all

Wednesday, November 28, 2012

క్యారెట్ ఓట్స్ తో ఫ్యాట్ లెస్ వింటర్ సూప్...

చలికాలం వచ్చేసింది. ఓ ప్రక్క చలి.. మరో ప్రక్క మంచు. శరీరాన్ని గజగజా వనికిస్తుంటే ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం ఆరోగ్యకరమైన సూప్స్ త్రాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. హెల్తీ సూప్స్ తాగడం వల్ల ఒత్తిడిని తగ్గించి హృదయాన్ని తేలికపరుస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఓట్స్ : 1/4cup
క్యారట్: 2
ఉల్లిపాయ: 1
వెన్న: 1tps
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1/2tsp
కొత్తిమిర తరుగు: 2tbsp
Healthy Winter Soup Carrot Oats Soup
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకగిన్నెలో రెండుకప్పుల నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి.
2. ఉడికించిన క్యారెట్, ఉల్లిపాయలు చల్లారాక గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో వెన్నవేసి వేడి చేసి అందులో ఓట్స్ వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత ఇందులో కప్పుడు నీళ్ళు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇందులో గ్రైండ్ చేసి వడగట్టి పెట్టుకొన్న క్యారెట్ రసం, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగించాలి. ఇందులో టమాటా లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అంతే ఈ విటర్ లో హెల్తీ క్యారెట్ ఓట్స్ సూప్ రెడీ...

No comments: