all

Wednesday, November 28, 2012

కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం

కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’.
పౌర్ణమి... ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే... ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెనె్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.
కార్తీక పౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామ స్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు.
పెళ్లికాని అమ్మాయిలు కార్తీక దీపాలను నదుల్లో వదిలి, రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముతె్తైదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. ఈ నోముకోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికా దీపాల నోము. ఆరోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలకాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధనవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించే వాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున... కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.
ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమినాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీప మాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక... ఇలపై శివుని ఆవాసంగా భావించే మహా పుణ్య క్షేత్రం వారణాసిలో గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ కార్తీక పున్నమినాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపార్తన అంటారు స్థానికులు. ఆరోజు పుష్కర్‌తోపాటు గంగానదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారన్నది మరో నమ్మకం.
----------------------------
భగవంతుడే పనిచేయడానికి ప్రేరణ అయతే చేసే పని ఆరాధన .
భగవంతునిపై భారం వేసి ముందుకు సాగితే ఫలితం శుభమే.
Samputi Magazine



కార్తీక పౌర్ణమి

కార్తీకపౌర్ణమి పవిత్రమైనది. ఈ రోజు చేసే స్నానం, దానం, హోమాల వలన అనంతమైన పుణ్యం వస్తుందంటారు. ఈ రోజు గంగాస్నానం చేసి సాయం సమయంలో దీపారాధన చేయాలి. ఈ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. ఈ రోజు వ్రతం ఆచరించి సత్యనారాయణ కధను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు,తులసిచెట్టు ఈ మూడింటో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. కాశీలో ఈ రీతిని జరుగుతుంటాయి. కార్తీక పౌర్ణమి చేసి జాగయరణ చేస్తే కోరుకున్నవన్ని నెరనేరతాయని చెబుతారు

చలికాలం చల్లగా జారుకోవడానికి..నులివెచ్చని జాగ్రత్తలు..!

సాధారణంగా వాతావరణ విషయంలో అన్ని కాలాల్లో కంటే చలికాలం అంటే చాలా మంది ఇష్టం ఎందుకంటే మరి కొద్దిసేపు ఎంచక్కా వెచ్చగా పడుకోవచ్చని. చలికాలంలో వీచే కఠినమైన చల్ల గాలుల వల్ల పడక మీద నుండి లేవబుద్ది కానీవ్వదు. మరి వాతావరణం చల్లగా చల్లగా ుంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ?ఎందుకేంటండి.... చాలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమ్ ను తినేయడమే కాదు మన శరీరం మీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది ప్రత్యేకంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. చలికాలం అనగానే ఓ వెరపు. బుగ్గలు ఎర్రగా అయిపోయి, పెదాలు, పాదాలు పగుళ్లు, చేతులు పొడిగా మారి, చర్మం చిట్లి... మొత్తానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, శిరోజాలకు ఎదుర్యే సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం..
winter season body care tips

చర్మ సంరక్షణ: ఈ కాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి. మీగడ ముఖానికి, చేతులకు రాసుకుని స్నానంచేయాలి. ఈ కాలంలో సబ్బుకన్నా సున్నిపిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసుకుని స్నానంచేయాలి. రాత్రి పడుకునేముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకుని పడుకోవాలి. లేదంటే కొబ్బరినూనె రాయాలి. ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్‌ప్యాక్‌లు పళ్ల మిశ్రమం వంటివైతే బెటర్‌. పగులుతున్నాయి కదాని పదేపదే పెదాలను తడి చేసుకోరాదు. పెదాలు పగలకుండా లిప్‌బామ్‌, విటమిన్‌ ఇ ఆయిల్‌ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకోబోయేముందు లోషన్‌ లేదా గ్లిజరిన్‌ రాసుకోవాలి. చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి.
ఎండనుండి: సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు. ఈ సమయంలోనూ అవసరమే! చలికాలంలో ఎండ చురుక్కు మంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అది వేడితో మరింత ఇబ్బందిపడుతుంది.
శిరోజాలు: ఈకాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్తపడాలి. హెయిర్‌ డ్రైయ్యర్‌ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది.
ఆహారం: చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్‌ పళ్లు తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి మరి! వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయటి నీళ్లు తాగడం వంటివి చలికాలం అనికాదు, ఏం కాలంలోనూ మంచిదికాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు.
దుస్తులు: చలి గాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తూ గ్లిజరిన్ సబ్బుకుగాని సున్నిపిండిని గానీ వాడాలి. చలికాలంలో సాధారణ సబ్బు వాడకం వలన ముఖం మీద చర్మం బిగుసుకుని బిరుసుగా గరుకుగా ఉంటుంది. అందువలన చలికాలములో సున్నిపిండి, కుంకుడుకాయలతో ఒళ్ళు రుద్దుకోవడం మంచిది.
పరిశుభ్రత: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెట్టర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చాలు... చలికాలం చలచల్లగా జారుకోడానికి!

శీతాకాలంలో మొటిమలు రావడానికి ప్రధాన కారణం..!?

సాధారణంగా చాలా మంది మొటిమలు, మచ్చలు ఏర్పడ్డానికి కారణం ఆయిల్ స్కిన్ మరియు వేడి వల్ల వస్తుంటాయి అనుకొంటుంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వేసవి కాలంలోనే ఎదురౌతాయి. అలాగే శీతాకాలంలో కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంది. కొంత మందిని ఇచ్చిన వివరణ ప్రకారం వేసవిలో కంటే శీతాకాలంలోనే మొటిమలు ఎక్కువగా బాధిస్తాయని తెలిసింది. ఐతే ఇది చెమట, వేడి వల్ల వచ్చే మొటిమలు కాదా..? మరి అయితే శీతాకాంలో మొటిమలకు దారితీసే కారణాలేంటి? ఒక సారి చూద్దాం...
why do we get acne winter

1. ఎక్కువగా కోల్డ్ క్రీమ్స్ ను ఉపయోగించడం: లిక్విడ్ రూపంలో కాకుండి చిక్కగా ఉండే కోల్డ్ క్రీమ్స్ చర్మానికి రాయడం వల్ల మొటిమలు ఏర్పడ్డ ప్రదేశం, మొటిమల వల్ల ఏర్పడ్డ రంద్రాలు మొత్తం నల్లగా మార్చివేస్తుంది కోల్డ్ క్రీమ్. శీతాకాలంలో చాలా వరకు పొడి చర్మం కలిగి ఉంటారు. కాబట్టి కోల్డ్ క్రీమ్ ను అప్లై చేయడం వల్ల చర్మంలో తేమ బయటకు రానివ్వకుండా అడ్డుకుంటుంది. దాంతో ముఖంగా నల్లగా కనిపిస్తుంటుంది. దాంతో ముఖం అసహ్యంగా కనబడుతుంది.
2. థిక్(చిక్కటి)కోల్డ్ క్రీమ్: శీతాకాలంలో పొడి బారిన చర్మ సంరక్షణకు కోల్డ్ క్రీమ్ మాయిశ్చరైజర్ చేయడం సహజం. అయితే మాయిశ్చరైజింగ్ కోసం చాలా చిక్కగా ఉండేటటువంటి కోల్డ్ క్రీమ్ ఎంపిక చేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను మూసుకొనేలా చేసి చర్మాన్ని నల్లగా మార్చుతుంది. కాబట్టి లైట్ గా ఉండే బాడీ లోషన్ లేదా ఫేష్ లోషన్ ను అప్లై చేయడం వల్ల మొటిమలు.. మచ్చల నివారణ పొందవచ్చు.
3. నో స్వెట్ -నో క్లీనింగ్: ఒక రకంగా చెమట కూడా మొటిమలు రావడానికి కారణమే. అయితే చెమట పట్టడం అనేది శరీర ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చెమట పట్టడం వల్ల చర్మలోపల ఉన్న దుమ్ము, ధూళి చెమట రూపంలో బయటకు విసర్జింపబడుతుంది. అయితే శీతాకాలంలో ఎక్కువ చెమట పట్టదు. దాంతో దుమ్ము, ధూళి కణాలు చర్మంలోపలే నిలిచి ఉండిపోతాయి. ఈ టాక్సిన్స్ వల్ల శీతాకాలంలో మొటిమలు రావడానికి ప్రధాన కారణం అవుతుంది.
4. ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం: సాధారణంగా శీతాకాలంలో చలి వల్ల ఏదైనా చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు తాకాలంటే ఇష్టం ఉండదు. చల్లని వాతావరణం వల్ల ముఖం కూడా సరిగా శుభ్రం చేసుకోరు. వేసవిలో శరీర సంరక్షణకు, ముఖ సంరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం ఫలితంగా చర్మం మురికిగా మారుతుంది. కొన్ని సార్లు మేకప్ తొలగించుకోవడం మర్చిపోతారు. దాంతో కూడా మొటిమలు మచ్చలు సులభంగా ఏర్పడుతాయి.
5. సన్ స్క్రీన్ ఉపయోగించకపోవడం: ఏకాలంలో నైనా సరే సూర్యకిరణాలు డైరెక్ట్ గా చర్మ మీద పడినప్పుడు చర్మ సమస్యలు ఏర్పడాటానికి అవకాశం ఉంది. చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు ఏర్పడం ఇవన్ని సూర్యరశ్మి వల్లే. కాబట్టి శీతాకాలంలో కూడా బయటకు వెళ్ళె అరగంట ముందే సన్ స్ర్కీన్ లోషన్ ను అప్లై చేసుకొని వెళ్ళాలి. చలికాలంలో సూర్యరశ్మి హానికరం కాకపోయినా, సూర్యకిరణాల్లో ఆల్ట్రావయొలెట్ కిరణాలు ఉండటం వల్ల చర్మనికి హానికలిగిస్తుంది. కాబట్టి సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరి.
మరి మొటిమలు నిరోధించడానికి ఏమి చెయ్యాలి?
1. శీతాకాలంలో చర్మానికి ఒక సారి మాత్రమే కోల్డ్ క్రీమ్ ను అప్లై చేయాలి.
2. క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక వేళ శుభ్రం చేసుకొన్న తర్వాత ముఖం డ్రైగా కనబడుతుంటే ఫేస్ వాష్ చేసుకొన్న ప్రతి సారి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
3. ఎక్కువ నీళ్ళు తాగుతుండాలి. లేదంటే శరీరంలోపల అధిక వేడికి గురిఅవుతుంది. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో శీతాకాలంలో ఏర్పడే మొటిమలను నివారించవచ్చు.

సహజమైన అందానికి పసుపు..గంధం..!

స్వాభావికంగా ఉండే కొన్ని మామూలు పదార్థాలతో జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చు. అలాంటి అందాన్ని పెంపొందించుకునే సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం . సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో కొత్త కొత్త సౌందర్య సాధనాలు వచ్చినా అవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా ఎప్పుడో కాలానుగుణంగా నిలదొక్కుకొన్నాయి. ఇటీవల వాస్తవరూపంలో వాటి ఉపయోగాన్ని మరిచిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యం కోసం వాటి ప్రాముఖ్యతను గుర్తుచేసుకుందాం. వాటిలో కొన్ని మీ కోసం........
Natural Skin Care With Turmeric Sandal
1. పసుపు: పసుపు కొమ్ములుగా పేర్కొనే ఒక మొక్కల వేళ్ళను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపు కీటక వినాశనిగా పనిచేస్తుంది. దానితో పాటు ముఖానికి కూడా సౌందర్య సాధనంగా పసుపు రాసుకుంటారు. అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడికోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.
2. చందనం: మన తెలుగు సంసృతిలోని ఎన్నో ఉత్పవాల్లో కాళ్లకు పసుపుతో పాటు...మెడపై గంధం రాసుకేనే సంప్రదాయం కూడా ఉంది అంటే సౌందర్య సాధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంసృతిలో అంతర్భాగంగా మారింది. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యగా ఉపయోగించడంతో పాటు చలువచేసే సాధనంగా వాడతారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గందాన్ని తయారు చేసి వాడతారు. దీన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో పెఫ్యూమ్స్ లో, సబ్బుల్లో , ఫేస్ ప్యాకులుగానూ ఉపయోగిస్తున్నారు. చందనంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే...
3. శనగపిండి: ముఖానికి ఉన్న జిడ్డు తొలగించడానికి దీన్ని ఒక ప్యాక్ లా వేసుకోవడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి, దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో మేని ఛాయ మెరుగవుతుందన్నది విశ్వాసం.
4. కొబ్బరి నూనె: ఇది ముదిరిన కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంసృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే ఇది శ్రేష్టమైనది. దీనితో పాటు ఆరోగ్యకరమైన, కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా మామూలే. కొబ్బరి నూనెను శరీరానికి బాగా పట్టించి మర్ధన చేయడం వల్ల శరీరానకి కావలసిన తేమ అంది, చర్మం చూడటానికి సున్నితంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
5. గోరింటాకు: ఇటీవల మెహందీ పేరిట ప్రాచుర్యం పొందిన ఆకు నుంచి తీసే ఈ ఉత్పాదనను సౌందర్య సాధనంగా ఎప్పటినుంచో మన సంసృతిలో ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్ గా మాత్రమేకాక...చల్లదనాన్ని ఇచ్చే సౌందర్యసాధనంగా పేరుపొందింది.ఇటీవల దీన్నీ తలకు వేసే రంగుల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లిసంబరాల్లో ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది ఒక సంసృతి వేడుక.
6. సాంబ్రాణి: ఇది కొన్ని రసాయనాలతో పాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి రోజూ చంటిపిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోనుంచి వచ్చే పొగ క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలున్న గదిలో దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకొని హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తుందన్నామాట....

గుత్తివంకాయను మరిపించే గుత్తికాకరకాయ

సాధరణంగా వెజిటేరియన్స్ వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల వంటలు వండుతుంటారు. అయితే రొటీన్ గా వండటం కంటే అప్పుడప్పుడు కొంచె డిఫరెంట్ గా వండటం వల్ల వాటి రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. తినడానికి కూడా బోర్ అనిపించదు. చాలా మంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానిలో ఉండే చేదువల్ల. అయితే దానిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొన్న తర్వాత తినకుండా మాత్రం ఉండరు. కాబట్టి కాకరకాయ చేదులేకుండా చేసే విధానంలో కొంచెం మార్పు చేసి చూడండి...ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో...
bharwa karela stuffed bitter gourd


కావలసిన పదార్థాలు:
చిన్న సైజు కాకరకాయలు: 6
పసుపు: 1tsp
నిమ్మరసం: 2tbsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1 pinch
నువ్వులు లేదా సన్ ఫ్లవర్ గింజలు: 1tsp
ధనియాలపొడి: 1tsp
కారం: 1tsp
ఆంచూర్(ఎండిన మామిడికాయపొడి): 1tsp
శెనగపిండి: 2tbsp
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పల నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, రెండు చెంచాల నిమ్మరసం వేసి నీటిని మరిగించాలి.
2. తర్వాత కాకరకాలయను మీకు కావల్సిన సైజులో నిలువుగా కట్ చేసి లోపల ఉన్న గూడును, గింజలను తొలగించాలి. ఆ తర్వాత పైన మరింగించి పెట్టుకొన్న నీటిలో 20 నిముషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల చేదు తొలగిపోతుంది. అరగంట తర్వాత వేడినీటిలో నానబెట్టిన కాకరకాయలను నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా పాన్ లో కొద్దిగా నూనె వేసి ఐదు నిముషాల పాటు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి వేగించాలి.
4. తర్వాత అందులోనే శెనపిండి, ధనియాలపొడి, నువ్వులు, కారం, ఆంచూర్ పౌడర్ ఇలా అన్ని వేసి బాగా వేగించాలి.
5. మసాలా అంతా బాగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించి పెట్టుకొన్న కాకరకాయ మధ్యలో ఫ్రైచేసిన మిశ్రమాన్ని నింపి, పైన మరో కాకరకాయ ముక్కతో క్లోజ్ చేసి దారంతో కట్టేయాలి. అందువల్ల లోపల ఉన్న మసాలా మిశ్రమం బయటకు విడిపోకుండా ఉంటుంది.
6. ఇప్పుడు మిగిలిన నూనెను పాన్ వేసి వేడి అయిన తర్వాత స్టఫ్ చేసిపెట్టుకొన్న కాకరకాయను అందులో వేసి మూత పెట్టి మరో 10-15నిముషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలియబెడుతుండాలి. అప్పుడే అన్ని వైపులా కాకరకాయ బాగా ఉడుకుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పప్పు, అన్నంతో సైడ్ డిష్ గా స్టఫ్ కాకరకాయ మంచి కాంబినేషన్.

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చికెన్ షీక్ కబాబ్

కబాబ్స్ ఇండియాలో చాలా ఫేమస్. చాలా రుచిగా... వివిధ రకాల టేస్ట్ లతో, తయారు చేస్తారు. నాన్ వెజ్ వెరైటీలలో షీక్ కబాబ్స్ కు మించిన టేస్ట్ లేదంటే నమ్మండి. చికెన్ కబాబ్ లకంటే మరింత టేస్ట్ గా ఉండే ఈ షీక్ కబాబ్స్ ఎందకంట టేస్టీగా ఉంటాయంటే .. నిప్పుల మీద లేదా మైక్రో వోవెన్ లో కాల్చడం వల్ల సుగంధ మసాలా దినుసులు బాగా పట్టించడం వల్ల అంత టేస్టీ గా ఉంటాయి. అయితే ఇవి రెస్టారెంట్లకే పరమితం కాకుండా మనం కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....
make chicken sheek kebabs at home

కావలసిన పదార్థాలు:
చికెన్: 500 grams (minced)
నెయ్యి: 2tbsp
ఉల్లిపాయ: 1 (chopped)
వెల్లుల్లి: 5 cloves
అల్లం: 1/2 inch
పచ్చిమిర్చి: 4
పుదీనా: 1 spring (chopped finely)
కొత్తిమీర ఆకులు: 1 spring (chopped finely)
కారం: 1tsp
శెనగపిండి: 2tbsp
జీలకర్ర: 1tsp
లవంగాలు: 4
యాలకలు: 4
చెక్క: 1/2 inch
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
బొగ్గు ముక్కలు: 3-4
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, మీడియం మంట మీదు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
2. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వాటితో పాటు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. అంతలోపు సుగంధ మసాలాదినుసులు (యాలకులు, చెక్క, లవంగాలు, జీకర్ర) ఇవన్నీ పాన్ లో వేసి తక్కువ మంట మీద వేయించి పెట్టుకోవాలి.
4. ఈ సుగంధ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకొని ముందగా పేస్ట్ చేసుకొన్న ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమంలో కలుపుకోవాలి.
5. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిపెట్టుకొన్న చికెన్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇంకా అందులో ఉప్పు, నెయ్యి, కారం,కొత్తిమీర,పుదీనా తరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు రెండు చెంచాల శెనగపిండి కూడా చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టి రెండు మూడు గంటల తర్వాత లేదా ఇంకా ఎక్కువ సమయం పెట్టినా కూడా మసాలాలు బాగా పడుతాయి.
7. వండేందుకు ఒక గంట ముందు ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను ఉన్న గిన్నెలోనే చికెన్ మద్యలో ఖాలీ ప్రదేశం ఉండేలా గిన్నెలో రౌండ్ గా సర్దుకోవాలి. ఖాలీగా ఉన్న ఆ ప్రదేశంలో బాగా కాలుతున్న బొగ్గుముక్కలను పోయాలి. దాంతోనే కబాబ్స్ కు మంచి వాసన వస్తుంది.
8. అరగంట తర్వాత కాలిన చికెన్ ముక్కలను ఒక కడ్డి(షీవర్స్)తో గుచ్చి పైకి తీసుకొని, బొగ్గులను ఆర్పేయాలి. ఇప్పుడు ఆ కడ్డీకున్న చికెన్ ముక్కలకు కొద్దిగా నెయ్యి రాయాలి.
9. ఈ చికెన్ గుచ్చిన షీకర్స్ ను మైక్రోవోవెన్ లో పెట్టి 30-60డిగ్రీ పవర్ లో బేక్ చేయాలి. ఈ షీకర్స్ తిరుగుతుండేలా చూసుకోవాలి. అప్పుడే చికెన్ అన్నివైపులా బాగా ఫ్రై అవుతుంది. బాగా బేక్ అయిన తర్వాత వొవెన్ ఆఫ్ చేసి పది నిముషాల తర్వాత బయటకు తీసి ఉల్లిపాయతో సర్వ్ చేయాలి అంతే చికెన్ షీక్ కబాబ్ రెడీ.

క్యారెట్ ఓట్స్ తో ఫ్యాట్ లెస్ వింటర్ సూప్...

చలికాలం వచ్చేసింది. ఓ ప్రక్క చలి.. మరో ప్రక్క మంచు. శరీరాన్ని గజగజా వనికిస్తుంటే ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం ఆరోగ్యకరమైన సూప్స్ త్రాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. హెల్తీ సూప్స్ తాగడం వల్ల ఒత్తిడిని తగ్గించి హృదయాన్ని తేలికపరుస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఓట్స్ : 1/4cup
క్యారట్: 2
ఉల్లిపాయ: 1
వెన్న: 1tps
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1/2tsp
కొత్తిమిర తరుగు: 2tbsp
Healthy Winter Soup Carrot Oats Soup
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకగిన్నెలో రెండుకప్పుల నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి.
2. ఉడికించిన క్యారెట్, ఉల్లిపాయలు చల్లారాక గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో వెన్నవేసి వేడి చేసి అందులో ఓట్స్ వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత ఇందులో కప్పుడు నీళ్ళు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇందులో గ్రైండ్ చేసి వడగట్టి పెట్టుకొన్న క్యారెట్ రసం, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగించాలి. ఇందులో టమాటా లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అంతే ఈ విటర్ లో హెల్తీ క్యారెట్ ఓట్స్ సూప్ రెడీ...

మీ జీవిత కాలాన్ని రెట్టింపు చేసే హెల్తీ హ్యాబిట్స్...

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకూ పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనాబ్రతికేయగలడు. మనిషికే కాదు, ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆహ్లాదం.. నిజమైన సంతోషం ఎంతో విలువైనది. మనిషి జీవితంలో ప్రశాంతత ఉన్నప్పుడు ఆనందం, సంతోషమనేది సాధ్యమవుతుంది. మనిషికి సంతోషమనేది పెద్ద ఆస్తి. అంతకుమించిన ఆస్తి ప్రస్తుత సమాజంలో దొరకదు. నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్న సమయంలో కొద్దిపాటి సంతోషం అవసరం. నేటి సమాజంలో మనిషి మానసిక క్షోభకు గురౌతున్నాడు. దానికి ఏకైక విరుగుడు సంతోషమే. సంతోషంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా నిత్య కృషివలుడుగా ఉండటం సాధ్యపడుతుంది. ప్రతి కుటుంబంలో జీవిత భాగస్వామి వారి పార్ట్నర్ కోసం లేదా పిల్లల కోసం తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. వారి పట్ల ప్రేమను కలిగి ఉంటారు.

భోజనాన్ని మరచిపోకూడదు: మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగ గడపడానికి సరైన ఆహారాన్ని, సరైన టైమ్ కు తీసుకోవాలి. ఇలా సమయానికి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. స్థిర శక్తిని కలిగి ఉంటుంది. సమయం తప్పించి తినడం లేదా అసలు తినకకుండా ఉండటం వల్ల తర్వాత తీసుకోనే ఆహరం వేగంగా తినడం లేదా ఎక్కువగా తినడం వల్ల క్యాలొరీలు శరీరానికి ఎక్కువగా అంధించబడి, బరువు పెరగడానికి దారితీస్తుంది.



రెగ్యులర్ ఎక్సర్ సైజ్: వ్యాయామం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాయామం అంటే శారీరక, మానసిక వ్యాయామం. 'ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు' ఉండాలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచి ఎటు కావాలంటే అటు వంగేటట్లు చేస్తుంది. కుటుంబ సభ్యులకు క్రమం తప్పని వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. జిమ్‌, ఎరోబిక్స్‌, చురుగ్గా నడవడం, ఈత, షటిల్‌ లేదా ఇంకేవైనా శరీరానికి వ్యాయామాన్నందించే ఆటలు ఆడాలి. దాంతో మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది ఇంకా బరువును కంట్రోల్ చేస్తుంది, డయాబెటిస్ వంటివి రాకుండా సహయపడుతుంది. దాంతో మీ కుటుంబ సభ్యలంతా ఎల్లప్పుడు ఆరోగ్యంగా..నిత్య యవ్వనంతో జీవించగలుగుతారు.



బ్రెషింగ్ చేసే విధానం: నోరు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుందంటారు. అది అక్షరాల నిజం. నోరు ఆరోగ్యంగా ఉంచకోవడం వల్ల రక్తప్రసరణ జరిపే ధమనులు ఆరోగ్యం ఉంటాయి. మంచి రక్తాన్ని శరీరానికి ప్రసరింపచేస్తాయి. రెగ్యలర్ గా రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం వల్ల నోట్లో ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు గుండెకు ప్రసరించే రక్తంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి, కుటుంబం సభ్యలు జీవితకాలన్ని పెంచుతుంది.


అందరూ కలసి ఆటలు ఆడటం: భారతదేశంలో చాలా వరకూ పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పూర్తిగా కరువౌంది. అలాంటప్పుడు సంతోషంగా, ఆహ్లాదంగా గడపడం కోసం వారాంతంలో, సెలవుదినాల్లో బయట విహారయాత్రకు ప్లాన్ చేసి అందురూ కలిసేలా చూడండి. విహార యాత్రలో ఫ్యామిలీప్లాన్, ప్యామిలీ స్పోర్ట్స్ వంటివి మీమ్మల్ని మీకుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్నిస్తుంది. శారీర బరువు, ఒత్తిడిని తగ్గించేందుకు బాగా సహాయం చేస్తుంది. అంతే కాదు కుటుంబ సభ్యలు మధ్య కమ్యూనికేషన్ బలపడానికి మరింత సహాయం చేస్తుంది.


మంచి ఆహారం: మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని కాదు. రుచికరమైనదని కూడా కాదు. మంచి ఆహారం అంటే శరీరానికి మేలు చేసేది. దీనిలో పౌష్టికత బాగా ఉండాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు తగిన నిష్పత్తిలో ఉండాలి. 8 నుండి 10 గ్లాసుల నీరు కూడా తాగాలి. వయసును బట్టి, ఆడమగా తేడాను బట్టి, చేసే శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి. ఎవరికి వారు తాము ఎలాంటి సమతులాహారం తీసుకోవాలో తెలుసుకుని భుజిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాల బారిన పడకుండా మన శరీరం కాపాడుతుంది.



హెల్తీ బ్రేక్ ఫ్యాస్ట్: ప్రతి రోజూ మనం ఉదయాన్నే తీసుకొనే అల్పాహరం భోజనం కంటే విలువైనది.. ఆరోగ్యకరమైనది. రోజంతటికీ కావల్సిన శక్తిని ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే అందుతుంది. కాబట్టి మీరు, మీకుటుంబ సభ్యలు ప్రతి రోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకొనేలా శ్రద్ద తీసుకోండి. పెద్దలు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడ వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. పిల్లల విషయంలో వారి శరీర పెరుగుదలకు, మెదడు చురుగ్గా ఉండటం కోసం అల్పాహరం అవసరం. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లేకుండా ఎవ్వరి బయటకు అనుమతించకూడదు.



చేతులు-కాళ్ళు పరిశుభ్రంగా: ఉదయం నిద్రలేవగానే ముఖం, కాళ్లు కడుక్కోవడం బయటినుండి ఇంట్లోకి వచ్చినపుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం, భోజనం ముందు, తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవడం, రోజూ స్నానం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. కాళ్ళు చేతులు మంచి యాంటి బయోటిక్ సోపులను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.



సరైన నిద్ర: నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతిలో ఉంటుంది. శరీరం లోపలి అవయవాల పని చురుకుదనం తగ్గుతుంది. మెదడు నిద్రావస్థలో ఉంటుంది. గుండె కొట్టుకునే రేటు కూడా నిమిషానికి 72 నుండి 55కి పడిపోతుంది. గాఢ నిద్ర అనంతరం మేల్కొనగానే మనసు, శరీరం చాలా తాజాగా ఉంటాయనేది మనకు అనుభవంలోని విషయమే. నిద్రలేమితో శరీరంలో ఆమ్లాల పరిమాణం పెరిగి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొంతమంది మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తారు. ఈ కాస్త నిద్ర వారి మెదడులో చురుకుదనాన్ని పెంచుతుంది. ప్రతి రోజూ 6 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. అంతకు మించిన నిద్ర చాలా ప్రమాదం. ఇది బద్దకాన్ని పెంచుతుంది.



రెగ్యులర్ హెల్త్ చెకప్(వైద్య పరీక్షలు): అనవసరమైన ఆరోగ్య సమస్యలు మరియు భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్యాలు, వాటి తాలుకూ భారీ వ్యయాలను నివారించాలంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం. ఆరోగ్యం వయస్సును బట్టి, స్త్రీ, పురుషులను బట్టి, మారుతుంటాయి. కాబట్టి రెగ్యులర్ చెకప్ లో రక్త పరీక్ష, బీపి, కొలెస్ట్రాల్ చెకప్ వంటివి చేయించుకోవడం చాలా అవసరం.



బంధాలు బలపరచుకోవడం(బెటర్ రిలేషన్ షిప్): మీరు, మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమ సజీవంగా, జీవిత కాలం ఉండాలంటే శృంగారం అవసరం. మీ ఆరోగ్యానికి పెంపొందించుకోవడానికి, జీవితకాలం ఒకరికొకరు తోడుగా గడిపేందుకు ఇది సహాయం చేస్తుంది.



కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా, వారి పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నా అందంతా సంతోషంగా గడపడం కోసమే. ఆనందగా గడపడానికి కావల్సింది సంతోషమే అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే సంతోషంగా గడపడం, లేదా సంతోషంగా ఉండటం అన్నది ఎంత మంది ఫాలో అవుతన్నారు చెప్పండి? జీవితం ఆనందమయంగా గడపడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. దానికి గొప్ప ఉద్యోగం, బోలెడంత డబ్బు, ఉండనక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు ద్వారా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకు కొన్ని హెల్తీ ఫ్యామిలీ హ్యాబిట్స్ ను అలవర్చుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా గడపగలరు. ఈ అలవాట్లును అవవర్చుకోగలిగినట్లైతే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండగలరు.

నిమ్మ-తేనె జ్యూస్ లో దాగున్న బోలెడు ఆరోగ్యప్రయోజనాలు...

సాధారణంగా మనం వినే ఉంటాం నిమ్మరసం, తేనెలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో అని. అధ్భుతమైన ఈ రెండింటి కాంబినేషన్ కొద్దిగా ఉప్పగా, రుచిగా, తియ్యగా, కమ్మగా ఉండే ఈ కలయిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది. డైటేరియన్ నుండి ఫిట్ నెస్ వరకూ ఇది అద్భుతమైన ఫలితాలను అంధిస్తుంది. డైయట్ ఫాలో అయ్యే వారు కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక్క గ్లాస్ ఈ కాంబినేష్ డ్రింక్ ను తాగాల్సిందే అంటున్నారు. ఎందుకంటే అతి త్వరగా సహజంగా బరువును తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అంతే కాదు తేనె-నిమ్మరసం కాంబినేషన్ లో ఇంకా బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అవి మీరు తెలుసుకోవాలంటే ఈ నిమ్మ-తెనె కాంబినేషన్ లోని డ్రింక్ తాగాల్సిందే. మరీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం...
benefits drinking lemon honey juice

1. బరువు తగ్గించడానికి: ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మరియు తేనెలోని యాంటిఆక్సిడెంట్స్ వేడి నీళ్ళలో కలపడం వల్ల అద్భుతమైనటువంటి జ్యూస్ గా తయారై మంచి ఫలితాలనందిస్తుంది. ఎవరైతే బరువు తగ్గించుకోవడానికి అధికంగా వర్కౌట్స్ చేస్తున్నారో వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: నిమ్మరసంతో మరొకో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం. జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను నివారిస్తుంది. మీరు కనుక కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే నిమ్మరసం, తెనె మిశ్రమాన్ని కలిపిన జ్యూస్ ను సేవించండి.
3. శరీరాన్ని శుభ్రపరచడానికి: ఇది మరొక ఆరోగ్య ప్రయోజం. నిమ్మరసం, తేనెతో మిశ్రమంతో తీసుకొనే ఈ జ్యూస్ ను వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయబడుతుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గి, మెరిసే చర్మాన్ని సొతం చేసుకోవాలనుకొంటే ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగాలి. తేనె, నిమ్మరసం వేడినీళ్ళతో మిక్స్ చేసి తాడం వల్ల మలబద్దకాన్ని పోగొట్టి, ప్రేగును శుభ్రం చేస్తుంది.
4. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది: ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది సాధారణ సమస్యగా మారింది. అందుకు కారణం తక్కుగా నీళ్ళు తాగడం, క్యాల్షియం అధికంగా ఉండటం చేత కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అలాగే యూరిన్ ఎక్కువ సేపు పోకుండా అలాగే ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమికాదు క్యాల్షియం నిక్షేపాలు నిల్వ ఉంటాయి. వీటిని కిడ్నీస్టోన్స్ అంటాం. కాబట్టి వాటిని కరిగించడానికి ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మకాయం బాగా పనిచేస్తుంది.
5. గొంతు నొప్పిని నివారిస్తుంది: గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది . వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.
6. పెద్దప్రేగు క్యాన్సర్ ను అడ్డుకొంటుంది: తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ అనామ్లజనకాలతో పోరడాకలిగే శక్తి ఉండి, పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

మధుమేహాన్ని నియంత్రించగలిగే సహాయకారి...!

సాధారణంగా మన శరీరం పెరుగుతున్న వయస్సుతో పాటు దానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యపరంగా జింక్ లోపం అనేది సాధారణ సమస్య. మరీ ముఖ్యంగా వెజిటేరియన్ ఎక్కువగా తీసుకొనే వారికి. మనం రోజూ తీసుకొనే ఆహారంతో జింక్ అందదు. ముఖ్యంగా జింక్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా జింక్ కు, డయాబెటిస్ కు దగ్గర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. జింక్ లోపం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నాయి కొన్ని పరిశోధనలు. డయాబెటీస్ అనేది జీవన విధానంలో మార్పుల వల్ల ఏర్పడుతుంది . కాబట్టి జింక్ కంట్రోల్ చేసుకొన్నట్లైతే డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు. వైద్య నిపుణులు.
zinc can control your diabetes

జింక్ శరీరం కోల్పోయిన యాంటీబాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్‌, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం, జింక్ లోపం అధికంగా ఉంగే శరీరం దుర్వాసనలు వెలువరించవచ్చు. అలాకాకుండా మధుమేహం కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మలబద్దకం వంటివి కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. మెగ్నీషియం, జింక్ ఉన్నపదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. దీనికి తోడు మంచి నీటిని కనీసం ఎనిమిది గ్లాసులు రోజులో తీసుకుంటే చాలా ఈ సమస్య అంతగా వేధించదు. మరి జింక్ డయాబెటిస్ ను ఎలా నియంత్రిస్తుందో చూద్దాం...
డయాబెటీస్ అనేది హార్మోన్ లోపం. ఇన్సులిన్ హార్మోన్ అనేది డయాబెటిస్ కు ప్రధాన లక్షణం. శరీరంలో హార్మోనులను సమతుల్య చేయడానికి జింక్ చాలా అవసరం. శరీరంలో జింక్ వల్ల 300వివిధ రకాల హార్మోన్ల చర్యలు నియంత్రిస్తుంది. కాబట్టి జింక్ మధుమేహగ్రస్తులకు రక్షణ కలిగిస్తుంది. ఎక్కువ మినిరిల్స్ తీసుకోవడం వల్ల మధుమేహం నుండి ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్ ను కంట్రోల్ చేస్తుంది.
మానవ శరీరంలోని గ్లెసెమిక్ ను జింక్ మెరుగుపరుస్తుంది. శరీరంలో గ్లెసెమిక్ స్థాయి తగ్గిపోవడం వల్ల మధుమేహానికి చాలా ప్రమాధకరం. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు షుగర్ వెల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి జింక్ చాలా అవసరం.
మధుమేహం వల్ల మెదట రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అటువంటప్పుడు జింక్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ఇతర రోగాలన బారీన పడకుండా చేస్తుంది.
మధుమేహం శరీరాన్ని బలహీన పరుస్తుంది కాబట్టి ఏదైనా గాయాలు ఏర్పడినప్పుడు అవి నయం కావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అటువంటప్పుడు జింక్ తీసుకోవడం వల్ల శరీరానికి ఇది ఒకరకమైనటువంటి కషాయంలా పనిచేస్తుంది. గాయాలను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు గాయాలు సెప్టిక్ కాకుండా నిరోధిస్తుంది.
ఒక వేళ మధుమేహం ఒక స్టేజ్ ధాటిన తర్వాత పురుషుల్లో సెక్స్ మీద ప్రభావం చూపుతుంది మరియు అది వారిని నపుంసకుడిని చేయవచ్చు. కాబటి శరీరానికి కావలసినంత జింక్ సంప్లిమెంట్ ను అందించడం వల్ల ఇటువంటి సమస్యలను సులభంగా ఎదుర్కొనవచ్చు.
మధుమేహం వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ హెయిర్ ఫాల్. చర్మం సమస్యలు. కాబట్ట తగిన పాళ్ళలో జింక్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఈ రెండు సమస్యలను అరికట్టవచ్చు. అంతే కాదు హెయిర్ లాస్ ను పూర్తిగా అరికట్టడంలో జింక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చర్మానికి రక్షణ కల్పించి వయస్సు పైబడినవారిగా కనబడనివ్వకుండా సహాయపడుతుంది. వృద్ధాప్యం లక్షణాలకు వ్యతిరేక ప్రభావం కలిగి ఉంటుంది. కాబట్టి జింక్ వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు అని తెలుసుకోండి...

మసాలా మహారాణి దాల్

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1/4 కేజీ
  • అల్లం. చిన్నముక్క
  • పచ్చికొబ్బరి. కాస్తంత
  • ఉల్లిపాయలు. 2
  • పచ్చిమిర్చి. 6
  • వెల్లుల్లి రెబ్బలు. 2
  • టొమోటోలు. 4
  • నూనె. 100 గ్రా.
  • పసుపు. చిటికెడు
  • నెయ్యి. 2 టీస్పూ.
  • జీలకర్ర. 1 టీస్పూ.
  • ఆవాలు. 1 టీస్పూ.
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • నిమ్మకాయ. 1
  • కొత్తిమీర. 1 కట్ట
    Picture  Recipe

తయారీ విధానం

కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి.
బాణెలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి.
కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణెలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి.
చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మసాలా మహారాణి దాల్ రెడీ

రాజ్మా దాల్‌

కావలసిన పదార్థాలు

  • రాజ్మా. 1/2 కప్పు
  • మినప్పప్పు. 1/4 కప్పు
  • శెనగపప్పు. 1/4 కప్పు
  • టొమోటో గుజ్జు. 1/2 కప్పు
  • ఇంగువ. కొద్దిగా
  • కారం. 2 టీస్పూ.
  • జీలకర్ర. 2 టీస్పూ.
  • అల్లంముద్ద. 2 టీస్పూ.
  • నూనె. తగినంత
  • ఉప్పు. సరిపడా
  • జీలకర్ర పొడి. 2 టీస్పూ.
  • గరంమసాలా. 2 టీస్పూ.
  • మెంతిపొడి. కొద్దిగా
  • పాలు. 2 కప్పులు
  • మీగడ. 4 టీస్పూ.
  • వెన్న. 4 టీస్పూ.
  • కొత్తిమీర. కొద్దిగా

    Picture  Recipe

తయారీ విధానం

ముందుగా పప్పులన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌కుక్కర్లో ఇవన్నీ వేసి కారం, ఉప్పు, ఇంగువ, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి.
మరో బాణెలిలో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
తరవాత కారం, టొమాటో గుజ్జు, ఉప్పు, జీలకర్ర పొడి, గరంమసాలా, మెంతి పొడి, పాలు, మీగడ, వెన్న అన్నీ వేసి ఉడికించిన పప్పు కూడా వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దించాలి.
చివరగా కొత్తిమీర అలంకరించి వడ్డిస్తే సరి.!

పంచరత్ని దాల్‌

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1 కప్పు
  • పెసరపప్పు. 1 కప్పు
  • సెనగపప్పు. 1 కప్పు
  • ఎర్ర కందిపప్పు. 1 కప్పు
  • పొట్టుతీయని పెసరపప్పు. 1 కప్పు
  • పసుపు. 2 టీస్పూ
  • ఉల్లిపాయలు. 8
  • జీలకర్ర. 2 టీస్పూ
  • నెయ్యి. 8 టీస్పూ
  • కొత్తిమీర. కొద్దిగా
  • టొమాటో గుజ్జు. 1 కప్పు
  • జీలకర్ర పొడి. 2 టీస్పూ
  • గరంమసాలా. 2 టీస్పూ
  • ఎండుమిర్చి. 6
  • ఉప్పు. తగినంత
    Picture  Recipe

తయారీ విధానం

పప్పులన్నింటినీ శుభ్రంగా కడగాలి. వీటిని ఓ పాత్రలో వేసి ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
టొమాటో గుజ్జు, జీలకర్ర పొడి, గరంమసాలా అన్నీ కలిపి మరికాసేపు ఉడికించాలి.
విడిగా మరో బాణెలిలో నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి, గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి.
తరవాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించి, పప్పులో కలిపి సన్నగా కోసిన కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. అంతే పంచరత్ని దాల్ స్పెషల్ రెఢీ!

చింతచిగురు పప్పు

కావలసిన పదార్థాలు

  • చింతచిగురు. 1 కప్పు
  • కందిపప్పు లేదా పెసరపప్పు.. ½ కప్పు
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 5
  • పసుపు. ¼ టీస్పూ//
  • ఉప్పు. తగినంత

పోపుకోసం

  • నూనె. 1 టీస్పూ
  • జీలకర్ర, 1 టీస్పూ
  • ఆవాలు. 1 టీస్పూ
  • ఇంగువ. చిటికెడు
  • ఎండుమిర్చి. 3
  • కరివేపాకు. 2 రెబ్బలు

    Picture  Recipe

తయారీ విధానం

ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని, దాంట్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి.
చింతచిగురును శుభ్రం చేసి, పప్పు సగం ఉడికిన తరువాత అందులో కలపి సన్నటి మంటమీద ఉడికించాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో నూనె స్టవ్ మీద పెట్టుకొని, నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి.
దీనికి ఉడికిన చింతచిగురు, పప్పు మిశ్రమాల్ని.. ఉప్పుని కలిపి, ఒక నిమిషంపాటు ఉంచి దింపేయాలి.

కోకోనట్ పులావ్ -స్పెషల్

సాధారణంగా పులావ్ ను రకరకాలుగా తయారు చేస్తుంటారు. చాలా సులభంగా... రుచిగా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్, లేదా లచ్ బాక్స్ రిసిపి పులావ్. వెజిటేబుల్ పులావ్, టమోటో పులావ్, పన్నీర్ పులావ్, మట్టర్ పులావ్, చికెన్, పులావ్ ఇలా రకరకాలుగా తయారు చేసుకుంటారు. అదే విధంగా ఫ్రేష్ కోకోనట్ మిల్క్ తో తయారుచేసే ఈ పులావ్ రుచితో పాటు ఆరోగ్యం కూడా. కొన్ని స్పైసీలు జోడించి తయారు చేసే ఈ పులావ్ చేయడం కూడా సులభమే... మరి కోకోనట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
coconut pulao

కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్ : 1.5cups
పచ్చి బఠానీ: 1cup
పచ్చి కొబ్బరి తురుము: 1cup
బిర్యానీ ఆకులు: మూడు
యాలకులు: 2-3
పచ్చిమిర్చి: 2-4
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు: 8-10
నూనె : 1/4cup
జీడిపప్పు: 5-10
ఉల్లిపాయలు: 1-2(సన్నగా కట్ చేసుకోవాలి)
లవంగాలు: 2-4
దాల్చినచెక్క: చిన్న ముక్క
నెయ్యి: 2tbsp
పొదీనా తరుగు: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడ
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారీ చేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యం శుభ్రంగా కడగి వార్చి వుంచాలి.
2. తర్వాత కొబ్బరి తురిమును మిక్సీలో వేసి దాని నుండి పాలు తయారు చేసుకోవాలి.
3. అలాగే అల్లం, వెల్లుల్లి కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి ఉంచాలి. బియ్యంలో 1.5కప్పు బియ్యానికి రెండు కప్పుల పాలు పోసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఆ తర్వాత మసాల దినుసులన్నీ వేసి వేయించాలి.
5. కొద్దిసేపటి తర్వాత పచ్చిబఠాణీ వేసి వేపి, బియ్యం పాలు పోసి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంట ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. స్టౌ ఆఫ్ చేసి పదినిమిషాల తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే కోకోనట్ పులావ్ రెడీ...ఉల్లిపాయ, పెరుగుపచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవల్సిన 9 ఆహారాలు..

నవంబర్- డిసెంబర్ వచ్చిందంటే చాలు చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. మారిన రుతువుకనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే.. శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి. మరి ఈ వింటర్ డైయట్ కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి కొన్ని మీకోసం...

ఆరెంజ్: వింటర్ లో వీటి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్ ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం ఉండదు.


ఆకు కూరలు: ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా దొరికే గ్రీన్ వెజిటెబుల్స్ లో ఇదొకటి. అత్యధిక పోషకాలు కలిగినటువంటి ఆకుకూరలు, బచ్చలికూర, తోటకూర, మెంతి, పాలకూర వంటివి అధిక రుచిని అంధించడమే కాకుండా ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఆకుకూరలు తినడానికి బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా వండి తినడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా శరీరానికి అందుతాయి.


*వేరుశెనగలు: వేరుశెనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ ,పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి, లేదా వేయించినవి, లేదా ఉప్పుపట్టించినవి ఈ సీజన్ లో తినడం చాలా ఆరోగ్యకరం. ఇంకా వేరుశెనగపప్పుతో తయారు చేసిన చిక్కీలు బయటమార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటి తినడం వల్ల శరీరానిక కావల్సిన పోషకాలు అందుతాయి.

జామకాయ: జామపండును తినడం వల్ల జీవక్రియను మెరుగు పరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. పచ్చి జామకాయలో ఉన్న లైకోపిన్ అనే పదార్థం ధమని సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. పింక్ కలర్ లో ఉన్న జాపపండు, జ్యూసి జామపండ్లను వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికెంతో క్షేమం.



క్యారెట్స్: ఒకటి కంటే ఎక్కువ విటమిన్లు ఒక్క క్యారెట్లోనే ఉన్నాయి. అటువంటి క్యారెట్లను ప్రకృతి సహజసిద్దంగా మనకు అంధించడం బహుమతే అనుకోవాలి. ఎందుకంటే క్యారెట్లో శరీరానికి ఏఏ విటమిన్లు అవసరమో ఆ విటమిన్లు అన్నీ(విటమిన్ బి, సి, డి, ఇ మరియు కె)ఇందులో పుష్కలంగా ఉన్నాయి కెరోటిన్ విటమిన్ ఎ గా మార్చబడుతుంది. కాబట్టి క్యారెట్స్ ను వింటర్ డైయట్ లో ప్రధమ స్థానం కల్పించండి.


కివి పండ్లు: ఇదొక అసాధరన పండు. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఉప్పు చల్లిన ఈ కివి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది. అంతే కాకుండా ఈ కివి పండ్లను శీతాకాలంలో వివిధ రకాల సలాడ్లలో కలిపి తీసుకోవడం మరింత ఆరోగ్యధాయకం. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.



చికెన్ సూప్: ఈ వింటర్ లో సూప్స్ అంటే ఇష్టపడని వారుండరేమో. సూప్స్ రుచిగా మాత్రమే కాదు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది.


కోకో: కోకోగింజలతో తయారు చేసిన పొడిని, ఒక కప్పులో పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల అద్భుతమైన టేస్ట్ మాత్రమే కాదు వింటర్ డైయట్ తో శరీరంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఇంకా కోకోలో ఉన్న ఫ్లెవనాయిడ్ వల్ల హర్ట్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి భోజనంతో లేదా భోజనం తర్వాత కోకోను కొద్దిగా తాగడం ఆరోగ్యానికి మంచిది.
 


నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్: తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు నట్స్ ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్ లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.




శీతాకాలంలో ఇటువంటి ఆహారాలను మీ డైయట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ఆహారపదార్థాలను మిస్ కాకుండా తిని ఆరోగ్యంగా జీవించండి...

అందమె ఆనందం

పొడి చేసిన బార్లీ గింజలకు నీళ్లు కలిపి ఉడికించాలి. చల్లారిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖం మీది మచ్చలు తగ్గి, నునుపుగా తయారవుతుంది. 

తెలవిగల పిల్లాడు-kids story

ఒక వ్యాపారి తన గాడిద ను తీసుకుని సంతకు బయల్దేరాడు. కొంత దూరం నడిచేసరికి అలసట, నిద్ర రావడంతో ఒక చెట్టునీడకు చేరి గాడిదను చెట్టుకి కట్టేసి హాయిగా పడుకున్నాడు. కాసేపటి తర్వాత లేచి చూస్తే గాడిద కనిపించలేదు. దాంతో రోడ్డు మీద కనిపించినవారిని తన గాడిద ఏమైనా కనపడిందా అని అడగనారంభించాడు. అంతలో ఒక పిల్లాడు ‘‘ఒక కన్ను గుడ్డిది, ఒక కాలు కుంటిది.. ఆ గాడిదేనా?’’ అన్నాడు.

‘‘అవును... అదే నా గాడిద’’ అన్నాడు వ్యాపారి. ‘‘కానీ దాన్ని చూడలేదు’’ అని అన్నాడు కుర్రాడు. దాంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. గ్రామపెద్ద దగ్గరికి పిల్లాడిని లాక్కెళ్లాడు.
‘‘వీడు నా గాడిదను దొంగిలించి చూడలేదని అబద్ధాలాడుతున్నాడు’’ అని ఫిర్యాదు చేశాడు. గ్రామపెద్ద పిల్లాడిని దగ్గరికి పిలిచి ‘‘నిజమేనా?’’ అని అడిగాడు.

అపుడు పిల్లాడు ఇలా చెప్పాడు-‘‘నిజంగానే గాడిదను చూడలేదు. కానీ అది నడిచిన దోవ ఆనవాలును బట్టి దాని నడకలో తేడా ఉందని గ్రహించాను. పైగా రోడ్డుకి కుడివైపున ఉన్న గడ్డి తినేసి ఉంది. ఎడమవైపునున్నది బాగానే ఉన్నది. అందువల్ల దానికి ఎడమ కన్ను గుడ్డిదని తెలిసింది’’ అన్నాడు.

పిల్లాడి తెలివితేటలకు గ్రామపెద్ద ఆనందించాడు. పిల్లాడిపై ఫిర్యాదు చేసినందుకు, కుంటి గుడ్డి గాడిదచేత మోత మోయిస్తున్నందుకు వ్యాపారిని మందలించి పంపించేశాడు.

కంటి పాప లకు కావాలి కాపలా!

కంటిలో ఉండే ఒక రకం ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల నరం దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా చిన్నపిల్లల్లో కనిపించే ఈ గ్లకోమా మన రాష్ట్రంలో ఎక్కువ. రాష్ట్రంలో 3,300 ప్రసవాలు జరిగితే అందులో ఒకరికి గ్లకోమా ఉంటోంది. మొత్తం అంధత్వానికి దారితీసే కేసుల్లో గ్ల్లకోమా వల్ల అంధత్వం వచ్చేవారి సంఖ్య 4.2 శాతం. తొలుత చిన్న పిల్లల్లో గ్లకోమాను అరుదైన విషయంగా పరిగణించినా ఇటీవల ఈ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రత్యేక కథనం.

మన కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే కంటిలో ప్రవహించే ‘యాక్వస్ ఫ్లూయిడ్’ అనే ఒక రకం ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్ యాంగిల్ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉండాలి. డ్రైనేజ్ యాంగిల్‌లో స్పాంజిలాంటి కణజాలం ఉంటుంది. దీనినే ట్రాబెక్యులార్ మెష్‌వర్క్ అంటారు. కంటిలో ప్రవహించే యాక్వస్ ఫ్లూయిడ్ ఈ ట్రాబెక్యులార్ మెష్‌వర్క్ ద్వారా కంటి నుంచి బయటకు వెళ్తుంది. కొంతమంది చిన్నారులలో యాక్వస్ ఫ్లూయిడ్ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్ ఫ్లూయిడ్ బయటకు ప్రవహించలేక అక్కడే ఉండిపోతుంది.

ఫలితంగా కంటిలో ఉండాల్సిన ద్రవం పరిమాణం పెరిగి కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఉండాల్సిన దానికంటే అలా పెరుగుతూ పోతున్నకొద్దీ కంటి నరంపైన ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. దానివల్ల చూపుకూడా పోతుంది. ఇలా కోల్పోయిన చూపు శాశ్వత దృష్టి లోపానికి దారితీస్తుంది. కంటిలోని యాక్వస్ ఫ్లూయిడ్ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితిని ‘కంజెనిటల్ గ్లకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లకోమా అంటారు.

ఎప్పుడు బయటపడుతుంది?
సాధారణంగా ఇది... పిల్లలు పుట్టిన మూడేళ్ల లోపు బయటపడుతుంది. ఇతర వ్యాధులు లేకుండా కేవలం గ్లకోమా మాత్రమే ఉంటే దాన్ని ‘ప్రైమరీ కంజెనిటల్ గ్లకోమా’ అంటారు. చాలాసందర్భాల్లో గ్లకోమా ఉన్న పిల్లల్లో ప్రైమరీ కంజెనిటల్ గ్లకోమా సాధారణంగా కనిపించే కండిషన్. అరుదైన సందర్భాల్లో మాత్రమే మరికొన్ని కండిషన్లతో పాటు గ్లకోమా ఉండవచ్చు. దీన్ని సెకండరీ కంజెనిటల్ గ్లకోమా అంటారు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే కొన్ని కేసుల్లో ఇది ఆరునెలల వయసులోనే బయటపడుతుంది. చాలా సందర్భాల్లో ఇది ఏడాది లోపు పిల్లల్లో తెలుస్తుంది.

ఎప్పుడు అనుమానించాలి?
బయటకు కనిపించే కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా ఉందేమోనని అనుమానించవచ్చు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి ఎక్కువగా నీరు కారుతున్నా, కొద్దిపాటి వెలుతురునే పిల్లలు భరించలేకపోతున్నా లేదా కాంతి పడగానే కనుగుడ్డు గట్టిగా మూయడం, కనుగుడ్డు పెద్దదిగా మారడం, కంట్లోని నల్లపాప మబ్బుగా, మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా ఉందని అనుమానించవచ్చు. ఇలాంటి లక్షణాలు పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, వాంతులు చేసుకుంటుండటం, తిన్నవెంటనే ఇలా జరుగుతుంటే చిన్నపిల్లల కంటివైద్యనిపుణుల (పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్)కు చూపించాల్సిన అవసరం ఉంది.

అందుబాటులో ఉన్న చికిత్సలు...
కంజెనిటల్ గ్లకోమా ఉన్నట్లు తేలితే ప్రధానంగా దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లకోమా ఉన్నట్లు తేలగానే ఇచ్చే కంట్లో వేసేందుకు ఇచ్చే క్రీములు, పూతమందులు (టాపికల్ యాంటీ గ్లకోమా మందులు) కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే.

ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని, మబ్బుగా కనిపిస్తున్న పరిస్థితులను తాత్కాలికంగా తగ్గించడానికి మాత్రమే పనిచేస్తాయి. భవిష్యత్తులో చేయబోయే సర్జరీని సులభతరం చేయడానికి ఉపయోగపడతాయంతే. కంట్లో యాక్వియస్ ద్రవం వల్ల పెరుగుతున్న ఒత్తిడి అంతా తొలగిపోయేలా ఆ ద్రవాన్ని బయటకు వెళ్లేలా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్ సర్జికల్ ప్రొసీజర్స్) అవలంబించాల్సి రావచ్చు. చిన్నారిపాపల కళ్ళకు ఏమైనా అయితే మనకే కన్నీళ్లు. అందుకే వారి కళ్ల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం.

కంజెనిటల్ గ్లకోమా నిర్ధారణ ఎలా?
కంజెనిటల్ గ్లకోమా విషయంలో పెద్దలు లేదా పెద్ద పిల్లలకు చేసే పరీక్షలతో పోలిస్తే, చిన్న పిల్లలకు చేయాల్సిన పరీక్షలు కష్టమైనవే అని చెప్పవచ్చు. కాబట్టి చిన్నారులకు చేయాల్సిన ఈ పరీక్షలను ఆపరేషన్ గదిలో అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి చేయాల్సి ఉంటుంది. వారికి నిర్వహించాల్సిన పరీక్షలివే...

కంటిలో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను కొలవడం
కంటిలోని నల్లపాప (కార్నియా) వ్యాసాన్ని కొలవడం
కంటోని నల్లపాప ఎంత స్పష్టంగా ఉందో (కార్నియల్ క్లారిటీ) తెలుసుకోవడం. కనుగుడ్డు మొత్తం వ్యాసాన్ని (యాగ్జియల్ లెంగ్త్) కొలవడం. కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని (డ్యామేజీని) తెలుసుకోవడం.
కంటిలో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం.
యాక్వియస్ ఫ్లూయిడ్ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ పరీక్షను నిర్వహించడం.

ఇది వంశపారంపర్యమా?
తల్లిదండ్రుల్లో గ్లకోమా ఉంటే పిల్లల్లో ఛైల్డ్‌హుడ్ గ్లకోమా వచ్చే అవకాశాలు 10 శాతం ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా వచ్చే అవకా శాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి.

ఆయుష్షును పెంచే రన్నింగ్!

మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం ఆవశ్యకతను గురించి అందరూ కొన్ని వేలసార్లు చదివే ఉంటారు. అయితే కొత్త సంగతి ఏమిటంటే... రన్నింగ్ లేదా జాగింగ్ వ్యాయామం ఆయుష్షును పెంచుతుందట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ దీర్ఘకాలిక అధ్యయనం కోసం వారు 440 మందిని ఎంపిక చేశారు. అందులో 50 ఏళ్లకు దరిదాపు వయసున్నవారిని ఎంపిక చేశారు. తాము ఎంపిక చేసిన వారిని 19 ఏళ్ళ పాటు పరిశీలించారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ అధ్యయనం లో తేలిన విషయం ఏమిటంటే... నిత్యం రన్నింగ్ లేదా జాగింగ్ చేసేవారిలో కేవలం 15 శాతం మంది మాత్రమే త్వరగా చనిపోయారు. అదే ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎలాంటి రన్నింగ్, జాగింగ్ చేయని వారిలో మాత్రం 34 శాతం మంది త్వరగా అకాల మరణం పాలయ్యారు. అంతేకాదు ఈ అధ్యయనంలోనే పరిశీలనకు వచ్చిన మరో అంశం ఏమిటంటే... వృద్ధులయ్యే కొద్దీ వచ్చే వైకల్యాలు రన్నింగ్ / జాగింగ్ చేసేవారిలో చాలా తక్కువగా ఉన్నాయట. అదే ఎలాంటి వ్యాయామం చేయనివారిలో అంగవైకల్యాలు వచ్చినవారు చాలామందే ఉన్నారట. అందుకే ఎలాంటి అంగవైకల్యాలూ లేకుండా సుదీర్ఘకాలం జీవించాలనుకునేవారు తప్పనిసరిగా రన్నింగ్ లేదా జాగింగ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

మంచి కొలెస్ట్రాల్ మనకు కావలసిందే...!

కొలెస్ట్రాల్ అనగానే అది చెడ్డదని, దాంతో అంతా నష్టమేననే అభిప్రాయం చాలామందిలో ఉంది. కొలెస్ట్రాల్‌లోనూ రెండు రకాలు ఉన్నాయి. అందులో చెడు కొలెస్ట్రాల్‌తో ఆరోగ్యానికి నష్టమే. అయితే శరీరానికీ, ఆరోగ్యానికీ మేలు చేసే కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు.

ఆరోగ్యం కోసం మంచి కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఆవశ్యకతపై ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌కు చెందిన చాలామంది పరిశోధకులు రీసెర్చ్ చేశారు. అందులోని చాలా అంశాలు ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. అందులోని వాస్తవాలు ఏమిటంటే... మన శరీరానికి అందాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగినంతగా అందనివారిలో 60 ఏళ్లు దాటాక వారికి మతిమరపు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మంచి కొలెస్ట్రాల్ తగ్గిన వారి మెదడులో జ్ఞాపకశక్తిని బ్లాక్ చేసే ఒకరకం గార (ప్లాక్) అభివృద్ధి చెందుతుందట. అది మెదడు కణాల్లో ఒక అడ్డంకిగా మారి జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందట. ఫలితంగా యుక్తవయసులో మంచి కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గిస్తే వారి వృద్ధాప్యంలో అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

ఇటీవల చాలామంది ఆహారంపైనా, ఆరోగ్యంపైనా చాలా ఎక్కువగా స్పృహ పెంచుకుని మంచి కొలెస్ట్రాల్‌ను కూడా తిరస్కరిస్తున్నారు. అందుకే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే కోడిగుడ్లలోని తెల్లసొన (ఎగ్ వైట్), చేపలు వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు సదరు అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు, న్యూట్రిషనిస్టులు.

ఆకుకూరలా మజాకా!

మాంసాహారం మీద మోజు పెంచుకుని ఆకుకూరలను చాలామంది చిన్నచూపు చూస్తుంటారు గాని... వాటితో కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఆ ప్రయోజనాల్లో కొన్నింటిని చూద్దాం.

త్వరగా కడుపునిండినట్లు అనిపించడం ఎందుకంటే: భోజనంలోకి మటన్, చికెన్ వంటివి ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువగా తినాలనిపిస్తుందని, అలా తిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుందని చాలామంది అనుకుంటారు. నిజానికి అలా ఎందుకు జరుగుతుందో మాత్రం వారికి తెలియదు. ఆకుకూరల భోజనంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రొటీన్లూ ఎక్కువే. మన జీవక్రియలకు ఎంత ఆహారం కావాలో మెదడుకు తెలుసు. అందుకే మనం ఎంత తినాలనుకుంటే అంతా తినలేం. మనకు సరిపోయినంత కడుపులో పడిందని భావించాక పొట్టకు మెదడు ఒక సంకేతం పంపిస్తుంది.


ఆ సంకేతం తర్వాత పూర్తిసంతృప్తి పొందిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంగ్లిష్‌లో దీన్నే సెటైటీ అంటారు. పీచులు -ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కొద్దిగా తీసుకోగానే అది చాలని భావించిన మెదడు సంతృప్తసంకేతం పంపిస్తుంది. దాంతో కడుపు నిండిపోయినట్లవుతుంది. అంటే మనం తీసుకున్న ఆ ఆహారం మనకు చాలన్నమాట. అదే పీచులు లోపించి మాంసం తిన్నామనుకోండి. అందులోని పీచులు మన జీవక్రియలకు సరిపోకపోవడం వల్ల కడుపులో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువే ఆహారం ఉన్నప్పటికీ ‘మరికాస్త తినాలి, ఇంకాస్త తినాలి’ అంటూ మన మెదడు కడుపునూ, నోటినీ కోరుతుంటుంది. అంటే సంతృప్త సంకేతం ఒక పట్టాన అందదన్నమాట. అందుకే మాంసాహారం తిన్నప్పుడు మామూలు కంటే ఒకముద్ద ఎక్కువగానే కావాలనిపిస్తుంది.

నిజానికి తగినన్ని పీచుపదార్థాలతో ఉన్న ఆహారంతో త్వరగా కడుపు నిండటమే మంచిది. ఎందుకంటే మనం అవసరానికంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల అందులో పీచులు లేకపోవడంతో మన జీర్ణవ్యవస్థలోని చిన్నపేగు, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే నిత్యం కూరగాయలు, ఆకుకూరలతో ఆహారం తీసుకునేవారిలో పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పైగా మాంసాహారంతో త్వరగా సంతృప్తస్థాయికి చేరక అదేపనిగా తింటూండటం వల్ల అతిగా తీసుకున్న ఆ ఆహారం కొవ్వురూపంలో శరీరంలో పేరుకోవడం, దాంతో అనేక అనర్థాలు కలగడం మామూలే.