్బుకొనే పది నిముషాల ముందు అటుకులను నానబెట్టుకోవాలి.
3. తర్వాత బియ్యం, పప్పుల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకొన్న తర్వాత 6-8గంటల పాటు పిండి నానాలి అప్పుడే దోసె మెత్తగా వస్తుంది.
4. పిండిలో తగినంత ఉప్పు, పంచదార కలిపి పక్కన పెట్టుకోవాలి.
5. పిండి బాగా పులిసిన తర్వాత చిన్న పరిమాణములో కాస్త మందంగా(కనీసం ఒక ఇంచ్ )దోసెలు చేసుకుని
పైన తరిగిన కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ, వెజిటేబుల్ ఖుర్మాతో వడ్డించాలి. ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.

No comments: