all

Wednesday, November 28, 2012

గుత్తివంకాయను మరిపించే గుత్తికాకరకాయ

సాధరణంగా వెజిటేరియన్స్ వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల వంటలు వండుతుంటారు. అయితే రొటీన్ గా వండటం కంటే అప్పుడప్పుడు కొంచె డిఫరెంట్ గా వండటం వల్ల వాటి రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. తినడానికి కూడా బోర్ అనిపించదు. చాలా మంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానిలో ఉండే చేదువల్ల. అయితే దానిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొన్న తర్వాత తినకుండా మాత్రం ఉండరు. కాబట్టి కాకరకాయ చేదులేకుండా చేసే విధానంలో కొంచెం మార్పు చేసి చూడండి...ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో...
bharwa karela stuffed bitter gourd


కావలసిన పదార్థాలు:
చిన్న సైజు కాకరకాయలు: 6
పసుపు: 1tsp
నిమ్మరసం: 2tbsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1 pinch
నువ్వులు లేదా సన్ ఫ్లవర్ గింజలు: 1tsp
ధనియాలపొడి: 1tsp
కారం: 1tsp
ఆంచూర్(ఎండిన మామిడికాయపొడి): 1tsp
శెనగపిండి: 2tbsp
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పల నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, రెండు చెంచాల నిమ్మరసం వేసి నీటిని మరిగించాలి.
2. తర్వాత కాకరకాలయను మీకు కావల్సిన సైజులో నిలువుగా కట్ చేసి లోపల ఉన్న గూడును, గింజలను తొలగించాలి. ఆ తర్వాత పైన మరింగించి పెట్టుకొన్న నీటిలో 20 నిముషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల చేదు తొలగిపోతుంది. అరగంట తర్వాత వేడినీటిలో నానబెట్టిన కాకరకాయలను నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా పాన్ లో కొద్దిగా నూనె వేసి ఐదు నిముషాల పాటు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి వేగించాలి.
4. తర్వాత అందులోనే శెనపిండి, ధనియాలపొడి, నువ్వులు, కారం, ఆంచూర్ పౌడర్ ఇలా అన్ని వేసి బాగా వేగించాలి.
5. మసాలా అంతా బాగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించి పెట్టుకొన్న కాకరకాయ మధ్యలో ఫ్రైచేసిన మిశ్రమాన్ని నింపి, పైన మరో కాకరకాయ ముక్కతో క్లోజ్ చేసి దారంతో కట్టేయాలి. అందువల్ల లోపల ఉన్న మసాలా మిశ్రమం బయటకు విడిపోకుండా ఉంటుంది.
6. ఇప్పుడు మిగిలిన నూనెను పాన్ వేసి వేడి అయిన తర్వాత స్టఫ్ చేసిపెట్టుకొన్న కాకరకాయను అందులో వేసి మూత పెట్టి మరో 10-15నిముషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలియబెడుతుండాలి. అప్పుడే అన్ని వైపులా కాకరకాయ బాగా ఉడుకుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పప్పు, అన్నంతో సైడ్ డిష్ గా స్టఫ్ కాకరకాయ మంచి కాంబినేషన్.

No comments: