all

Wednesday, November 28, 2012

ఆయుష్షును పెంచే రన్నింగ్!

మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం ఆవశ్యకతను గురించి అందరూ కొన్ని వేలసార్లు చదివే ఉంటారు. అయితే కొత్త సంగతి ఏమిటంటే... రన్నింగ్ లేదా జాగింగ్ వ్యాయామం ఆయుష్షును పెంచుతుందట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ దీర్ఘకాలిక అధ్యయనం కోసం వారు 440 మందిని ఎంపిక చేశారు. అందులో 50 ఏళ్లకు దరిదాపు వయసున్నవారిని ఎంపిక చేశారు. తాము ఎంపిక చేసిన వారిని 19 ఏళ్ళ పాటు పరిశీలించారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ అధ్యయనం లో తేలిన విషయం ఏమిటంటే... నిత్యం రన్నింగ్ లేదా జాగింగ్ చేసేవారిలో కేవలం 15 శాతం మంది మాత్రమే త్వరగా చనిపోయారు. అదే ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎలాంటి రన్నింగ్, జాగింగ్ చేయని వారిలో మాత్రం 34 శాతం మంది త్వరగా అకాల మరణం పాలయ్యారు. అంతేకాదు ఈ అధ్యయనంలోనే పరిశీలనకు వచ్చిన మరో అంశం ఏమిటంటే... వృద్ధులయ్యే కొద్దీ వచ్చే వైకల్యాలు రన్నింగ్ / జాగింగ్ చేసేవారిలో చాలా తక్కువగా ఉన్నాయట. అదే ఎలాంటి వ్యాయామం చేయనివారిలో అంగవైకల్యాలు వచ్చినవారు చాలామందే ఉన్నారట. అందుకే ఎలాంటి అంగవైకల్యాలూ లేకుండా సుదీర్ఘకాలం జీవించాలనుకునేవారు తప్పనిసరిగా రన్నింగ్ లేదా జాగింగ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

No comments: