సాధారణంగా వాతావరణ విషయంలో అన్ని కాలాల్లో కంటే చలికాలం అంటే చాలా మంది ఇష్టం ఎందుకంటే మరి కొద్దిసేపు ఎంచక్కా వెచ్చగా పడుకోవచ్చని. చలికాలంలో వీచే కఠినమైన చల్ల గాలుల వల్ల పడక మీద నుండి లేవబుద్ది కానీవ్వదు. మరి వాతావరణం చల్లగా చల్లగా ుంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ?ఎందుకేంటండి.... చాలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమ్ ను తినేయడమే కాదు మన శరీరం మీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది ప్రత్యేకంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. చలికాలం అనగానే ఓ వెరపు. బుగ్గలు ఎర్రగా అయిపోయి, పెదాలు, పాదాలు పగుళ్లు, చేతులు పొడిగా మారి, చర్మం చిట్లి... మొత్తానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, శిరోజాలకు ఎదుర్యే సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం..
చర్మ సంరక్షణ: ఈ కాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి. మీగడ ముఖానికి, చేతులకు రాసుకుని స్నానంచేయాలి. ఈ కాలంలో సబ్బుకన్నా సున్నిపిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసుకుని స్నానంచేయాలి. రాత్రి పడుకునేముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకుని పడుకోవాలి. లేదంటే కొబ్బరినూనె రాయాలి. ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్‌ప్యాక్‌లు పళ్ల మిశ్రమం వంటివైతే బెటర్. పగులుతున్నాయి కదాని పదేపదే పెదాలను తడి చేసుకోరాదు. పెదాలు పగలకుండా లిప్‌బామ్, విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకోబోయేముందు లోషన్ లేదా గ్లిజరిన్ రాసుకోవాలి. చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి.
ఎండనుండి: సన్‌స్క్రీన్ లోషన్స్ కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు. ఈ సమయంలోనూ అవసరమే! చలికాలంలో ఎండ చురుక్కు మంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అది వేడితో మరింత ఇబ్బందిపడుతుంది.
శిరోజాలు: ఈకాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్తపడాలి. హెయిర్ డ్రైయ్యర్ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది.
ఆహారం: చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్ పళ్లు తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి మరి! వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయటి నీళ్లు తాగడం వంటివి చలికాలం అనికాదు, ఏం కాలంలోనూ మంచిదికాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు.
దుస్తులు: చలి గాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తూ గ్లిజరిన్ సబ్బుకుగాని సున్నిపిండిని గానీ వాడాలి. చలికాలంలో సాధారణ సబ్బు వాడకం వలన ముఖం మీద చర్మం బిగుసుకుని బిరుసుగా గరుకుగా ఉంటుంది. అందువలన చలికాలములో సున్నిపిండి, కుంకుడుకాయలతో ఒళ్ళు రుద్దుకోవడం మంచిది.
పరిశుభ్రత: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెట్టర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చాలు... చలికాలం చలచల్లగా జారుకోడానికి!

No comments:
Post a Comment