1. ముందుగా పిల్లలకి ఎలా మాట్లాడాలో నేర్పించాలి. పెద్దలు ఆచరిస్తే పిల్లలు కూడా వారిని అనుకరించే అవకాశం ఉంది.
2. కృతజ్ఞతకు ‘థాంక్స్', చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ‘సారీ' లాంటి చిన్న చిన్న పదాలు చెప్పడం చిన్నతనం నుండే వారికి అలవాటు చేయాలి.
3. పిల్లల ఎదుట అసభ్య పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అదే విధంగా గొడవలు పడడం కూడా చేయకూడదు. ఇది వారి పసి మెదడు మీద తీవ్రంగా పనిచేస్తుంది.
4. పిల్లల్ని దండిస్తేనే వారు క్రమశిక్షణగా ఉంటారన్నది నూటికి నూరుపాళ్ళు అబద్దం. వారికి నెమ్మదిగా అర్థమయ్యేటట్లు ఒకటికి పదిసార్లు లేదా వందసార్లు అయినా ఓపికగా చెప్పాల్సిన భాద్యత మీకుంది.
5. మంచి ప్రవర్తన అనేది ఓ పాఠంలాగా వారికి రోజులో కొద్దిసేపన్నా చెప్పగలిగితే అది వారి మెదడులో బలంగా నాటుకుపోతుంది.
6. పుస్తకాలు, యానిమేటెడ్ వీడియో చిత్రాల ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పే ప్రయత్నం చేయాలి. మాటలక్నా దృశ్యం వారిలో బలంగా హత్తుకుపోతుంది.
7. క్రమశిక్షణ పేరుతో ఇతర పిల్లలతో వారిని ఎప్పుడూ పోల్చకండి. ఈవిధంగా పోల్చడం వలన వారిలో ఆత్మన్యూనతా భావం నెలకొంటుంది.
No comments:
Post a Comment