all

Tuesday, July 9, 2013

అందాన్ని మెరుగుపరిచే సహజ సౌందర్య సాధనాలు..!

స్త్రీకి అందం... ప్రకృతి నుంచి ప్రేయసి వరకు అన్నింటికీ ఇచ్చే కొలమానం. అందానికి ఉన్న ఆకర్షణ, ఆదరణ నేటి ఆధునిక యుగంలో ఇంతా అంతా కాదు. అందులోనూ స్త్రీ అందం ప్రాధాన్యత మరీ ఎక్కువ. ప్రకృతితో పోటీ పడే స్త్రీ అందానికి ఆధునిక మెరుగులు దిద్దితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే చాలా అందంగా ఉందికదూ! అలాంటి ఆధునిక మెరుగులు దిద్దేందుకు అవతరించినవే‘బ్యూటీ'పార్లర్‌లు.

ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైన ఈ బ్యూటీపార్లర్‌లు, ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి. దాంతో యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడి బ్యూటీపార్లలకు ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారు. అలాగే వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి.

సహజంగా సౌందర్యాన్ని సంరక్షించుకోవడం , ప్రస్తుత యాంత్రిక జీవితంలో కష్టమే అయిపొయింది. అయినా, మన ఇంట్లో ఉండే సహజ సౌందర్య సాధనాలే , మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తుల కన్నా మెరుగైన సౌందర్యం మనకు అందిస్తాయి అనేది , సౌందర్య నిపుణులు కూడా చెబుతూ వస్తున్న విషయం. మరి ఈ విషయాన్ని కనుక ఆచరణలో పెట్టదలిస్తే , కొన్ని సహజ సౌందర్య చిట్కాలు మీకోసం;

ప్రకృతి ప్రసాధించిన సహజ సౌందర్య సాధనాలు.!
ఆల్‌మండ్‌ నూనె: పొడిగా ఉన్న చర్మం గలవారు వాడితే మృదువుగా వుంటుంది. ఈ ఆయిల్‌ మొటిమలకు, మచ్చలకు సంజీవిలా పనిచేస్తుంది. ఆల్‌మండ్‌ పైభాగాన్ని బాగా దంచి కొద్దిగా నీరు కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే నిగ నిగలాడిపోతారు.



ఆపిల్‌: ఆపిల్‌లో సౌందర్య రహస్యం కూడా దాగివుంది. ఇది చర్మం పగుళ్లకు, చర్మంపై మంటలు, దురదలు లాంటి ఇబ్బందులు వున్నవారు ఈ గ్రీన్‌ ఆపిల్స్‌ జ్యూస్‌ రాస్తే సేద తీరుతారు. ముందు ముందు ఆ సమస్య దూరమౌతుంది.


ఆప్రికార్ట్స్‌: సూర్యరశ్మి వల్ల ముఖం నల్లబడినా, దురదలున్నా ఫ్రెష్‌గా వున్న ఆప్రికార్ట్స్‌ జ్యూస్‌ను రాయండి.


శెనగపిండి: మొటిమలున్నవారు, చర్మ సంబంధిత ఎలర్జీ గలవారు పెరుగుతో కలిపి పేస్ట్‌లా చేసుకోండి. పేస్ట్‌ చేసిన దాన్ని సమస్య వున్న చోట రాయండి. మంచి ఛాయ కోసం వాడేవారు నీటితో లేదా గ్లిజరిన్‌తో కలిపి రాసుకోండి.


దోసకాయ: ముఖంపై బొబ్బలు, దద్దుర్లు, పొక్కులకు దోసకాయ మహామందు. జ్యూస్‌ చేసి మృదువుగా రాసుకోండి. అంతకన్నా మృదువుగా మీ చర్మం మారుతుంది. ఇంకా బెటర్‌మెంట్‌ కోసం క్యారెట్‌, లెటూస్‌, అల్ఫా జ్యూస్‌లతో కూడా కలిపి వాడుకోవచ్చు.


మునగకాయలు: మునగ కాయ గింజలతో, ఆకులతో నిమ్మరం కలిపి పేస్ట్‌లా చేసి నల్లటి మచ్చలు, మొటిమలకు రాయటం ద్వారా చక్కటి గుణం వుంటుంది


మెంతులు: మెంతి ఆకులని, నీటిని కలిపి పేస్ట్‌లా చేయండి. దాన్ని రాత్రిపూట రాసుకొని, తిరిగి ఉదయం పూట వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై ముడుతలు తగ్గుతాయి. పొడిచర్మం మృదువుగా తయారవుతుంది. మెంతిగింజలను నీటిలో బాగా వుడకబెట్టి ఆపై పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించండం ద్వారా చక్కటి సౌందర్య ఫలితం కనిపిస్తుంది.


వెల్లుల్లి: మొటిమలున్నవారు పచ్చి వెల్లుల్లిని మృదువుగా, సుతారంగా రుద్దండి. ఎంతోకాలంగా పీడిస్తున్న మొటిమలు సమస్య తీరిపోతుంది. రెగ్యులర్‌గా చేయటం ద్వారా మచ్చలు, మొటిమలు కనిపించకుండా చేయవచ్చు. చర్మ సంబంధమైన సమస్యలున్నవారు, భోజనం చేసేటప్పుడు అన్నం ముద్దలో వెల్లుల్లిని పెట్టి మింగేయండి. చర్మంపై వున్న సమస్యలని లోపలినుంచి క్లియర్‌ చేస్తుంది.


తేనె: కొద్దిగా తేనెని నీటిలో బాగా కలపండి. శరీరంపై మచ్చలున్న దగ్గర రాయండి. మృదువుగా సుమా! దీనివల్ల చర్మం కాంతి వంతమవుతుంది. చక్కటి చర్మ నిగారింపుకు తేనె, పాలు, పెరుగు నువ్వుగింజల పిండి సమపాళ్లలో బాగా కలిపి మృదువుగా రాయండి.


నిమ్మరసం: చర్మ పగుళ్లను, మొటిమలు, మచ్చలను తరిమికొడుతుంది. గోరువెచ్చని వేడిపాలలో నిమ్మ పండురసం కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకోండి.


మామిడికాయలు: మామిడి ఆకులను, కాయ తొక్కలను బాగా వేడిచేసి చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత అనేక ఇన్‌ ఫెక్షన్స్‌ తగ్గిపోతాయి.


పుదీనా: మొటిమల నివారణకు, ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు దద్దుర్లు వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదురయినప్పుడు, చర్మ సంబంధమైన విషయాలకూ చాలా బాగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు పుదీనా రసం ముఖానికి రాసుకుంటే మంచి చక్కటి ఫలితం వస్తుంది. ముఖం లక్ష్మీదేవిలా కళకళలాడుతుంది. మీ సౌందర్య రహస్యం ఏమిటని పక్కవారు అడిగేలా వుంటారు.

వేపాకులు: వేపాకులు పదిరెబ్బలు తీసుకుని శుభ్రంగా కడిగి, బాగా నూరి ఉండలాగా చేసుకొని నీటితో మాత్ర వేసుకున్నట్టు వేసుకోండి. చర్మం లోపలి బాగాలు శుభ్రపడతాయి. కొంతమందికి నోటి దుర్వాసన వస్తుంది. అలాంటివారు తాజా వేపాకులను బాగా నలిమి మింగటం ద్వారా నోరు భాగమంతా ఫ్రెష్‌ అవుతుంది. ఆహ్లాదంగా వుంటుంది.

కమలాపండు: మొటిమలున్నవారు కమలా తొక్కలను ఎండబెట్టి బాగాపొడిచేసి తగినంత నీరు కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోండి. మొటిమల తీవ్రత మెల్లమెల్లగా తగ్గుతుంది.

బొప్పాయి: ఫ్రూట్‌ జ్యూస్‌ త్రాగే అలవాటు వున్నవారు హ్యాపిగా తాగండి. పచ్చిబొప్పాయి రసాన్ని, తోలు, గింజలతో కలిపి తీసిన జ్యూస్‌ని మచ్చలున్నవారు, మొటిమలున్నవారు, చర్మపు వాపులున్నవారు రాసుకోండి. తగ్గటంతోపాటు ముఖం మంచివన్నె వస్తుంది. ముఖకాంతి కోసం రాసుకునేవారు పచ్చి లేదా పండిన బొప్పాయిని మృదువుగా రాసుకోండి.

పైనాపిల్‌ :ఇది కూడా ఆపిల్‌లాగా శరీరంపై ముఖంపై ఏర్పడే చిన్నచిన్న సమస్యలు తీరుస్తుంది. జ్యూస్‌ ని రాసి బాగా ఆరాక మెత్తటి టవల్‌తో అద్దుతూ తుడవండి. పైనాపిల్‌ జ్యూస్ తాగటం ద్వారా, ముఖానికి రాసుకోవటం ద్వారా ముఖం మీద చిన్నచిన్న మచ్చలు కూడా కనిపించకుండా మాయమవుతాయి. పైనాపిల్‌ మధ్య భాగంతో ముఖంమీద ముడతలు వద్ద పదిహేను నిమిషాలు మృదువుగా రుద్దండి. ముఖంపై పగుళ్లు, మంటలు, కందిపోవటం లాంటి ఇబ్బందులున్న వారు ఈ రసాన్ని రాసు కోవటం ద్వారా ఉపశమనం కలుగుతుంది.


దానిమ్మపండు: ముందుగా దానిమ్మపండు తొక్కను ఎండబెట్టండి. ఆపై పొడిచేసి దానికి ఫ్రెష్‌ నిమ్మ పండురసాన్ని కలపండి. పేస్ట్‌లా చేసిన ఈ రెంటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించటం ద్వారా చాలా రకాల సమస్యలు తీరి అందంగా వుంటారు.

ముల్లంగి: ముందుగా ముల్లంగి గింజలను, నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోండి. నల్లటిమచ్చలు, మొటిమలకి బాగా పనిచేస్తుంది.

టమాటాలు: ఎర్రటి టమాటాలలోని గుజ్జుతో మొటిమలున్న చోట అప్లెయ్‌ చేయండి. పదిహేను నిమిషాలు వుంచి ఆపై చక్కగా శుభ్రంగా ముఖాన్ని వాష్‌ చేసుకోండి.

పసుపు: కంటిచుట్టూ వలయాలున్నవారు పైనాపిల్‌ జ్యూస్‌లో పసుపుని కలిపి పేస్ట్‌లా చేసి మృదువుగా సుతారంగా రాయండి. పసుపులో గోధుమపిండిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మసంబంధిత ఇన్‌ ఫెక్షన్‌లకు రాయటం ద్వారా చక్కటి గుణం కనిపిస్తుంది. ముడుతలున్నవారు వయస్సు పైబడ్డట్టు కనబడేవారు పసుపుని చెరుకురసంలో పేస్ట్‌లా కలుపుకొని రాసుకుంటే అందరిలో మీరే ఎట్రాక్షన్‌గా వుంటారు.

వాక్సింగ్ గురించి తప్పక తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు!

అవాంచిత జుట్టును తొలగించడానికి తాత్కాలిక పద్ధతి అత్యంత ప్రసిద్ధ వాక్సింగ్. ఇది కొత్త పద్ధతి కాదు; పురత ఈజిప్ట్ స్త్రీలు వికారమైన జుట్టును తొలగించడానికి చక్కర వాక్సుని ఉపయోగించే పురాతన పద్ధతి. షేవింగ్ లాకాకుండా, వాక్సింగ్ జుట్టు తిరిగి పెరగడానికి షుమారు మూడు నుండి ఎనిమిది వారాలు పడుతుంది, ఇది ఇతర పద్ధతుల విషయంలో కాదు.

వాక్సింగ్ (Waxing) అనేది వెంట్రుకలను మూలం నుంచి తొలగించే ఒక పాక్షిక-శాశ్వత రోమాల తొలగింపు పద్ధతి. వాక్స్ చేసిన (మైనంతో రోమాలు తొలగించిన) ప్రదేశంలో కొత్త రోమాలు రెండు నుంచి ఎనిమిది వారాల వరకు పెరగవు. కనుబొమలు, ముఖం, కాళ్లు, చేతులు, వీపు, ఉదరం మరియు పాదాలతో పాటు దాదాపుగా శరీరంలోని అన్ని ప్రదేశాల్లో వాక్స్ చేయడం ద్వారా రోమాలను తొలగించవచ్చు. అవాంఛిత రోమాలను తొలగించేందుకు అనుకూలంగా ఉండే అనేక రకాల వాక్సింగ్ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి.ఇతర మార్గాల్లో రోమాలు తొలగించడం కంటే వాక్సింగ్ ద్వారా రోమాలు తొలగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏక సమయంలో ఎక్కువ పరిమాణంలో రోమాలను తొలగించేందుకు ఇది ఒక సమర్థవంతమైన పద్ధతి.

ఈ పద్ధతి ఎక్కువకాలం కూడా మన్నుతుంది. వాక్స్ చేసిన ప్రదేశాల్లో రోమాలు రెండు నుంచి ఎనిమిది వారాల వరకు తిరిగి పెరగవు. రోమహారి క్రీము (డెపిలేటరీ క్రీమ్)తో రోమాలను షేవ్ చేసినప్పుడు లేదా తొలగించినప్పుడు, రోమాలు మూలం నుంచి కాకుండా, ఉపరితలంపై నుంచి తొలగించబడతాయి. కొద్ది రోజుల్లోనే, ఉపరితల భాగంలో తిరిగి రోమాలు కనిపిస్తాయి. ఈ పద్ధతులతో, తిరిగి పెరిగే రోమాలు కఠినత్వాన్ని, దృఢత్వాన్ని పొందుతాయి. అయితే మళ్లీమళ్లీ వాక్స్ చేసిన ప్రదేశాల్లో తిరిగి పెరిగే రోమాలు మాత్రం సుదీర్ఘకాలంపాటు మృదువుగానే ఉంటాయి.


గోరువెచ్చని లేదా వేడి వాక్సింగ్ - ఇది అత్యంత సాధారణమైన పద్ధతి, ఈ వాక్స్ సుగర్ కలిగిఉండడం వల్ల జుట్టును తేలికగా తొలగించవచ్చు. ఇది చల్లని వాక్సింగ్ కంటే ఎంతో ప్రభావంతమైన మార్గం, ఇది ఎక్కువగా పార్లర్ లలో వాడతారు.

చల్లని వాక్సింగ్ - ఈ వాక్స్ ఏదైనా మందుల దుకాణంలో లేదా కెమిస్ట్ షాపు వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతిని ఎక్కువమంది ఇంట్లోనే చేస్తారు.


వాక్సింగ్ జుట్టు పెరిగే దిక్కులో అవాంచిత జుట్టు ఉన్న ప్రదేశం పై వాక్స్ ని మందపాటి పొరలాగా పరుస్తారు. ఆ వాక్స్ పై గుడ్డ లేదా పేపర్ స్ట్రిప్ ని అడిమిపెడతారు, తరువాత ఆ స్ట్రిప్ ని జుట్టు పెరిగే దిక్కుకు వ్యతిరేక దిశలో వెంటనే లాగుతారు. దీనితో జుట్టుతో పాటు వాక్స్ కూడా తొలగి, చర్మం సున్నితంగా ఉంటుంది.



వాక్సింగ్ లో దశలు :చేతులు, కాళ్ళు, పొట్ట, పాదాల వాక్సింగ్ మూడిటికీ ఒకేవిధమైన క్రింది దశలను అనుసరించండి. *ఈ చర్మానికి సరిపోయే సరైన వాక్స్ ని కొనండి. సూచనల లేబుల్ ని గమనించండి. *సూచనల ప్రకారం వాక్స్ ని వేడి చేయండి (ఎక్కువ వేడిగా ఉండకూడదు, దానివల్ల చర్మం కాలుతుంది).


*వాక్స్ అప్ప్లై చేసేముందు మీ కాళ్ళను శుభ్రంచేసి, పొడిగా ఉంచుకోండి. *తరువాత, వాక్స్ చల్లబడే లోపు అప్ప్లై చేయండి (అది గోరువెచ్చగా ఉండాలి), జుట్టు పెరిగే దిశలో అప్ప్లై చేయండి. *ఇప్పుడు, కాటన్ క్లాత్ లేదా పేపర్ స్ట్రిప్ ని వాక్స్ పై అదిమి ఉంచండి, వాక్స్ కొంచెం చల్లబడే వరకు వదిలేయండి. *తరువాత, మీ జుట్టు పెరిగిన వ్యతిరేక దిశలో ఆ పేపర్ స్ట్రిప్ లేదా వాక్సింగ్ క్లాత్ ని వెంటనే లాగండి. దానిని నేరుగా లాగకండి మరింత నొప్పి పుడుతుంది.


*విశ్రాంతి కోసం వాక్స్ ప్రాంతంలో తడిబట్టను ఉంచండి. *మీ కాళ్ళు లేదా పదాలు లేదా పొట్ట లేదా చేతులు పూర్తిగా అయ్యేవరకు వాక్స్ ని అప్ప్లై చేయడం, విశ్రాంతి కోసం తడిబట్టను ఉంచడం ఇదే విధానాన్ని అనుసరించండి. *దాన్ని తొలగించిన తరువాత సున్నితమైన క్రీముని లేదా మాయిశ్చరైజ్ క్రీమ్ ని రాయండి. ఫేస్, కనుబొమల వాక్సింగ్ వంటి ఇతర వాక్సింగ్ లని నిపుణులతో చేయించుకోవడం మంచిది. ఇంట్లో ప్రయత్నించడం మంచిది కాదు.


హెచ్చరిక : *మధుమేహంతో బాధపడేవారు, రక్తప్రసరణ తక్కువగా ఉన్నవారు, ఈ విధానాన్ని అనుసరించ వద్దని సలహా.*రేటిన్-ఏ, రేనోవ, డిఫెరిన్, ఐసోట్రేటినోయిన్ తీసుకునే వ్యక్తులు ఈ విధానాన్ని ఎన్నుకోవద్దని సూచన. *పులిపిర్లు, మొటిమలు, పుట్టుమచ్చలు, దద్దుర్లు లేదా సూర్యరస్మి నుండి బాధపడే వారు ప్రభావిత ప్రాంతంలో వాక్స్ ను అప్ప్లై చేయవద్దు. *పగిలిన చర్మం లేదా అనారోగ్య సిరాలపై వాక్స్ అప్ప్లై చేయరాదు.



ప్రయోజనాలు :వాక్సింగ్ చేయించుకున్న తరువాత జుట్టు పెరగడానికి షుమారు మూడు నుండి ఎనిమిది వారాలు పడుతుంది, కొత్త జుట్టు సున్నితంగా ఉంటుంది, ఈ పద్ధతి ఇంకా దేనిలో లేదు.

*షేవింగ్ లాంటి ఇతర విధానాలతో పోల్చుకుంటే, వాక్సింగ్ వల్ల ఎటువంటి కోతలు ఉండవు. *అవాంచిత జుట్టును తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది, చర్మం పైఉన్న డెడ్ సేల్స్ ని కూడా తొలగిస్తుంది.



లోపాలు :*జుట్టు తొలగించడానికి ఇది ఒక తాత్కాలిక పద్ధతి, శాశ్వత విధానం కాదు. *చర్మం నుండి కాటన్ స్ట్రిప్ తొలగించేటపుడు నొప్పి పుడుతుంది. *షేవింగ్ లాంటి ఇతర పద్ధతులతో పోలిస్తే, వాక్సింగ్ కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది.

జిడ్డు-ఆయిల్ చర్మం కలవారికి సింపుల్ మేకప్ టిప్స్

సాధారణంగా మేకప్ వేసుకొనే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నారు. మేకప్ ను గతంలో ఏ ఫంక్షల్లో, పార్టీలో లేదా శుభకార్యాలకు వేసుకొనే వారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి రోజూ కూడా మేకప్ వేసుకొనే వారు ఉన్నారు. అయితే రెగ్యులర్ మేకప్ వేసుకొనే వారికి మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుందా? లేదా మేకప్ ఎటువంటి చర్మ తత్వం గలవారు వేసుకోవాలి? అనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా పొడి చర్మం గల వారికి మేకప్ తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆయిల్ స్కిన్ ఉన్నవారు మేకప్ వేయడం నివారిస్తున్నారా? మనలో చాలా మంది జిడ్డు చర్మం కలిగి ఉన్నారు.


వారు మేకప్ వేసుకోవడం వల్ల భయంకరంగా కనబడుతుంది. అది మనం జిడ్డు చర్మం గలవారు మేకప్ వేసుకుంటే ఎలా ఉంటారన్నది పనిచేసే కార్యాలయాలు, లేదా ఇంటి వద్ద లేదా ఎక్కైనా గమనిస్తే తెలిసిపోతుంది. మరి అందుకు మీరు ఆందోలన పడవల్సిన అవసరం లేదు. ఈ సమస్యను వదిలించుకోవటం కోసం కొన్ని మార్గాలున్నాయి. అవి ఈ సమస్యను తొలగించడానికి బాగా సహాయపడుతాయి.

జిడ్డు చర్మం కలవారికి,మార్కెట్లో కావల్సినన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ను ఎంపికచేసుకొనటప్పుడు, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. మన్నికైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే మీ చర్మ సౌందర్యానికి ఎక్స్ ట్రా కేర్ చాల అవసరం. కాబట్టి, అందం, మేకప్ విషయంలో ఎల్లప్పుడు మన్నికైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకొని, క్రింది విధంగా అప్లై చేయాలి...



మేకప్ కు ప్రధానంగా చేయవల్సిన మొదటి పని ఇది. మేకప్ వేసుకొనే ముందు ముఖాన్ని మంచి నీళ్ళతో శుభ్రంగా కడగాలి. తర్వాత క్లెన్సర్ ను ఉపయోగించడం వల్ల ముఖ చర్మం ప్రక్షాళన చేయబడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ఒక మంచి స్ర్కబ్ బాగా సహాయపడుతుంది. అందుకు మీరు హోం మేడ్ స్ర్కబ్ ను ఉపయోగించవచ్చు.


ముఖం మీద మేకప్ అప్లై చేసే ముందు, ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ను చిలకరించాలి. దీన్ని మీరు ముఖం శుభ్రం చేసిన 5నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో దాగి ఉన్న అదనపు జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది.


మీ చర్మం ఆరోగ్యంగా మరియు తేమగా ఉంచడానికి మంచి మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాలి. మేకప్ ను వేసుకోవడానికి ముందు మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. మరియు మేకప్ తర్వాత ఫర్ ఫెక్ట్ లుక్ ను అంధిస్తుంది. ఎప్పుడూ ఆయిల్ ఫ్రీ లేదా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి.



మంచి మన్నికైన ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ ను తీసుకొని చర్మానికి అప్లై చేయాలి. దీని వల్ల ముఖం మీద నునుపుగా కనిపిస్తుంది. మంచి ఫలితం కోసం ఈ ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ కు మాయిశ్చరైజర్ ను మిక్స్ చేసి, చేతివేళ్ళ, తర్వాత అరచేత్తో తర్వాత బ్రెష్ ను ఉపయోగించి ముఖం మీద అప్లై చేసుకోవచ్చు.



ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత 5-10నిముషాలు అలాగే ఉండాలి. ఫౌండేషన్ బాగా ఆరిన తర్వాత, ట్రాన్స్ లూసెంట్ పౌండర్ ను అప్లై చేయాలి. తర్వాత బ్రష్ ఉపయోగించి సరి చేసుకోవాలి . బుగ్గులు మరియు నుదుటిపైన మరియు ముక్కు మీద హైలైట్ అయ్యేలా వేసుకోవాలి. మరియు మీ వేసుకొనే ఫౌండేషన్ కు సరిపడే లైట్ పౌడర్ షేడ్ ను ఎంపిక చేసుకోవాలి.


మీ స్కిన్ టోన్ కు నప్పే కన్సీలర్ ను కొనుగోలు చేయాలి. దీన్ని మీ చర్మం ఎక్కడైన ఎర్రగా లేదా blemishes ఉన్న చోట కన్సీలర్ ను అప్లై చేయాలి. మీ కళ్ళ క్రింద దీన్ని అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ను కనబడనియ్యకుండా చేయడానికి సహాయపడుతుంది.


ఆయిట్ బ్లోటింగ్ షీట్(ముఖం మీద ఏర్పడ్డ జిడ్డు మరియు నూనెను గ్రహించివేసే షీట్స్)ఎప్పుడూ మీ వెంట తీసుకెళ్ళాలి. ఇవి చర్మంలో ఏర్పడ్డ ఆయిల్ ను తొలగించడానికి చాలా సులభమైన పద్దతి. ఇది చాలా సులభంగా ఏ మందుల షాపు/దుకాణంలో అందుబాటులో లభిస్తుంది.

ఏడడుగులకు ముందే...కలిసి నడిచారు

 
     
జస్ట్ మ్యారీడ్ కొండపల్లి బొమ్మల్లా ఉన్నారు!
వీళ్లేం చెప్తారు భార్యాభర్తల అనుబంధం గురించి?
ఒక కష్టమా? ఒక నిష్టూరమా?
ఒక పోట్లాటా? ఒక మాట్లాటా?
ఈ ఏడాదిన్నరలో మిస్టర్ - మిసెస్ ఆర్యన్‌ల మధ్య
ఇవేమీ లేకపోవచ్చు... కానీ...
వీటన్నిటినీ ఓర్చుకోగలిగిన స్థాయికి
ఏడడుగులకు ముందే రీచ్ అయ్యారు!
పెళ్లి కుదిర్చి చూడకుండా వెళ్లిపోయిన తండ్రి...
కోలుకోలేని దుఃఖంలో పడిపోయిన ఆర్యన్...
నేనున్నాను కదా అని నిలబడ్డ అమ్మాయి...
ఇలా... ముడులు పడకుండానే బలపడిన
దాంపత్యబంధమే... ఈవారం ‘మనసే జతగా’

ఆర్యన్‌రాజేష్ సినీనటుడు. దర్శక నిర్మాత ఇవివి సత్యనారాయణ పెద్దకుమారుడు. తెలుగు, తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన భార్య సుభాషిణి. తమ దాంపత్యబంధం గురించి వారిద్దరూ ముచ్చటిస్తూ... ‘‘ఆలుమగల మధ్య దాపరికాలు ఉండకూడదు. తప్పో ఒప్పో ఏదైనా సరే జీవితభాగస్వామి దగ్గర మనస్పూర్తిగా మాట్లాడగలగాలి. నిజాయితీగా ఉండాలి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోగలిగితేనే ఆ దాంపత్యబంధం సంతోషంగా, చూపరులకు ఆదర్శంగా ఉంటుంది. ఈ మాటలు చెప్పడమే కాదు, ఆచరణలో పెడుతున్నాం’’ అని తెలిపారు. ఈ జంట వైవాహిక జీవితంలోకి (ఫిబ్రవరి 11, 2012) అడుగుపెట్టి ఏడాదిన్నర పూర్తయ్యింది. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బాధ్యతలను పంచుకుంటున్న ఈ జంట చెబుతున్న మరిన్ని విషయాలు...

పెళ్లి చూపుల్లో ఆకట్టుకున్న ఆత్మీయత
ఆ.రాజేష్: నాన్నగారు ఉన్నప్పుడే ఆయన స్నేహితుని కూతురైన సుభాషిణిని చూసి, నాకు ఆ ఫొటో చూపించారు. నచ్చలేదన్నాను. నేరుగా చూస్తే తెలుస్తుందన్నారు నాన్నగారు. అలా సుభాషిణిని కడి యం దగ్గర (రాజమండ్రి) జేగురుపాడులోని వారి ఇంట్లో పెళ్లిచూపుల్లో చూశాను. ఫొటోకి, తనకు అస్సలు పోలికే లేదు. నాన్న చెప్పినట్టు అమ్మాయి నిజంగా చాలా బావుందనుకున్నాను. అక్కడే కాసేపు మేం మాట్లాడుకునే అవ కాశం దొరికింది. అయితే ఒకరినొకరు పరిచయం చేసుకోవడం మాత్రమే కుదిరింది. కాని ఆ క్షణాల్లోనే ఏదో ఆత్మీయబంధం మా ఇద్దరి మధ్య ఏర్పడిందనిపించింది. నేను సింపుల్‌గా ఉంటాను. ఆనందంగా ఉండటాన్ని ఇష్టపడతాను. నా మనస్తత్వం ప్రకారం... కుటుంబాన్ని, నన్ను ఇష్టపడే అమ్మాయి కావాలనుకున్నాను. సుభాషిణిలో ఆ లక్షణాలు చూశాను.

సుభాషిణి: ఎం.బి.ఏ చేసిన నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వ్యక్తిని పెళ్లిచేసుకుంటానేమో అనుకున్నాను. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని అస్సలు అనుకోలేదు. అయితే నన్ను కట్టుకోబోయేవాడికి మద్యం, సిగరెట్ అలవాట్లు మాత్రం ఉండకూడదని గట్టిగా అనుకున్నాను. అవి ఉంటే అస్సలు చేసుకోనని మా నాన్నకు ముందే చెప్పాను. అప్పటికే ఈయన మంచితనం, ఏ అలవాట్లు లేకపోవడం గురించి నాన్న నాకు చెప్పారు. మా బంధువుల్లోనూ వీరి బంధువులు ఉన్నారు. వారి ద్వారా వీరి కుటుంబం గురించి అప్పటికే విన్నాను. పెళ్లిచూపుల నాడే... ఈయన మాటతీరు, పెద్దలకు ఇచ్చే గౌరవం నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

పెద్దలు తమ పిల్లల బాగోగుల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవారే! కాని పెళ్లిపేరుతో నూరేళ్లూ కలిసి జీవించే అబ్బాయి, అమ్మాయి ఆలోచనలూ తెలుసుకోవాలి. ఆ అవకాశాన్ని పెద్దలు ఆర్యన్‌రాజేష్, సుభాషిణిలకు కల్పించారు. పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే పెళ్లికుమారుడి తండ్రి అనారోగ్య కారణంగా కుమారుడి పెళ్లి కాకముందే మరణించారు. ఆయన మరణం వీరి బంధంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటుంది?

ఏర్పడిన మానసిక బంధం
ఆ.రాజేష్: జనవరి 5న పెళ్లిచూపులు జరిగాయి. అప్పటికే నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. జనవరి 11న ఆయన మరణించారు. ఆ దుఃఖంనుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయమే పట్టింది. ఆ సమయంలో సుభాషిణి... అత్తయ్యను, మన కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటానని చెప్పింది. ఇంకా మా మధ్య పెళ్లి బంధం ఏర్పడకుండానే మా కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది. సంతోషంలోనే కాదు కష్టంలోనూ నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించేవ్యక్తి అని అర్థమైంది.
సుఖాలు కాదు కష్టాలే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పునాదిరాళ్లుగా మారుతాయి. ఆ సమయంలో అండగా ఉంటానన్న భరోసా ఆ వ్యక్తుల మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుంది. మనస్ఫూర్తిగా ఇచ్చే ఆలంబన ఇరుహృదయాలను కట్టిపడేస్తుంది. కలిసి జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని ఒంటపట్టించుకోవాల్సిందేనని వీరి మాటల్లో స్పష్టమవుతుంది.

అరమరికలే ఉండవ
ఆ.రాజేష్: మా అమ్మగారు, సుభాషిణి తెగ కబుర్లు చెప్పుకుంటారు. అంతసేపు ఏం కబుర్లు ఉంటాయని అడిగితే ‘అత్తా-కోడళ్ల మధ్య ఉండే సఖ్యత కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది’ అని అంటుంటే ఆనందంగా అనిపిస్తుంటుంది. సుభాషిణి నా కంటే ఆరేళ్లు చిన్నది. కాని మెచ్యూరిటీ పరంగా నాతో ఈక్వల్‌గా ఉంటుంది. సుబ్బూ, సుబ్బి అని ఆటపట్టిస్తుంటాను. నన్ను రాజేష్ అని పిలవమని చెబుతుంటాను. కాని అలా పిలవదు. మా మధ్య చిన్న చిన్న అలకలు, బుజ్జగింపులు మామూలే! కాని అబద్ధాలకు మాత్రం తావుండదు. ఆనందానికి అవరోధం కలిగించే విషయాలేవీ మా మధ్య చోటుచేసుకునే అవకాశాలు కల్పించను.
సుభాషిణి: మా పుట్టింట్లో ఈయన మా అన్నయ్యలాగే బాగా కలిసిపోతారు. అల్లుడిగా ప్రత్యేక మర్యాదలు చేయనివ్వరు. మా అమ్మ ‘మా అల్లుడు బాగా కలిసిపోతాడు! మేము చాలా అదృష్టవంతులం!’ అంటుంటారు.

ఈయన నటించిన ‘లీలామహల్ సెంటర్’ సినిమా నాకు బాగా ఇష్టం. ఆ సినిమా చాలా సార్లు చూశాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ ఈయనకు ఏదో సందర్భంలో చెబుతూనే ఉంటాను. అన్నీ ఓపిగ్గా వింటారు. వాకింగ్ చేస్తారే తప్ప జిమ్‌కి వెళ్లరు. ఇంకా టైమ్ ఉందిలే అని చెబుతుంటారు. కాని నేనే ఊరుకోను. చిన్న చిన్న విషయాలకు ఎంత త్వరగా కోపం వస్తుందో, అంతే త్వరగా కూల్ అయిపోతుంటాం.

ఫీల్‌గుడ్
ఆ.రాజేష్: పెళ్లయిన కొద్దినెలల వ్యవధిలోనే సినిమా వర్క్‌లో ఉన్నాను. ఉదయాన్నే పేపర్లలో హీరోయిన్‌తో కలిసి ఉన్న సినిమా యాడ్ చూసినా, పోస్టర్స్ చూసినా సుభాషిణి ముఖం మాడ్చుకోవడం గమనించాను. ‘అలాగ ఎందుకు ఉండాలి? ఇలా ఎందుకు ఉండాలి?’ అనేది. నాకు నచ్చిన ఫీల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులోని సాధకబాధకాలు తనూ అర్థం చేసుకోవాలని షూటింగ్స్‌కి తీసుకెళ్లాను. అక్కడ అందరూ ఎంత హార్డ్‌వర్క్ చేస్తారో కళ్లారా చూసి తెలుసుకుంది. తనకు ఇండస్ట్రీ గురించీ, నా గురించీ ఇంకాస్త అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు తనే కొత్త సినిమాల గురించి అడిగి తెలుసుకుంటుంది.
సుభాషిణి: పెళ్లికిముందు నాతో చాలామంది ‘సినిమా హీరోలు హీరోయిన్స్‌తో క్లోజ్‌గా ఉంటారు, నీకు ఓకేనా!’ అని అడిగేవారు. ‘అది సినిమా వరకే’ అని చెప్పేదాన్ని. సినిమాను సినిమాలాగే చూడటం మొదలుపెట్టాక నా ఆలోచనల్లో మార్పు వచ్చింది.
ఎవరికి వారు ఆనందంగా ఉండాలనే కాదు, తన జీవితంలోకి అడుగుపెట్టిన జీవిత భాగస్వామికీ ఆనందం పంచాలన్న భావన ఇద్దరిలోనూ ఉండాలి. వృత్తిపరంగానే కాదు జీవనగమనంలో ఏ చిన్న అరమరికలకూ తావు ఇవ్వకుండా, మనసులు కలిసి ప్రయాణించాలని ఈ జంట స్పష్టం చేసింది.

అందమె ఆనందం

 
     
టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే నల్ల మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.