కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’.
పౌర్ణమి... ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే... ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెనె్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.
కార్తీక పౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామ స్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు.
పెళ్లికాని అమ్మాయిలు కార్తీక దీపాలను నదుల్లో వదిలి, రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముతె్తైదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. ఈ నోముకోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికా దీపాల నోము. ఆరోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలకాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధనవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించే వాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున... కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.
ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమినాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీప మాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక... ఇలపై శివుని ఆవాసంగా భావించే మహా పుణ్య క్షేత్రం వారణాసిలో గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ కార్తీక పున్నమినాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపార్తన అంటారు స్థానికులు. ఆరోజు పుష్కర్‌తోపాటు గంగానదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారన్నది మరో నమ్మకం.
----------------------------
భగవంతుడే పనిచేయడానికి ప్రేరణ అయతే చేసే పని ఆరాధన .
భగవంతునిపై భారం వేసి ముందుకు సాగితే ఫలితం శుభమే.

No comments:
Post a Comment