all

Thursday, November 22, 2012

పిల్లలకు హోంవర్క్ చిట్కాలు!

సాధారణంగా పిల్లలు స్కూలు విద్యకు వచ్చే సరికి సిలబస్ అధికంగా వుంటుంది. స్కూలులో టీచర్స్ కూడా వీరికి అధికంగా హోంవర్క్ ఇవ్వటం చేసి వారి విద్యా శిక్షణకు తోడ్పడతారు. ప్రతిరోజూ స్కూలులో ఇచ్చే హోం వర్కు మీ చిన్నారులకు ఎంతో కష్టమనిపిస్తుంది. హోం వర్క్ అధికమైతే, వారి ఆట పాటలు కూడా వెనకపడతాయి. హోం వర్క్ చేయకుంటే స్కూలులో టీచర్లచే వారు దండించబడతారు. ఇటువంటపుడు మీ బిడ్డ తన విద్యను బాగా అభ్యసించేందుకుగాను అతను ఇంటివద్ద హోం వర్క్ ప్రతిరోజూ సరిగా చేస్తున్నాడా లేదా అనేది గమనించాలి. హోం వర్క్ చేయటానికి గాను మీరు అతనికి కొంతమేరకు సహకరించాలి. మరి పిల్లల హోం వర్క్ తేలికగా ఇంటివద్ద అయిపోయేందుకు కొన్ని చిట్కాలు పరిశీలించండి.

హోం వర్క్ అన్న పేరుతో మీ పిల్లాడిని గంటలతరబడి డెస్క్ పై కూర్చో పెట్టకండి. పిల్లల స్టడీ, మరియు నిర్వహణా నైపుణ్యతలను మీరు మెరుగుపరిస్తే, ఎంతటి చిక్కు సమస్యలనైనా సరే వారు పరిష్కరించుకోగలరు. మధ్యలో వారికి కొంత బ్రేక్ కూడా ఇవ్వాలి. వారికి చెపటం ద్వారా పెద్దలు కూడా ఒకటి రెండు విషయాలు కొత్తవి నేర్చుకునే అవకాశం వుంటుంది.
పిల్లల హోం వర్క్ చిట్కాలు
టీచర్ల గురించి తెలుసుకోండి. స్కూలులో జరిగే ఫంక్షన్లకు హాజరవండి. పేరెంట్ టీచర్ మీటింగులు, ప్రాధాన్యం. అపుడు మీరు మీ పిల్లాడి టీచర్లను కలుసుకోవచ్చు. వారి హోంవర్కు విధానాలు, వాటిలో మీ జోక్యం ఎంతవరకు అనేది నిర్ణయించుకోవచ్చు.

Top 10 Home Work Tips Kids


ఇంటివద్ద హోం వర్కు చేసేందుకు అనువైన పరిస్ధితి అంటే, వారికి కావలసిన పేపర్లు, పెన్సిళ్ళు, జిగురు, సిజర్లు వంటివి అందుబాటులో పెట్టండి. స్టడీకి ఒక రెగ్యులర్ సమయం వుంచండి. కొంతమందికి సాయంకాల చిరుతిండి తర్వాత మంచి సమయంగా భావిస్తారు. మరికొంతమంది డిన్నర్ తర్వాత మంచి సమయంగా భావిస్తారు. వారి చదువు ప్రణాళికకు సహకరించండి. అధికంగా వుంటే, హోం వర్క్ చేసేటపుడు మధ్యలో చిన్న బ్రేకు ఇవ్వండి. ఒక ప్రణాళిక చేసి ఇవ్వండి. ప్రతి గంట హోం వర్క్ కు 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి.

టి.వి. మ్యూజిక్, ఫోన్ కాల్స్ వంటి అంతరాయాలు మధ్యలో లేకుండా చూడండి. పిల్లలు తమ పని తామే చేసుకునేలా చేయండి. వారంతటవారే ఆలోచించి చేయాలి. మీరు మార్గదర్శకులుగా మాత్రమే వుండాలి. పిల్లలను ప్రోత్సహించండి. వారు పూర్తిచేసని హోం వర్క్ ను మీరు చెక్ చేయండి. మీరు కూడా అతనికి ఆదర్శంగా వుండాలి. అతను హోం వర్క్ చేసుకునేటపుడు మీరు కూడా పుస్తకం చదవటం, మీ బడ్జెట్ వేసుకోవడం వంటివి చేయాలి.

వారు చేసిన పనిని ప్రశంసించండి. వారి విజయాలను మీ బంధువులకు ఇతరులకు తెలుపండి. హోం వర్క్ తో నిరంతరం సమస్యలు వస్తుంటే, పిల్లవాడి టీచర్ తో మాట్లాడండి. అతను బోర్డు చూడటంలో సరిగా వున్నాడా? లేక కంటి అద్దాలు కావాలా? అనేది పరిశీలించండి. మరికొంతమందికి క్లాస్ రూమ్ లో సరైన శ్రద్ధ పెట్టలేనిదిగా వుంటుంది. టీచర్ తో సంప్రదించి పిల్లవాడి విషయంలో కొన్ని మార్పులు చేయాల్సివస్తుంది.


No comments: