all

Monday, May 13, 2013

మునగాకు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా...!

వంటలకు ఘుమఘమలను అందించి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ, మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ కాడలతోటే కాకుండా మునగ ఆకును వంటు చేసుకుని తినడం వలన శరీర ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తుంది. అయితే, ఇప్పుడు కాడలు వాడినంతగా ఆకును వాడటం లేదనే చెప్పాలి. దీని లేత ఆకులు కూరగాను, పువ్వును మామూలు ఆకుకూర వండిన మాదిరిగానే వండవచ్చును. మునగాకు కాలేయంలో చేరిన విష పధార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది.

కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతూంటారు. అలాంటివారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. వాత వాయువులను, కడుపునొప్పి, అల్సర్లు, పేగు పూతలు పోగొడుతుంది. ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూటకట్టి గవదబిళ్లపై కడితే తగ్గిపోతాయి.

మునగాకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమయినంతగా పట్టణాలలో లభ్యం కాకపోవచ్చు. కొంత ఆకుల్లో ఉండే విలువలే మునగకాయల్లోనూ ఉంటాయి. ఇవి పట్టణాల్లో దొరుకుతాయి. కనుక, వాటినైనా తీసుకునే విధంగా తీసుకుంటుంటే ఫలితాలు పొందవచ్చు. ఉడికించే వాటిల్లో వేయడం వలన వాటిలోని సారం అంతా ఇవతలకి వస్తుంది. అది తీసుకుంటే శరీరానికి చక్కగా వంట పడుతుంది. మునగ ఆకైనా, కాడైనా ఆరోగ్యానికి మంచిది.

health benefits drumstick flowers and leaves


 
ములగకాయల గురించి మనకందరికీ తెలుసు. ములగ కాయల పులుసు ఎంత సువాసన భరితమో తెలియనిదెవరికి. అయినా ములగ ఆకు గురించి ఈ తరం వారిలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యకరమే. గృహవైద్యంలో ములగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు. నిజానికి ములక్కాయల వలన ఉపయోగం తక్కువ.

ములగ ఆకు వైద్య సంబంధమైన ఒక గొప్ప ఔషధి. అందువలన ములగ ఆకు గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం.ములగ ఆకులో ఉన్నంతగా ఎ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరలోను లేవు. సున్నము, భాస్వరము, ఇనుము తగినంతగా ఉన్నాయి. 100గ్రా ములగ ఆకులలో పోషకవిలువలు ఈ విధంగా ఉంటాయి. పిండిపదార్థాలు-13.4గ్రా, క్రొవ్వు పదార్థాలు 1.7గ్రా, మాంసకృత్తులు-6.7గ్రా, సున్నం-440మి.గ్రా, భాస్వరం-70మి.గ్రా, ఇనుము-7మి.గ్రా, పీచుపదార్థం 0.9మి.గ్రాములగ ఆకు కొద్దిగా కారంగా ఉంటుంది.

ములగ ఆకు వేడిచేసే స్వభావం కలిగి ఉంటుంది. ప్రారంభదశలో ఉన్న కీళ్లనొప్పులకు ములగ ఆకును నూరి కట్టినచో కీళ్లనొప్పులు తగ్గుతాయి. పుండ్లు మొదలగునవి వానియందలి నీరు లాగుటకు ములగ ఆకును నూరి కట్టుకట్టినచో పుండ్లు త్వరగా నయమవుతాయి. చర్మరోగములు, వ్రణములను నివారిస్తాయి.వాతము, కఫమును హరిస్తాయి. దృష్టి మాంద్యమును, రేచీకటిని పోగొడతాయి. ములగ ఆకులలో అమినో ఆమ్లములు పుష్కలంగా ఉంటాయి. అందువలన మాంసకృత్తుల లోపము వలన వచ్చు రోగములను నిరోధిస్తాయి.

గర్భిణులకు పాలిచ్చే తల్లులకు ములగ ఆకు రసం ఎంతో మేలు చేస్తుంది.దోసకాయరసంతో కొంచెం ములగ ఆకు రసాన్ని కలిపి ప్రతినిత్యం సేవిస్తే గుండె, కాలేయం, మూత్రపిండాల అపసవ్యత వలన శరీరానికి నీరు పట్టకుండా నిరోధిస్తుంది. ములగ ఆకు మలబద్దకాన్ని నివారిస్తాయి. కీళ్ల సంధుల అరుగుదల, నపుంసకత్వం, కాలేయం పెద్దవి కావటం, తదితర వ్యాధులను ములగపూల రసాన్ని సేవించటం ద్వారా నివారించవచ్చు. ములగపూల రసం స్త్రీలో వంధ్యత్వాన్ని పోగొడుతుంది. కీళ్లసంధులలో నొప్పులను తగ్గిస్తుంది. ములగ చెట్టు వ్రేళ్లను, కొద్దిగా మెంతులను కొద్దిగా ఆముదం గింజలను కలిసి లేహ్యంగా చేసి నొప్పి ఉన్న ప్రాంతంపై మర్దన చేస్తే నొప్పులు తగ్గిపోతాయి.

 

అందానికి కస్తూరి పసుపు ప్రాధాన్యత ఎంతో మీకు తెలుసా..?

పసుపుతో ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఈ తరంలో తెలియని తనం వల్ల పసుపు యెక్క ప్రాధాన్యతను కొందరు విస్మరిస్తున్నారు. పసుపు కేవలం వంటకానికి రంగును తెచ్చేది మాత్రమే కాదు.

పసుపుతో నీరుకలిపి మెత్తగా పేస్ట్ లా చేసి క్రమంగాలోనికి తీసుకుంటే శరీరానికి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేధం వెల్లడిస్తోంది.పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను హరిస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారంలో విషపధార్థాలు లేక మలినపధార్థాలు కలిసి ఉండి మనలోకి వెళుతాయి. పసుపు కావాలిసినంతగా కలిపిన ఆహారం విష మరియు మలిన పధార్థాలను పసుపు తొలగిస్తుంది. గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంటలాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది.సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుపుకు ఎంతో ఋణపడి ఉన్నాయి.

మెత్తగా పేస్టులా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమవుతుంది. అలా పసుపు బాహ్య మరియు అంతరప్రయోజనాలకు ఎంతాగానో ఉపయోగపడుతుంది.పసుపును ఒక మొక్క తాలూకు వేళ్ల నుంచి తీస్తారు. పసుపు కొమ్ములుగా పేర్కొనే ఆ మొక్కల వేళ్లను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపు వాడతారు. తెలుగువారి ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఉంది. ఇది కీటక వినాశనిగా పని చేస్తుంది. దానితోపాటు ముఖానికి కూడా సౌందర్యసాధనంగా పసుపు రాసుకుంటారు.

అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడి కోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
Kasturi Turmeric Ubtans Spotless Skin

ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని
పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపసమనం కలిగిస్తుంది.పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి.

ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి. శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది.

పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి.పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి.

మొటిమలు :
జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి దాంతో మొటిమలు మచ్చలు తొలగిపోతాయి. పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. * పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. * దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది. * పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.

 


అమ్మను దత్తత తీసుకుందాం! (వివరం),,,,,,,,,,,,,,,,

 

మాతృదినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...
చెట్టుకు పువ్వు పూయడం సహజమే కావొచ్చు. కానీ ఏ సామాజిక గాలివానో చెట్టును ఊపేస్తే! పూసిన పువ్వు అనాధగా రాలిపడితే! దాన్ని జాగ్రత్తగా ఏరుకునే రెండు కొమ్మల్లాంటి చేతులు కావాలి. అక్కడ ఈ పువ్వు తిరిగి వికసించాలి. ‘దత్తత బంధం’ అంటే ఇదేనేమో! కడుపున పుడితేనే బిడ్డలా! ప్రేమతో ఆహ్వానించే బంధం పేగుతెంచు కున్నదానికంటే పెద్ద బంధం ఎందుకు కాకూడదు! ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇస్తున్న దత్తతలపై ప్రత్యేక కథనం.

‘దత్తతలో బిడ్డ తల్లి గర్భంలో కాక ఆమె హృదయంలో పెరుగుతుంది.’. దత్తత దరఖాస్తు తొమ్మిదిపేజీలో కనిపించే ఈ వాక్యం చదవగానే ఎవరికైనా పెంచుకోవడంపై మక్కువ కలుగుతుంది. పిల్లలులేని ఎందరో తల్లిదండ్రుల తాత్కాలిక సమస్యకు దత్తత శాశ్వత పరిష్కారం ఇస్తోంది. అయితే దత్తత కోరుకునే చాలామందికి దానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలియవు. మనకు అవసరమైనప్పుడు దత్తతిచ్చేచోటుకెళ్లి మనకి నచ్చిన బిడ్డను తెచ్చుకోవచ్చనే అపోహలో ఉన్నవారు కొందరయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో దత్తత తీసుకోడానికి ఏళ్లు గడిచిపోతాయెందుకని అడిగేవాళ్లు మరికొందరు. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈ ప్రత్యేక కథనం.

దత్తత ఎవరిస్తారు?

మన రాష్ర్తంలో ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’ మాత్రమే దత్తత ఇస్తుంది. పూర్వం స్వచ్చంద సంస్థలు కూడా పిల్లల్ని దత్తత ఇచ్చేవి. వాటిపై రకరకాల ఆరోపణలు రావడంతో ఆ పని కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ఉన్న మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలోనే దత్తత ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘శిశుగృహ’ ద్వారా అందుబాటులోకి వచ్చింది. అయినా, హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయానికే ఎక్కువ దరఖాస్తులు వస్తుండటంతో బిడ్డ ఇంటికి రావడానికి ఏడాదిన్నర పడుతోంది. అదే జిల్లాల్లో అయితే ఆర్నెళ్ల సమయం సరిపోతుంది. సమయం గురించి కచ్చితంగా చెప్పాలంటే... ఏడాదిలోపు బిడ్డయితే ఏడాదిన్నరపైనే పడుతుంది. అదే మూడేళ్లలోపు పిల్లలు కావాలంటే ఏడాది సమయం పడుతుంది. అంతకంటే పెద్ద వయసు చిన్నారులను దత్తత తీసుకోవడానికి ఆర్నెళ్లు చాలు. రెండు నెలల బిడ్డ నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లలను దత్తతకు ఇస్తారు. అయితే ఇక్కడ పిల్లల వయసును బట్టి దత్తత కోసం వచ్చిన తల్లిదండ్రుల వయసుని నిర్దేశిస్తారు. పాతికేళ్ల దంపతులకు పదేళ్ల పాపని ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. యాభై ఏళ్లున్నవారికే పదేళ్ల పిల్లల్ని ఇస్తారు. కారణాలు అధికారులు కౌన్సిలింగ్‌లో వివరిస్తారు.

దరఖాస్తు...కౌన్సెలింగ్

పిల్లలు లేనివారు శిశు సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలి. బిడ్డ కావాలంటూ కోరుతూ మొదలయ్యే ఆ పద్నాలుగు పేజీల ధరఖాస్తులో ఆస్తి మొదలు తల్లిదండ్రుల ఆరోగ్య వివరాలతో సహా పూరించాలి. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేకపోయినా దత్తత కోరే అర్హతను కోల్పోతారు. దరఖాస్తు చేసుకున్నాక శిశు విహార్‌వారు కౌన్సెలింగ్‌కి పిలుస్తారు. పిల్లల్ని కోరుకునే తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు వారికి అర్హత కల్పిస్తారు. ‘‘దత్తత ఉద్దేశం తల్లిదండ్రులకు తగిన పిల్లల్ని ఇవ్వడం కాదు, పిల్లలకు తగిన తల్లిదండ్రులను వెతకడం. దత్తత అనేది ఏ ఒక్కరి అవసరం కాదు. పిల్లలకు మంచి తల్లిదండ్రులు కావాలి. అలాగే పిల్లలకోసం ఎదురుచూసేవారికి పిల్లలు కావాలి. అయితే రకరకాల ఆలోచనలతో, అభిప్రాయాలతో వచ్చేవారు కౌన్సెలింగ్ తర్వాత వారి హృదయంలో ఉన్న ఆవేదనను బయటపెడతారు. వారి భవిష్యత్తుని ఆనందమయం చేసే బిడ్డని ఇవ్వమని అడుగుతారు. నిజానికి ఇక్కడికి వచ్చే తల్లిదండ్రుల్లో చాలామంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నవారే’’ అంటారు శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్యామ్ సుందరి.

హోమ్ స్టడీ...

కౌన్సిలింగ్ అయ్యాక ఎవరైతే ముందు దరఖాస్తు పెట్టారో వారింటికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు వెళ్లి వాస్తవాలను విచారిస్తారు. ఆస్తులకు సంబంధించిన వివరాల్లో ఏమైనా అవాస్తవాలున్నట్లు తేలితే దరఖాస్తుని పక్కన పెట్టేస్తారు. హోమ్ స్టడీ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే బిడ్డ ఉండేది అక్కడే కాబట్టి. దత్తత తీసుకున్న బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలనేది శిశు సంక్షేమ శాఖ ఉద్దేశం. అలాగే పరిసరాల వాతావరణం కూడా చాలా ముఖ్యం. దానికోసం చుట్టుపక్కలవారితో కూడా అధికారులు మాట్లాడతారు. బిడ్డకు అన్నివిధాల అది అనువైన చోటని నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తుని అంగీకరిస్తారు.

సీనియారిటీని బట్టే...

బిడ్డను దత్తతకు ఇవ్వడానికి నెలలు నెలలు ఎందుకు గడిచిపోతాయి? ‘‘దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తుంటాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరినీ కౌన్సెలింగ్ చేసి ఎంపిక చేయాలి. దీనికోసం రెండు మూడు నెలల సమయం పడుతుంది. తర్వాత వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేయాలి. దీనికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఫలాన వారికి పిల్లల్ని ఇవ్వొచ్చు...అని నిర్ధారించుకున్న తర్వాత ఎవరు ముందుగా ధరఖాస్తు చేసుకున్నారో వారిని శిశు విహార్‌కు పిలిపిస్తాం’’ అని వివరిస్తారు అసిస్టెంట్ డెరైక్టర్ విజయలక్ష్మి.

మ్యాచింగ్...

తల్లిదండ్రుల రంగు, పోలికలను బట్టి వారడిగిన వయసు బిడ్డని ఎంపిక చేస్తారు అధికారులు. పూర్వం ముగ్గురు పిల్లల్ని చూపించేవారు. ఈ మధ్యకాలంలో దత్తతకు పెరిగిన డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఒక్కబిడ్డను మాత్రమే చూపిస్తున్నారు. నచ్చితే తీసుకోవాలి. లేదంటే వెనక్కి వెళ్లిపోవాలి. విజయలక్ష్మి ఛాంబర్ బయట బోర్డుపై ఇప్పటివరకూ దత్తత తీసుకున్న తలిదండ్రుల ఫొటోలను వారు తీసుకున్న బిడ్డ ఫోటోతో సహా పెట్టారు. వాటిని చూస్తే అధికారుల మ్యాచింగ్ కళను మెచ్చుకోకుండా ఉండలేం. నిజంగా ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లానే ఉన్నారు.

మెడికల్ టెస్టులు...

అధికారులు చూపించిన బిడ్డ నచ్చితే, మీకిష్టమైన వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి బిడ్డకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అప్పటికే అధికారులు పరీక్షలు చేయించినప్పటికీ మీ సందేహాలు తీర్చుకోడానికి మళ్లీ చేయించుకుంటే మంచిది. మీరెక్కడ పరీక్షలు చేయించదలుచుకుంటే అక్కడికి మీతో పాటు అధికారులు ఒక ఆయాని పంపుతారు. దీని గురించి ఈ మధ్యనే దత్తత తీసుకున్న సునీత, ప్రకాష్ దంపతులు... ‘‘మా ఇద్దరి రంగుకు దగ్గరగా, మా పోలికల్లో కలిసిపోయేలా ఉంది పాప. చూడ్డానికి హుషారుగా, ఆరోగ్యంగా కనిపించింది. అయినా ఎందుకైనా మంచిదని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలూ చేయించుకుని మా సందేహాలు తీర్చుకున్నాం’’ అని చెప్పారు.

చట్టబద్ధంగా...

ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక బిడ్డను తీసుకెళ్లి అధికారులకు అప్పగించాలి. బిడ్డ ఆరోగ్యంగా ఉందని ధృవీకరించుకున్నాక, ‘మాకు ఆ బిడ్డ కావా’లంటూ ఒక అంగీకార పత్రాన్ని అందజేయాలి. దానిపై సంబంధిత అధికారుల సంతకాలు అయ్యాక ఓ వారం రోజుల లోపులో బిడ్డను మీకు అప్పగిస్తారు. అక్కడితో బిడ్డ మీ సొంతమైపోయినట్టు కాదు. ఇంటికి తీసుకెళ్లాక ఓ అరవైరోజులు పూర్తయ్యాక ఫ్యామిలీకోర్టులో తల్లిదండ్రుల తరపున ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ వేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు బిడ్డను దత్తత తీసుకోడానికి సమర్పించిన పత్రాలన్నీ పొందుపరచాలి. కోర్టు పిలిచిన తేదీ ప్రకారం బిడ్డతో సహా న్యాయమూర్తి ముందు హాజరుకావాలి. బిడ్డ పేరుని మార్చుకునే ఉద్దేశం ఉంటే అప్పుడు చెబితే కోర్టు ఆర్డర్ ఆ పేరుతో ఇస్తారు. ఆ ఆర్డరు పత్రాన్ని తీసుకెళ్లి మీ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే వాళ్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు.

ఆ క్షణం నుండి బిడ్డ చట్టబద్ధంగా మీ సొంతమైనట్టు. బిడ్డను దత్తత తీసుకున్న రెండేళ్ల వరకూ మధ్య మధ్యలో అకస్మాత్తుగా ప్రభుత్వ అధికారులు వచ్చి బిడ్డ వివరాలు కనుక్కుంటారు. ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటారు. దత్తతలో చాలా రకాలుంటాయి. బంధువుల పిల్లల్ని, మీ దృష్టికి వచ్చిన అనాథ పిల్లల్ని పెంచుకోవడం మంచిదే కాని వారిని చట్టబద్ధంగా దత్తత చేసుకోకుండా పెంచుకోవడం మాత్రం సురక్షితం కాదు. బంధువుల బిడ్డయితే భవిష్యత్తులో వారినుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక అనాథలనుకోండి...వారికి మీరేదో జీవితం ఇచ్చినట్లు ఫీలవుతూ వారిపట్ల చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే చట్టబద్ధంగా సొంతం చేసుకుంటే వారి పట్ల బాధ్యత ఏర్పడుతుంది. దానివల్ల మీ బంధం పదికాలాలపాటూ పదిలంగా ఉంటుంది.

- భువనేశ్వరి
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


పిల్లలు ఎక్కడివారు?

మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్లు దత్తత ఇస్తున్న పిల్లలందరూ అనాథలని అందరికీ తెలుసు. అయితే వాళ్లు మా దగ్గరికి వచ్చేవరకేగానీ ఆ తర్వాత కాదంటారు డిప్యుటీ డెరైక్టర్ శ్యామ్ సుందరి. ‘‘చెత్తకుప్పల్లో దొరికిన వారు కొందరు, బస్టాపులు, రైల్వేస్టేషన్‌లలో దొరికిన వారు కొందరు. ఇలా కాకుండా ఆసుపత్రిలో వదిలిన పిల్లలు కూడా మా దగ్గరికే వస్తారు. ఇలా వచ్చిన పిల్లల ఫొటోలను వివరాలతో పత్రికల్లో ప్రచురిస్తాం. వారికి సంబంధించిన వ్యక్తులు వస్తే తిరిగి ఇచ్చేస్తాం. లేదంటే శిశువిహార్‌కి అప్పగిస్తాం. ఇలాకాకుండా కొందరు తల్లులు వాళ్లే స్వయంగా మా దగ్గరికి తీసుకొస్తుంటారు. వారితో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకొని బిడ్డను తీసుకుంటాం. అరవైరోజులలోపు ఆ తల్లి మళ్లీ వచ్చి తన బిడ్డని తీసుకెళ్లొచ్చు. ఆ సమయం దాటిపోతే ఆమెకు బిడ్డతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టే. ఏ జిల్లాలో దొరికిన వారిని ఆ జిల్లా శిశు గృహాల్లో చేర్పిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, శిశువిహార్‌కి వచ్చాక వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. చిత్రం ఏంటంటే మా దగ్గరికి వచ్చేవారంతా ఆడపిల్లలే. మగపిల్లలు చాలా తక్కువ. ఎంత తక్కువంటే నూటికి ఐదుశాతం ఉండడం కూడా కష్టమే. మరో చిత్రం ఏమిటంటే, దత్తతకు వచ్చేవారంతా కూడా ఆడపిల్ల కావాలనే కోరుకుంటున్నారు’’ అని వివరించారామె.

‘ఊయల’లో వేయండి

మహిళా శిశు సంక్షేమశాఖవారు కొన్నాళ్ల క్రితం ‘ఊయల’ కార్యక్రమం పెట్టారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆసుపత్రి ఆవరణలో ఒక ఊయల పెట్టారు. పుట్టిన బిడ్డ ఇష్టం లేకపోతే చెత్తకుప్పల్లో, బస్టాపుల్లో వదలకుండా ఆ ఊయలలో పడుకోబెట్టి వెళ్లిపోవచ్చు. ఆ బిడ్డని జిల్లా శిశుగృహవారు తీసుకెళ్లిపోతారు.

డబ్బుతో కనేబదులు...

మాకు పెళ్లయి పదిహేనేళ్లవుతోంది. సంతానం కోసం వైద్యపరంగా కూడా చాలా ప్రయత్నాలు చేశాం. మా బంధువులు, స్నేహితులు టెస్ట్‌ట్యూబ్ బేబీలని, సరోగసి అని రకరకాల సలహాలు ఇచ్చారు. ఒక ఆసుపత్రికెళితే ట్రీట్‌మెంట్‌కి రెండు మూడు లక్షలవరకూ ఖర్చవుతుందని చెప్పారు. నాకు, నా భార్యకు ఆ సలహాలు నచ్చలేదు. అన్ని లక్షల డబ్బు ఖర్చుపెడితే పిల్లలు కలుగుతారని గ్యారెంటీ లేదు. ఈలోగా రకరకాల మందులతో ఇల్లే కాదు ఒళ్లంతా గుల్లవుతుంది. అన్నింటికన్నా దత్తత ఉత్తమం అనిపించింది. ఆరు నెలల పాపని తీసుకున్నాం. దత్తత చేసుకుని ఏడాదవుతోంది. ‘సరయు’ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ మా జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టు ఉంది. అడాప్షన్ ఈజ్ గుడ్ ఆప్షన్!
- తులసికుమార్, హైదరాబాద్

విదేశాలకు వికలాంగులు...

శిశువిహార్‌కి వచ్చిన బిడ్డలందరూ ఆరోగ్యవంతులు కారు. వీరిలో చాలామంది శారీరక, మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. వీరిని ఎవరూ దత్తత తీసుకోడానికి ముందుకు రారు. మన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విదేశీయులు కూడా పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కార(సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి) ఆధ్వర్యంలో జరుగుతుంది. విదేశీయులు అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ‘‘వారికి పిల్లలు ఉన్నా కూడా సామాజిక స్పృహతో వికలాంగులను, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని దత్తత తీసుకుంటారు. ఇప్పటివరకూ మేం 66 మంది పిల్లల్ని విదేశీయులకు దత్తత ఇచ్చాం’’ అని చెప్పారు అసిస్టెంట్ డెరైక్టర్ విజయలక్ష్మి.
 

అమ్మానేనూ ఫ్రెండ్స్........................సింగిల్ పేరెంట్

 

 
ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొత్త నిర్వచనం ఆమె...
వినోదంలో విజ్ఞానాన్ని మేళవించి కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా ఒకే పట్టులో నడిపించే టీవీ యాంకర్. 21వ శతాబ్దపు యువతి ఇలా ఉండాలి.... మహిళ అంటే ఇలాగే ఉండాలి... అనే ప్రశంసలను అందుకుంటున్న ఝాన్సి టీనేజ్‌లోకి అడుగుపెట్టబోతున్న అమ్మాయికి తల్లి. సింగిల్ పేరెంట్‌గా రెండు బాధ్యతలను మోస్తున్న ఆమె అనుభవాలు మదర్స్ డే సందర్భంగా...


సాధికార మహిళలో తల్లి పాత్రను ప్రస్తావించినప్పుడు ఝాన్సి... తన కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమె తల్లి ఆలిండియా రేడియో ఉద్యోగి, తండ్రి కాంట్రాక్టర్. వారిద్దరి ప్రోగ్రెసివ్ థాట్స్‌లో పెరిగిన నేపథ్యాన్నీ గుర్తు చేసుకున్నారు. తను నమ్మే పేరెంటింగ్ వాల్యూస్‌తోపాటు తనబిడ్డ పెంపకంలో అనుసరిస్తున్న విధానాన్ని వివరించారు. ‘‘నాకెరియర్ పాత్‌లో టీవీ షోలలో సోషల్ రెస్పాన్సిబిలిటీని జోడించే అవకాశాలు వచ్చాయి. ఏ కార్యక్రమం చేసినా యాంకర్ అంటే గ్లామర్ ఒక్కటే కాదని నిరూపించడానికి ప్రయత్నించాను. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌కి నువ్వు తీసుకుంటున్న అర్థం సరికాదు’ అనే విమర్శలూ వచ్చాయి. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌లు నియమాలు పెట్టలేదు కాబట్టి నాకు కొత్తకోణాన్ని ఆవిష్కరించే అవకాశం వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... మనలోని స్కిల్, ప్యాషన్ మన కెరీర్ మీద ప్రభావం చూపుతాయి. పేరెంటింగ్ క్రమంలోనూ వాటిని గుర్తు పెట్టుకోవాలి. పిల్లలకు అవకాశం ఇవ్వాలి, పరిమితులు విధించి, పెద్దరికంతో ఆపకూడదు. అప్పుడే వాళ్లకు ‘నేను ఇష్టపడుతున్నది ఏది’ అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అన్నారామె.

సింగిల్ పేరెంట్ బాధ్యత!

కుటుంబం సమాజంలో ఒక యూనిట్. కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు ఉంటారు. ఇది పాఠ్యాంశాల్లో సిలబస్. ఈ నేపథ్యంలో పాపకు కలిగే సందేహాన్ని ముందే గ్రహించానంటారు ఝాన్సీ. ‘‘ధన్య బుక్‌లో ఈ పాఠం చూసిన తర్వాత టీచర్‌తో మాది సెపరేటెడ్ ఫ్యామిలీ కాబట్టి పాఠాన్ని సున్నితంగా చెప్పమని కోరాను. ఆ టీచర్ పేరు శోభ. ఆమె పుస్తకంలో ఉన్న రెండు, మూడు రకాల కుటుంబాల గురించి చెప్పి ఊరుకోకుండా తల్లి- బిడ్డ ఉండే కుటుంబం, తండ్రి- బిడ్డ ఉండే కుటుంబం, అమ్మానాన్నలు లేకుండా పిల్లలు గ్రాండ్‌పేరెంట్స్‌తో జీవించే పిల్లలు... ఇలా సొసైటీలోని అనేక కుటుంబాలను పరిచయం చేశారు. ఆ పాఠం విన్న రోజు ధన్య ఇంటికి వచ్చి ‘మనలాగే... మా ఫ్రెండ్, వాళ్ల నాన్న ఉంటారట. వాళ్లమ్మ యూకే వెళ్లిందట’ అని చెప్పింది. పిల్లలకు ఏదయినా సానుకూలంగా రిసీవ్ చేసుకునేట్లు చెప్పాలి’’ అన్నారు.

బాధ్యత రెట్టింపు!

సింగిల్ పేరెంట్‌గా బాధ్యత రెట్టింపవుతుందని తెలుసు, పాప భవిష్యత్తు, తన కెరీర్ మీద ప్రభావం... వంటి అనేక కారణాలతో మోయడానికి సిద్ధమయ్యానంటున్నారు ఝాన్సి. ‘‘నేను పేరెంటింగ్ వాల్యూస్‌ని బాగా నమ్ముతాను. ఇంట్లో హెల్దీ ఎన్విరాన్‌మెంట్‌తో కూడిన హ్యాపీ పేరెంటింగ్ ఉండాలి. చైల్డ్ సంతోషంగా లేకపోతే ఆ ప్రభావం మానసిక వికాసం మీద తప్పకుండా ఉంటుంది. డిస్టర్బ్‌డ్ చైల్డ్‌కి ఎన్ని అవకాశాలిచ్చినా ప్రయోజనం ఉండదు. ఎన్ని పైపూతలు పూసినా లోపల సిమెంట్‌లో వచ్చిన క్రాక్స్ పెరుగుతూనే ఉంటాయి. నా నిర్ణయాన్ని చాలామంది ‘ఫ్యామిలీ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ పేరెంటింగ్‌ని చాలెంజ్ చేస్తున్నావు’ అన్నారు. అయితే నా నిర్ణయం నా ఒక్కదాని కోసం కాదు. ధన్యని అన్‌హ్యాపీ సిచ్యుయేషన్‌లో పెంచడం కంటే అన్నీ నేనై పెంచడమే కరెక్ట్ అనుకున్నాను. కంప్లీట్ ఫ్యామిలీలో ఉండాల్సిన ఒక ఫిగర్ మిస్సయిన భావన ధన్యలో నాకెప్పుడూ కనిపించలేదు’’ అంటూ వైవాహికజీవితంలో తీసుకున్న నిర్ణయానికి కారణం చెప్పారామె. ఈ సమయంలో అమ్మానాన్నా చాలా సపోర్ట్‌గా నిలిచారని కృతజ్ఞతగా చెప్పారు ఝాన్సి.

ప్రశ్నలు- సమాధానాలు!

సమాజం వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చెప్పి అలవాటైందంటారు ఝాన్సి. ‘‘ప్రశ్నలు ధన్యకూ వస్తుంటాయి. ఐ స్టే విత్ మై మామ్’ అని చెప్తుంది. లక్కీగా తన స్కూల్ వాతావరణం హెల్దీ. నేను ధన్య చదువు దగ్గర కాన్షియస్‌గా ఉంటాను. ఎంతమంచి టీచరైనా అమ్మకు సమానం కాదు. అమ్మ బెటర్ టీచర్’’ అన్నారు.

వీథి చివరి వరకు నడక...!

పాప కోసం తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యమవుతోందా అన్నప్పుడు... ‘‘నాకు చాలా ఇష్టమైనది తనను స్కూల్ బస్ ఎక్కించడానికి నడిచే నడక. ఇంటి నుంచి వీథి చివర వరకు ధన్యతో కలిసి నడవడం, బస్సు వచ్చే వరకు తను చెప్పే కబుర్లు వినడం నాకు ఇష్టమైన వ్యాపకం’’ అని సంబరంగా చెప్పారు.

సన్నిహితంగా...!

ధన్యతోడిదే లోకం అన్నట్లు జీవిస్తున్నారేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు... ‘‘మేమిద్దరం ఒక అంగీకారానికి వచ్చాం. పదేళ్ల వరకే నేను తనకి అమ్మని, ఆ తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్. ఎలాగూ 18 ఏళ్లు వచ్చిన తర్వాత నన్ను ఫ్రెండ్‌గా అంగీకరించదు కదా! ఈ టైమ్‌ని మిస్ కాకుండా గడపాలన్నది నా కోరిక’’ అన్నారు ఝాన్సి.

ఒక సినిమాలో పల్లెటూరి మహిళ పాత్రలో ఒదిగిపోతారు. మరో షోలో ఆధునిక యువతి పాత్రను పండిస్తారు. సమాజంలో ఉన్న ప్రతి కోణాన్ని స్పృశించాలనే ప్రయత్నం కనిపిస్తుంది ఝాన్సిలో. అలాగే పిల్లల్ని సంతోషకరమై వాతావరణంలో పెంచగలగడమే సరైన పేరెంటింగ్ అని పిల్లల పెంపకంలో మరో కోణాన్ని ప్రస్తావించారు. సంస్కృతి- సంప్రదాయాలకు, ఆధునిక భావజాలానికి ప్రతీక అయిన మహిళ ఎలా ఉంటుంది? - అంటే ‘ఝాన్సిలాగే ఉంటుంది’ అనే సమాధానం చెప్పుకోవాలేమో!
 

చైనా ఉప్పు... వివాదాలు... మంచిచెడ్డలు!

 

కొన్ని చైనీస్ ఐటమ్స్ చాలా రుచిగా ఉంటాయి. అలాంటివి మన ఇంట్లో చేసుకున్నా అంత రుచి రాదెందుకని కొందరు సందేహిస్తుంటారు. ఆ టేస్ట్ రావడం కోసం చైనీస్ రెస్టారెంట్స్‌లో చైనా ఉప్పు వాడుతుంటారు. చైనా సాల్ట్ అని పిలిచే ఈ ఉప్పును ఇటీవల చాలామంది ఇళ్లలోనూ వాడుతున్నారు. దీనిపై కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇదంత మంచిది కాదని కొందరు చెబుతుంటారు. అయితే దీనితో పెద్దగా ప్రమాదం లేదని కూడా మరికొందరు ఆహారనిపుణులు భరోసా ఇస్తుంటారు.

ఏమిటి ఈ చైనా సాల్ట్?

చైనా సాల్ట్ అని పిలిచే ఈ తరహా ఉప్పు మోనో సోడియమ్ గ్లుటామేట్ అనే ఒక స్వాభావికమైన కొన్ని ప్రోటీన్లు బ్రేక్ అయినప్పుడు లభ్యమయ్యే అమైనో ఆసిడ్స్‌నుంచి వచ్చే ఒకరకం ఉప్పు అనుకోవచ్చు. సాధారణ ఉప్పు రసాయనికంగా సోడియం క్లోరైడ్ అయితే... ఇది గ్లుటామిక్ ఆసిడ్‌కు చెందిన సోడియమ్ ఉప్పు. ఇందులో ఉన్న రసాయనం మోనో సోడియమ్ గ్లుటామేట్ కావడంతో దీన్నిసంక్షిప్తరూపంలో ‘ఎమ్‌ఎస్‌జీ’ అని కూడా పిలుస్తుంటారు. రుచికోసం దాదాపు వందేళ్లకు పైగా దీన్ని వాడుతున్నా... దీనిలో ఉన్న పదార్థం ఏమిటన్నది తెలుసుకోవడం కోసం టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కికూనీ ఇకెడా దీన్ని ల్యామినేరియా జపానికా అనే సముద్రపు నాచు నుంచి వేరు చేశారు. ఇక దీని రుచికీ ఒక పేరు పెట్టారు. చక్కెర తియ్యగా ఉంటుంది, ఉప్పు ఉప్పగా ఉంటుంది. మరి కొత్త రుచినిచ్చే ఈ పదార్థపు రుచి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే... ‘ఉమామీ’ అంటూ దీని రుచికి నామకరణం చేశారు. అప్పట్నుంచి దీన్ని చైనా వంటకాల్లో, కొన్ని సూప్‌లలో, సలాడ్స్‌లో, చిప్స్‌లలో విరివిగా వాడుతున్నారు.

పోషక విలువలేమీ ఉండవు...

కేవలం రుచి కోసం దీనిని వాడటమే తప్ప ఇందులో పోషకవిలువలేమీ ఉండవు. పైగా దీన్ని ఎంత తక్కువ వాడితే రుచి అంత బాగుంటుంది. అంటే... వీలైనంత తక్కువ వాడటం అన్నది అటు రుచికీ, ఇటు ఆరోగ్యానికీ... ఈ రెండింటికీ మంచిదన్నమాట.

ఈ ఉప్పుపై వివాదాలెందుకు?

పదార్థానికి ‘ఉమామీ’ రుచి రావాలంటే వాడే ఇంత రుచికరమైన ఈ చైనా ఉప్పు కొన్ని వివాదాలనూ ఎదుర్కొంది. ఉదాహరణకు దీన్ని అధికంగా వాడే వారిలో ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ అని పిలిచే ఒక తరహా ఆరోగ్య సమస్య వస్తుందన్నట్లుగా గుర్తించారు. ఎమ్‌ఎస్‌జీ ఉప్పు వాడిన పదార్థాలు తిన్నవారిలో ఈ కింది సమస్యలు కనిపిస్తుండటంతో దీన్ని ‘ఎమ్‌ఎస్‌జీ సింప్టమ్ కాంప్లెక్స్’ అంటే ఎమ్‌ఎస్‌జీ వాడినప్పుడు కనిపించే లక్షణాలుగా పేర్కొన్నారు. అవి... తలనొప్పి ముఖంలోని రక్తనాళాల్లోకి రక్తం ఎగజిమ్మి ముఖం ఎర్రబడటం (ఫ్లషింగ్), చెమటలు పట్టడం ముఖమంతా బిగుతుగా మారడం ఒక్కోసారి ముఖం, మెడ భాగాలు మండటం, తిమ్మిరిగా ఉన్నట్లు అనిపించడం గుండెదడ (హార్ట్ పాల్పిటేషన్స్) ఛాతీలో నొప్పి వికారం.

అయితే పైన పేర్కొన్నవాటిని ఎమ్‌ఎస్‌జీ సింప్టమ్స్ అని పేర్కొనడంతో దీనిపై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా ఆహార పదార్థాన్ని వాడటానికి అనుమతినిచ్చే అమెరికాకు చెందిన సంస్థ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ దీనికి ‘సాధారణంగా సురక్షితమైనదే’ (జనరల్లీ రికగ్నైజ్‌డ్ యాజ్ సేఫ్-జీఆర్‌ఏఎస్) అని ధ్రువీకరించింది. కాబట్టి దీన్ని నిర్భయంగా వాడుకోవచ్చు. అయితే మనం ఆరోగ్యం కోసం ఉప్పును బాగా తగ్గించి వాడితే మంచిది అన్నట్లుగానే ఈ చైనా ఉప్పునూ బాగా తగ్గించి వాడటం మంచిది. ఎందుకంటే మన నాలుకకు రుచిని ఇచ్చే ఈ పదార్థమే మనలో అతిగా ఉత్తేజం కలిగిస్తుంది. దీనిలో ఉన్న ‘ఎక్సైటో టాక్సిన్స్’ ఈ పని చేయడం వల్ల పైన పేర్కొన్న అనర్థాలు చాలా కొద్దిమందిలో కనిపించవచ్చు. అలాంటివారు తమకు చైనాసాల్ట్ సరిపడదనీ, దానితో తమకు అలర్జీ ఉందని గ్రహించి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

మరి అదే రుచిని సాధించడం ఎలా?

చైనా సాల్ట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు... మరి అదే రుచిని సాధించడం ఎలా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. సోయా సాస్‌కు మన సాధారణ ఉప్పు కలిపినా అదే ‘ఉమామీ’ రుచిని సాధించవచ్చు. అయితే అదే తరహా ‘ఉమామీ’ రుచి వచ్చేలా ఈ పదార్థాల మోతాదును కాస్తంత ప్రాక్టీస్ ద్వారా ఎవరికి వారు గ్రహించవచ్చు.

చైనా ఉప్పులో అనుకూల అంశమే లేదా?

స్వాభావికమైన ఏ పదార్థంతోనైనా కొన్ని ప్రతికూల అంశాలున్నా మరికొన్ని అనుకూల అంశాలూ ఉంటాయి. సాధారణ ఉప్పు వాడితే రక్తపోటు పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఒక టీ స్పూన్ సాధారణ ఉప్పుకు బదులు, చైనా ఉప్పును చాలా కొద్ది పరిమాణంలో... (అంటే మనం వాడే సాధారణ ఉప్పులోని నాలుగో వంతు వాడితే) ఉప్పు వాడినంత వేగంగా రక్తపోటు పెరగదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే తెలిసేదేమిటంటే... పెద్దలు చెప్పిన ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న మాట అక్షరాలా సత్యం అని.

అందుకే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా మీ విచక్షణతో కొద్ది మోతాదులో వాడి ఎమ్‌ఎస్‌జీని వాడి... ‘రుచిని మాత్రమే పొందండి. ఆరోగ్య సమస్యలను కాదు’ అన్న విషయాన్ని గ్రహించండి.

- నిర్వహణ: యాసీన్

ఎమ్‌ఎస్‌జీ లేకుండారుచిని సాధించడం ఎలా..?

చైనా ఉప్పు సరిపడని వారు ఎలాగైనా ‘ఉమామీ’ రుచిని సాధించడం ఎలా అన్న దానికీ కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం తయారు చేసే తినుబండారాల్లో మాంసం, ఛీజ్, సముద్రపు చేపలు (సీఫుడ్), నట్స్ ఎక్కువగా వాడే అవకాశం ఉంటే వాటితో ఎమ్‌ఎస్‌జీ లేకుండానే ఉమామీ రుచిని సాధించవచ్చు. అలాగే చేప సాస్ (ఫిష్ సాస్), సోయా సాస్, వర్సెస్టర్‌షైర్ సాస్ వంటి వాటిని కూడా చైనా ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అదే ఫ్లేవర్ సాధించడం కోసం కొందరు వాడుతుంటారు. ఇక శాకాహరం తినేవారు సాధారణంగా వాడే టొమాటో, వెన్న, వాల్‌నట్ వంటివి కూడా ఆహార పదార్థాన్ని బట్టి కాస్తంత ఎక్కువగా వాడితే ఎమ్‌ఎస్‌జీతో వచ్చిన రుచే దాదాపుగా వస్తుంది. మనుషులంతా అత్యంత ఆరోగ్యంగా ఉండే మధ్యధరా సంస్కృతి (మెడిటెరేనియన్ కల్చర్)లో గ్లుటామైన్ రుచి కోసం టోమాటో/టొమాటో సాస్, ఉల్లిగడ్డలు కొన్ని సందర్భాల్లో వాటితో పాటు మష్రూమ్స్ వాడుతారు. అందుకే చైనా ఉప్పును అస్సలు వాడదలచుకోని వారు మెడిటెరేనియన్స్ వాడే టొమాటో/ఉల్లిగడ్డలతో అదే రుచిని సాధించుకోవచ్చు. పైగా ఇవి మనకు తేలికగా లభ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
-

చర్మం బంగారు ఛాయను పొందాలంటే పెరుగే బెస్ట్ ...

ఏప్రిల్ మొదలవగానే ఎండలు మొదలయ్యాయి. ఎండలు మండిపోతున్నాయి. ఈ మండే ఎండల్లో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి. చర్మానికి ఎటువంటి హాని జరగక ముందే సమ్మర్ స్కిన్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. మరి ఈ సమ్మర్ లో మీ ప్లాన్స్ ఏంటి?ఎండల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి..సమ్మర్ స్కిన్ కేర్ కోసం ఆల్రెడీ మీరు కాస్మోటిక్స్ కొనేశారా? లేదా మరే ఇతర ఖర్చుతో కూడిన బ్యూటీ ట్రీట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా?ఇవన్నీ లేకుండానే ఖర్చలేని బ్యూటీ ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంది. చర్మానికి రక్షించే ఆ ఆశ్చర్యకరమైన వస్తువు పెరుగు. చర్మం సంరక్షణ గురించి మీకున్న దిగులును పోగొడుతుంది.

ఇది మన వంటింట్లో అతి సులభంగా దొరికే బ్యూటీ వస్తువు. చర్మానికి చైతన్యం నింపుతుంది. ఇంకా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, చర్మానికి తేమను అంధిస్తుంది.పెరగులో వివిధ రకాల బ్యూటీ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ముఖానికి పెరుగు ను అప్లై చేయడం వల్ల ముఖంలో ఉండే ఫైన్ లైన్స్ లేకుండా చేస్తుంది. ఎర్లీ ఏజింగ్ లక్షణాలను ధరిచేరనివ్వదు, సన్ బర్న్ ను నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నలుపుదనాన్ని తగ్గింస్తుంది మరియు మొటమలతో పోరాడుతుంది. ఇది చర్మానికి తగినంత తేమను అంధించడంలో అద్భుతంగా పనిచేసేటటువంటి వస్తువు. అంతే కాక, దీని ధర తక్కువ(బడ్జెట్ ఫ్రెండ్లీ)మరియు అతి సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, దీన్ని ప్రతి రోజూ కూడా ఉపయోగించుకోవచ్చు. మీ చర్మాన్ని ఫ్రెష్ గా మరియు యవ్వనంగా మరియు కాంతి వంతంగా మెరుస్తుండే చర్మం చూసి ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేట్లు చేయాలనుకుంటే, మీ ముఖానికి పెరుగును ఉపయోగించండి . పెరుగును ఉపయోగించి కొన్ని సాధారణ చిట్కాలు...

 
1. చర్మాన్ని ప్రక్షాళన(శుభ్రం) చేయడానికి : రోజంతా పనిచేసిన తర్వాత, మీరు ఏదైనా చేయడానికి చాలా అలసటగా ఉన్నప్పుడు మరియు చర్మానికి పోషణ అంధించడం చాలా అవసరం. పెరుగు ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేయవచ్చు. పెరుగును మీ ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ఉండటం వల్ల నునుపైన చర్మం మరియు ఎముకల నుండి పెళ్లగా ఊడివచ్చు చర్మానికి సహాయడతుంది.

2. పెరుగుతో మసాజ్: పెరుగులో, పుసుపు వేసి పేస్ట్ లా తయారు చేసి, 15నిముషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మం లోపల చర్మరంధ్రాలకు పోషణను అందిస్తుంది.



3. ఎండ వేడికి కమిలిన చర్మాన్ని ఉపశమనం కలిగిస్తుంది: కమిలిన చర్మానికి పెరుగు మంచి ఉపశమనం కలిగిస్తుంది. సూర్య రశ్మివల్ల చర్మ మీద ఏర్పడే దద్దుర్లు లేదా వాపుకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పెరుగులో ఉండే జింక్ టాన్ చర్మానికి ఉపశమనం కలిగించడానిక సహాయపడుతుంది. అతి త్వరగా మంచి ఫలితాల పొందాలంటే పెరుగులో కొన్ని చుక్కల చమోమైల్(చామంతి)ఆయిల్ ను మిక్స్ చేసి ముఖం మొత్తం మర్ధన చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. మొటిమలు లేని చర్మం కోసం: మీరు మొటిమల సమస్యతో బాధ పడుతున్నట్లైతే..మీ ముఖం మీద పుల్లటి పెరుగును అప్లై చేయాలి. పుల్లటి పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల పుల్లటి పెరుగును ముఖానికి అప్లై చేయడం వల్ల అతి సులభంగా ముఖంలో మొటిమలను తొలగించుకోవచ్చు.

5. ఫైయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్: ఆరెంజ్ తొక్క పౌడర్ ను పెరుగులో కలిపి పేస్ట్ లా తయారు చేసి, వారంలో రెండు మూడు సార్లు ముఖానికి పట్టించాలి. ఇంకా పెరుగు మరియు తేనె కూడా మిక్స్ చేసి ముఖానికి పట్టించవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ చర్మం ఖచ్చితంగా మంచి ఛాయను పొందుతుంది.

6. ముఖంలో ఫైన్ లైన్స్ తొలగిస్తుంది: ముఖంలో ఏర్పడే నా వృద్ధాప్యం పంక్తులను నివారించడానికి మంచి మార్గంగా చెప్పవచ్చు. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం డెడ్ స్కిన్ ను రద్దు చేయడానికి మరియు చర్మ రంద్రాలను బిగుతుగా చేయడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి పెరుగులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి ముఖానికి వారంలో రెండు మూడు సార్లు పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. పెరుగుతో ఫేస్ మాస్క్: ఈ ఫేస్ మాస్క్ ను రెగ్యులర్ గా లేదా వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ చర్మంలో చైతన్యం నింపుతుంది మరియు చర్మం బంగారు ఛాయతో నిండి ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ ఎలా వేయాలంటే..పెసరపిండిని పెరుగులో కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరం మొత్తం అప్లై చేయవచ్చు .

8. పెరుగు- నిమ్మరసం: పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే శరీర చర్మం మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుంది.

 

పట్టుకుచ్చులా మెరిపించే కురుల సౌందర్యానికి ఇంట్లోనే హెయిర్ స్పా...!

వాతావరణ నిమిత్తం లేకుండా జుట్టు రాలకుండం ..లేదా నిర్జీవంగా ఎండు గడ్డిలా కనిపించడం...కొందరిలో నిత్యం ఉండే సమస్యే . ఇలాంటివాటిని నివారించి పట్టుకుచ్చులా మేరిపించేలా చేయడంలో...హెయిర్ స్పా చికిత్స గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా స్పాలకే వేళ్ళాలనిలేదు.

కొన్నిరకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకుంటే ఇంట్లోనే కురులకు స్పా చికిత్స చేసుకోవచ్చు.ఈ చికిత్స చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులో ఉంటుంది. సిరోజాలు పట్టుకుచ్చులా, ఆరోగ్యంగా మారతాయి. చివర్ల చిట్లకుండా కూడా ఉంటాయి. కుదిరితే వారానికోసారి కూడా చేసుకోవచ్చు .ఈ చికిత్స చేసుకున్న తరవాత రెండురోజులవరకు షాంపూ పెట్టకుండా ఉండాలి. జుట్టును ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్ కాకుండా మెత్తని తువాలుతో తుడిచేసుకోవాలి.
steps get hair spa treatment at home
 
1. ఆయిల్ మసాజ్ /హెర్బల్ స్పా : ఈ చికిత్స చేసుకునే ముందు జుట్టు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఏదయినా హెర్బల్ నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసుకోవాలి. కనీసం ఇరవై నిమిషాలపాటు సవ్య, అసవ్య దిశలో మర్దన చేయాలి.

2. ఆవిరి పట్టాలి: హాట్ ఆయిల్ మసాజ్ తర్వాత వేడి నీటిలో వెడల్పాటి టర్కీ తువాలును ముంచి దాన్ని తలకు చుట్టుకోవాలి. దీనివల్ల జుట్టుకు ఆవిరి అందుతుంది.

3. కండీషనర్: పదినిమిషాలయ్యాక తీసేసి హెర్బల్ కండిషనింగ్ ప్యాక్ ని జుట్టుకు పూతలా వేసుకోవాలి. ఇది మార్కెట్లో లభ్యం అవుతుంది. అయితే తలకు గాలి తగలకుండా షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీరు ,హెర్బల్ షంపూతో కడిగేసుకోవాలి .అయితే జుట్టు తడిగా ఉన్నప్పుడే హెర్బల్ హెయిర్ స్పా క్రీంను రాసుకోవాలి. ఇది కూడా బజార్లో లభించే ఉత్పత్తే . దీన్ని రాసుకున్న పదినిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ చికిత్స వల్ల పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు జుట్టు ఆరోగ్యంగా , పట్టుకుచ్చులా కనిపిస్తుంది.

4. జెల్ స్పా: ఈ చికిత్స కూడా తలకు నూనె రాసుకోకుండా చేసుకోవాలి. నాలుగు చెంచాల కలబంద గుజ్జు, చెంచా చొప్పున బాదం నూనె ,గులాబి నూనె. మైట్లి నూనె (బజార్లో లభిస్తుంది)లను తీసుకోవాలి. ఈ నూనెల్ని కలబంద గుజ్జుకు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట మర్దన చేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. పదినిమిషాలు అలాగే వదిలేసి ఆ తరవాత జెల్ ఆధారిత షాంపూతో కడిగేసుకోవాలి. జుట్టు తడి ఆరకుండానే జెల్ స్పా క్రీంను రాసుకుని పదినిమిషాలయ్యాక కడిగేసుకోవాలి.

5. ఎగ్ స్పా: నాలుగు చెంచాల ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి అందులో కప్పు తెల్లగుడ్డు సోన చేర్చి బాగా గిలక్కోట్టినట్లు చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని పదిహేను నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో ముంచిన తువాలును చుట్టుకోవాలి. కాసేపయ్యాక తీసేసి కోడిగుడ్డు ఆధారిత షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడే హెయిర్ స్పా క్రీంను రాసుకుని పది నిమిషాలు తరవాత కడిగేసుకోవాలి.

6. పండ్లతో హెయిర్ స్పా: ఆరెంజి, నల్ల ద్రాక్ష నూనెలను సమానంగా తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు రాసుకోవాలి. కనీసం పదిహేను నిమిషాలు మర్దన చేసి గోరువెచ్చని నీటిలో ముంచిన తువాలును చుట్టుకోవాలి. కురులు తడిగా ఉన్నప్పుడే యాపిల్, అరటిపండు, కమలాఫలాల గుజ్జు, గోరింటాకు పొడి... కప్పు చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాని జుట్టు చివర్ల దాక పట్టించి గాలి తగలకుండా షవర్ కేప్ పెట్టేయాలి. నలభై ఐదునిమిషాల తరవాత నీళ్ళతో చుండు నివారణ షాంపూతో కడిగేసుకుని ఆ తరవాత ఫ్రూట్ స్పా క్రీం ను రాసుకోవాలి. పది నిమిషాలాగి దాన్ని కూడా కడిగేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చుండ్రు సమస్య అదుపులో ఉంటుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.

7. కలర్ స్పా: జుట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. ముందుగా తలస్నానం చేసుకోవాలి. తడి పూర్తిగా ఆరిపోయాక.. నప్పే కలర్ స్పా క్రీం ను సరిపడేంత తీసుకుని మాడుకు కాకుండా జుట్టుకు మాత్రమే పట్టించాలి. నలభై ఐదునిమిషాల తరవాత స్పా కలర్ కంట్రోల్ షాంపూతో కడిగేసుకోవాలి. తడి ఆరకుండానే స్పా కండిషనింగ్ క్రీంను రాసుకుంటే సరిపోతుంది. మరో పదినిమిషలయ్యాక నీళ్ళతో దాన్నీ తొలగించుకోవాలి. తరచు కలర్ కంట్రోల్ షాంపూను వాడడం వల్ల వేసుకున్న రంగు ఎక్కువ రోజులు జుట్టుకు పట్టి ఉంటుంది. ఈ చికిత్సల్లో ఉత్పత్తులన్నీ బజార్లో లభిస్తాయి.




ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగా...?

శరీరంలో ఎక్కడ ముడతలు కనిపించినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ, ముఖం మీద ముడుతలు ఏర్పడితే మాత్రం మానసికంగా ఆందోళన పడిపోతారు. ఇందులో ఆడవారు, మగవారు అనే తేడా లేదు. ఇంచుమించు ఈ విషయంలో ఇద్దరి భావాలు ఒకే విధంగా ఉంటాయి.

ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగపడిపోతారు.ముఖంలో ముడుతలు ఏర్పడటానికి డ్రై స్కిన్... విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం.

 
బంగాళదుంప: రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి అపె్లై చేయాలి. అది ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు రెగ్యులర్‌గా చేస్తే సరి.


అరటి పండు: అరటి పండును గుజ్జును ముఖానికి అపె్లై చేసి అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 
క్యారెట్: క్యారెట్ జ్యూస్‌లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయండి.

 
బాదాం: ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

 
కోడి గుడ్డు: కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అపె్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి.

 
బీట్ రూట్: బీట్ రూట్ రసం రెగ్యుల్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.



క్యాబేజ్: ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అపె్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 
బొప్పాయి: తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అపె్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

 
పాలు: స్త్రీ ప్రతిరోజు ఉదయం కాచిన పాల నుంచి చెంచా పాల మీగడ తీసుకుని అందులో విటమిన్‌ (ఇ) నూనెను వేసి నిమిషం పాటు తమ కళ్ల చుట్టూ మృదువుగా మర్ధన చేసి పది నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే కళ్ల చుట్టూ వుండే ముడతల ను తగ్గించుకోవచ్చు. కళ్ల కింద ముడతలు పోవాలంటే, ఒక కప్పు నీళ్లలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున అదే నీళ్లలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని శుభ్రం చేసుకోవాలి.మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో బొప్పాయి. గుడ్డు, చేపలు, పాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

 
కలబంద : ముఖ వర్చస్సుకోసం: బాదంపొడి, పాలపొడి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ గులాబి నీటితో కలపాలి. కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని పదిహేను నిమిషాలయ్యాక కడగాలి. అలా వారానికి ఒకసారి చేస్తే చర్మం తాజాగా మృదువుగా ఉంటుంది. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్‌ వాటర్‌ రాసుకుంటే చాలా మంచిది.

 
నిమ్మరసం: చేతులు మృదువుగా ఉండాలంటే: మీకు సాధారణంగా చేతులకు మురికి ఉన్నప్పుడు, డెడ్‌స్కిన్‌ పోవాలంటే చేతుల్ని రెండు నిమిషాలు ఖచ్చితంగా వేడినీళ్లలో ఉంచాలి. చర్మం మెత్తబడ్డాక ఉప్పు కలిపిన నిమ్మికాయ రసం రాసి పాత టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా శుభ్రం చేయాలి. నెమ్మదిగా మాయిశ్యరైజర్‌ రాసుకున్నట్లైతే చర్మంలోని ముడతలు క్రమంగా తగ్గుతాయి. క్రమంగా మీ చేతులపై మార్పు కనబడుతుంది. ఒక గిన్నెలో ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్లు పచ్చిపాలు, ఆర స్పూన్‌ గంధం పొడి చేసి బాగా కలిపిన చేతికి ప్యాక్‌ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేయటం వల్ల చేతులు మృదువుగా అవుతాయి.


 
రోజ్ వాటర్: ముఖానికి రోజ్‌వాటర్‌ రాసుకుం టూవుంటే చాలామంచిది. అలాగే చెంచాడు తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కలు ఆలివ్‌ నూనె కలిపి రాసుకున్నా ముఖం ముడుతలు సర్ధుకుని కళగా ఉంటుంది.

 

 

ఈ వేసవిలో చాలా సులభంగా మొటిమలను నివారించుకోండిలా

ప్రస్తుతం వేసవి కాలం, ఒక పక్క మండే ఎండలు..మరో ప్రక్క చెమటలు, శరీరం, చర్మం, కేశాల మీద తీవ్ర ప్రభావం. వేసవి వేడికి శరీరంలోని నీరంత చెమట రూపంలో బయటకు విసర్జింపడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. దాంతో అనేక ఆరోగ్య సమ్యలు ఏర్పడుతాయి.

ఇక చర్మం విషయంలో ఎండ వేడిమికి చెమటలు పడితే ఆ చమట మీద దుమ్మ..దూళి చేరి ముఖం జిడ్డుగా మారడం, దాంతో ముఖంలో మొటిమలు, మచ్చలు తదితరాలకు ఇదే సమయం. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరినీ సాధారణంగా బాధిస్తుంటుంది.

మొటిమలు ఏర్పడి..ముఖ అందాన్ని నాశనం చేయడంతో పాటు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మొటిమలు ముఖం మొత్తం వ్యాపించి మనిషిని మరింత బాధ పెడుతాయి.కానీ మోటిమలు గిల్లడం వల్ల మొటిమలు తొలగిపోతాయని అనుకుంటే పొరపాటే మొటిమలను గిల్లడం వల్ల ఆప్రదేశంలో రంద్రాలతో లేదా నల్ల మచ్చలతో మరింత అసహ్యంగా మారుతుంది. మొటిమను గిల్లడం రుద్దడం, వంటివి చేయకుండా కొన్ని మొడిసినల్ చిట్కాలను పాటించడం వల్ల మొటిమలను తొలగిచుకోవచ్చు. అందుకు కొన్ని పద్దతులు మీకోసం...


మీ ముఖం శుభ్రంగా ఉంచండి: మీ మేకప్ ను పూర్తిగా తొలగించండి. జిడ్డు ముఖం, మొటమలు మచ్చలు ఉన్న వారు ఒక salycylic ఫేస్ వాష్ ఉపయోగించవచ్చు.


మీరు రోజంతా బయట గడిపి ఇంటికి చేరుకొన్న తర్వాత ముఖంను శుభ్రంగా కడుగుక్కోవాలి.


స్ర్కబ్ చేయకూడదు: ఎక్కువ సార్లు ముఖాన్ని సోపులతో కడగడం మరియు స్క్రబ్బింగ్ వంటి చేయడం వల్ల చర్మానికి చికాకు కలిగిస్తుంది.


మీ ముఖాన్ని ఎక్కువగా చేతులతో -గోళ్ళతో తరచూ తాకకూడదు. అలా తరచూ ముఖం మీద చేతులు శుభ్రం చేయకుండా ముఖాన్ని తాకడం వల్ల ముఖం మీద బ్యాక్టీరియా ఏర్పడి మొటిమలు ఏర్పడటనాకి కారణం అవుతుంది.


నాన్ కమెడొజెనిక్(non Comedogenic) లేబుల్స్ ఉన్న బ్రాండ్స్ ను లేదా మన్నికైన మేకప్ ను ఉపయోగించడానికి ప్రయత్నించండి .

ఎండలో తిరగడం మానుకోండి: ఇది మోటిమలు వ్యాప్తి చెందే అవకాశాన్ని పెంచుతుంది.

మొటమల నివారించడానికి మీరు వారానికి ఒకసారి యాంటీ ఏన్స్ ఫేస్ (anti acne)మాస్క్ ను ఉపయోగించవచ్చు.


మొటిమలు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడుతాయి. కాబట్టి మీ చర్మ వైద్యుడు(డెర్మటాలజిస్ట్) మీ హార్మోన్లు పరీక్షలు చేయించమని మీకు సలహా ఇవ్వొచ్చు.


నుదిటి మీదు మొటిమలు రావడానికి ప్రధానకారణం చుండ్రు . మోటిమలు ఏర్పడటానికి అత్యంత సాధారణ కారణాలలో చుండ్రు ఒకటి. మీ డెర్మటాలజిస్ట్ సూచన ప్రకారం యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించడం ఉత్తమం.


మీ శరీరం మీద మొటిమలు ఉన్నట్లైతే మీరు శరీరానికి హత్తుకుపోయే దుస్తులను ధరించడం మాలనుకోవాలి.



వీటిలో ఏమీ సహాయపడకపోయినట్లైతే , మీ ముఖంలో అధికంగా మొటిమలు మిమ్మల్ని బాధిస్తున్నా..ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీ చేయిదాటిపోయినా మీరు డెర్మటాలజిస్ట్ ను తప్పనిసరిగా కలిసినట్లైతే తప్పకుండా మీకు మంచి పరిష్కార మార్గాన్ని సూచించవచ్చు.