all

Wednesday, December 12, 2012

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి - కార్న్ పన్నీర్ ఉప్మా

ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మా చాలా ప్రసిద్ది. అతి తక్కువ సమయంలో తయారైపోవు బ్రేక్ ఫాస్ట్ ఉప్మా. సాధారణంగా ఉప్మాను ప్లెయిన్ గా ఎప్పుడూ వండుతుంటారు. అప్పుడప్పుడు కొన్ని వెజిటేబుల్ వేసి తయారు చేసుకొంటుంటారు. మరికొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ సీజన్ లో దొరికే కార్న్ తోటి ఉప్మా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మరియు ఆరోగ్యం కూడా.. పన్నీర్ చేర్చడం వల్ల టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మరి మీరూ తయారు చేసి చూడండి...

corn paneer upma breakfast

కావల్సిన పదార్థాలు:

మొక్కజొన్నవిత్తనాలు(కార్న్): 1/2 cup
క్యాప్సికమ్: 1/2 (chopped)
క్యారెట్: 1 (chopped)
పచ్చిమిర్చి: 2 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
రవ్వ: 1 cup
పన్నీర్: 50 grams (grated)
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నెయ్యి: 1tbsp
నూనె: 1tbsp
టమోటో: 1 (chopped)
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. అందులో క్యారెట్, క్యాప్సికమ్, మొక్కజొన్నవిత్తనాలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.
2. తర్వాత అందులో ఉప్పు వేసి ఐదు నిముషాల పాటు ఉడికించాలి.
3. అవి ఉడికేలోపు మరో పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో రవ్వ వేసి తక్కువ మంట మీద వేయించి పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి.
5. ఇప్పుడు అందులో పన్నీర్ తురుమును కూడా వేసి, మరో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
6. పన్నీర్ తురుము వేగి బ్రౌన్ కలర్ లోని వచ్చిన తర్వాత అందులో ఉడికించిన కూరగాయలు, నీటితో సహా వంపుకోవాలి. ఫ్రై చేస్తున్న మిశ్రమాన్ని వెజిటేబుల్స్ ను బాగా మిక్స్ చేసి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి.
7. ఉప్మా తయారయ్యేంత వరకూ మీడియం మంట మీద ఉడికిస్తూ మద్య మద్యలో కలుపూతూ ఉండాలి. చివరగా కొత్తిమీర గరుగు, టమోటో ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే కార్న్ పన్నీర్ ఉప్మా రెడీ..

No comments: