all

Thursday, November 22, 2012

Pudina_Pulavపుదీనా పలావు;
కావలసిన పదార్థాలు...పుదీనా - 2 కట్టలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
తాజా కొబ్బరి తురుము - పావుకప్పు
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయ - ఒకటి ( సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌
లవంగాలు - 4
యాలకులు - 4
దాల్చిన చెక్క - 4
పలావు ఆకులు - 4
అనాసపువ్వు - ఒకటి
వేయించిన జీడిపప్పు - పావుకప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
ఉప్పు - సరిపడినంత

తయారు చేసే విధానం...
పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి. ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి. తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలపాలి. కుక్కరయితే వెయిట్‌ పెట్టకుండానూ, గిన్నె అయితే మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి. అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.

శనగపప్పు కేసరి

split-bengalgram
ఇది పోషకాల మయం. చేయడం ఎంతో సులువు. హల్వా రుచితో ఎంతో బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు...
పచ్చి శనగపప్పు - రెండు కప్పులు
పంచదార - రెండు కప్పులు
పాలు - లీటరు
నూనె - కొద్దిగా
నెయ్యి - టేబుల్‌ స్పూన్‌
జీడిపప్పు, పలుకులు,
ఎండుద్రాక్ష - కొద్దిగా


తయారు చేసే విధానం...
శనగపప్పును మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేయాలి. బాణలీలో నూనె వేడి చేసి, ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేయించాలి. ఇప్పుడు పాలను సగం అయ్యే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత శనగపప్పు మిశ్రమం, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులు ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలపాలి. సన్నటి మంటపై ఉంచి ఐదు నిమిషాలయ్యాక తీసేస్తే సరిపోతుంది.కొంచెం ఘాటుగా ఉండాలని కోరుకుంటే ముద్ద కర్పూరం చాలా కొద్దిగా చల్లుకోవచ్చు.

‘మీల్‌ మేకర్‌’ తో కొన్ని వంటలు

meal-makerమీల్‌ మేకర్‌ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మరింత ఇష్టంగా భుజిస్తారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మీల్‌మేకర్‌తో కొన్ని రుచికరమైన వంటలు మీ కోసం....

ఖీమా హల్వా


కావలసిన వస్తువులు:
మీల్‌ మేకర్‌ ఖీమా : 1/2 కిలో
చక్కెర: ఒక కప్పు
క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ తురుము: ఒక కప్పు
నెయ్యి: 100 గ్రాములు
ఇలాయిచీ పొడి: చిటికెడు
జీడీపప్పు, ద్రాక్ష: 25 గ్రాములు
పాలు: 2 కప్పులు


తయారు చేసే విధానం:
ముందుగా మీల్‌ మేకర్‌లో కొద్దిగా ఉప్పు వేసి 5 విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించి జార్‌లో ఖీమా బ్లేడ్‌ పెట్టి ఖీమాలాగా చేసిపెట్టుకోవాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ వేయించి పక్కనబెట్టు కోవాలి. క్యారెట్‌ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలు పోసి బాగా వేడి చేసి అందులో వేయించిన క్యారెట్‌, ఉడికించిన సోయా ఖీమా వేసి తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనిచ్చి ఇలాయిచి పొడి వేసి నెయ్యి తేలేలాగా దగ్గర కానివ్వాలి. దించే ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి దించాలి. ఇది కొద్దిగా చల్లారాక సర్వ్‌ చేసుకోవాలి. వెరైటీగా, రుచిగా ఉంటుంది. 


పులావ్‌

meal-maker-pulao
కావలసిన వస్తువులు:
మీల్‌మేకర్‌ : 250 గ్రాములు
బాస్మతి బియ్యం: 250 గ్రా
నెయ్యి, నూనె: 100 గ్రాములు
ఉప్పు: ఒక టేబుల్‌ స్పూన్‌
దాల్చిన చెక్క: ఒక ముక్క
అల్లం: 25 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు: ఒక గుప్పెడు
యాలకులు: 3
లవంగాలు -15
బిర్యానీ ఆకులు -2
పుదీనా- 4 రెబ్బలు
కొత్తిమీర- 4 రెబ్బలు
పచ్చిమిర్చీ-4
ఉడికించిన గ్రీన్‌పీస్‌ - 50 గ్రాములు
ఆలుముక్కలు - 1 చిన్న కప్పు
ఉల్లి తరుగు: ఒక చిన్న కప్పు


తయారు చేసే విధానం:

ముందుగా ఆలు ముక్కలు, గ్రీన్‌పీస్‌, సోయా (మీల్‌మేకర్‌) విడివిడిగా ఉడికించుకోవాలి. స్టవ్‌పై చిన్న కుక్కర్‌ పెట్టి నెయ్యి, నూనె వేసి కొద్దిగా వేడి చేయాలి. ఇలాయిచి, దాల్చిన,సగం అల్లం, సగం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. అందులోనే బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లితరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత మిగతా అల్లం, వెల్లు ల్లి పేస్ట్‌ వేసి మంచి వాసన, రం గు, రుచి వచ్చేదాకా వేయించి, గ్రీన్‌ పీస్‌, ఆలు ముక్కలు, సోయా ముక్కలు ఉడికించినవి వేసి వేయించి తగినంత నీరు (2 కప్పులు), ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 4 విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి. మంచి సోయా పులావ్‌ రెడీ. దీన్ని సోయా ఖుర్మా లేదా బఠానీ ఖూర్మా లేదా పుదీనా చట్నీతో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది.

దాల్చా

meal-maker-dalcha
కావలసిన వస్తువులు:
మీల్‌ మేకర్‌ - 100 గ్రాములు
కందిపప్పు - 50 గ్రాములు
కొబ్బరి- చిన్న ముక్క
కొత్తిమీర - నాలుగు రెమ్మలు
టమాటలు - 4
చింతపండు రసం - ఒక కప్పు
ఉల్లి తరుగు - 1/2 ఉల్లిపాయ
ఉప్పు - అర టీస్పూన్‌
కారం- ఒక టీ స్పూన్‌
ధనియాల పొడి - 3 టీ స్పూన్‌లు
పసుపు - చిటికెడు


తయారుచేసే విధానం:

ముందుగా సోయా ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్‌ మీద కుక్కర్‌ చిన్నగా పెట్టి ఉడికించిన సోయా, ఉప్పు, పసుపు, 2 రెమ్మల కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం సన్నని సెగ మీద తిప్పాలి. ఆ తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. కొబ్బరి మిశ్రమం, కంది బేడల మిశ్రమం, చింతపండు రసం వేసి బాగా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కమ్మని సోయా మీల్‌మేకర్‌ దాల్చా రెడీ. ఇది అన్నం రోటీ, పూరీ ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఆయిల్‌ లేకుండా కూడా దీన్ని వండవచ్చు.
-


 
 

 
Ragi_Muddaరాగి ముద్ద
రాయలసీమ వంటకాల్లో రాగిముద్ద ఎంతో పేరు గాంచింది. రోజువారీగా ఒక్కపూటైనా ఈ రాగిముద్ద తినకుండా సీమ వాసులు ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ రాగిముద్ద ఐటమ్‌ సీమవాసులకు చాలా ఇష్టం.

కావలసిన పదార్ధాలు:
బియ్యం నూకలు : 500 గ్రా.
రాగి పిండి  : 400 గ్రా.
ఉప్పు  : తగినంత

తయారు చేసే విధానం:
రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవా లి. ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి. నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి. తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు. మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే. ఈ రాగి ముద్దను రాయల సీమవాసులు రుచికరమైన నాటుకోడి పులు సు, పొట్టేలు తలకాయమాంసం, మటన్‌ పులుసు, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు. పల్లీల చట్నీలతో కలిపి తింటే ఆ రుచే వేరని సీమవాసులు ఆనందంతో చెప్తారు.

నాటుకోడి పులుసు:


రుచికరమైన నాటు కోడి పులుసు రాయల సీమవాసులకు ఎంతో ఇష్టం. దీనిని వేడివేడి గా తినాలని సీమ వాసులు కోరుకుంటారు.
కావలసిన పదార్ధాలు:
Nattu_Kodi_Pulusuనాటుకోడి మాంసం - 1 కేజి
నూనె  - 50 గ్రా.
ఉల్లిపాయలు         - 150 గ్రా.
పచ్చిమిరపకాయలు - ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద - సుమారు 100 గ్రా.
ఉప్పు  - తగినంత
పసుపు  - 1 స్పూను
పెరుగు  - 1 కప్పు
కొబ్బరి పొడి  - 2 టీ స్పూన్లు
కారంపొడి  - 1 స్పూను
ధనియాలపొడి - 1 స్పూను
కొత్తిమీర  - 1 కట్ట
పెరుగు  - 1 కప్పు


తయారు చేసే విధానం:
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.  

మెంతి పులావు
కావలసిన పదార్ధాలు:

బాసుమతి రైస్‌ - 1/2 కేజీ
Methi_Pulaoమెంతికూర  - 8 కట్టలు
టమాటాలు  - 2
పెరుగు  - 1 కప్పు
జీర  - 10 గ్రా.
పచ్చిమిరపకాయలు - 4
పసుపు  - 1 టీ స్పూను
నెయ్యి  - 50 గ్రా.
ఉప్పు  - తగినంత


తయారు చేసే విధానం:
బియ్యాన్ని శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకోవాలి. అలాగే మెంతి కూరను కూడా ఆకు కోసి కడిగి ఉంచుకోవాలి. అరకిలో బియ్యం ఉడికే గిన్నెను స్టౌమీద పెట్టి నెయ్యి వేసి వేడి అయిన తర్వాత జీర వెయ్యాలి. అది వేగిన తర్వాత మెంతి కూరను వేసి రెండు నిమిషాలు వేయించి దానికి టమాటా ముక్కలు, పెరుగు, పసుపు చేర్చాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యాన్ని పోసి కలపాలి. అప్పుడే ఉప్పును కూడా చేర్చాలి. బియ్యం 3/4 వంతు ఉడికిన తర్వాత మంటను తగ్గించి స్టౌవ్‌ను సిమ్‌ మీద ఉంచి పూర్తిగా ఉడకనివ్వాలి. వేడి వేడి మెంతి పులావ్‌ చాలా బాగుంటుంది.
పల్లీల చట్నీ

కావలసిన పదార్ధాలు:

వేరుశనగ గుళ్లు - 2 కప్పులు
కొబ్బరి పొడి  - 1 కప్పు
పుట్నాల పప్పు - 1 కప్పు (వేయించినవి)
పచ్చిమిరపకాయలు - 12
నూనె  - 2 టేబుల్‌  స్పూన్లు
జీలకర్ర, ఆవాలు - 1 టేబుల్‌ స్పూను
ఎండుమిర్చి  - 3
పచ్చిశనగపప్పు - 1 టేబుల్‌స్పూన్‌
మినపపప్పు  - 1 టేబుల్‌స్పూన్‌
వెల్లుల్లి  - 3 రెబ్బలు
కరివేపాకు  - 2 రెబ్బలు
చింతపండు  - కొద్దిగా
ఉప్పు  - సరిపడినంత
Palli_Chutney
తయారు చేసే విధానం:
వేరుశనగగుళ్లు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనెవేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేయించి పెట్టకోవాలి. ఈ మొత్తానికి వేయించిన శనగగుళ్లు, పుట్నాల పప్పు, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి దాన్లో ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దోరగా వేగాక కరివేపాకు వేయాలి. తరువాత ఆ పోపులో గ్రైండ్‌ చేసి ఉంచుకున్న పల్లీల చట్నీని వేయాలి. ఈ పల్లీల చట్నీని రాగిముద్దలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. రాయలసీమ వాసులు రాగిముద్దలోకి ఈ పల్లీల చట్నీని ఇష్టంగా తింటారు.

for hair tip

ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్‌ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. సహజంగా ఉంటే జుట్టు ఎర్రబారుతుందని అనిపించినప్పుడు ఈ చిట్కా ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి రాత్రంతా ఉంచేయండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా వేడి చేసి చల్లారిన తరువాత తాగండి. అలాగే కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నడినెత్తిన మసాజ్‌ చేయండి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొరవిప్పిన నల్లతారులా నిగనిగలాడుతుంది. ప్రయత్నించి చూడండి.
HAIR_KING

some tips

పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.

ఉదయాన్నే అయిదు గ్లాసుల నీరు తాగితే నోటి దుర్వాసనను పూర్తిగా నివారించవచ్చు.

పరగడుపున తులసి రసంలో తేనె కలుపుకుని తాగితే దగ్గు, జలుబు నివారించవచ్చు.

అల్లం ముక్కతో పాటు కాస్త పంచదారని కలిపి తింటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
అప్పటికప్పుడు పంటి నొప్పి నుండి రిలీఫ్‌ కావాలంటే నొప్పి ఉన్న చోట లవంగాన్ని అదిమిపెడితే సరి.

జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారిస్తుంది.

లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోక లు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.

నేరుడు విత్తులు, గింజ తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూలు, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికా య చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రిస్తుంది.

జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు, రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి

గొరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.

ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్ధాలకు బదులు చలవ పదార్ధాలు తింటే మంచిది.

జలుబు, దగ్గు తగ్గాలంటే రెండు తమల పాకులు , మూడు వేయించిన లవంగాలు, ఐదు గ్రాముల అతిమధురం ,ఐదు గ్రాముల వాము, చిన్న కరక్కాయ ముక్క దంచి రసం తీసి రోజుకు మూడు సార్లు తాగాలి.

ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ తుమ్మి ఆకు రసంతోపాటు రెండు టీ స్పూన్ల తేనెనుకలిపి రోజుకు రెండు సార్లు కళ్లలో వేయాలి. ఇలా మూడు రోజులు వేస్తే పచ్చకామెర్లు తగ్గుతాయి.‚
పంటి నొప్పితో బాధపడే వారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంద.

వేపపువ్వును ఎండబెట్టి ఓ సీసాలో నిల్వ ఉంచుకుంటే దానితో చారు చేసుకోవచ్చు. కొంచెం చింతపండు నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి మరిగించి ఆ తర్వాత తాళింపులో సరిపోయేంతగా వేపపువ్వు వేసి రుచికి కాస్తంత బెల్లం ముక్క కూడా వేస్తే రుచికరమైన చారు తయారవుతుంది. వేపపువ్వు వల్ల కడుపులో నులిపురుగులు నశిస్తాయి. మనం పగలు ఎంత విందు భోజనం చేసినా, రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే చారుతో అన్నం తింటే ఎంతో హాయిగా ఉంటుంది.

జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనెఫెక్షన్‌ బాధ నుంచి బయట పడవచ్చు.

అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటిెకడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.

ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనెఫెక్షన్‌ తగ్గుతుంది.


ginger

చర్మం నల్లబడుతుంటే...

కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు...చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడు తుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతా యి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్య లుగా చెబుతుంటారు.

హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సంబంధిత సమ స్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మం దుల కారణంగా, శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభదశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

కొన్ని చిట్కాలు...
1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.
3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్‌ లోషన్‌ ముఖానికి రాసుకోవాలి.
acharya4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.
5. కొంచెం క్యారెట్‌, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్‌ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
6. పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 

beauty tip

కీరదోస మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్‌ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్‌, సిలికాన్‌ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. దోసరసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది. దోసను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ ‘కె’ సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.

kira
కార్తీకంలో మన కర్తవ్యం
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తి క నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయా లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృత్తికా నక్షత్రం
sivaఈ కృత్తికానక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ లలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖ ములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక దీపాలు
ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను.ఈ మాసాన భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలకొండ (తమిళనాడులోని) మీద జ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్యోతి చాలా రోజుల వరకు వెలుగుతూ పరిసరప్రాంతాలన్నింటికీ కనబడుతూ ఉంటుంది.ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజ లను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు.

ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ అమితానందాన్ని చేకూరుస్తూ కన్నుల పండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తా రు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ విధంగా ఈ మాసమంతా నిత్యదీపారాధనతో వెలుగుతో నిండి ఉంటుంది. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

కార్తీక సోమవారాలు
ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథము డైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచ రించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ హిందూ ప్రజలంతా భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు.

శివప్రీతికరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియ మాలను పాటించవలెను. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. ఈ కార్తీక సోమవారాలలో వనభోజనం చేస్తారు. ఉసిరిక చెట్టుకింద భోజన చేయడం వల్ల శుభప్రదమని ప్రతీతి. ఈ సోమవారాలలో శివుడిని అర్చించి అనంతరం అన్నదానమును నిర్వహించి, అతిథి సత్కారాల తరువాత దీక్షవహించిన వ్యక్తి భుజించవలెను. ఈ నియమముల వలన శివాను గ్రహంకలిగి సర్వ పాపములు నశించును.

తులాసంస్థే దినకరే కార్తికే మాసి యో నరః
స్నానం దానం పితృశ్రాద్ధ మర్చనం శుద్ధమానసః
తదక్షయ్యఫలప్రాహుర్యత్కరోతి నరేశ్వర
సక్రమం వా సమారభ్య మాసమేకం నిరంతరమ్‌
మానస్య ప్రతిపద్యాం వా ప్రారభేత్కార్తికవ్రతమ్‌
నిర్వఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే
ఇతి సంకల్ప్య విధిత త్పశ్చాత్స్నానం సమాచరేత్‌


Untit6ఏ మనుష్యూడైనను తులారాశియందు సూర్యుడుండగా కార్తీకమాసమందు సూర్యోదయ కాలమునకు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి, నదీస్నాన మొనరించి, జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను జేసినచో గొప్ప ఫలంబు సంప్రాప్తించునని యుందురు . సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలుకొనిగాని వ్రతారంభమును చేయవలయును. అట్లు ప్రారంభించు సమయమున ఓ కార్తీక దామో దార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ జరుగునట్లు చేయుము అని పిమ్మట స్నానము చేయవలెను.ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నా రాయణునకును, భైరవునకును నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి,

మార్జన మంత్రముతో, అఘమర్షణ మంత్రముతో, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకును, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను. కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాది నదులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదులన్నిటి యందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పాద మాత్ర ప్రదేశమందున్న జలమునందు సన్నిహితుడై యుండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్ర కామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది.

నదీ స్నానావకాశము లభింపనిచో! కాలువ యందుగాని, చెరువునందుగాని, కూపము కడగాని సూర్యోద యము స్నానము చేయవలెను. ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీ పురుషూలకు ముఖ్యము. మడి బట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వపుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరము సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞమును ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలెను. దేవపూజకు తన యింటి దొడ్డిలోగాని, తోటలోగాని లభించిన పుష్పములనే స్వయముగ తెచ్చి ఉపయోగించుట ప్రధాన ధర్మము. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును గావించుకుని, స్వగృహంబునకుబోయి, అతిథిపూజ, వైశ్వదేవము మొదలగు నిత్యకర్మలను చేసి, తృప్తిదీర భుజించి, రెండుమారులు ఆచమనీయం చేసిన శుద్ధుడగును.

Unti6పిదప పురాణమును స్వయముగా జదువుటయో, లేక ఇతరులవలన వినుటయో చేయవలెను. సూర్యు డస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమునగాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూచించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదు లతో గూడిన నైవేద్యము నిడవలయును, అటు పిమ్మట చేతులు మోడ్చి మంత్రములచేగాని, స్తోత్రములచేగాని, గీతములచే గాని అష్టపదులచేగాని హరిహరులను స్తుతిచేయవలెను. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుదివరకు నెలదినములు వ్రతము చేసినచో కార్తీకమాస వ్రతము పూర్తగును.

మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూతతృప్తి గావించవలెను. ఇట్లు వ్రతమాచరించిన స్త్రీలు, పురుషూలకు ఈ జన్మమునందును, పూర్వజన్మమునందును నొనరించిన పాపంబులు పటాపంచలై, పవిత్ర వంతులై మోక్షార్హులగుదురు. ఇందు సందేహం ఏమాత్రమూ లేదు. మరియు నిట్లు చేయనవకాశములేక చేయువారితోగూడి సంతసించినను సమానమగు ఫలితము నందుదురు.

 
 
 
 

కార్తీక పున్నమి

భు‘వన భోజనాల’ కార్తీక పున్నమి
కార్తీక పూర్ణిమ నాడు శివలింగాన్ని జ్యోతిర్లింగంగా ఆరాధిస్తే సర్వపాప నివృత్తి. సర్వ శుభప్రాప్తి కలుగుతుందని కార్తీకమాహాత్మ్యం తెలియచేస్తుంది.
లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాం శివతుష్టయే
ఇహసమ్యక్‌ ఫలం ప్రాప్య సార్వభౌమా భవేత్‌ ధ్రువవ్గు
య: కూర్య ద్దీపదానంచ పౌర్ణమ్యాం కారీే్తక నఘ
సర్వపాప వినిర్ముక్త స్తతోయాతి పరాంగతివ్గు
ఇచ్చట లింగ, దీపదానమంటే భూమిని శుద్ధిచేసి శివలింగాన్ని చిత్రించి దీపాలతో అర్చించడమనే అర్థం. గోపురద్వార శిఖరే లింగాగ్రే కార్తీక్యావ్గు అర్పయేద్‌ దీపవ్గు అనే మాటను బట్టి శివ లింగార్చన శ్రేష్ఠమని తెలుస్తోంది. దీపతో లభతే విద్యాం దీపదో లభతే శ్రుతవ్గు దీపతో లభతే చాయు: దీపతే దివవ్గు అనే ప్రమాణాన్ని బట్టి కార్తీక మాసంలో దీప దానం వలన విద్యా, జ్ఞానం ఆయుష్షూ, సుఖం స్వర్గం అన్ని లభిస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం మన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పట్ల అంతగా అవగాహన ఉండడం లేదు. ధన, ఉద్యోగ, సుఖ, స్వార్థ కామాలతో విదేశీ వ్యామోహంతో మాతృభూమి, తల్లితండ్రులు, గురువులపై విశ్వాసం తగ్గి పోతుంది. నానాటికీ అడుగంటుతున్న మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతివారూ ఉద్యమించాలి.

వనభోజనాల సందడి
Untitlaకార్తీకమాసం వచ్చిందంటే సందడే సందడి. నేడు ఎపార్‌‌టమెంట్‌ కల్చర్‌ వల్ల ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా బ్రతుకులు మారిపోయాయి. కనీసం కార్తీక మాసంలో వనభోజనాల పేరిట కుటుంబాలు, స్నేహితులు ఒక చోట చేరటం, పిల్లలందరూ కలసి మెలసి ఆడుకోవడం జరుగుతుంది. వనభోజనాలు కేవలం, కులాలకు, ప్రాంతీయతలకే పరిమితం కాకుండా , విస్తరిస్తే ’వసుదైవ కుటుంబకం’ అర్థానికి పరిణితి సమకూరుతుంది. కార్తీక మాసానికే పరిమితం కాకుండా కుటుంబ సమ్మేళనాలు ప్రకృతి వాతావరణంలో కలవడం కారణాన మానసికవికాసం కలుగుతుంది. పిల్లలకు, పెద్దలకు చక్కటి అనుభూతిని అందిస్తుంది.

న కార్తీక మాసమో మాసః
నదేవః కేశవాత్పరమ్‌
నచ వేదసమం శాస్త్రం
న తీర్థం గంగాయస్సమమ్‌


కార్తీక మాసంనకు సమానమైన మాసం లేదు. కేశవుడితో సమానమైన దేవుడూ లేదు. వేదంతో సమానమైన శాస్తమ్రూ లేదు. గంగతో సమానమైన తీర్థము లేదంటారు. ఈ విధంగా పరమపావనమైన కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. జన్మజన్మల పాపములను పటాపంచలు చేసి మానవుడికి మోక్షం కలిగిచే మాసంగా ప్రసిద్ధి చెందిన కార్తీకమాసంలో చేసే స్నాన, పూజ, జపాదులు, దానం, దీప దానం, వనభోజనాలు వంటివి విశేష ఫలితాలనిస్తాయని శాస్తవ్రచనం. వీటన్నింటిలో ఆధ్యాత్మిక ఫలితాలతో పాటు సామాజిక ఏకత్వాన్ని, మానసికోల్లాసాన్ని ప్రశాంతతను ప్రసాదించేవి ‘వనభోజనాలు’.మారుతున్న సంస్కృతి, సామాజిక పరిస్థితులు, హడావిడిగా మారిన నగర జీవనాల మధ్య ’’వనభోజనాలు’’ వంటి ఆచారాలు మరిచిపోతూ ఉన్నా ఇప్పటికీ అక్కడక్కడ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉండడం సంతోషకరం.

vanaaనగర, పట్టణవాసులు ’పిక్నిక్‌’ల పేరుతో ఇటువంటి వాటిని జరుపుకోవడం గమనించవచ్చు. ‘వనభోజ నాలు’ మిగతా సమయాల్లో చేసినా కార్తీకమాసంలో తప్పనిసరిగా చేయాలి. కార్తీకమాసంలో వీటిని నిర్వహించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఇది సామాజిక కార్యక్రమం. అందరూ కలిసి వివిధ వృక్షాలు ఉన్న ఒక తోటగానీ, ఉద్యానవనంకు గానీ వెళ్లి అక్కడ వంట చేసుకుని సరదాగా ఆటపాటలతో గడిపి భోజనం చేసి రావడమే కాకుండా వనభోజన ఆచరణ విషయంలో మన శాస్త్రాల్లో కొన్ని నియమాలు పేర్కొనబడ్డాయి. పలు జాతుల వృక్షాలు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు క్రింద కూర్చుని పనసఆకులో భోజనం చేయాలనేది శాస్త్ర వచనం.

అంతకంటే ముందుగా ఉసిరిక చెట్టునూ, ఉసిరిక చెట్టుక్రింద సాలగ్రామాన్ని గానీ, శ్రీ మహావిష్ణువు పటాన్ని గానీ ఉంచి పూజించి నైవేద్యం సమర్పించాలి. గంధం, కుంకుమతో ఉసిరికచెట్టును అలంకరించి ఈ 21 నామాలతో పుష్పపూజ చేయవలెను.

ఓం శ్రీ ధాత్య్రైనమః, ఓం శ్రీ శాంత్యైనమః, ఓం శ్రీ మేధాయైనమః, ఓం శ్రీకాంత్యైనమః, ఓం శ్రీ ప్రకృత్యై నమః, ఓం శ్రీ విష్ణుపత్న్యై నమః, ఓం శ్రీమహాలక్షై్మ నమః, ఓం శ్రీ రమాయై నమః, ఓం శ్రీ కమలాయై నమః, ఓం శ్రీ ఇందిరాయై నమః, ఓం శ్రీ కల్యాణై్య నమః, ఓం శ్రీ కమనీయాయై నమః, ఓం శ్రీ సావిత్యై నమః, ఓం శ్రీ జగద్దాత్రే నమః, ఓం శ్రీ గాయత్య్రై నమః, ఓం శ్రీ సుధాత్య్రై నమః, ఓం శ్రీ అవ్యక్తాయై నమః, ఓం శ్రీ విశ్వరూపాయై నమః, ఓం శ్రీ సురుపాయై నమః, ఓం శ్రీ అబ్ధిభవాయై నమః, ఓం శ్రీ లోకమాత్రే నమః అనే నామాలను పఠిస్తూ పూజించిన అనంతరం

ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి
పుత్రాన్‌ దేహి మహాప్రాజ్ఞా యశోదేహి బలంచమే
ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం
నిరోగం కురుమాం నిత్యం నిష్టాపం కురుసర్వదా


van4అనే శ్లోకాన్ని పఠిస్తూ తొమ్మిది సార్లు ఉసిరిక వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. ఈ విధంగా ఉసిరిక చెట్టును, ఉసిరిక చెట్టు క్రింద ఉంచిన సాలగ్రామాన్ని పూజించడం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలం దక్కుతుందని పురాణాలు పేర్కొన్నాయి.ఇలా పూజను ముగించిన అనంతరం సాముహికంగా కూర్చుని వనభోజనాలు చేయాలి. అది కూడా ఉసిరిక చెట్టు క్రింద కూర్చుని పనస ఆకులో భోజనం చేయడం మంచిది. ఈ ఆచారాన్ని పరిశీలిస్తే ఇందులో ’’సామాజిక ఏకత్వం’’ అనే లక్షణమే కాకుండా అనేక ఆరోగ్యరహస్యాలు కూడా ఇందులో దాగిఉన్నాయని బోధపడు తోంది. ఉసిరిక ఆయుర్వేద వైద్య విధానంలో ప్రముఖమైన స్థానం పొందింది. ఉసిరిక కాయలో ఉన్నంత ’విటమిన్‌-సి’ మరెందులోనూ లేదని శాస్తజ్ఞ్రుల అభిప్రాయం.

ఎసిడిటి నివారణలోనూ వివిధ చ్యవన్‌ ప్రాశల తయారిలోనూ ఉసిరికను ఉపయోగిస్తారు. ఉసిరిక ఊరగాయ తో ప్రతి రోజూ ఒక ముద్ద అన్నం తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద శాస్త్రం వక్కాణి స్తోంది. అటువంటి దివ్య ఔషధగుణాలు కలిగిన ఉసిరిక చెట్టును పూజించడం, దాని క్రింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆ సమయంలో ఉసిరిక గాలిని పీల్చడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడుతూ ఉంది. ఇలా వనభోజనాల వల్ల ఆధ్యాత్మిక ఫలితాలతో పాటూ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది.

 
 
 

ఒత్తిడిని జయిస్తే ఆరోగ్యకరమైన జీవితం

ఒత్తిడిని జయిస్తే ఆరోగ్యకరమైన జీవితం
ఒత్తిడిని ఏదైనా శారీరక, రసాయనిక లేక భావావేశపూరిత, ఉద్విగ్నభరితమైన అంశంగానైనా పరిగణించవచ్చు.. అలాగే శారీరక లేక మానసిక అశాంతిని, ఆందోళనను కలిగించడంతో ఈ వ్యాధి సంక్రమించడానికి ఇది ఒక హేతువుగా, సకరాణయుతమైన అంశం కూడా కావచ్చు. ఒత్తిడిని కలుగజేసే శారీరక మరియు రసాయనిక అంశాలు తీ్ర గాయం, అఘాతం, అంటురోగాలు, జీవ విషాలు (టాక్సిన్స్‌), అనారోగ్యం మరియు ఏ విధమైన ఇతర గాయాలతోనైనా కూడీ ఉండవచ్చు. ఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనేకమై, వివిధ రకాలుగా కూడా ఉంటారుు.

Stresaఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనే కమై, వివిధ రకాలుగా కూడా ఉండాయి. ఒత్తిడి అనే మాట మానసిక ఒత్తిడితో సంబంధం కలిగినదిగా భావిస్తున్న ప్పటికీ తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయ కంగానే ఉంటా యి. ఉదా హరణకు ఒక ప్రొజెక్ట్‌ లేక మరేదైనా పనిని నిర్వహిస్తున్నప్పుడు తక్కువస్థాయిలో ఒత్తిడికి గుర వుతు న్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఉండగ లిగే టట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతం గా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది. ఒత్తిడిలో రెండు రకాలునానయి. స్ట్రెస్‌ (అనుకూలవంత మైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి) మరియు డిస్ట్రెస్‌ (ప్రతికూలమైన, నిర్సూహకరమైన ఒత్తిడి)ఉజ్జాయింపున చెప్పాలంటే ఛాలెంజ్‌ మరియు అదనపు బరువు.

ఒత్తిడి ఉదృతంగా ఉన్నప్పుడు లేక అతి తక్కువగా అదుపులో ఉన్నప్పుడు, అలాగే నిర్వహింపబడుతున్న పుడు, అది ప్రతికూలమైన సానుకూలం కానటువంటి ప్రభావాలకు కారణమవుతుంది. ఒత్తిడి వల్ల కలిగే పరిణామాలను ప్రభావితం చేసే అంశాలు మరియు ఒత్తిడికి అవకాశాన్ని కలిగించేవి ఒక వ్యక్తి ఒత్తిడిగి సులువుగా గురయ్యే అవకాశం ఈ క్రింది ఏ ఒక్క అంశం వల్ల గాని అన్ని ంశాల వలన గానీ జరగవచ్చు. అంటే ఒత్తిడికి ప్రతివారూ కూడా వివిధ మోతాదులో ఓర్పు, సహనం కలిగి ఉంటారు. అయితే ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి ఒత్తిడిని సులువుగా కలుగజేసే వాటిని ఎంచి, వాటిని ఇవే అని ఖచ్చితంగా నిర్ణయించలేము. అఞదుచేత కాలక్రమాన ప్రతి వ్యక్తి ఒత్తిడిని భరించగలిగే, ఓర్చుకోగలిగే స్థాయి మారుతూ ఉండుంది.

చిన్ననాటి, బాల్యావస్థలోని అనుభవాలు (ఒత్తిడికి గురయ్యే అవకాశాన్ని నింద, దుర్వినియోగం, హింస అనేవి మరింత పెచ్చవచ్చు). వ్యక్తిత్వం (కొందరి వ్యక్తిత్వాలు ఇతరుల కంటే ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నవిగా ఉంటాయి). జన్యుపరంగా (ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తూ ఉండే సేద తీర్చు కోవడం, విశ్రాంతిని తీసుకోవడానికి స్పందించడం ‘సిరోటినిన్‌ స్థాయిలు’ మెదడును క్షేమంగా చూస్తూ ఉంటే రసాయన పదార్థాలు). వ్యాధి నిరోధక శక్తిలో అసామాన్యత, తేడా (కొనిన రకాల వ్యాధులను కలుగజేసే విగా, అంటే కీళ్ళు, జాయింట్లలో నొప్పులు మరియు చర్మవ్యాధి వంటి ఒత్తిడిని భరించగలిగే, నిబాయించు కోగలిగే శక్తిని బలహీనపరిచేవి). జీవనశైలి (ప్రధానంగా అఞతగా పుష్టికరంగాలేని ఆహారం మరియు వ్యావమాలు చేస్తూ ఉండకపోవడం).

ఒత్తిడుల కాలవ్యవధి మరియు తీవ్రత. ఒత్తిడి ఉందా అని చూసేందుకు దర్యాప్తు చేయడానికి ఉసిగొలిపే సూచికలు నిద్రపోవడంలో ఇబ్బందులు, ఆకలి లేకపోవడ, ఏకాగ్రత లేదా దృష్టిని నిలపడంలో లోపం లేక ఏదైనా జ్ఞాపకముంచుకోవడంలో ఇబ్బంది, పనితనంలోనూ, సామర్థ్యంలోనూ తరుగుదల, విశేషంలేని, అసామాన్యమైన పొరపాట్లు, తప్పులు లేక స్వయంగా విధించుకున్న హద్దులను, ఆంక్షలను పాటించ కపో వడం, నిలబెట్టుకోలేకపోవడం, క్రోధం, కోపోద్రేకం, హింసాత్మక లేక సంఘవ్యతిరేక ప్రవర్తన, మత్తుపానీ యాలు లేక మాదకద్రవ్యాల దుర్వినియోగం, నరాల బలహీనత లేక అధైర్యంగా ఉండే అలవాట్లు.

ఆరోగ్యకరమైన మార్గాలు
కాసేపు వాకింగ్‌కు వెళ్ళండి. ప్రకృతి అఞదాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చెయ్యండి. ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి. ఒక చక్కటి వ్యాయామంతో ఉద్రిక్తతను పారద్రోలండి. ఏదైనా వ్రాయండి. ఎక్కుసేపు స్నానం చేయండి. సువాసన వెదజల్లుతూ ఉండే ఒక కొవ్వొత్తిని వెలిగించండి. వెచ్చటి ఒక కప్పు కాఫీ గానీ టీ గాని త్రాగండి. మీ పెంపుడు జంతువుతో కాసేపు ఆడుతూ కాలక్షేపం చేయండి. మీ ఉద్యానవనంలో పనిచేయండి. ఏదైనా ఒక సందేశాన్నందుకోఞడి. ఒక మంచి పుస్తకంలో నిమగ్నమవండి. సంగీతాన్ని ఆలకించండి. లేదా ఒక హాస్య చిత్రాన్ని చూడండి.

సేద తీర్చుకోవడానికి కాలాన్ని వేరే కేటాయించండి. మీ దైనందిన కార్యక్రమంలో విశ్రాంతి మరియు సేద తీర్చుకోవడాన్ని చేర్చండి. వేరే ఇంక ఏ వ్యాపకాలను మీ పక్కన చేరనివ్వకండి. అన్ని బాధ్యతల నుండి మీరు కాసేపు విశ్రాంతిని తీసుకుని గడపడానికి, అలాగే మీ శక్తిని తిరిగి పొందడానికి ఇదే మీ సమంయం.
ఇతరులతో కలిసి ఉండండి. మీ జీవితాన్ని ఉత్సాహభరితంగా చేసే ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉండే వారితో కాలాన్ని గడపండి. ఒత్తిడివల్ల కలిగిన ప్రభావాన్ని తగ్గించి, బలమైన సహాయ, సహకారాలను మీకందించే విధానం ఒత్తిడితో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.


ఏదో ఒకటి చేయండి, ప్రతిరోజూ ఆనందంగా గడపండి. తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగుజేసే కార్యక్రమాలను చేపట్టండి. ఇవి ఏవైనా కవచ్చు. జ్యోతిష్యశాస్త్రం గురించి కావచ్చు. పియానో వాయించడం లేక మీ బైక్‌ మీద సవారి చేయడం. మీ హాస్యధోరణిని కొనసాగించండి. మీ అంతటమీరే హాయిగా నవ్వుకో గలిగే సమర్థతతో కూడి ఉంటుంది ఇది. ఒత్తిడిని అనేక విధాలుగా ఎదుర్కోవడంలో నవ్వుతూ ఉండడం మీ శరీరానికి సహకరిస్తుంది.

ఆరోగ్యకరమైన జీవన విధానం
Stressaఆహారాన్ని మెరుగుపరిచే గ్రూప్‌ బి విటమిన్లు మరియు మెగ్నిషి యమ్‌ చాలా ముఖ్యమైనవి. అయితే, మిగతా అన్ని విటమిన్లు కూడా అదే శక్తిని కలిగి ఉంటాయి.ఒత్తిడి నుండి కాపాడడానికి విటమిన్‌ సి అవసరమైనది. విటమిన్‌ డి ఆరోగ్యవంతమైన శరీర పోషణకు సహకరి స్తుంది. ముఖ్యంగా ఎముకల విషయంలో, ఆరోగ్యవంతమైన శరీరం మరియు మెదడుకు సరిపోయి నంత స్థాయిలో ఖనిజాలను తీసుకోవడం కూడా ఆవశ్యకరమైనదే కాకుండా ఇవి ఒత్తిడికి గురయ్యే అవకాశం తగ్గిస్తాయి. ప్రస్తుతం మీరు తీసుకునే ఆహారాన్ని మదింపు చేసి ఎక్కడ మెరుగుపరచాలి అన్న దానిని గుర్తించి, అటువంటి మెరుగుపరచిన చర్యలకు కట్టుబడి ఉండండి. కాల్చి వండే వాటిని, డబ్బాలలో నిలువ చేసే ఉంచే ఆహారాన్ని, అధికంగా ఉప్పు మరియు మందు బిళ్ళలను వాడడం తగ్గించండి.

జీవ విషాన్ని (టాన్సిన్‌) లోపలికి తీసుకోవడం తగ్గించండి. స్పష్టంగా చెప్పాలంటే పొగాకు, ముఖ్యంగా మత్తుపానీయాలు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించవచ్చు కానీ, ఇవి శరీరం యొక్క సమతుల్యా నికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీనితో ఒత్తిడినే మరింతగా పెంచివేస్తూ, ఒత్తిడికి మరిన్ని అవకాశాలను కలుగజేస్తాయి. మరికాస్త ఎక్కువగా వ్యాయామం చెయ్యండి. సాధారణంగా, విపరీతమైన ఒత్తిడిని అనుభ విస్తున్నపుడు, వ్యాయామం ఆడ్రినాలన్‌ను మండించి, సహకారాన్నందించే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రోత్సాహకరమైన మనోభావాలను కూడా పెంచుతూ ఒత్తిడిని కలిగించే కారణాల నుండి వ్యాయా మం మన ధ్యానాన్ని మరల్చి, మనల్ని దాని నుండి దూరంగా ఉంచుతుంది.

ఒత్తిడిగా ఉంది అన్న భావాన్నుండి ఒత్తిడి కలగడానికి సహకరించే థాతువు కణజాలం నుండి వెచ్చదనంతో, జలుబు నుండి బిగుసుకుపోయిన నరాల నుండి వ్యాయామం మనల్ని విముక్తులను చేస్తుంది. వ్యాయామం మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మనకు మంచిది. ఒత్తిడికి గల అవకాశాలను తగ్గిస్తూ వ్యాయామం ఆరోగ్యవంతమైన శరీర పోషణకు మరియు శరీరపుష్టికి సహకరిస్తుంది. వ్యక్తిగత మనోభావాలకు మరియు మానసికావస్థలను గురించి స్వయం అవగాహనను పెంచుకోండి. అతి తీవ్రమైనదిగా తయారయ్యే ముందు దానిని గమనించి, సరైన చర్యలు తీసుకుంటూ ఒత్తిడి పెరుగుదలను, పేరుకుపోవడాన్ని నిరోధిం చండి. సేద తీర్చుకునే పద్దతులను అన్వేషించండి.

యోగా, ధ్యానం. స్వయయం యోగముద్ర, మసాజ్‌, స్వచ్ఛమైన గాలిని పీల్చడంతో పాటు ఏ ప్రత్యేక పరిస్థితిలోనైనా చేయగలిగేది, ఏదైనా సరే చేయగలిగితే ఇవన్నీ కూడా ఒక అవకాశమిస్తే చక్కగా పని చేస్తాయి. ఆరోగ్యవంతమైన జీవిత సమతుల్యానికి నిద్ర, విశ్రాఞతి అవసరమైనవి. పగటిపూట నిద్రపోవడం కూడా ఆరోగ్యకరమైనదే. ఇది మనల్ని రీచార్జ్‌ చేసి, కొత్త శక్తిని పుట్టించి,సేదతీర్చి, మెదడును ఒత్తిడి నుండి, అంతగా ఆనందకరం కాని మనోభావాలను మెదడు నుండి శుభ్రంగా తుడిచివేసినట్లు చేస్తుంది.

పనిచేసే చోట వచ్చే కోపం ఒత్తిడి లక్షణం
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, దాని కారణంగా వచ్చే ఒత్తిడిని మార్చి మెరుగుపరచవచ్చు. అటువంటి వ్యక్తి మార్పును కోరుకుంటేనే, అంటే అంగీకారం, సమ్మతి, గుర్తించడం, కట్టుబడి ఉండడం, దీనిపై సరైన అవగాహన కలిగి ఉండడం అన్నది అన్నింటికంటే ముందు ఆవశ్యకత. కోపంతో ఉండే కొంతమంది తమ కోపంలో గర్వాన్ని పొందుతారు. అలాగే మారడానికి వీరు ఇష్టపడరు. మరికొందరు దీని ప్రభావం తమపైన, ఇతరులపైనా ఎలా ఉంటుంది అన్నదానిని తెలుసుకోలేరు.

కోపాన్ని అదుపుచేయడం కోపంతో ఉన్న వ్యక్తి దానిని ఒప్పుకుని, మార్పుచెందడానికి అంగీకరిస్తూ, దానికి కట్టుబడి ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఒత్తిడి యొక్క మూలకారణాలను తెలుసుకోవడానికి సలహా, సంప్రదింపులు అవసరమవుతాయి. తమ కోపానికి పర్యవసానంగా కలిగే ప్రభావాన్ని అటువంటి వ్యక్తి నిష్పాక్షికంగా, బుద్దికుశలతో ఇతరులవైపు చూడవలసి ఉంటుంది. వారి ప్రవర్తన వినాశనకరమైనదని, ప్రతికూలమైనదని తెలుసుకోవడానికి కోపంతో ఉన్న వారికి నచ్చచెప్పడం ముఖ్యమైన ముందడుగు వంటిది.

aaNaveenవారి ఆరోగ్యంపైనా మరియు వారి కుటుంబం పైనా పడే దీని ప్రభావాలను గురించి వారితో చర్చించండి. బయట నుండి వాస్తవాలను తమంతట తాము చూడడానికి ఇటువంటి వ్యక్తిని చేరదీయండి. కోపాన్ని నియంత్రీకరించడంలో, వేయవలసిన రెండో అడుగు వారి కోపిష్టి స్వభావానికి కారణాలను అర్థం చేసుకోవడం. ఇది ఒత్తిడికి కారణమయ్యే అంశాలతో పాటుగా ఒత్తిడిని కలుగుజేసే అవకాశాలతో కలిసి ఉంటుంది. తగినంత విశ్వాసాన్ని మరియు సౌహార్థ్రతను పెంపొందిం చుకోవడానికి కౌన్సెలర్‌ అనేక సార్లు సమావేశాలను నిర్వహించవలసి ఉంటుంది.


- డా నవీన్‌కుమార్‌,
న్యూరాలజిస్ట్‌, లక్డీకాపూల్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌,
సెల్‌ 92472 59479.

Email|Print|

అధిక బరువు అనారోగ్యాలు

ఈ ఆధునిక యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మనుష్యూల్లో అధిక బరువు, స్థూలకాయం ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉన్నాయి. అధిక బరువున్న వారు 1.2 బిలియన్లుండగా, వారిలో 300 మిలియన్లు మంది స్థూలకాయులుగా ఉన్నారు. ఈ సమస్య ప్రమాదకరమైన అనారోగ్యాలకు దారితీస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం నివారించ దగిన పది ఆనారోగ్య కారణాలలో స్థూలకాయం ఒకటి. దాదాపు 13శాతం మంది పిల్లలు, యువకులు స్థూల కాయంతో బాధపడుతూ ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. ఈ శాతం గత పదేళ్ళ కన్నా రెండింతలు ఎక్కువైందని అంచనా. ఇవాళ టీవీలు, కంప్యూటర్‌ గేమ్స్‌, ఆట స్థలాలు కరువైపోవడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కేలరీలు మిగిలిన చిరుతిళ్ళు, ఆహార విషయంలో అవగాహన లేక పోవడం వంటివి ప్రధాన కారణాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. స్థూలకాయం కారణంగా పరిణమించే ముఖ్యమైన వ్యాధులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, కీళ్ళ జబ్బులు, కేన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధులు, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు, అల్సర్లు, గ్యాస్టిక్‌ ్టబ్రుల్‌ మొదలైనవి.

బరువు ఏ వయసులో ఎలా పెరుగుతుంది?
మన శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరితే అధిక బరువవుతాం. దీనినే ఊబకాయం అంటాం. ప్రపంచం మొత్తంలో ఈ అధిక బరువు వల్ల ఎంతమందో ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి మనం బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు అవగాహన ముఖ్యం. ముందుగా బరువు పెరగడానికి కారణాల్ని చూద్దాం.

ముఖ్యంగా మధ్యవయసులో ఎక్కువమంది బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నప్పటి నుంచి అధిక బరువు తో ఉండవచ్చు. ఏ వయసు లోనైనా బరువు ఎక్కువగా కనిపించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళలో ఈ అధిక బరువు తక్కువగా కనిపిస్తోంది. వంశపారంపర్యంగా కూడా అధిక బరువు వస్తుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ అధిక బరువున్న వాళ్ళయితే వాళ్ల పిల్లల్లో 80 శాతం మందికి జీన్స్‌ ద్వారా అధిక బరువుండే లక్షణం రావచ్చు. ఎండో క్రైన్‌గ్లాండ్స్‌ సిక్రీషన్స్‌ ఇంబాలన్స్‌ వల్ల అధిక బరువు కలుగవచ్చు.

మహిళలు - అధిక బరువు
పెద్ద మనిషి అయినప్పుడు, గర్బవతులైనప్పుడు, ముట్లుడిగిన తర్వాత సాధారణంగా కలుగుతుంటుంది. స్టిరాయిడ్స్‌, నోటి ద్వారా కాంట్రాసెప్టివ్‌, ఇన్సులిన్‌ వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. అధిక బరువున్నప్పుడు లావుగా తయారై, మన దైనందిన కార్యక్రమాల్ని నిర్వహించడమే కష్టమవుతుంటుంది. బద్ధకం పెరుగుతోంది. త్వరగా కదల బుద్దికాదు. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.

అధిక బరువు తెలుసుకోవడం ఎలా?
Obesaబాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎమ్‌ఐ) ద్వారా బిఎమ్‌ఐ... బరువు కిలోలలో బై ఎత్తు మీటర్లలో దీన్ని తెలుసుకోవచ్చు. బాడీమాస్‌ ఇండెక్స్‌ 20 నుంచి 25 వరకూ ఉంటే సాధారణ బరువు. 25 నుండి 30 మధ్య ఉంటే అధిక బరువు. 30 నుండి 35 వరకూ స్థూలకా యం. 35 నుంచి 45 వరకూ ఉంటే స్థూలకాయం. గ్రేడ్‌2, 40 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయం. గ్రేడ్‌3 బిఎమ్‌ఐ 30కు పైగా ఉంటే ఒబేస్‌ అని, 40కు పైగా ఉంటే మార్బ్‌డ్‌ ఒబేడ్‌ అని అంటారు. కొద్ది పాటి అధికబరువు ఉన్నవాళ్ళు వ్యాయామం, ఆహార వ్యవహారాల మార్పుతో బరువు తగ్గించుకోవచ్చు. మార్బ్‌డ్‌ ఒబేసిటీ ఉన్నవాళ్ళకీ బేరియాట్రిక్‌ సర్జరీస్‌ ద్వారానే బరువును తగ్గించవచ్చు. ఇలాంటి సర్జరీస్‌ వల్ల ఇబ్బంది ఉండదు. మామూలు జీవితానికి రావచ్చు.

డాక్టర్‌ కె.ఎస్‌.లక్ష్మి,
ఓబేసిటీ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌,
లక్డీకపూల్‌, హైదరాబాద్‌.
సెల్‌ నెం.98497 13853

 
 

మాంసం మృదువుగా ఉడికించేదుకు 10 చిట్కాలు.

ప్రస్తుత కాలంలో శాకాహారంతో పాటు మాంసాహారన్ని తినేటటువంటి వారు కూడా చాలా పెరిగారు. మాంసాహార ప్రియులు వారంలో ఒకటి రెండు సార్లు మాంసహారం రుచి చూడందే వారికి భోజనం రుచించదు. అయితే మాంసాహారాన్ని తినేవారు వాటి వల్ల లాభనష్టాలు తెలుసుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని తగిని మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడు కోగలుగుతారు. అంతే కాదు వండే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శాకాహారం కంటే మాసాహార్ని వండటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల భారీన పడాల్సి వస్తుంది. కాబట్టి మాంసాన్ని మెత్తగా.. త్వరగా ఉడకాలంటే కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం....

ఉప్పు: మాంసం మెత్తగా ఉడకాంటే సీ సాల్ట్ ను మాంసం మీద చల్లి ఒక గంట తర్వాత ఉడికించుకోవాలి. సాధారణ ఉప్పు కంటే సీ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల మాంస ముక్కల్లోనికి చొచ్చుకొని పోయి మెత్తబడాలా చేసి తిరిగి అదే ఆకృతి కలిగి ఉంటుంది.


టీ: మాంసాన్ని మెత్తబరిచే టానిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సహజంగా మెత్తబడేలా చేస్తుంది. ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీ ని తయారు చేసి చల్లారిన తర్వాత మాంసం ముక్కలకు పట్టించిన అరగంట తర్వాత ఉడికించాలి.



వైన్, సిట్రస్ జ్యూస్, లేదా వెనిగర్: సిట్రస్ (నిమ్మ, నారింజ)వంటి వాటిలో సిట్రిక్ ఆసిడ్ కలిగి వుండటం వల్ల మాంసాన్నికి వీటి రసాన్ని పట్టించడం వల్ల మాంస యొక్క కండర తంతువులు మృదువుగా మారుతాయి. సిట్రస్ జ్యూస్ కోసం నిమ్మరసం లేదా పైనాపిల్ వాడొచ్చ. ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా బాల్సామిక్ లేదా ఇంట్లో సాధారణంగా ఉపయోగించే వెనిగర్. టానిన్స్ గుణాలు కలిగినటువంటి రెడ్ వైన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మాంసాన్ని మృదువుగా చేస్తుంది.



టమోటో సాస్: టమోటోలో ఆమ్లాగుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సాస్ ను మాంసం ముక్కలకు బాగా పట్టించిన అరగంట తర్వాత ఉడికించుకోవాలి



బీర్: బీర్ లో ఆల్ఫా యాసిడ్స్ మరియు టానిన్స్ కలిగి ఉండి, మంచి రుచిని మరియు సువాసనను కలిగిస్తుంది. కాబట్టి మాంసాన్ని ఫ్రైచేయడానికి లేదా గ్రిల్లింగ్ చేయడానికి అరగంట ముందే బీర్ తో మ్యారినేట్ చేయాలి.



కోలా: మాంసం ముక్కలను కోలా(డైయట్ కోక్ కాదు) తో మ్యారినేట్ చేసి అరగంట నుండి ఐదు ఆరు గంటలు నానబెట్టడం మల్ల మళ్లీ, ఆమ్ల ఉత్ప్రేరకం కలిగిస్తుంది.

అల్లం: అల్లం ప్రోటియోలైటిక్ క్ ఎంజైమ్ ను కలిగి ఉండి. ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.



కాఫీ: సహజ టెండరైసర్ కూడా రుచిని జోడిస్తుంది. స్ట్రాంగ్ కాఫీ చల్లబడిన తర్వాత గ్రిల్డ్ చేయడానికి ముందుగా మాంసానికి మ్యారినేట్ చేసి ఇరవై నాలుగు గంటల తర్వాత వండుకోవచ్చు.



మజ్జిగ మరియు పెరుగు: వీటిలో ఆమ్లత్వం గుణం కలిగి ఉంటుంది. మరియు ప్రోటీన్ విచ్ఛిన్నం ఉపయోగపడే కాల్షియం కంటెంట్ ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. కాబట్టి మాంసం త్వరగా ఉడకాలంటే పెరుగు లేదా మజ్జిగతో మ్యారినేట్ చేసిన ఐదారు గంటల తర్వాత వండుకోవచ్చు.


అత్తి పండ్లను, పైనాపిల్, కివీస్, బొప్పాయి: ఈ పండ్లలో ప్రోటీన్ విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు కలిగి ఉండటం వల్ల ఈ పండ్లలో ఏదైనా ఒకదానితో మాంసాన్ని నానబెట్టి కొన్నిగంటల తర్వాత వండుకోచ్చు.

షాపింగ్ కు వెళుతున్నారా...?ఐతే ఈ బేసిక్స్ రూల్స్ మీకోసమే ...?

సాధారణంగా మనకి నిత్యవరసర సరులకులు, వస్తువులు రోజూ అవసరమే. ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువులు అవసరం ఉంటుందో ఎప్పుడు ఏం అయిపోతాయో.. ఎవ్వరికీ తెలియదు. షాపింగ్‌కు వస్తారా? అని ఎవ్వరైనా అడిగితే చాలు అవసరం ఉన్నాలేకపోయినా బయలుదేరేవారు చాలామంది ఉంటారు. షాపింగ్‌ చాలా మందికి సరదా... కొందరికి కాలక్షేపం, మరికొద్దిమందికి మార్కెట్‌ పరిశోధన. కొనేది లేకపోయినా చాలామంది షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లి కనీసం విండో షాపింగైనా చేస్తుంటారు.



ఒక్క రోజు ముందే ప్లాన్: షాపింగ్ వెళ్ళాలనుకొనేటప్పుడు ఒక్క రోజు ముందే ప్లాన్ చేసుకోవాలి. దాంతో మీకు కావల్సిన వస్తువు జాబితాను రాసుకోవడానికి కావల్సిన సమయం ఏర్పడుతుంది. అలాగే లిస్ట్ లో మర్చిపోయిన వస్తువులు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కావల్సినంత సమయం ఉంటుంది.



షాపింగ్ లిస్ట్ : షాపింగ్‌కి వెళ్ళి ఆఫర్ ఉన్నది కొనడం కాకుండా, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఇంటివద్దనే జాబితా తయారు చేసుకోండి. దీనివలన మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది. అనవసర వస్తువులు కొనుగోళ్లకు దూరంగా ఉండగలుగుతారు.


చెక్ లిస్ట్: ఇక షాపింగ్ కు వెల్లే ముందు ఒక సారి మీరు రాసుకొన్న లిస్ట్ ను మళ్లీ ఒక సారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ లిస్ట్ తోనే షాపింగ్ కు వెళ్ళాలి. దాంతో మీరు లిస్ట్ ప్రాకారం అన్నీ కొనుగోళు చేసారా లేదా అన్నది తెలిసిపోతుంది. ఏదైనా మర్చిపోయినా మార్క్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.



మీవారితో ఒక సారి సంప్రదించండి: సాధారణంగా ఈ విషయంలో చాలా మంది కపుల్స్ ఒకరినొకరు సంప్రదించుకోరు. దాంతో ఒక్కోసారి ఇద్దరూ ఒకే ఐటమ్ ను తీసుకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పుడు డబ్బుతో పాటు వస్తువులను కూడా సేవ్ చేయవచ్చు.



కుటుంబ సభ్యులు: షాపింగ్ లిస్ట్ రెడీ చేసేటప్పుడు అది మీ ఒక్కరికి మాత్రం సంబంధించినది మాత్రమే కాదు. ఉమ్మడి కుటుంబం అయితే ఇంట్లో వారికి కూడా ఏవైనా అవసరమున్నాయో లేదో కనుక్కొని జాబితాలో చేర్చుకోవాలి. దాంతో తర్వాత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకేసరి కొనడం ఒకే ప్రదేశంలో కొనడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.


వంటగదిలో వస్తువుల స్టాక్ : సాధారణంగా కొన్ని సార్లు ఉన్న వస్తువులనే అవి పూర్తిగా వాడకముందే మళ్ళీ అదే వస్తువులను కొనడం వల్ల కొన్ని సార్లు అవి పాడవుతుంటాయి. పురుగులు పడుతుంటాయి. కాబట్టి ఇంట్లో వస్తువుల స్టాక్ చూసుకొని మాత్రమే జాబితా రెడీ చేసుకోవాలి.



క్యాటగిరి వైజ్ లిస్ట్ ప్రిపరేషన్: షాపింగ్ వెళుతున్నామంటే నెలంతటికీ సరిపడే వంట గదిలో వినియోగించే వస్తువులను మాత్రమే కొనడానికి మాత్రమే కాదు. వారానికి సరిపడే వెజిటేబుల్ లిస్ట్ సపరేట్ గా, పాలు, పళ్లు ఇంకా ఇలా ఇంప్రూవ్ మెంట్ కు సంబంధించినవి సపరేట్ గా క్యాటగిరీ వైజ్ రాసుకోవాలి. . లేదంటే కళ్లముందు కనిపించిన ప్రతీదాన్ని కొనే ప్రమాదం ఉంది.



స్టోరేజ్: నిల్వ వుంచిన పదార్థాల విషయంలో మెలుకువులు పాటించాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు ఎప్పటి నుండో అలాగే ఉండి ఉంటాయి.వ వాటి ఎక్స్ పైరీ డేట్స్ ముగిసి వుంటాయి. అటువంటివి గమనించి తీసుకోవాలి. ఉదాహరణకు బియ్యం, గోదుమలు, వైన్, గరం మాసాల, స్పైసీ ఐటమ్స్, ఊరగాయలు వంటివి సంవత్సరాల పొడవునా అలాగే ఉంచేస్తుంటారు. ఏదేని ఆఫర్స్ చూసి కొనాలనుకొంటే అందులో ఏదో మిస్టేక్ ఉందని గమనించాలి.



బడ్జెట్: షాపింగ్ లకు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని ఖర్చు చేసేయకూడదు. ముఖ్యంగా ఇంటి సరుకులకు వెళ్ళేటప్పుడు బడ్జెట్ వేసుకొనే వెళ్ళాలి. ఒక వేళ మీరు ఒక్కరే ఉన్నట్లేతే ఆలోచించాల్సిన పనిలేదు. ఇంట్లో చాలా మంది నివసించేటట్లైతే అందుకు తగినంత మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ లిస్ట్ ప్రకారం బడ్జెట్ మించకుండా చూసుకోవాలి.



కార్డులు ఉపయోగించండి: షాపింగ్‌లకు జరిపే లావాదేవీలన్నీ నగదు కంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది. పండగల సమయంలోనైతే కార్డుల ద్వారా చేసే షాపింగ్‌లపై బ్యాంకులు అదనపు రివార్డు పాయింట్లను అందిస్తుంటాయి. ఈ రివార్డు పాయింట్ల ద్వారా మీరు గిఫ్ట్ వోచర్లను పొందవచ్చు.

పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో షాపింగ్ అంటే మొదట మాల్సే గుర్తుకువస్తాయి. మనకు కావలసిన వస్తువులన్నీ శుభ్రం చేసి అందంగా ప్యాక్ చేసి ఆకర్షణీయంగా సరుకులను సర్ధడం వల్ల ఎంపిక చేసుకోవడం చాలా సులువు. సమయం కూడా ఆదా అవుతుంది. అంతే కాదు మాల్స్‌ కి వెళ్లామంటే అక్కడి వస్తువులు ఆకర్షింపజేసి కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తాయి. అవసర మైనా...కాకపోయినా వస్తులతో నిండిన క్యారీ బ్యాగులతో ఇంటికి చేరడం ఖాయం. అప్పటి వరకు ఇది మనకు సంతృప్తినిచ్చినా జేబుకు మాత్రం పెనుభారమే. అయితే జేబుకు చిల్లు పడకుండా, అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేలా కొన్ని కిటుకులు పాటిస్తే మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడమే కాకుండా ఇంటికి అవసరమైన వస్తు వులను తక్కువ ధరలో తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా...!

గోరింటాకు ఎర్ర గులాబీలా పండాలంటే....?

పంటలేని గోరింటను అరచేతుల్లో పూయించడం అంటే అతివలకు అత్యంత ఇష్టమైనది. మందారంలా పూసినా, గులాబీలా పూసినా... చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. పెళ్లిళ్లలో, పండగల్లో మగువల మనసుల్లో వెంటనే మెదిలేది మెహిందీ. అసలు ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టకోవడం కూడా ఒక వేడుకే కదా. అయితే ఏదో చేతికొచ్చింది కాకుండా మనసుపెట్టి గీయడానికి అరచేతులను కాన్వాస్‌గా మలుచుకోవాలనుకునేవారికి వెబ్‌సైట్లలో లెక్కకు మించి డిజైన్ల ఉన్నాయి. అరబిక్, పాకిస్తానీ, ఇండియన్, బ్రైడల్, రాజస్థానీ...ఒకటేమిటి

how darken the colour mehendi

అందమైన ఆకుపచ్చని హెన్నా డిజైన్లు... చేతులకు, కోమల పాదాలకు ఇనుమడింపజేసే ఈ అందం..చూసి తీరవలసిందే కాని మాటల్లో చెప్పలేనిది. గోరింటా అరచేతుల్లో పెట్టుకుంటే కలలు నిజం చేస్తుందన్నది నమ్మకం. ఇక కేశాలకు పట్టిస్తే చక్కటి రంగుతో జుట్టు మెరిసేలా చేస్తుందన్నది వాస్తవం... ప్రాచీన కాలం నుండి నేటి రకు చక్కటి రంగు కోసం గోరింటాకు పేస్ట్ తయారీలో ఎన్నో రకాల పద్దతులను అనుసరిస్తూ వచ్చారు. గోరింటాకు అందంగా, ఎర్రగా పండి చేతులకు, పాదాలకు చక్కని అందం రావాలంటే ముందుగా గోరింటాకు నాణ్యనతను పరిశీలించాలి. గోరింటాకు మిశ్రమాన్నా సరైన పద్దతిలో తయారు చేసుకోవాలి. అంతే కాదు గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు మీకోసం...
గోరింటాకు(మెహిందీని)రాత్రంతా నానబెట్టాలి: గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడినీళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్ టీలో కనుక కలిపి నానబెట్టినట్లైతే మరింత డార్క్ కలర్ తో గోరింట పండుతుంది.
మెహిందీకి కాఫీపౌడర్ మిక్స్: మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్ కలిపుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు పెట్టుకొన్నట్లైతే కాఫీ బ్రౌన్ కలర్ లో పండుతుంది.
నిమ్మరసం మరియు పంచదార: నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్ లా తయారు చేసుకోవాలి. మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరేసమయంలో ఈ లెమన్ సుగర్ సిరఫ్ ను చేతులకు అప్లై చేయాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్.
మెహిందీని పెట్టుకొన్న తర్వాత కనీ 6గంటల సమయం అలాగే ఉంచాలి: గోరింటాకు చేతులకు పెట్టుకొన్న తర్వాత అది చేతుల మీద కనీసం ఆరుగంట సమయం అన్నా ఉండేట్లు చూసుకోవాలి. అందుకు లెమన్ సుగర్ సిరఫ్ ను మధ్య మధ్యలో రాస్తుంటే మీరు కోరుకొన్న కలర్ మీ చేతుల్లో పండుతుంది.
లవంగాల ఆవిరి పట్టించడం: లవంగాలను ఒక పాన్ లో వేసి వేయించాలి. వేయించే సమయంలో వచ్చే పొగ మీద రెండు చేతులను ఒక అంగుళం దూరంలో పెట్టి ఆవిరి పట్టించాలి. ఆ పొగ చేతులకు వేడి పుట్టించి మెహిందీ మరింత ఎర్రగా పండేలా చేస్తుంది.

నొప్పిని పోగొట్టే బామ్: మెహిందీ పెట్టుకొన్న తర్వాత ఈ పెయిన్ రిలిఫీ బామ్ ను అప్లై చేయడమనేది చాల పాత పద్దతి. దీన్ని ఉపయోగించడం వల్ల చేతులకు వేడి పుట్టించి మెహిందీ బాగా ఎర్రగా పండేలా చేస్తుంది.

అందమె ఆనందం

పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతివంతం అవుతుంది.