all

Monday, May 13, 2013

వేసవిలో చర్మ రక్షణతో పాటు..చర్మాన్ని శుభ్రపరచడం ఎలా..?

ఓవెన్లో ఆహారం ఎలా తయారవుతుందో, వేసవికాలంలో మీ చర్మం కూడా అలా అవుతుంది. మీ చర్మాన్ని మండే సూర్యుడి నుండి రక్షించుకోవటానికి అదనంగా రక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. చర్మరక్షణకు తీసుకునే చర్యలలో ముఖ్యమైనది చర్మాన్ని శుభ్రపరచటం. మన చర్మం రోజులో ఆసాంతమూ కాలుష్యం, దుమ్ము, చెమట మరియు అనేక బాహ్య మలినాలతో ప్రభావితమవుతుంది. ఇందువలన మన చర్మాన్ని సరిఅయిన పద్ధతిలో శుభ్రపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

 skin cleansing tips summer
వేసవికాలంలో చర్మాన్ని శుభ్రపరచుకోవటానికి కొన్ని చిట్కాలు క్రింద ఇస్తున్నాము:

1 - వేసవిలో వేడి మరియు తేమ వలన తైల గ్రంథులు ఎక్కువగా పని చేయటం వలన మీ చర్మం మీద ఎక్కువ నూనె ఉత్పత్తి అయి, మీ చర్మం జిగటగా తయారవుతుంది. మీరు ఉదయం బయటకు వెళ్లబోయేముందు మీ ముఖం, మెడను ఒక తేలికపాటి శుభ్రపరచు ద్రవముతో గాని, సోప్ తో గాని కడగండి మరియు ఇదే విధంగా మీ పడుకునే ముందు కూడా. మీ చర్మం యొక్క లక్షణాన్ని బట్టి సరైన టోనర్ ఉపయోగించిన తరువాత ఒక సున్నితమైన, pH-సమతుల్య ముఖ క్లెన్జర్ తో ఉపయోగించండి.

2. క్లెన్జర్ ను ఎక్కువగా ఉపయోగించవొద్దు, దీనిమూలంగా మీ చర్మాన్ని రక్షించే పోర తొలగిపోయి, మీ చర్మం ఎక్కువ పొడిగా మరియు ఇరిటేషన్ గా తయారవుతుంది. కాబట్టి, ఎక్కువగా వాడవొద్దు.

3. మీ శరీరంలోని తైల గ్రంథులు మీ చర్మాన్ని రక్షించటంలో తోడ్పడతాయి, కాబట్టి మీరు సహజంగా హైడ్రేటెడ్ ఉండేలా చూసుకోండి.

4. మీ చర్మం సాధారణమైనదిగా ఉంటే, మీరు సున్నితమైన జెల్-బేస్డ్ క్లెన్జింగ్ వాష్ ను ఉపయోగించండి. దీనివలన మీ చర్మం తాజాగా ఉంటుంది.

5. ఎవరైతే అధిక పొడి చర్మంతో ఉన్నారో, వారు పాలు, నూనె లేదా ఔషధతైలంతో చర్మాన్ని శుభ్రపరచుకోండి. దీనివలన మోతాదు మించిన శుభ్రత కన్నా కావలసినంత మాత్రమే శుభ్రతను అందిస్తుంది.

6. ఎల్లప్పుడూ మేకప్ యొక్క ఆనవాళ్ళను తొలగించటానికి ఒక మంచి మేకప్ రిమూవర్ ను వాడండి.

 

No comments: