all

Wednesday, November 28, 2012

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చికెన్ షీక్ కబాబ్

కబాబ్స్ ఇండియాలో చాలా ఫేమస్. చాలా రుచిగా... వివిధ రకాల టేస్ట్ లతో, తయారు చేస్తారు. నాన్ వెజ్ వెరైటీలలో షీక్ కబాబ్స్ కు మించిన టేస్ట్ లేదంటే నమ్మండి. చికెన్ కబాబ్ లకంటే మరింత టేస్ట్ గా ఉండే ఈ షీక్ కబాబ్స్ ఎందకంట టేస్టీగా ఉంటాయంటే .. నిప్పుల మీద లేదా మైక్రో వోవెన్ లో కాల్చడం వల్ల సుగంధ మసాలా దినుసులు బాగా పట్టించడం వల్ల అంత టేస్టీ గా ఉంటాయి. అయితే ఇవి రెస్టారెంట్లకే పరమితం కాకుండా మనం కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....
make chicken sheek kebabs at home

కావలసిన పదార్థాలు:
చికెన్: 500 grams (minced)
నెయ్యి: 2tbsp
ఉల్లిపాయ: 1 (chopped)
వెల్లుల్లి: 5 cloves
అల్లం: 1/2 inch
పచ్చిమిర్చి: 4
పుదీనా: 1 spring (chopped finely)
కొత్తిమీర ఆకులు: 1 spring (chopped finely)
కారం: 1tsp
శెనగపిండి: 2tbsp
జీలకర్ర: 1tsp
లవంగాలు: 4
యాలకలు: 4
చెక్క: 1/2 inch
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
బొగ్గు ముక్కలు: 3-4
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, మీడియం మంట మీదు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
2. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వాటితో పాటు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. అంతలోపు సుగంధ మసాలాదినుసులు (యాలకులు, చెక్క, లవంగాలు, జీకర్ర) ఇవన్నీ పాన్ లో వేసి తక్కువ మంట మీద వేయించి పెట్టుకోవాలి.
4. ఈ సుగంధ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకొని ముందగా పేస్ట్ చేసుకొన్న ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమంలో కలుపుకోవాలి.
5. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిపెట్టుకొన్న చికెన్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇంకా అందులో ఉప్పు, నెయ్యి, కారం,కొత్తిమీర,పుదీనా తరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు రెండు చెంచాల శెనగపిండి కూడా చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టి రెండు మూడు గంటల తర్వాత లేదా ఇంకా ఎక్కువ సమయం పెట్టినా కూడా మసాలాలు బాగా పడుతాయి.
7. వండేందుకు ఒక గంట ముందు ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను ఉన్న గిన్నెలోనే చికెన్ మద్యలో ఖాలీ ప్రదేశం ఉండేలా గిన్నెలో రౌండ్ గా సర్దుకోవాలి. ఖాలీగా ఉన్న ఆ ప్రదేశంలో బాగా కాలుతున్న బొగ్గుముక్కలను పోయాలి. దాంతోనే కబాబ్స్ కు మంచి వాసన వస్తుంది.
8. అరగంట తర్వాత కాలిన చికెన్ ముక్కలను ఒక కడ్డి(షీవర్స్)తో గుచ్చి పైకి తీసుకొని, బొగ్గులను ఆర్పేయాలి. ఇప్పుడు ఆ కడ్డీకున్న చికెన్ ముక్కలకు కొద్దిగా నెయ్యి రాయాలి.
9. ఈ చికెన్ గుచ్చిన షీకర్స్ ను మైక్రోవోవెన్ లో పెట్టి 30-60డిగ్రీ పవర్ లో బేక్ చేయాలి. ఈ షీకర్స్ తిరుగుతుండేలా చూసుకోవాలి. అప్పుడే చికెన్ అన్నివైపులా బాగా ఫ్రై అవుతుంది. బాగా బేక్ అయిన తర్వాత వొవెన్ ఆఫ్ చేసి పది నిముషాల తర్వాత బయటకు తీసి ఉల్లిపాయతో సర్వ్ చేయాలి అంతే చికెన్ షీక్ కబాబ్ రెడీ.

No comments: