all

Wednesday, December 12, 2012

గుడ్ లుకింగ్

 
నా వయసు 19. నేను చామనచాయగా ఉంటాను. జిడ్డు చర్మం. ఈ మధ్య నా ముఖం నల్లగా తయారైంది. నేను ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వాడను. ఇవి లేకుండా ముఖసౌందర్యాన్ని కాపాడుకోలేమా? సలహా ఇవ్వగలరు.
- సంజన, ఈమెయిల్


చాలామంది కాస్మొటిక్స్ అంటే సౌందర్య ఉత్పత్తులు వాడితేనే చర్మం కాంతివంతం అవుతుందనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఎండ, దుమ్ము, కాలుష్యం వంటి రకరకాల కారణాల వల్ల మీ ముఖ చర్మం నల్లగా అయింది. ఇంట్లో చేసుకోదగిన పద్ధతుల వల్ల నలుపు పోదు. సౌందర్యనిపుణుల వద్ద సరైన చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాత వారు ఇచ్చిన సూచనలు పాటించండి.

నా వయసు 21. నా జుట్టు బాగా పొడిబారి, జీవం లేనట్టుగా తయారైంది. వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. కొసలు మరీ ఎక్కువగా చిట్లుతున్నాయి. వీటి నివారణకు ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి.
- బి.శశి, ఈమెయిల్


శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చలికాలంలో మాడు, శిరోజాలు మరింత పొడిబారుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. కలపతో తయారు చేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను తల దువ్వుకోవడానికి వాడండి. మాడు నుంచి, కిందివరకు చిక్కులు లేకుండా దువ్వండి. దీనివల్ల మాడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. లోహంతో తయారైన హెయిర్‌పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు (మాడుకు కాకుండా) ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి.

నా వయసు 22. నాకు ముక్కుపైన మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంది. మొటిమల లోపల పస్ ఉంటుంది. బాగా నొప్పిగా అనిపిస్తాయి. మచ్చలు కూడా ఉన్నాయి. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? మొటిమలు కేవలం ముక్కుపైనే అవడానికి కారణం ఏంటి?
- భాగ్యశ్రీజక్కుల, ఈమెయిల్


మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువగా స్రవిస్తున్నాయి. శుభ్రపరచుకోకపోవడం వల్ల మురికి పేరుకుపోయి, మొటిమల సమస్య పెరుగుతోంది. ముక్కు జిడ్డుగా అనిపించినప్పుడల్లా ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచు కోండి. చేత్తో ముక్కును రుద్దకుండా టిష్యూపేపర్‌ని ఉపయోగించండి. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్‌లో డెర్మలాజికల్ స్పా రెమిడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి. సమస్య తగ్గుతుంది.

No comments: