all

Wednesday, December 12, 2012

గుడ్ లుకింగ్

 
నా వయసు 19. నేను చామనచాయగా ఉంటాను. జిడ్డు చర్మం. ఈ మధ్య నా ముఖం నల్లగా తయారైంది. నేను ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వాడను. ఇవి లేకుండా ముఖసౌందర్యాన్ని కాపాడుకోలేమా? సలహా ఇవ్వగలరు.
- సంజన, ఈమెయిల్


చాలామంది కాస్మొటిక్స్ అంటే సౌందర్య ఉత్పత్తులు వాడితేనే చర్మం కాంతివంతం అవుతుందనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఎండ, దుమ్ము, కాలుష్యం వంటి రకరకాల కారణాల వల్ల మీ ముఖ చర్మం నల్లగా అయింది. ఇంట్లో చేసుకోదగిన పద్ధతుల వల్ల నలుపు పోదు. సౌందర్యనిపుణుల వద్ద సరైన చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాత వారు ఇచ్చిన సూచనలు పాటించండి.

నా వయసు 21. నా జుట్టు బాగా పొడిబారి, జీవం లేనట్టుగా తయారైంది. వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. కొసలు మరీ ఎక్కువగా చిట్లుతున్నాయి. వీటి నివారణకు ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి.
- బి.శశి, ఈమెయిల్


శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చలికాలంలో మాడు, శిరోజాలు మరింత పొడిబారుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. కలపతో తయారు చేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను తల దువ్వుకోవడానికి వాడండి. మాడు నుంచి, కిందివరకు చిక్కులు లేకుండా దువ్వండి. దీనివల్ల మాడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. లోహంతో తయారైన హెయిర్‌పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు (మాడుకు కాకుండా) ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి.

నా వయసు 22. నాకు ముక్కుపైన మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంది. మొటిమల లోపల పస్ ఉంటుంది. బాగా నొప్పిగా అనిపిస్తాయి. మచ్చలు కూడా ఉన్నాయి. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? మొటిమలు కేవలం ముక్కుపైనే అవడానికి కారణం ఏంటి?
- భాగ్యశ్రీజక్కుల, ఈమెయిల్


మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువగా స్రవిస్తున్నాయి. శుభ్రపరచుకోకపోవడం వల్ల మురికి పేరుకుపోయి, మొటిమల సమస్య పెరుగుతోంది. ముక్కు జిడ్డుగా అనిపించినప్పుడల్లా ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచు కోండి. చేత్తో ముక్కును రుద్దకుండా టిష్యూపేపర్‌ని ఉపయోగించండి. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్‌లో డెర్మలాజికల్ స్పా రెమిడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి. సమస్య తగ్గుతుంది.

చీరకట్టు మేడీజీ........ఫ్యాషన్

 
 
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు.
తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు.
తెలుగింటి సింగారాలు... సిరులొలికించే చీరలు.
వేడుక ఏదైనా... వేదిక ఏదైనా...
తెలుగింటి గుమ్మానికి తోరణపు కళ తెచ్చి
ఆనందాల వెల్లువను ఎద నిండా నింపేవి కోటి వరాల చీరలు.
‘చీరకట్టుకోవాలా...! నాకు రాదు’ అనే నేటితరం అమ్మాయిల నోట‘చీరకట్టుకోవడం అంటే ఇంత ఈజీనా!’
అనిపించే రెడీమేడ్ చీరలు ఈవారం...


1- పచ్చ, గోధుమరంగుల కలయికతో రూపుదిద్దుకున్న ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఇది. బెనారస్, జార్జెట్‌తో ఈ చీరకు కొత్త వన్నెలు అద్దారు. మెరూన్, వెల్వెట్ రంగుల్లో మెరిసిపోతున్న పువ్వుల ప్యాచ్‌లు ఈ చీరకు ఆకర్షణీయంగా మార్చాయి.

2- ఎరుపు, పసుపు, పచ్చరంగుల్లో మెరిసిపోతున్న రెడీమేడ్ నెట్ శారీ ఇది. వెల్వెట్ బార్డర్, కుందన్ మెరుపులు, పువ్వుల డిజైన్.. చూపు తిప్పుకోనివ్వని అందాన్ని ఈ చీరకు తీసుకువచ్చాయి. ఫిష్ కట్ , గ్రీన్ కలర్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఈ చీరను ప్రత్యేకంగా చూపుతున్నాయి.

3- గులాబీ, పచ్చ, వంగపండు రంగుల నెటెడ్ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన మయూరపు రెడీమేడ్ చీర ఇది. వంగపండు రంగు బార్డర్, పువ్వుల ప్యాచ్‌వర్క్ చేసిన ఈ చీర వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.


4-నీలాకాశాన్ని వంచి ఎరుపు, మెరుపులను అద్దినట్టున్నది ఈ నెటెడ్ రెడీమేడ్ చీర. కుందన్, జర్దోసీ పనితనం ఈ చీరను ఆకర్షణీయంగా మార్చాయి.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి - కార్న్ పన్నీర్ ఉప్మా

ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మా చాలా ప్రసిద్ది. అతి తక్కువ సమయంలో తయారైపోవు బ్రేక్ ఫాస్ట్ ఉప్మా. సాధారణంగా ఉప్మాను ప్లెయిన్ గా ఎప్పుడూ వండుతుంటారు. అప్పుడప్పుడు కొన్ని వెజిటేబుల్ వేసి తయారు చేసుకొంటుంటారు. మరికొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ సీజన్ లో దొరికే కార్న్ తోటి ఉప్మా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మరియు ఆరోగ్యం కూడా.. పన్నీర్ చేర్చడం వల్ల టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మరి మీరూ తయారు చేసి చూడండి...

corn paneer upma breakfast

కావల్సిన పదార్థాలు:

మొక్కజొన్నవిత్తనాలు(కార్న్): 1/2 cup
క్యాప్సికమ్: 1/2 (chopped)
క్యారెట్: 1 (chopped)
పచ్చిమిర్చి: 2 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
రవ్వ: 1 cup
పన్నీర్: 50 grams (grated)
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నెయ్యి: 1tbsp
నూనె: 1tbsp
టమోటో: 1 (chopped)
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. అందులో క్యారెట్, క్యాప్సికమ్, మొక్కజొన్నవిత్తనాలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.
2. తర్వాత అందులో ఉప్పు వేసి ఐదు నిముషాల పాటు ఉడికించాలి.
3. అవి ఉడికేలోపు మరో పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో రవ్వ వేసి తక్కువ మంట మీద వేయించి పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి.
5. ఇప్పుడు అందులో పన్నీర్ తురుమును కూడా వేసి, మరో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
6. పన్నీర్ తురుము వేగి బ్రౌన్ కలర్ లోని వచ్చిన తర్వాత అందులో ఉడికించిన కూరగాయలు, నీటితో సహా వంపుకోవాలి. ఫ్రై చేస్తున్న మిశ్రమాన్ని వెజిటేబుల్స్ ను బాగా మిక్స్ చేసి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి.
7. ఉప్మా తయారయ్యేంత వరకూ మీడియం మంట మీద ఉడికిస్తూ మద్య మద్యలో కలుపూతూ ఉండాలి. చివరగా కొత్తిమీర గరుగు, టమోటో ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే కార్న్ పన్నీర్ ఉప్మా రెడీ..

సింపుల్ మరియు టేస్టీ క్యారెట్ గీ రైస్

సాధారణంగా క్యారెట్ తో రకరకాల వంటలు వండుతుంటారు. స్వీట్స్ గాను, కర్రీస్ గా, వెజిటేబుల్స్ సూప్స్, వెజిటేబుల్ పలావ్, సలాడ్స్, రైతా ఇలా అన్నీంటిలోకి నేనున్నాంటూ ముందుంటుంది క్యారెట్. టేస్ట్ పరంగానే కాదు.. ఆరోగ్య పరంగాను చాలా మంచిది. కాబట్టి క్యారెట్ ను ఏదో ఒక రకంగా ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రొటీన్ ఫుడ్ తో బోరుకొడున్నా... పిల్లలు తినమని మారాం చేస్తున్నా ఇలాంటి కలర్ ఫుల్ ఫుడ్ ను వారి ముందు ఉంచడి చాలు. ప్లేటు కాలీ అవ్వాల్సిందే. కొంచెం కారంగా.. కొంచెం తియ్యగా ఉండే ఈ క్యారెట్ గీ రైస్ కు జీడిపప్పు గార్నిష్ చేయడంతో మరింత టేస్టీగా తయారవుతుంది. మరి ఇంకెదుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి...

కావలసిన పదార్థాలు:

బాస్మతి రైస్: 2cups
క్యారెట్: 2-3(తురుముకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్నగా కట్ చేసుకోవాలి)
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
యాలకులు: 2
బిర్యానీ ఆకు: చిన్నది
గరం మసాలా: 1tsp
కొత్తిమీర పేస్ట్: 1tbsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 4tbsp
జీడిపప్పు పలుకలు: కొద్దిగా

Ghee Rice With Carrot Recipe

తయారు చేయు విధానం:
1. ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రం చేసుకొని, పొడిపొడి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, యాలకుల, బిర్యానీ ఆకు వేసి అన్నింటిని దోరగా వేయించుకోవాలి.
3. తర్వాత అందులో క్యారెట్ తురుము వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. క్యారెట్ కొద్దిగా మెత్తగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు మీడియం మంట మీద వేయించాలి.5. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. రుచి చూసి ఉప్పు సరిచేసుకొని చివరగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి వేడి వేడి గా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ గీ రైస్ రెడీ

 

మీరు గర్భవతి అని కుటుంబానికి చెప్పడానికి కొన్ని సరదా మార్గాలు!!

మీరు గర్భం ధరించారని తెలియగానే మీరు ఈ వార్త మీ భర్త తర్వాత మీ కుటుంబసభ్యులకు సాధ్యమైనంత త్వరగా చెప్పడానికి చాలా ఉత్సాహంగా వుంటారు. కానీ అందరికి చెప్పే ముందు ఈ వార్త ఎలా చెప్పాలా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఎలా చెప్తే వారు సంతోషిస్తారు. అని మీరు మనస్సులో రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఏదో ఒక రకంగా వారి సంతోషపరచడానికి సమయం సందర్భాన్ని చూసి చెప్పాలనుకుంటారు. ఆ సంతోష క్షణాలను మీరు కూడా ఆస్వాధించాలనుకుంటారు. కాబట్టి ఇలాంటి సంతోషకరమైన వార్తలు చెప్పే ముందు కొన్ని చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మీ పార్ట్నర్ తో పాటు మీరు, మీకుంటుంబ సభ్యులు సంతోషంగా గడుపగలుగుతారు.
fun ways tell family you re pregnant

మీరు గర్భవతి అని ఎప్పుడు చెప్పాలి ?

గర్భధారణ జరిగి మూడు నెలలు గడిచేదాకా తాము త్వరలో తల్లిదండ్రులం అవుతున్నట్టు కుటుంబానికి, స్నేహితులకు చెప్పడానికి ఆగుతారు. ఏమి జరిగినా వాళ్ళు తమ ఆనందాన్ని పంచుకుని, అవసరమైన సహాయం చేస్తారనే ఉద్దేశ్యంతో మరికొందరు ఈ సమాచారం తెలియగానే అందరికీ చెప్పాలని అనుకుంటారు. అదెలాగో చూద్దాం...

1. పసి వారికి పెట్టె ఆహారం వండండి: పసి వారికి చేసినట్టు చిన్న చిన్న వాటితో కుటుంబానికి భోజనం వండి తెలియచేయ్యడం ఒక సరదా ఆలోచన. దీంట్లో బేబీ కారెట్లు, బేబీ పక్కటెముకలు, పిల్లల కప్పులలో ఆపిల్ జ్యూస్ లాంటివి చేయవచ్చు. దీంట్లోని భావాన్ని మీ కుటుంబ సభ్యులు పసిగట్టారేమో చూడండి. లేదంటే, ఆ విషయం వారి దృష్టికి తెచ్చి వారి మొహాల్లో ఆ విషయం అర్థమైన సంగతి తెలిసేదాకా వేచి వుండండి.

2. మీ ప్రకటనను చాయాచిత్రంగా తీయండి: కుటుంబ సభ్యులు కలిసినప్పుడు, అందరినీ గ్రూప్ ఫోటో దిగమని మీరు గానీ మీ భాగస్వామి కానీ అడగాలి. ఫోటో కోసం అందరూ సిద్ధం కాగానే, ఫోటో తీసేవారు గర్భం ధరించిన విషయాన్ని బిగ్గరగా ప్రకటించాలి. అలా చెప్పగానే ఆశ్చర్యపోయిన వారి హావభావాలను అమూల్యమైన ఛాయాచిత్రంగా తీయ౦డి.

3. మీ గర్భధారణ ప్రకటనతో టీ-షర్టులు ఇవ్వండి: ఇదే తోలి గర్భం అయ్యి, తొలిచూలు మనవడు / మేనగోడలు / మేనల్లుడు ఐతే ఈ ఆలోచన ప్రత్యేకంగా సరదాగా వుంటుంది. అందరినీ భోజనానికి కూర్చోమని - ‘అమ్మమ్మ', ‘బాబాయి', ‘తమ్ముడు' అనే పదాలున్న టీ షర్టులను వారికి కానుకగా ఇవ్వండి. అందరూ తమ తమ షర్టులు తెరిచి వాటి అర్థం ఏమిటో తెలుసుకు౦టు౦టే మీరు చూడండి. దీని కోసం కెమెరా కూడా సిద్ధంగా ఉంచుకోండి.

4. ఒక ప్రకటన పంపండి: మీరు గర్భం ధరించిన సంగతి మెయిల్ ద్వారా అందరికీ తెలపండి, గర్భం ధరించి చాలా కాలం ఐతే సోనోగ్రాం కాపీ కూడా జత చేయండి. అది ఇంకా అందంగా ఉండాలంటే, ఈ ప్రకటనను డైయాపర్ లో వుంచి - ప్రసవం గడువు తేదీని కూడా రాసి భావి శిశువు నుంచి ఒక నోట్ ను ప్రతి వారికీ పంపండి.

5. మీ గర్భం గురించి ప్రకటించే ముందు ఆలోచించాల్సినవి ఏమిటి?:

1. మీ గర్భధారణ ఊహించినది కానప్పుడు, లేదా మీ కుటుంబంలో ఎవరూ కోరుకోనిది ఐనప్పుడు, మీరు చెప్పే విధానం కొంచెం మార్చుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. 2. అంత సంతోషంగా లేని మొహాలతో తీసిన ఫోటోలను మీ ఆల్బంలో ఏళ్ళ తరబడి ఉంచుకోవడం అంత సంతోషకరం కాదు కదా!

అబ్బాయిలతో సంభాషణ మొదలు పెట్టేందుకు చిట్కాలు...!


స్నేహం ఓ స్వచ్ఛమైన పదం. స్నేహం ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా పాతబడని పదం. కులమతాలు, లింగభేదాలు, వయసు అంతరాలు అంటని అనుబంధం అది. స్నేహం అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ రోజుల్లో మంచి స్నేహితులు దొరకడం నిజంగా అదృష్టమే. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల్ని, అనేకానేక ఒత్తిడులను ఎదుర్కోవడంలో స్నేహితుల సహకారం ఎంతో ఉంటుంది. తమ బాధలను స్నేహితులతో పంచుకుని సేద తీరేవారు ఎందరో వుంటారు. ఇన్ని లక్షల మందిలో మనసుకు నచ్చిన, మన భావాలకు విలువనిచ్చే స్నేహితులను ఎంచుకోవడంలోనే మన నైపుణ్యం ఉంటుంది. స్నేహంలో స్వచ్ఛత తప్ప స్వార్ధం ఉండకూడదు. జీవితంలో ప్రత్యేక పాత్ర వహించే మిత్రులు శాశ్వతం కావాలంటే కొన్ని జాగ్రత్తలు వహించాలి.


ముందుగా ఎక్కడైనా ఉదాహరణకు జిమ్ లేదా గిటార్ క్లాస్....వంటి ప్రదేశాల్లో మీరు మీకు నచ్చిన బాయ్ ఫ్రెండ్ ను ఆకర్షించాలంనుకుంటారు. అయితే అదేలా?ప్రతి అమ్మాయికి అబ్బాయిల యొక్క దృష్టిని వారిమీద మరల్చడానికి, వారిని పడగొట్టడం చాలా సులభం. అయితే మీకు ఇష్టమైన అబ్బాయిలతో మొదట ఎలా సంభాషించాలి?ఇష్టమైన ఒక వ్యక్తితో స్పష్టమైన సంభాషణ లేకుండా మాట్లాడేందుకు చాలా కష్టం.చాలా సార్లు, వారికి ఇష్టమైన వ్యక్తులతో మొదటి సారి ఎలా సంభాషించాలి. ఏవిధంగా మొదలు పెట్టాలి? అనేవి అమ్మాయిలకు తెలియవు. అయితే అదే వ్యక్తి మిమ్మల్ని ఇంకా గమనించి ఉండకపోవచ్చు. లేదా అతను మీదగ్గరకు రావడానికి భయపడి ఉండవచ్చు. అటువంటప్పుడు ఏమి చేయాలి. ఈ గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా? మీకు నచ్చిన అబ్బాయిని ఆకర్షించేలా చేయడంతో పాటు, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మొదలు పెట్టాలనే దానికి కొన్ని చిట్కాలు మీకోసం...

tips girls start conversation


1. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా?:
మీరు మీకు ఇష్టమైన వ్యక్తితో సంభాషణను ప్రారంభించేందుకు ఒది ఇక మంచి మార్గం. మీకు ఇష్టమైన వ్యక్తితో మాట కలుపుకోవడానికి ఈ ప్రయత్నం..మీరు అతనిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఒక సూచనను ఇవ్వండి. అతని దగ్గరకు ఆత్మ విశ్వాసంతో వెళ్ళి ఇలా పలకరించండి ‘హాయ్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?''అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానం వచ్చినా సరే.. మీ మధ్య ఖచ్చితంగా సంభాషణ మొదలవుతుంది.

2. మీరు నాకు కొంచెం సహాయం చేస్తారా?:
ఈ ప్రశ్నకు తప్పని సరిగా ఎదుటి వ్యక్తి స్పందిచగలుగుతాడు. అంతే కాదు మీరు అతన్ని అడగడం వల్ల అతను లక్కీగా ఫీల్ అవుతాడు. అతని మీ దగ్గరగా వస్తున్నప్పుడు అతన్ని సహాయం అడగండి. మీ చేతిలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నప్పుడు కాస్త పట్టుకోమని చెప్పండి. బారీగా ఉన్న బాగులను అందించమనండి. ఇంకా ఇంటర్నెంట్ సెంటర్ లో ఉన్నట్లైతే తప్పనిసరిగా అతని సహాయం కోరడండి నెట్ వర్క్ పనిచేయలేదని కొంచెం చూసి పెట్టమనండి. ఇంకా మీరేదైనా అడ్రెస్ కనుక్కోవాలనుకొన్నప్పుడు వారి అడగండి. అమ్మాయిలకు హెల్ప్ చేయడం అంటే అబ్బాయిలను చాలా ఇష్టం. సరదా. ఎప్పుడైతే అతను మీకు హెల్ప్ చేస్తారో అప్పుడు ఇక చిరునవ్వుతో థాక్స్ చెప్పండి అక్కడి నుండే మొదలవుతుంది మీ మధ్య అసలైన సంభాషణ.

3. ఇక్కడ కూర్చోవచ్చా?:
చాలా మంది అమ్మాయిలు చాలా సాధారణంగా, సింపుల్ గా ఫాలో అయ్యే మార్గాల్లో ఒకటి. అది ఒక బస్సు, రైలు, లేదా విమానాశ్చయంలో ఇలా అడగడం వల్ల వారు కూడా కఫర్ట్ ఫుల్ గా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఎవరినైనా సహాయం అడిగేటప్పుడు ముఖంలో చిరునవ్వుతో పలకరించాలి. దాంతో మీరు మంచి ఫలితాన్ని పొందుతారు.

4. మీ వస్తువులను అతనికి సమీపంలో వదిలేయండి:
మీరు ఎటువంటి క్లూ ఇవ్వకుండానే మీకు ఇష్టమైన వ్యక్తి నుండే సంభాషణ మొదలవుతుంది. అదేలాంగే అతనికి దగ్గరగా వెళ్ళుతున్నప్పడు తెలియకుండానో, లేదా అజాగ్రత్తతోనో, జారవిడిచో మీదగ్గర వున్న పెన్ , బుక్, కీ, లేదా ఏదైనా ఒక వస్తువును వదిలేయడం వల్ల అతను వంగి వాటిని తీసి మీకు అందివ్వొచ్చు. అతని సహాయానికి చిరునవ్వుతో కూడిన కృతజ్ఞతను తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అప్పుడు మాట్లాడే సందర్భం రాకపోయినా.. మరోసారి ఎక్కడైనా కలిసినప్పుడు తప్పనిసరిగా మాట్లాడటానికి కారణం అవుతుంది.

5. నేరుగా చెప్పేయండి:
మీరు అతన్ని చూసిన వెంటనే, మీకు నచ్చినట్లైతే, కొద్దిగా చొరవ తీసుకుని మీరే వెళ్ళి పలకరించండి. మొదటి సంభాషణ ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పడం వల్ల ఎవ్వరూ తప్పుగా అనుకోరు. అయితే మీరు చేసే ప్రతి చర్యా సాధారణ సంభాషనై పరిమితంగా ఉండాలి. మీ హద్దులు దాటకుండా జాగ్రత్తపడాలి. ఆ సంభాషణ కూడా అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి మీకు ఇష్టమైన వ్యక్తితో మీ సంభాషణలకు ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.

 

మీ గార్డెన్ లో సాధారణంగా పెంచుకొనే పూల మొక్కలు...!

కొన్ని రకాల సాధారణ పుష్పాలు భౌగోళిక ప్రదేశం, వాతావరణం, సంస్కృతిని బట్టి గణనీయంగా మారుతూ ఉంటాయి, కానీ హృద్యంగా వుండే కొన్ని రకాల పూలు విశ్వవ్యాప్తంగా ఉంటాయి. సాధారణ పుష్పాలు వేరువేరు ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. కొంతమంది పుష్ప గుచ్చాలు లేదా పుష్ప రీతులలో బాగా ఉపయోగపడతాయి, అయితే, కొన్ని రకాలు తోటలలోనే బాగా ఉంటాయి. సాధారణ పుష్పాలు రంగు, వాసన, రూప౦ లేదా ఆకారం పరంగా ప్రత్యేక లక్షణాలు కలిగి వుంటాయి.

list common flowers your garden

గులాబీలు:

గులాబీలు పెంచుకోవడానికి, ఇతరులకు ఇవ్వడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన పూలలో ఒకటి. గులాబీలు అనేక రెక్కలను కలిగి ఉంటాయి, వీటికి సాధారణంగా ముళ్ళతో కూడిన కాండం ఉంటుంది. ఇవి వాటి పరిమాణం, రంగుల మార్పులతో వందకంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. ఎరుపు, తెలుపు, నారింజ, పసుపు, బహుళ వర్ణాలతో దొరికే గులాబీలు బొకేలకు, పుష్ప రీతుల ఏర్పాటుకు చక్కగా సరిపోతాయి. సెంట్లు, సుగంధ పరిమళాల్లోను, గాలిని గుబాళి౦పచేయడానికి వాడే పూల తోట్లలోను విరివిగా వాడే సుగంధం గులాబుల సొంతం. ఇవి మొక్కలుగా, పొదలుగా లేదా తీగలుగా కూడా పెరుగుతాయి కాబట్టి తోటలు గా కూడా వేస్తారు.

చిన్న చేమంతులు:

చేమంతులు సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగులలో ఉంటాయి, సన్నటి, చదునైన రేకల మధ్య వుండే విశిష్టమైన సన్నని వృత్తాకారపు డిస్క్ లాంటిది కలిగి ఉంటాయి. అయితే, కొన్ని సాధారణ చేమంతుల రకాలకి మధ్యలో డిస్క్ ఉండదు. ప్రకాశవంతమైన రంగులకు, ఆహ్లాదకరమైన సువాసనలకు ప్రసిద్ది చెందిన, ఈ పూలు తెనేటీగలు, సీతాకోకచిలుకలను పరాగ సంపర్కం కోసం ఆకర్షిస్తాయి. ఈ చేమంతులు విలియమ్ షేక్ ష్పియర్, జాన్ కీట్స్ లాంటి కవులకు కవితా వస్తువులయ్యాయి. చేమంతులతో తరచుగా స్నేహం, అమాయకత్వం ముడిపడి ఉంటాయి. చేమంతులను కోసినా అవి వాడిపోవు కనుక వాటిని కొందరు మామూలు కలుపు మొక్కలుగా భావిస్తారు, కానీ తోటమాలులకు వాటి హృద్యమైన అందం చాలా విలువ కలది.

గంగరావి పుష్పం:

ప్రపంచంలో గుర్తించదగిన పుష్పాలలో ఇది ఒకటి. ఎరుపు, ఊదా, గులాబీ, తెలుపు, ఆరంజ్, లాంటి అనేక రంగుల కలయికతో ఒకదానిపై ఒకటి ఉండే రెక్కలతో వుండే ఈ పుష్పాలు కప్పు ఆకారంలో విభిన్నంగా ఉంటాయి, తులిప్స్ హాలాండ్ దేశానికి అధికారిక పుష్పం, ఇది హాలాండ్ లోని అతిపెద్ద ఎగుమతులలో ఒకటి. తులిప్స్ సాగుచేయడానికి చాలా అనువైన మొక్కలు, అందువల్ల తోటలుగా పెంచడానికి బాగుంటాయి. తులిప్స్ అనేక రంగులు కలిగిఉండడం వల్ల శృంగారం లేదా సృజనాత్మకత, కల్పన లాంటి భావనలతో అనుబంధం కలిగి ఉంటాయి.


లేత గులాబీ రంగు పూలు:

ఈ కార్నేషన్లు చిన్న రిబ్బన్ లాంటి రెక్కల సమూహాలు కలిసి మొత్తం పుష్పంగా కనబడతాయి. ఈ ప్రసిద్ద పుష్పాన్ని రోమన్లు పూలదండలుగా ఉపయోగించేవారు, ఇది చారిత్రికంగా దేవతల పుష్పంగా భావించేవారు. ఈ కార్నేషన్లు విస్తృత రంగుల (పసుపు, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా) వల్ల, పెరుగుదల సౌలభ్యం వల్ల ఎక్కువ ప్రసిద్ది పొందాయి. ఇవి కట్ చేసిన తరువాత చాలా గంటలు లేదా రోజుల పాటు తాజాగా వుండడం వల్ల బోకేలలో, పెళ్ళిళ్ళలో ఆడవారికి, మగవారికి తయారయ్యే ప్రత్యెక అలంకారాలలో ప్రధాన ఎంపికగా మారాయి.

 

మొదటి సారి ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎలా తెలుస్తాయి...!

స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్నితమైన వాటినుండి తీవ్రమైనవిగా ఉండి నివృత్తి కోసం వైద్యుని సలహా తీసుకోవడం జరుగుతుంది. వైద్యుని నిర్ధారణలో గర్బం వల్ల వచ్చిన మార్పులో లేక శారీరకంగా కొన్ని వ్యాధుల వల్ల కలిగే మార్పులో తెలుస్తుంది. కొన్ని సార్లు ఇటువంటి శారీరక మార్పులు ఫ్లూ, అపెండిసైటిస్ లేక మోనోపాజ్ వల్ల సంభవించవచ్చు.గర్బధారణ సమయంలో శరీరంలో సహజంగా కలిగే మార్పుల్ని పరిశీలిద్దాం.

నెల తప్పడం:

రుతుస్రావం రాకపోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన. దీనినే నెల తప్పడంగా కూడా వ్యవహరిస్తారు. సహజంగా స్త్రీ యొక్క ఋతుచక్రం 28 రోజులు ఉంటుంది. ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం. స్త్రీలో రుతుస్రావం అనేది వారం రోజుల కంటే ఎక్కువ రోజులు ఆలస్యం అయితే ఇది గర్బదారణకి మంచి సూచన. అయితే, ఈ అలస్యమనేది ప్రతి ఒక్కరికి గర్బధారణ వల్లే కాకపోవచ్చు. కొంతమందిలో, ఆకస్మిక ఆహార మార్పులు అలాగే బరువులో మార్పులు ఇంకా ఆత్రుత స్థాయిలని బట్టి కూడా రుతుస్రావం ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయి.
how know if you are pregnant


వేవిళ్ళు:

గర్భదారణ సమయంలో మరొక ముఖ్యమైన సూచన వికారం. సహజంగా చాలా మందిలో ఉదయం పూట ఈ వికారం కనపడడం వల్ల దీనిని మార్నింగ్ సిక్ నెస్ అని కుడా అంటారు. గర్భం ధరించిన తర్వాత రెండు వారాలకి మొదలై పద్నాలుగు వారాల వరకూ వేవిళ్ళు కొనసాగవచ్చు. గర్భధారణ సమయంలో గర్భిణీలకు సిగరెట్ పొగ, వండిన ఆహార పదార్ధాల వాసనలు అలాగే అత్తరు సువాసనలలో వికారం కలిగించే గుణాలు మెండుగా ఉంటాయి. దీనికి కారణం, వాసన గ్రహించే శక్తి అధికమవ్వడమని వైద్యులు అంటారు. ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తేడాల వల్ల కొంతమందికి జీర్ణ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల వాంతులు కనబడతాయి. అంతే కాకుండా, చాలా మందిలో తమకిష్టమైన ఆహార పదార్ధాల పట్ల అనాసక్తత ఏర్పడుతుంది. చిత్రంగా కొంత మందిలో ఇంతకు ముందు ఇష్టపడని ఆహార పదార్ధాల మీద అమితమైన ఇష్టం ఏర్పడుతుంది. ఇలాంటి మార్పులు మొదటి త్రైమాసికంలో గమనించవచ్చు.

రొమ్ములలో సున్నితత్వం:

గర్భిణీ స్త్రీలలో సహజంగా కనపడే మరొక మార్పు రొమ్ములు సున్నితంగా మారడం. గర్భం ధరించినప్పుడు కలిగే హార్మోన్ల మార్పుల వల్ల స్తనాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. శిశువు ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అదే వేగంలో స్తనాలలో మార్పులు కూడా సంభవిస్తాయి. నెలతప్పడం, వికారాలతో పాటు, స్తనాలలో కలిగే మార్పులు గర్భధారణకి మంచి సూచన. ఈ సమయంలో చిన్నపాటి స్పర్సకి కూడా రొమ్ములు నొప్పికి గురవుడంతో పాటు బరువుగా అనిపించడం, జలదరింపు వంటివి గర్భిణులకు అనుభవంలోకి వస్తాయి. చనుమొనలు కూడా సున్నితంగా మారడం వల్ల దుస్తులు మార్చుకునేటప్పుడు ఇబ్బందికి గురవడం చనుమొనలు నల్లగా పెద్దగా అవడం కూడా గమనించవచ్చు.

ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ స్నానం ఎలా చేయాలి..?

స్నానం చేయడం సాధారణ దినచార్యలో ఒక భాగం. శుభ్రంగా, శుచిగా వుండడం చాలా ముఖ్యం.
how take shower

చర్యలు :

1. బట్టలు విడవండి. మలినమైన వస్త్రాలను లాండ్రీ బుట్టలో వేయండి. శుభ్రమైన బట్టలను లేదా పైజామాలను స్నానం చేసేటప్పుడు తడిసిపోకుండా ఉండేలా సురక్షితమైన చోట వుంచండి.

2. నీటి పంపు తిప్పి వెచ్చటి నీళ్ళు వచ్చేదాకా ఆగండి. మరీ వేడిగా లేకుండా చోసుకోండి. షవర్ హెడ్ నుంచి వచ్చే నీరు షవర్ బయటకు పోకుండా క్రిందికి చిమ్మేలా వుందో లేదో చూసుకోండి.

3. ఉష్ణోగ్రత ఎంత వుందో చూసుకోండి. సరిపడా ఉష్ణోగ్రత ఉందనుకుంటే షవర్ లోకి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా కొనసాగేముందు ఉష్ణోగ్రత సౌకర్యంగా వుందో లేదో చూసుకోండి.

4. మీ మొత్తం శరీరాన్ని తడుపుకోండి. మీ తల మొత్తం, మీ శరీరంలోని ప్రతి అంగుళం తడిసిందని నిర్ధారించుకోండి. మీ శరీరాన్ని ప్రాధమికంగా శుభ్రం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం.

5. మీ తల మీదికి కొద్దిగా షాంపూని రుద్దుకోంది. మెల్లిగా మీ నెత్తి మీది ప్రతి భాగాన్ని రుద్దుతూ అన్ని వెంట్రుకలకూ నురగ అంటేలా చూసుకోండి. మీ జుట్టు ను రోజూ కడగకండి. అది మీ జుట్టుని పాడు చేస్తుంది.

6. మీ జుట్టు నుంచి షాంపూ ని కండిషనర్ ను కడిగి వేయండి. ఎండిపోయాక సబ్బు, షాంపూ ఉండకుండా మొత్తం వదిలిపోయిందని నిర్ధారించుకోండి.

7. మీ తువ్వాలును బాగా తడప౦డి. అది తడిశాక దాని మీద కొద్దిగా సబ్బు వేసి మీ ముఖాన్ని మెల్లిగా రుద్దండి. మీ కంట్లో సబ్బు పడకుండా చూసుకోండి. తువ్వాలును, మీ ముఖాన్ని శుభ్ర౦గా కడుక్కోండి.

8. మీ స్నానం సబ్బును లేదా బాడీ వాష్ ను మీ తువ్వలుకి పట్టించండి. ఇప్పుడు మీ శరీరం మొత్తాన్ని శుభ్రం చేసుకోండి. మీ శరీరం పై భాగం నుంచి మొదలు పెట్టి క్రిందికి శుభ్రం చేసుకోండి. మీ బాహు మూలల్లో శుభ్రం చేసుకున్నట్టు నిర్ధారించుకోండి. మీ మర్మావయవాలను, క్రింది భాగాన్ని చివరిగా శుభ్రం చేసుకోండి. చెవుల వెనుక భాగం, మెడ వెనుక భాగం, కాలివేళ్ల మధ్యలో కూడా శుభ్రం చేసుకోవడం మరచిపోకండి. మీ బాహుమూలలను, మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి.

9. సబ్బు కడిగివేయండి. మీ జుట్టులోకి చేతులు పోనిచ్చి సబ్బంతా కడిగేసుకున్నట్టు నిర్దారించుకోండి. మీరు ఇందాక మర్చిపోయిన భాగాలు ఏవైనా వుంటే ఇప్పుడు శుభ్రం చేసుకోండి.

10. చివరిగా మరో సారి కడుక్కోండి. మీ శరీరం మీద ఎక్కడా సబ్బు నిలవకుండా చూసుకోవడం ముఖ్యం. తరువాతి చర్యకు వెళ్ళే ముందు మీ జుట్టు లో సబ్బు ఏ మాత్రం మిగలలేదని నిర్ధారించుకోండి.

11. నీళ్ళు కట్టేయండి. విలువైన నీరు వృధా కాకుండా ఉండడానికి పంపును గట్టిగా కట్టేసినట్టు నిర్ధారించుకోండి. షవర్ స్టాల్ నుంచి బయట పడడానికి సిద్ధం కండి - మీరు లోపలి తెచ్చిన వస్తువులను సేకరించుకోండి.

12. షవర్ నుంచి నిష్క్రమించండి. రగ్గు లేదా కాలి పట్టా మీద నిలబడి మెల్లిగా మీ తల, ముఖం, చాతీ, ఉదార భాగం, కటి ప్రదేశం, కాళ్ళు, మర్మావయవాలు, పాదాలు ఒక తువ్వాలు తో పొడిగా తుడుచుకోండి. మీరు దీన్ని జాగ్రత్తగా చేస్తే మిగిలిన నీరు ఏదైనా వుంటే అది రగ్గు లేదా కాలి పట్టా మీద వుండాలి, మిగతా నేల మీద కాదు.

13. ఇప్పుడు మీ డియోడరెంట్ వేసుకోండి, లేదా బట్టలు వేసుకున్నాక కుదరనిది ఇంకా ఏదైనా వుంటే అది కూడా ఇప్పుడే వేసుకోండి.

14. మీ పొడి బట్టలు (లేదా పైజామాలు) వేసుకోండి. శుభ్రమైన లోదుస్తులు వేసుకోండి. తరువాత, చొక్కా గానీ ఒక టాంక్ టాప్ గానీ ధరించండి. అప్పుడు షార్ట్ లు, గౌన్ లేదా పాంట్ లు వేసుకోండి. చివరిగా ఒక జత ఉతికిన సాక్సులు వేసుకోండి.

హెచ్చరికలు:

 షవర్ లో వున్నప్పుడు ఎలాంటి ఎలెక్ట్రికల్ వస్తువులూ వాడకండి. హెయిర్ డ్రయర్లు, సెల్ ఫోన్లు, రేడియోలు లాంటివన్నమాట - పవర్ కార్డ్ లేదా బాటరీ తో నడిచేవి ఏవీ స్నానశాల లేదా షవర్ లో ఎప్పుడూ వాడకూడదు.

తలుపు గడియ పెడితే గోప్యత వుండే మాట నిజమే కానీ, మీరు షవర్ లో పడిపోయారో లేక గాయ పడ్డారో అనుకోండి - గడియ వేసిన తలుపుంటే మీకు అత్యవసర సేవలు అందడం ఆలస్యం కావచ్చు. మీరు నమ్మగల వ్యక్తులతో కలిసి నివసిస్తుంటే, తలుపు వేయకుండా ఉండే అవకాశం పరిశీలించండి.

షవర్ లోకి వెళ్ళడం, బయటికి రావడం చేసేటప్పుడు జారి పడి దెబ్బలు తగలకుండా ఉండేలా జాగ్రత్తగా వుండండి. షాంపూ, కండిషనర్, సబ్బు వాడేటప్పుడు అవి కళ్ళలో పడకుండా ఉండేలా చూసుకోండి - అవి బాగా బాధిస్తాయి.

 

ఏభై ఏళ్ళలో కూడా అందంగా..ఆకర్షణీయంగా కనిపించడం ఎలా?

సాధారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. మీ వయసు మీద పడుతున్నట్లయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా తిరిగి మీలో దాగి ఉన్న అందాన్ని బయటకు కనబర్చేలా చేసి వృద్యాప్య ఛాయలను కనబడనియకుండా యవ్వనంగా కనబడాలే చేస్తుంది. అందుకు కొన్ని జాగ్రత్తలు మీ కోసం..
how be beautiful at fifty


చిట్కాలు:
1. మంచి నీళ్ళు బాగా త్రాగండి. శరీరంలో ని వేడిని నియంత్రించి హైడ్రేటెడ్ కాకుండా ఉండేందుకు నీరు తోడ్పడుతుంది. స్ట్రాబెర్రీస్, బ్రోకోలి, ఆకుకూరలు మరియు నిమ్మకాయ వంటి ఆహారపదార్ధములను తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చును. సమతుల్యమైన ఆరోగ్యకర ఆహారాలని తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యం పై ఎన్నో అద్బుతమైన ఫలితాలు పొందవచ్చు.
2. శిరోజాల సౌందర్యం కోసం ప్రత్యేకించి శ్రద్ధ వహించ వలసి వస్తుంది. మీరు మీ శిరోజాలకి రంగు వేసుకునేటట్లయితే, ఎటువంటి రంగుని వాడుతున్నారో ఒక సారి గమనించండి. అరవై దాటిన వారు వాడే చాలా రంగులు కృతిమంగా కనిపిస్తాయి. సహజంగా కనిపించేలా రంగులు వాడితే, మీ శిరోజాల అందం రెట్టింపవుతుంది.
3. మీ జుట్టు పొడవు ఒక సారి గమనించండి. వయసు మీరుతున్న ఎక్కువ మందిలో భుజం దాటేంత వరకు మాత్రమే పొడవు ఉన్న జుట్టు అందాన్ని కలుగ చేస్తుంది. కాని, కొంత మందిలో పొడవు జుట్టు కూడా అందంగా ఉంటుంది. మీకు నప్పే విదంగా మీ జుట్టు ని మరల్చుకోండి.
4. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా జాగ్రత్తపడండి. వ్యాయామం ద్వారా మరియు ఆరోగ్యాన్నందించే ఆహార పదార్ధాల ద్వారా మీ బరువు ని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ప్రతి రోజు నడకని అలవాటు చేసుకోండి. చిన్న షికారు కూడా మీ బరువుని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది.
5. ఒక సారి మీ వార్డ్ రోబ్ ని పరీక్షించండి. మీకు సరిపడని, చిరిగినా లేదా పాడైపోయిన దుస్తులని తీసి పడేయండి. కొన్ని కొత్త దుస్తులు కొనుక్కోండి. వివిధ రకాల టాప్స్ మరియు బాటంస్ ఎంచుకోండి. వీటికి నప్పే టాప్స్ మరియు బాటంస్ మీద మార్చి మార్చి వేసుకుని ఒక కొత్త అవుట్ ఫిట్ని సృష్టించుకోండి. ఎందుకంటే, మీ అందాన్ని రెట్టింపు చెయ్యడానికి దుస్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
6. మేకప్ ని ఎక్కువగా వాడకండి. మీ వయసు మీద పడుతున్న కొద్ది మేకప్ ని తగ్గించుకుని సహజంగా అందంగా కనిపించేందుకు ప్రయత్నించండి. తెల్లని మేని ఛాయ కలిగిన వారు ఐ లైనర్ మరియు మస్కారాలకి బ్రౌన్ లేదా గ్రే కలర్ రంగులని ఎంచుకుంటే మంచిది. డార్కర్ స్కిన్ కలిగిన వారికి నలుపు రంగు సరిపోతుంది. ఆడంబరంగా కనిపించే లిప్ కలర్స్ కి దూరంగా ఉండి మీకు నప్పే కలర్ ని ఎంచుకోండి. మీ పెదవులకి సరిపడా రంగులని ఎంచుకోవడం ద్వారా మీ అందాన్ని పెంచుకోవచ్చు.


మరి కొన్ని చిట్కాలు :
1. నాణ్యత కలిగిన లోడుస్తులని ఎంచుకోవడం ద్వారా మీ శరీరాకృతిని అందంగా ఉంచవచ్చు.
2. మీ వయసు ఎంతైనా కానివ్వండి, క్లెన్సింగ్, టోనింగ్ మరియు మోయిస్చరైసింగ్ ల వంటివి నిర్లక్ష్యం చెయ్యకుండా పాటించండి.
3. మీరు నడిచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకొని అందంగా నిలుచోవడం లేదా కూర్చోవడానికి ప్రయత్నించండి.
4. ముఖ్యంగా, అందం అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. మన మనసు కూడా అందంగా ఉండాలి. మీరు ఎంత అందంగా కనిపించినా, మీ ఆలోచనలు అందంగా లేకపోతే ఎటువంటి ఉపయోగమూ లేదు.దుస్తుల విషయంలో
జాగ్రత్తలు:

1. మీ దుస్తుల ఎంపిక మీ వయసుకి తగినట్లుగా ఉండాలి. వయసులో ఉండే వారు వేసుకునేటటువంటి దుస్తులు ఎంచుకోకండి.
2. వ్యాయామం అతిగా చెయ్యకండి. అందం తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం. అందంగా కనిపిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఆనందం.

 

పిత్తాశయంలో రాళ్ళను సహజంగా తొలగించడం ఎలా ?

పిత్తాశయంలో క్రమేణా ఏర్పడే చిన్న చిన్న గులక రాళ్ళ లాంటి వాటిని పిత్తాశయ రాళ్ళు అంటారు. ఈ ప్రక్రియ జరగడానికి చాలా ఏళ్ళు పట్టవచ్చు. పిత్తాశయంలో రాళ్ళు పడడం సర్వ సాధారణం; కానీ చాలా సార్లు ఇవి ఎలాంటి భౌతిక సంకేతాలు చూపించవు. దురదృష్టవశాత్తూ దాదాపు పది శాతం పిత్తాశయ రాళ్ళు మూత్ర కోశం లో గానీ లేదా పిత్త వాహిక లోగానీ అవరోధాలు కల్పించి పొత్తికడుపులో నొప్పి, కామెర్లు, వికారం, జ్వరం కలుగ చేస్తాయి. ఇలా జరిగినప్పుడు వాచిన పిత్తాశయాన్ని, దాంట్లో వుండే రాళ్ళను శస్త్ర చికిత్స ద్వారా తీసివేయాల్సి రావచ్చు. చాలామందికి పొత్తికడుపు అల్ట్రా సౌండ్ చేసినప్పుడు యాదృచ్చికంగా పిత్తాశయ రాళ్ళు ఉన్నట్టు బయట పడుతుంది. మీ పిత్తాశయం లో రాళ్ళు వున్నాయని తెలిస్తే మీరు ఎలాంటి ఆహారాన్ని వదిలివేయాలి? ఆహారంలో మార్పులతో మీరు సహజంగా పిత్తాశయం లో రాళ్ళను నిరోధించగలరా?

how prevent gallstones naturally

సూచనలు :
1. జంతువుల నుంచి తయారయ్యే ఉత్పత్తులు తినడం మానేయండి. ఎర్రటి మాంసం, వెన్న, పాలల్లో ఎక్కువగా వుండే సంత్రుప్త కొవ్వులు, పిత్తాశయం లో రాళ్ళు ఏర్పడడానికి, పిత్తాశయం లో నెప్పులు రావడానికి దారి తీస్తాయి.
2. కొవ్వు పదార్దాలుండే ఆహారాలు వదిలేయండి. జిడ్డుగా ఉండేవి లేదా వేయించిన ఆహారాలు కూడా పిత్తాశయం లో రాళ్ళున్న వారు తీసుకోకూడదు. ఈ ఆహార పదార్ధాలు పిత్తాశయాన్ని మరింత శ్రమించేలా చేస్తాయి. మీకు పిత్తాశయంలో రాళ్లున్నట్టు పరీక్షల్లో తేలితే, వాటిలో ఒకటి అకస్మాత్తుగా మీ మూత్రకోశ నాళాల్లో అవరోధం కల్పించవచ్చు.
3. కనోలా లేదా ఆలివ్ నూనేల్లో వుండే లాంటి ఏకసంతృప్త కొవ్వులను తీసుకోండి. గింజలు తినడం కూడా మంచి ఆహార ఎంపికే. మధ్యధరా సముద్ర తీరంలోని ఆహారాల్లో భాగమైన ఈ నూనెలు నిజానికి పిత్తాశయంలో రాళ్ళను నిరోధి౦చే సామర్ధ్యం కలిగి వుంటాయి.
4. టూనా, మాకరెల్, సాల్మన్ లాంటి చల్ల నీటి చేపలను తినండి. ఒమేగా-3 చేప నూనెలు పిత్తాశయం రాళ్ళను నిరోధింఛి మరింత సమర్ధంగా పనిచేసేలా చేస్తాయి.
5. శుద్ధం చేయబడిన, ఎక్కువ మధుమేహ స్థాయి కలిగిన పిండిపదార్ధాలతో వుండే చక్కర వాడకండి. బంగాళాదుంపలు, పాస్తా, బ్రెడ్ లాంటి వాటిని శరీరం చక్కేరగా మారుస్తుంది. రక్తంలో అధిక శాతం చక్కర వుంటే అది నేరుగా మధుమేహానికి, అలాగే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడానికి దారి తీస్తుంది.
6. రోజూ కొద్దిగా కాఫీ తాగండి. ఇలా చేస్తే పిత్తాశయం లో కొలెస్టరాల్ స్థాయి తగ్గి రాళ్ళను నిరోధిస్తుంది.
7. కూరలు, పళ్ళు పుష్కలంగా తినండి. వాటిలో విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు ఉండడమే కాదు, వైద్య అధ్యయనాల ప్రకారం అవి నిజానికి పిత్తాశయం లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
8. తృణ ధాన్యాలు, పప్పుదినుసుల లో వుండే నీటిలో జీర్ణమయ్యే పీచు పదార్ధాలతో మీ ఆహారాన్ని నింపండి. ఆహారంలోని పీచు పదార్ధం కోలెస్టరాల్ను, ట్రైగ్లిసరైడ్ ల స్థాయిని తగ్గిస్తుంది, తద్వారా పిత్తాశయం లో రాళ్ళు సహజ౦గానే నిరోధించబడతాయి.

చిట్కాలు & హెచ్చరికలు :
వారసత్వ కారణాల వల్ల కూడా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం వుంది.మీ పిత్తాశయం లో రాళ్ళు ఎలాంటి చిహ్నాలు చూపించనప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలను పరిగణించ కూడదు.పిత్తాశయం లో రాళ్ళు వుంటే వేగంగా బరువు పెరగడం లేదా కోల్పోవడం కూడా జరగవచ్చు. బరువు క్రమంగా తగ్గించుకుని, ఇక ఆ బరువును కొనసాగించుకుంటూ వుంటే కూడా పిత్తాశయం లో రాళ్ళు సహజంగా నిరోధించవచ్చు.

చిరు బొజ్జను కరిగించుకొనే చక్కటి ఉపాయలివిగో...!

ప్రస్తుత కాలంలో అధిక బరువు అందరికీ సమస్యే. ముఖ్యంగా పొట్ట, నడుము, పిరుదుల దగ్గర పేరుకొనే కొవ్వు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన శరీరంలో కొవ్వు సులభంగా చేరిపోతుంది. దీని వల్ల బరువు పెరగడం కాని శరీరంలోని ఇతర అవయవాలు పెరగవు, కాని కొవ్వు వల్ల అధిక రక్త పోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌, డయాబెటీస్‌, హైపొథైరాయిడ్‌ ప్రాబ్లమ్‌, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అధిక నిద్ర, వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో సమస్యలు మరింత తీవ్రంగా రావచ్చు. ఇలా మన శరీరానికి ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మహిళ యొక్క సహజ శారీరక రూపం నడుము వద్ద సన్నగా ఒంపుతో వుండి, పిరుదులవద్ద కొద్దిపాటి లావుగా వుండటం. అయితే, నేటి మహిళలు చాలా భాగం తమ శారీరక రూపాన్ని పై నుండి కిందకు ఒకే లావు కలిగి వుంటున్నారు. దురదృష్టవశాత్తూ పొట్టలో కొవ్వు పెరిగిపోతోంది. నడుము వుండవలసిన దానికంటే కూడా అధిక సైజు చూపుతోంది. పొడుచుకుని ముందుకు వచ్చే పొట్ట మగవారికి సైతం సాధారణమైపోయింది. పురుషులు, స్త్రీలు కొన్ని సమయాలలో సన్నగా వున్నప్పటికి నడుము మాత్రం లావుగానే ఎందుకుంటోంది? దీనికిగాను వారు చేయాల్సిందేమిటి?పొట్ట పలురకాలు. పొట్ట అవస్థలు అనేక రకాలు. అధిక పొట్ట ఉండటం వల్ల కూర్చోవడానికి కుర్చి సరిపోదు, బట్టలు అసలే పట్టవు, నడిస్తేనేమో ఆయాసం, పరిగెత్తడం మహా కష్టం, నిలుచుంటే ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపిస్తుంటుంది. అయితే పొట్ట మాత్రం తగ్గదు.. దాని వల్ల వచ్చే బరువు తగ్గదు. పెరుగుతున్న పొట్టను ఫ్లాట్‌గా ఎలా చేయాలి? అలా పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలన్న అంశాలపై అవగాహన అవసరం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయానికి చెక్‌ పెట్టవచ్చు...పొట్ట రాకుండా రోజువారీగా తప్పని సరిగా డైట్‌ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్ట పెరగకుండా కొన్ని రకాల ఆహారాలు అడ్డుకొంటాయి. అటువంటివి ప్రతి రోజూ మన డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. మరి పొట్ట తగ్గించే ఆ ఆహారాలేంటో.. వాటి విలువెంతో ఒక సారి చూద్దాం...





లెగ్యుమ్(చిక్కుడు)జాతికి చెందిన అన్ని రకాల కూరగాయలు, గింజల్లో ప్రోటీన్స్, ఫ్రైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ జాతికి చెందిన గింజలు డార్క్ కలర్స్, బ్లాక్, రెడ్, వంటి వాటిలో అధిక శాతంలో ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఫ్లెవనాయిడ్స్ టమ్మీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. స్పైసీ బ్లాక్ బీన్స్ సూప్ తీసుకోవడం వల్ల నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చు.


సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు.



పాప్ కార్న్ తృణధాన్యాలో ఒక రకం. తృణధాన్యాలు ఆరోగ్యానికి, ఎంత మంచి చేస్తాయో అందిరికి తెలిసిన విషయమే. పాప్ కార్న్ తినాలనుకొనే వారు వైట్ రైస్, పాస్తా, బ్రెడ్ వంటి వాటికి బైబై చెప్పండి హ్యాపీ గా పాప్ కార్న్ తిని బరువు తగ్గించుకొని ఆరోగ్యాని కాపాడుకోండి.



బంగాళా దుంపను తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అభిప్రాయం అయితే పచ్చి బంగాళదుంపను సలాడ్ల రూపంలో తీసుకోవడం వల్ల అధిక పొట్టను, బరువును తగ్గించుకోవచ్చు. వెనిగర్ పొటాటో సలాడ్, చిల్లీ పొటాటో వంటివి తరచూ తింటూ ఉండలి. వాటివల్ల కొవ్వు నిరోధక పిండి పదార్థాలను, కొవ్వు కణాలను బయటకు నెట్టి వేయబడుతుంది. బంగాళదుంపలోని స్ట్రార్చ్ వంటి పదార్థం ఫాట్ ను కరిగించడానికి బాగా సహాయపడుతుంది.




 మనందరికి తెలుసు వేరుశెనక్కాయలు ఎంత రుచిగా ఉంటాయో.. అవి ఎంత రుచిని అందిస్తాయి. ఆరోగ్యాన్నికి కూడా అంతే ఉపయోగపడుతాయి. వేరుశెనగక్కాయలు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. కుక్కీస్, చిప్స్, మరియు డిజర్ట్స్ వల్ల ఏర్పడే కొవ్వులను అతి సులభంగా కరిగించే శక్తి వేరుశెనక్కాయల్లో మెండుగా ఉంది. కాబట్టి కుక్కీస్, చిప్ప్, డిజర్ట్స్ కంటే వేరుశెనక్కాయ స్నాక్ తినడం వల్ల స్నాక్స్ తిన్నసంతృప్తి, ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతుంది.



సాధారణంగా మనం వండుకొనే చార్లు, సలాడ్లు, పెరుగు, సాండ్ విచ్, క్రంచెస్ లో ఈ విత్తనాలు చేర్చి తినడవల్ల వీటిలోని అన్ సాచురేటెడ్ ఫ్యాట్ అధికబరువును, అధిక పొట్టను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.



కొవ్వను కరిగించడంలో అద్భుతమైనటువంటి ఔషదం గ్రీన్ టీ అయితే అంతకంటే బాగా పనిచేసేది వైట్ టీ, ప్యాట్ ను కణాలను బ్రేక్ చేయడానికి బాగా సహాయపడుతాయి.



ఈ ఆయిల్ ను ముఖ్యంగా సలాడ్ డ్రెస్సింగ్ గా ఉపయోగిస్తుంటారు. ఇందులోని లినోలెనిక్ ఆసిడ్ ఒమేగా 6 కొవ్వ కరిగించడానికి బాగా ఉపయోగపడుతాయి. ఇంకా జీవక్రియను సక్రమంగా పనిచేసేలా కాపాడుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఈ ఆహారాలు తిని స్లిమ్ గా మారండి...



సాస్ మరియు సలాడ్స్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఇచ్చినంత టేస్ట్ మరేదీ ఇవ్వదని అంటారు. ఎందుకంటే ఇందులో ఎసిటిక్ ఆసిడ్ వల్ల ఆ వాసన, పుల్లదనంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. అంతే కాదు శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వును కరిగించడానికి ఈ ఎసిటిక్ ఆసిడ్ బాగా సహాయపడుతుంది.







 

మంచి మూడ్ తో నిద్రలేవటం ఎలా?

ఉదయం నిద్ర లేవటం అనేది మీకు తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు తగిన నాణ్యమైన నిద్ర దక్కేట్టుగా ఒక వ్యూహం తయారు చేస్కోవాలి. మీ దినచర్య కు లోబడి నిద్రకు లోటు రాకుండా చూస్కోవాలి. నిద్ర లేమి వల్ల మెదడు చురకుదనం తగ్గి ఉత్సాహం కూడా సన్నగిల్లుతుంది. కాబట్టి ఆరోగ్యానికి సమయానికి నిద్ర పోవడం ఎంత అవసరమో... సమయానికి నిద్ర లేవడం కూడా అంతే అవసరం.
how wake up a good mood


సూచనలు :1. సరి అయిన సమయంలో పడుకోండి. పొద్దున్న ఉల్లాసంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం.
2. మంచి నిద్ర చెయ్యాలంటే మీ గది చీకటిగా ఉండేట్టు చూస్కోండి. కొంచెం వెలుతురు ఉన్నా మీ మెదడు మెలుకువగా ఉండే అవకాశం ఉంది.
3. నిద్ర పోయే సమయానికి ముందు ఒత్తిడి కలిగించే విషయాలకి దూరంగా ఉండండి. ఆ సమయంలో వార్తలు చూడకండి. అందులోని చెడు, హింసాత్మక అంశాలు నిద్రకు సహకరించవు .
4. నిద్రపోయే ముందు మరుసటి ఉదయానికి తయారుగా ఉండండి.మీరు వేస్కోవాల్సిన దుస్తులు సిద్ధంగా ఉంచుకోండి. పొద్దుట బయల్దేరాసిన ముందు చెయ్యాల్సిన చిన్న పనులను చేసేస్కోండి. మీ ఉదయం ప్రశాంతంగా, పద్ధతిగా ఉంటుందన్న నిశ్చింతతో మెరుగ్గా నిద్రపోతారు.
5. పడుకునే ముందు కొన్ని నిమిషాలు కృతజ్ఞత దినచర్య రాసుకునేందుకు కేటాయించండి. మీకు ఆనందం కలిగించిన విషయాలని పునశ్చరణ చేస్కోవడం వల్ల మీ మెదడు కూడా కృతజ్ఞత, సంతోషం కూడుకున్న ప్రాంతంలో సంచరిస్తుంది. ఈ మనస్సిత్థి తో నిద్రలో జారుకుంటే చక్కటి నిద్ర కలిగి ఉల్లాసభరితమైన ఉదయం సాధ్యమవుతుంది.

చిట్కాలు & హెచ్చరికలు:
1. ఒక నిర్ణీత సమయానికి రొజూ నిద్ర పోవటంవల్ల మంచి నిద్ర మీ సొంతమవుతుంది.
2. నిద్రవేళకు ముందు కెఫీన్, నికోటిన్ లను నివారించండి.
3. పడుకునే సమయానికి బాగా ముందునించే ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. టీవీ, బాగా ప్రకాశవంతమైన లైట్లను ఆపివేయండి.

 

మందులు వాడకుండానే అధిక రక్తపోటు నియంత్రణకు 11 మార్గాలు...

బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీ, లోబీపికి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్‌ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్‌ ప్రెషర్‌ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. మానసిక ఒత్తిడులు కూడా బి.పిని ప్రభావితం చేస్తాయి.


అధిక పొట్టను తగ్గించుకోవాలి: మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. దానితో గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి.



అధిక బరువు: అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి. రక్తపోటు తరచుగా బరువు పెంచుతుంది. కేవలం నాలుగున్నర కేజీల బరువు తగ్గడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల రక్త పోటు తగ్గించడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలి. నడుము చుట్టు పేరుకొన్న కొవ్వు వల్లే హై బ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి వస్తుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవండి.




ఆరోగ్యకరమైన ఆహారం: ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మరియు సంతృప్త కొవ్వు వంటివి తీసుకోవడం వల్ల 14యంయం హెజిని తగ్గిస్తుంది. డైయట్ ప్లాన్ మార్చడం అంత సులభం కాదు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హెల్తీ డైయట్ ను పాటించవచ్చు.

 

ఉప్పును తగ్గించాలి: మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు. నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్‌ ఫుడ్స్‌ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది. ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.

 

ఆల్కహాల్: ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి మంచి మరియు చెడు రెండు ఉన్నాయి. అతి తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల రెండు నుండి నాలుగుmm Hgద్వారా రక్త పోటును తగ్గింస్తుంది. ఆల్కహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే హనీ ఎక్కువ కలుగ జేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది.

 

పొగాకు ఉత్పత్తులు మరియు సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్: ధూమపానం వల్ల శరీరానికి అన్నిరకాలుగాను నష్టం వాటిళ్లితుంది. పొగాకులో ఉన్న నికోటిన్ 10mm Hg స్థాయి రక్తపోటును పెంచుతుంది. ప్రతి రోజూ ధూమపానం చేసే వారికి తప్పని సరిగా రక్తపోటు లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే పొగతాగేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల నుండి పొగ పీల్చడం కూడా అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు, మరియు ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.




కాఫీ తగ్గించాలి: కేఫినేటెడ్ పానీయాలు తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ అధికంగా ఉంటుంది. అయితే ఈ బ్లడ్ ప్రెజర్ తాత్కాలికమా లేదా దీర్ఘకాలమా ఉంటుందన్న విషయం స్పష్టంగా తెలియదు. కాబట్టి కెఫిన్ ఉన్నటువంటి కాఫీ, పానీయాలకు దూరంగా ఉండండి.




ఒత్తిడి తగ్గించుకోవాలి: ఒత్తిడి లేదా ఆందోళన తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. కాబట్టి మీరు ఏ విషయంలో ఒత్తిడికి, ఆందోళనకు గురికాబడుతున్నారో తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. అందుకు యోగా, య్యామాలు, విహార యాత్రలకు వెళ్ళడం, ధ్యానం వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వండి.




కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి సపోర్ట్: మీ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి మెరుగుపరచుకోవచ్చు. మీకు మీరే మీ ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకోవడానికి వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇంకా అధిక రక్తపోటుకు గురి అయినప్పుడు వారే మిమ్మల్ని డాక్టర్ వద్దకు తీసుకెళతారు. కాబట్టి వీరి మద్దతు మీకు తప్పనిసరి.





డాక్టర్ చెకప్: రక్త పోటును మీరు ఇంట్లోనే పర్యవేక్షించుకోవచ్చు. లేదా డాక్టర్ వద్దకు వెళ్ళి తరచూ బడ్ల ప్రెజర్ ను తెలుసుకొని కంట్రోల్ చేసుకుంటుండాలి. హై బ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు డాక్టర్ సలహా పై మందులు వాడాలి.

 


క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతి రోజూ 30-60నిముషాల పాటు వ్యాయమం చేయడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. వ్యాయమం క్రమంతప్పకుండా చేయడం వల్ల కేవలం కొన్ని వారాల్లో మీ రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే వాకింగ్, ఉదయాన్నే పడే సూర్యకిరణాల్లో నడవడం వంటివి చాలా అవసరం.

 

అసాధారణంగా రక్తపోటు 130/90 మి.మీ. అంతకన్నా అధికంగా వున్నపðడు ఎక్కువ రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) అని అంటారు. 120/80 నుండి 139/89 మి.మీ స్థాయిని అధిక రక్తపోటు ముందు స్థాయిగాను, 140/90 మి.మీ. స్థాయిని అధిక రక్తపోటుగాను గుర్తించాలి. బి.పి రావటానికి కల కారణాలు.... స్ట్రెస్, ఊబకాయం, ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవటం, మధుమేహం.. బి.పి ఎక్కువ ఉండటం వల్ల గుండె పోటు, ఇతర గుండె జబ్బులు, కిడ్నీకి సంబందించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం ఏదైనా బి.పి పెరిగిపోయి ప్రమాదకర పరిస్థితి వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారు. బి.పి ఉందని తెలిసిన తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. అయితే మందుల వరకు వెళ్లకుండా తీసుకొనే ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పు చేసుకోవడం ద్వారా బి.పిని కంట్రోల్ చేసుకోవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. కాబట్టి మనం తినే ఆహారంతో పాటు జీవశైలిలో మార్పులు చేసుకొంటేఈ బి.పి. నుండి మనల్ని మనం కాపాడుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని, దాంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆహారం తిన్నామంటే సరి, హై బి.పి ని కూడా మనం మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.