all

Monday, May 13, 2013

సున్నిత చర్మం కాంతివంత చేయడానికి నేచురల్ ఫేస్ బ్లీచింగ్..!

చర్మ సంరక్షణలో స్కిన్ బ్లీచింగ్ బెస్ట్ మరియు ఇది చర్మాన్ని శుద్ది చేయడానికి మరియు చర్మ వ్యాధులను తగ్గించడానికి, చర్మ రంగును మార్చడానికి, యవ్వనంగా కనబడేలా చేయడానికి చాలా సులభమైనటువంటి మార్గం బ్లీచింగ్. అయితే సున్నిత చర్మ తత్వం కలిగిన వారు స్టాంగ్ బ్లీచింగ్ ఏంజ్ ఉపయోగించడం వల్ల సున్నిత చర్మ మీద దుష్ప్రభావాలు చూపించే అవకాశాలున్నాయి. కాబట్టి సున్నిత చర్మ తత్వం కలవారు చర్మంపై ఎటువంటి హానికరమైన ప్రభావాలు లేకుండా ఉండాలంటే అందుకు సహజ బ్లీచింగ్ ను ఉపయోగించడం ఉత్తమం. మరి మీది సున్నిత చర్మ తత్వమైతే ఈ నేచురల్ బ్లీచ్ ఐడియాస్ ఉపయోగించి మెరిసే తాజా చర్మాన్ని పొందవచ్చు.

ఆరెంజ్ పీల్ మరియు పాలు:
ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా పాలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మీద అప్లై చేయాలి. ముఖం మీద మాత్రమే కాదు, మెడ, గొంతు బాగాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని 15-20నిముషాలు అలాగే ఉంచేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. సున్నిత చర్మానికి ఆరెంజ్ పీల్ అద్భుతంగా పనిచేస్తుంది.

టమోటో గుజ్జు:
టమోటో చాలా ప్రభావవంతమైన బ్లీచింగ్ ఏజెండ్. మీ చర్మం ఎక్కడ కాంతివంతంగా మెరవాలనుకుంటున్నారో అక్కడ ఈ టమోటో గుజ్జును అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ఎండవరకు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది సున్నిత చర్మం కలవారు ఇలా ప్రతి రోజూ అప్లై చేయడం వల్ల విజయవంతంగా మంచి ఫలితాలను పొందారు.

natural face bleach ideas sensitive skin


నిమ్మరసం:
నిమ్మరసం ఇది సిట్రస్ చెందిన ఫ్రుట్. సిట్రస్ పండ్లు తక్షణ ప్రభావాన్ని చూపెడుతాయి. ఇది చాలా ప్రభావవంతమైన నేచురల్ స్కిన్ బ్లీచ్ . నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం మీ ముఖాన్ని డ్రైగా మార్చుతుంది కాబట్టి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచుకొన్న తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

కీరదోస:
కీరదోసకాయా చాలా ప్రభావవంతమైన నేచురల్ స్కిన్ బ్లీచ్. దీన్ని సున్నిత చర్మ తత్వం కలవారు ఆరోగ్యవంతంగా ఉపయోగించవచ్చు . కీరదోసను గుజ్జుగా చేసి ముఖానికి పట్టించి ఎండిన తర్వతా స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 
ఓట్ మీల్ బ్లీచ్:
రెండు చెంచాలా ఓట్ మీల్ పొడిలో రెండు చెంచాల పెరుగు, రెండు చెంచాలా నిమ్మరసం మరియు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళు కలుపుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. ఇది తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసి, మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

పెరగుు:
పెరుగును బెస్ట్ నేచురల్ స్కిన్ బ్లీచ్ గా చెప్పవచ్చు. ఇది సున్నిత చర్మ తత్వం కలవారికి అద్భుతమైన సహాజ బ్లీచింగ్ ఏజెంట్. పెరుగును ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది సున్నిత చర్మాన్ని మరింత సున్నితంగా మరియు అందంగా ఉండేలా చేస్తుంది కాబట్టి దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయాలి.

 

No comments: