all

Wednesday, November 28, 2012

మంచి కొలెస్ట్రాల్ మనకు కావలసిందే...!

కొలెస్ట్రాల్ అనగానే అది చెడ్డదని, దాంతో అంతా నష్టమేననే అభిప్రాయం చాలామందిలో ఉంది. కొలెస్ట్రాల్‌లోనూ రెండు రకాలు ఉన్నాయి. అందులో చెడు కొలెస్ట్రాల్‌తో ఆరోగ్యానికి నష్టమే. అయితే శరీరానికీ, ఆరోగ్యానికీ మేలు చేసే కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు.

ఆరోగ్యం కోసం మంచి కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఆవశ్యకతపై ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌కు చెందిన చాలామంది పరిశోధకులు రీసెర్చ్ చేశారు. అందులోని చాలా అంశాలు ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. అందులోని వాస్తవాలు ఏమిటంటే... మన శరీరానికి అందాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగినంతగా అందనివారిలో 60 ఏళ్లు దాటాక వారికి మతిమరపు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మంచి కొలెస్ట్రాల్ తగ్గిన వారి మెదడులో జ్ఞాపకశక్తిని బ్లాక్ చేసే ఒకరకం గార (ప్లాక్) అభివృద్ధి చెందుతుందట. అది మెదడు కణాల్లో ఒక అడ్డంకిగా మారి జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందట. ఫలితంగా యుక్తవయసులో మంచి కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గిస్తే వారి వృద్ధాప్యంలో అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

ఇటీవల చాలామంది ఆహారంపైనా, ఆరోగ్యంపైనా చాలా ఎక్కువగా స్పృహ పెంచుకుని మంచి కొలెస్ట్రాల్‌ను కూడా తిరస్కరిస్తున్నారు. అందుకే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే కోడిగుడ్లలోని తెల్లసొన (ఎగ్ వైట్), చేపలు వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు సదరు అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు, న్యూట్రిషనిస్టులు.

No comments: