all

Wednesday, November 28, 2012

మీ జీవిత కాలాన్ని రెట్టింపు చేసే హెల్తీ హ్యాబిట్స్...

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకూ పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనాబ్రతికేయగలడు. మనిషికే కాదు, ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆహ్లాదం.. నిజమైన సంతోషం ఎంతో విలువైనది. మనిషి జీవితంలో ప్రశాంతత ఉన్నప్పుడు ఆనందం, సంతోషమనేది సాధ్యమవుతుంది. మనిషికి సంతోషమనేది పెద్ద ఆస్తి. అంతకుమించిన ఆస్తి ప్రస్తుత సమాజంలో దొరకదు. నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్న సమయంలో కొద్దిపాటి సంతోషం అవసరం. నేటి సమాజంలో మనిషి మానసిక క్షోభకు గురౌతున్నాడు. దానికి ఏకైక విరుగుడు సంతోషమే. సంతోషంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా నిత్య కృషివలుడుగా ఉండటం సాధ్యపడుతుంది. ప్రతి కుటుంబంలో జీవిత భాగస్వామి వారి పార్ట్నర్ కోసం లేదా పిల్లల కోసం తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. వారి పట్ల ప్రేమను కలిగి ఉంటారు.

భోజనాన్ని మరచిపోకూడదు: మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగ గడపడానికి సరైన ఆహారాన్ని, సరైన టైమ్ కు తీసుకోవాలి. ఇలా సమయానికి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. స్థిర శక్తిని కలిగి ఉంటుంది. సమయం తప్పించి తినడం లేదా అసలు తినకకుండా ఉండటం వల్ల తర్వాత తీసుకోనే ఆహరం వేగంగా తినడం లేదా ఎక్కువగా తినడం వల్ల క్యాలొరీలు శరీరానికి ఎక్కువగా అంధించబడి, బరువు పెరగడానికి దారితీస్తుంది.



రెగ్యులర్ ఎక్సర్ సైజ్: వ్యాయామం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాయామం అంటే శారీరక, మానసిక వ్యాయామం. 'ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు' ఉండాలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచి ఎటు కావాలంటే అటు వంగేటట్లు చేస్తుంది. కుటుంబ సభ్యులకు క్రమం తప్పని వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. జిమ్‌, ఎరోబిక్స్‌, చురుగ్గా నడవడం, ఈత, షటిల్‌ లేదా ఇంకేవైనా శరీరానికి వ్యాయామాన్నందించే ఆటలు ఆడాలి. దాంతో మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది ఇంకా బరువును కంట్రోల్ చేస్తుంది, డయాబెటిస్ వంటివి రాకుండా సహయపడుతుంది. దాంతో మీ కుటుంబ సభ్యలంతా ఎల్లప్పుడు ఆరోగ్యంగా..నిత్య యవ్వనంతో జీవించగలుగుతారు.



బ్రెషింగ్ చేసే విధానం: నోరు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుందంటారు. అది అక్షరాల నిజం. నోరు ఆరోగ్యంగా ఉంచకోవడం వల్ల రక్తప్రసరణ జరిపే ధమనులు ఆరోగ్యం ఉంటాయి. మంచి రక్తాన్ని శరీరానికి ప్రసరింపచేస్తాయి. రెగ్యలర్ గా రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం వల్ల నోట్లో ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు గుండెకు ప్రసరించే రక్తంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి, కుటుంబం సభ్యలు జీవితకాలన్ని పెంచుతుంది.


అందరూ కలసి ఆటలు ఆడటం: భారతదేశంలో చాలా వరకూ పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పూర్తిగా కరువౌంది. అలాంటప్పుడు సంతోషంగా, ఆహ్లాదంగా గడపడం కోసం వారాంతంలో, సెలవుదినాల్లో బయట విహారయాత్రకు ప్లాన్ చేసి అందురూ కలిసేలా చూడండి. విహార యాత్రలో ఫ్యామిలీప్లాన్, ప్యామిలీ స్పోర్ట్స్ వంటివి మీమ్మల్ని మీకుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్నిస్తుంది. శారీర బరువు, ఒత్తిడిని తగ్గించేందుకు బాగా సహాయం చేస్తుంది. అంతే కాదు కుటుంబ సభ్యలు మధ్య కమ్యూనికేషన్ బలపడానికి మరింత సహాయం చేస్తుంది.


మంచి ఆహారం: మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని కాదు. రుచికరమైనదని కూడా కాదు. మంచి ఆహారం అంటే శరీరానికి మేలు చేసేది. దీనిలో పౌష్టికత బాగా ఉండాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు తగిన నిష్పత్తిలో ఉండాలి. 8 నుండి 10 గ్లాసుల నీరు కూడా తాగాలి. వయసును బట్టి, ఆడమగా తేడాను బట్టి, చేసే శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి. ఎవరికి వారు తాము ఎలాంటి సమతులాహారం తీసుకోవాలో తెలుసుకుని భుజిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాల బారిన పడకుండా మన శరీరం కాపాడుతుంది.



హెల్తీ బ్రేక్ ఫ్యాస్ట్: ప్రతి రోజూ మనం ఉదయాన్నే తీసుకొనే అల్పాహరం భోజనం కంటే విలువైనది.. ఆరోగ్యకరమైనది. రోజంతటికీ కావల్సిన శక్తిని ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే అందుతుంది. కాబట్టి మీరు, మీకుటుంబ సభ్యలు ప్రతి రోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకొనేలా శ్రద్ద తీసుకోండి. పెద్దలు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడ వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. పిల్లల విషయంలో వారి శరీర పెరుగుదలకు, మెదడు చురుగ్గా ఉండటం కోసం అల్పాహరం అవసరం. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లేకుండా ఎవ్వరి బయటకు అనుమతించకూడదు.



చేతులు-కాళ్ళు పరిశుభ్రంగా: ఉదయం నిద్రలేవగానే ముఖం, కాళ్లు కడుక్కోవడం బయటినుండి ఇంట్లోకి వచ్చినపుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం, భోజనం ముందు, తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవడం, రోజూ స్నానం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. కాళ్ళు చేతులు మంచి యాంటి బయోటిక్ సోపులను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.



సరైన నిద్ర: నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతిలో ఉంటుంది. శరీరం లోపలి అవయవాల పని చురుకుదనం తగ్గుతుంది. మెదడు నిద్రావస్థలో ఉంటుంది. గుండె కొట్టుకునే రేటు కూడా నిమిషానికి 72 నుండి 55కి పడిపోతుంది. గాఢ నిద్ర అనంతరం మేల్కొనగానే మనసు, శరీరం చాలా తాజాగా ఉంటాయనేది మనకు అనుభవంలోని విషయమే. నిద్రలేమితో శరీరంలో ఆమ్లాల పరిమాణం పెరిగి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొంతమంది మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తారు. ఈ కాస్త నిద్ర వారి మెదడులో చురుకుదనాన్ని పెంచుతుంది. ప్రతి రోజూ 6 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. అంతకు మించిన నిద్ర చాలా ప్రమాదం. ఇది బద్దకాన్ని పెంచుతుంది.



రెగ్యులర్ హెల్త్ చెకప్(వైద్య పరీక్షలు): అనవసరమైన ఆరోగ్య సమస్యలు మరియు భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్యాలు, వాటి తాలుకూ భారీ వ్యయాలను నివారించాలంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం. ఆరోగ్యం వయస్సును బట్టి, స్త్రీ, పురుషులను బట్టి, మారుతుంటాయి. కాబట్టి రెగ్యులర్ చెకప్ లో రక్త పరీక్ష, బీపి, కొలెస్ట్రాల్ చెకప్ వంటివి చేయించుకోవడం చాలా అవసరం.



బంధాలు బలపరచుకోవడం(బెటర్ రిలేషన్ షిప్): మీరు, మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమ సజీవంగా, జీవిత కాలం ఉండాలంటే శృంగారం అవసరం. మీ ఆరోగ్యానికి పెంపొందించుకోవడానికి, జీవితకాలం ఒకరికొకరు తోడుగా గడిపేందుకు ఇది సహాయం చేస్తుంది.



కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా, వారి పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నా అందంతా సంతోషంగా గడపడం కోసమే. ఆనందగా గడపడానికి కావల్సింది సంతోషమే అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే సంతోషంగా గడపడం, లేదా సంతోషంగా ఉండటం అన్నది ఎంత మంది ఫాలో అవుతన్నారు చెప్పండి? జీవితం ఆనందమయంగా గడపడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. దానికి గొప్ప ఉద్యోగం, బోలెడంత డబ్బు, ఉండనక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు ద్వారా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకు కొన్ని హెల్తీ ఫ్యామిలీ హ్యాబిట్స్ ను అలవర్చుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా గడపగలరు. ఈ అలవాట్లును అవవర్చుకోగలిగినట్లైతే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండగలరు.

1 comment: