all

Wednesday, November 28, 2012

చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవల్సిన 9 ఆహారాలు..

నవంబర్- డిసెంబర్ వచ్చిందంటే చాలు చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. మారిన రుతువుకనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే.. శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి. మరి ఈ వింటర్ డైయట్ కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి కొన్ని మీకోసం...

ఆరెంజ్: వింటర్ లో వీటి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్ ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం ఉండదు.


ఆకు కూరలు: ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా దొరికే గ్రీన్ వెజిటెబుల్స్ లో ఇదొకటి. అత్యధిక పోషకాలు కలిగినటువంటి ఆకుకూరలు, బచ్చలికూర, తోటకూర, మెంతి, పాలకూర వంటివి అధిక రుచిని అంధించడమే కాకుండా ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఆకుకూరలు తినడానికి బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా వండి తినడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా శరీరానికి అందుతాయి.


*వేరుశెనగలు: వేరుశెనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ ,పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి, లేదా వేయించినవి, లేదా ఉప్పుపట్టించినవి ఈ సీజన్ లో తినడం చాలా ఆరోగ్యకరం. ఇంకా వేరుశెనగపప్పుతో తయారు చేసిన చిక్కీలు బయటమార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటి తినడం వల్ల శరీరానిక కావల్సిన పోషకాలు అందుతాయి.

జామకాయ: జామపండును తినడం వల్ల జీవక్రియను మెరుగు పరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. పచ్చి జామకాయలో ఉన్న లైకోపిన్ అనే పదార్థం ధమని సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. పింక్ కలర్ లో ఉన్న జాపపండు, జ్యూసి జామపండ్లను వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికెంతో క్షేమం.



క్యారెట్స్: ఒకటి కంటే ఎక్కువ విటమిన్లు ఒక్క క్యారెట్లోనే ఉన్నాయి. అటువంటి క్యారెట్లను ప్రకృతి సహజసిద్దంగా మనకు అంధించడం బహుమతే అనుకోవాలి. ఎందుకంటే క్యారెట్లో శరీరానికి ఏఏ విటమిన్లు అవసరమో ఆ విటమిన్లు అన్నీ(విటమిన్ బి, సి, డి, ఇ మరియు కె)ఇందులో పుష్కలంగా ఉన్నాయి కెరోటిన్ విటమిన్ ఎ గా మార్చబడుతుంది. కాబట్టి క్యారెట్స్ ను వింటర్ డైయట్ లో ప్రధమ స్థానం కల్పించండి.


కివి పండ్లు: ఇదొక అసాధరన పండు. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఉప్పు చల్లిన ఈ కివి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది. అంతే కాకుండా ఈ కివి పండ్లను శీతాకాలంలో వివిధ రకాల సలాడ్లలో కలిపి తీసుకోవడం మరింత ఆరోగ్యధాయకం. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.



చికెన్ సూప్: ఈ వింటర్ లో సూప్స్ అంటే ఇష్టపడని వారుండరేమో. సూప్స్ రుచిగా మాత్రమే కాదు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది.


కోకో: కోకోగింజలతో తయారు చేసిన పొడిని, ఒక కప్పులో పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల అద్భుతమైన టేస్ట్ మాత్రమే కాదు వింటర్ డైయట్ తో శరీరంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఇంకా కోకోలో ఉన్న ఫ్లెవనాయిడ్ వల్ల హర్ట్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి భోజనంతో లేదా భోజనం తర్వాత కోకోను కొద్దిగా తాగడం ఆరోగ్యానికి మంచిది.
 


నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్: తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు నట్స్ ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్ లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.




శీతాకాలంలో ఇటువంటి ఆహారాలను మీ డైయట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ఆహారపదార్థాలను మిస్ కాకుండా తిని ఆరోగ్యంగా జీవించండి...

No comments: