చాలా కేసులలో, పిల్లలకు పదేళ్ళు వచ్చినా పక్క తడిపేస్తూ వుంటారు. ఇది మీకు మరియు మీ పిల్లవాడికి ఆరోగ్యకరం కాదు. మీరు నిర్లక్ష్య పరుస్తున్న ఈ అంశానికి బిడ్డకు మరో కారణం ఉంటుందని గ్రహించండి.
పిల్లలలో బెడ్ వెట్టింగ్ కు కారణాలు
1. డయాబెటీస్ - చాలామంది పిల్లలు టైప్ 1 డయాబెటీస్ తో పుడతారు. ఇది మనం అంత త్వరగా గ్రహించలేము. డయాబెటీస్ ఉంటే తరచుగా మూత్రం అవుతుంది. రాత్రులందు బిడ్డ మూత్రం ఆపుకోలేక బెడ్ లో చేయవచ్చు. పక్క తడపటం, పిల్లాడిలో అలసట, చూపు సరి లేకపోవటం వంటివి కనుక ఉంటే, మీరు వెంటనే అతనికి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించండి.
2. మలబద్ధకం - పిల్లాడికి మలబద్ధకం ఉంటే, పక్కలో మూత్రం పోసే అవకాశాలు అధికం. అతనికి తెలియకుండానే మూత్రం వచ్చేస్తుంది. ఈ సమస్య పెద్దవారిలో కూడా ఉంటుంది. పిల్లవాడికి టాయ్ లెట్ శిక్షణ బాగా ఇచ్చి, మలబద్ధకం పరిశోధించండి.
3. వంశపారంపర్యంగా - ఇంటిలో గతంలో మీ కుటుంబ సభ్యులలోని పెద్దవారికి కనుక ఈ సమస్య ఉంటే, పిల్లాడికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రాశయం చిన్నది కావచ్చు. లేదా అది సరిగా పనిచేయకపోవచ్చు. ఇవి తల్లితండ్రులనుండి బిడ్డకు వస్తాయి. కుటుంబంలో ఈ చరిత్ర ఉంటే, మీ బిడ్డను ఈ అంశాలకుగానను తప్పక పరీక్షలు చేయించండి.
4. భయం - ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి చిన్న మెదడులో తెలియకుండా ఉండిపోతే, అతనికి తెలియకుండానే మూత్రం వస్తుంది.మీరు అతనిని కొట్టటం, లేదా భయ పెట్టటం వంటివి బెడ్ కి వెళ్ళే ముందు చేయరాదు. ఈ రకమైన భయంతో కూడా అతను మూత్రం చేస్తాడు. కొన్నిమార్లు అతను పడుకునే స్ధలం మార్చినా లేక, ఒక్కడినే పడుకోమన్నా కూడా ఈ సమస్య వస్తుంది.
5. సోదరులమధ్య పోటీలు - ఇతను మీరు రెండవ కొడుకా? మొదటి బిడ్డ అంటే అతని సోదరుడిపై అతనికి అసూయ వుందా? గతంలో మీ ప్రేమ పొందిన అతను ఇపుడు మీ ప్రేమ తక్కువగా ఉండటంచేత కూడా అభధ్రత భావించి ఇటువంటి పనులు చేస్తాడు. ఇది మీ ప్రేమ పొందటానికని భావించండి. తగిన చర్యలు చేపట్టండి.
మీ బిడ్డ పక్కలో మూత్రం చేయకుండా ఉండాలంటే అతనితో కఠినంగానే ఉండండి. కాని అవగాహన కలిగి ఉండండి. పిల్లవాడిని కొడితే సమస్య పరిష్కారంకాదు కనుక పై కారణాలు పరిశీలించి మీ బిడ్డ పక్క తడిపే అలవాటు మాన్పించండి.
No comments:
Post a Comment