కావలసిన పదార్థాలు
- చింతచిగురు. 1 కప్పు
- కందిపప్పు లేదా పెసరపప్పు.. ½ కప్పు
- ఉల్లిపాయ. 1
- పచ్చిమిర్చి. 5
- పసుపు. ¼ టీస్పూ//
- ఉప్పు. తగినంత
పోపుకోసం
- నూనె. 1 టీస్పూ
- జీలకర్ర, 1 టీస్పూ
- ఆవాలు. 1 టీస్పూ
- ఇంగువ. చిటికెడు
- ఎండుమిర్చి. 3
- కరివేపాకు. 2 రెబ్బలు
తయారీ విధానం
ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని, దాంట్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి.
చింతచిగురును శుభ్రం చేసి, పప్పు సగం ఉడికిన తరువాత అందులో కలపి సన్నటి మంటమీద ఉడికించాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో నూనె స్టవ్ మీద పెట్టుకొని, నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి.
దీనికి ఉడికిన చింతచిగురు, పప్పు మిశ్రమాల్ని.. ఉప్పుని కలిపి, ఒక నిమిషంపాటు ఉంచి దింపేయాలి.
No comments:
Post a Comment