all

Wednesday, November 28, 2012

తెలవిగల పిల్లాడు-kids story

ఒక వ్యాపారి తన గాడిద ను తీసుకుని సంతకు బయల్దేరాడు. కొంత దూరం నడిచేసరికి అలసట, నిద్ర రావడంతో ఒక చెట్టునీడకు చేరి గాడిదను చెట్టుకి కట్టేసి హాయిగా పడుకున్నాడు. కాసేపటి తర్వాత లేచి చూస్తే గాడిద కనిపించలేదు. దాంతో రోడ్డు మీద కనిపించినవారిని తన గాడిద ఏమైనా కనపడిందా అని అడగనారంభించాడు. అంతలో ఒక పిల్లాడు ‘‘ఒక కన్ను గుడ్డిది, ఒక కాలు కుంటిది.. ఆ గాడిదేనా?’’ అన్నాడు.

‘‘అవును... అదే నా గాడిద’’ అన్నాడు వ్యాపారి. ‘‘కానీ దాన్ని చూడలేదు’’ అని అన్నాడు కుర్రాడు. దాంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. గ్రామపెద్ద దగ్గరికి పిల్లాడిని లాక్కెళ్లాడు.
‘‘వీడు నా గాడిదను దొంగిలించి చూడలేదని అబద్ధాలాడుతున్నాడు’’ అని ఫిర్యాదు చేశాడు. గ్రామపెద్ద పిల్లాడిని దగ్గరికి పిలిచి ‘‘నిజమేనా?’’ అని అడిగాడు.

అపుడు పిల్లాడు ఇలా చెప్పాడు-‘‘నిజంగానే గాడిదను చూడలేదు. కానీ అది నడిచిన దోవ ఆనవాలును బట్టి దాని నడకలో తేడా ఉందని గ్రహించాను. పైగా రోడ్డుకి కుడివైపున ఉన్న గడ్డి తినేసి ఉంది. ఎడమవైపునున్నది బాగానే ఉన్నది. అందువల్ల దానికి ఎడమ కన్ను గుడ్డిదని తెలిసింది’’ అన్నాడు.

పిల్లాడి తెలివితేటలకు గ్రామపెద్ద ఆనందించాడు. పిల్లాడిపై ఫిర్యాదు చేసినందుకు, కుంటి గుడ్డి గాడిదచేత మోత మోయిస్తున్నందుకు వ్యాపారిని మందలించి పంపించేశాడు.

No comments: