all

Monday, May 13, 2013

ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగా...?

శరీరంలో ఎక్కడ ముడతలు కనిపించినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ, ముఖం మీద ముడుతలు ఏర్పడితే మాత్రం మానసికంగా ఆందోళన పడిపోతారు. ఇందులో ఆడవారు, మగవారు అనే తేడా లేదు. ఇంచుమించు ఈ విషయంలో ఇద్దరి భావాలు ఒకే విధంగా ఉంటాయి.

ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగపడిపోతారు.ముఖంలో ముడుతలు ఏర్పడటానికి డ్రై స్కిన్... విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం.

 
బంగాళదుంప: రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి అపె్లై చేయాలి. అది ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు రెగ్యులర్‌గా చేస్తే సరి.


అరటి పండు: అరటి పండును గుజ్జును ముఖానికి అపె్లై చేసి అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 
క్యారెట్: క్యారెట్ జ్యూస్‌లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయండి.

 
బాదాం: ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

 
కోడి గుడ్డు: కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అపె్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి.

 
బీట్ రూట్: బీట్ రూట్ రసం రెగ్యుల్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.



క్యాబేజ్: ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అపె్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 
బొప్పాయి: తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అపె్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

 
పాలు: స్త్రీ ప్రతిరోజు ఉదయం కాచిన పాల నుంచి చెంచా పాల మీగడ తీసుకుని అందులో విటమిన్‌ (ఇ) నూనెను వేసి నిమిషం పాటు తమ కళ్ల చుట్టూ మృదువుగా మర్ధన చేసి పది నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే కళ్ల చుట్టూ వుండే ముడతల ను తగ్గించుకోవచ్చు. కళ్ల కింద ముడతలు పోవాలంటే, ఒక కప్పు నీళ్లలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున అదే నీళ్లలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని శుభ్రం చేసుకోవాలి.మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో బొప్పాయి. గుడ్డు, చేపలు, పాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

 
కలబంద : ముఖ వర్చస్సుకోసం: బాదంపొడి, పాలపొడి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ గులాబి నీటితో కలపాలి. కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని పదిహేను నిమిషాలయ్యాక కడగాలి. అలా వారానికి ఒకసారి చేస్తే చర్మం తాజాగా మృదువుగా ఉంటుంది. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్‌ వాటర్‌ రాసుకుంటే చాలా మంచిది.

 
నిమ్మరసం: చేతులు మృదువుగా ఉండాలంటే: మీకు సాధారణంగా చేతులకు మురికి ఉన్నప్పుడు, డెడ్‌స్కిన్‌ పోవాలంటే చేతుల్ని రెండు నిమిషాలు ఖచ్చితంగా వేడినీళ్లలో ఉంచాలి. చర్మం మెత్తబడ్డాక ఉప్పు కలిపిన నిమ్మికాయ రసం రాసి పాత టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా శుభ్రం చేయాలి. నెమ్మదిగా మాయిశ్యరైజర్‌ రాసుకున్నట్లైతే చర్మంలోని ముడతలు క్రమంగా తగ్గుతాయి. క్రమంగా మీ చేతులపై మార్పు కనబడుతుంది. ఒక గిన్నెలో ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్లు పచ్చిపాలు, ఆర స్పూన్‌ గంధం పొడి చేసి బాగా కలిపిన చేతికి ప్యాక్‌ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేయటం వల్ల చేతులు మృదువుగా అవుతాయి.


 
రోజ్ వాటర్: ముఖానికి రోజ్‌వాటర్‌ రాసుకుం టూవుంటే చాలామంచిది. అలాగే చెంచాడు తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కలు ఆలివ్‌ నూనె కలిపి రాసుకున్నా ముఖం ముడుతలు సర్ధుకుని కళగా ఉంటుంది.

 

 

No comments: