ఐరన్ లోపము పెద్దవారిలో కంటే పిల్లల పైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల ఎదుగుదలకు ఐరన్ అత్యవసరం. ఐరన్ లోపం వల్ల ఎనీమియా ఏర్పడుతుంది. మానసికంగా వారిలో కుదురు ఉండదు. ఏకాగ్రత లేకపోవడం, చీటికీ మాటికీ కోపం, విసుగూ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకు రోగనిరోధక శక్తి పెరగడానికి, పిల్లలలో ఎదుగుదలకు, పునరుత్పత్తి విధులకు ఐరన్ తప్పనిసరి.
బాడీలో ఐరన్ తక్కువగా ఉంటే పిల్లలు ఎనీమియా బారిన పడే అవకాశం ఉంది. ఆకు కూరలు, ఎండిన పళ్లు, పుచ్చపండు, బియ్యం, మాంసం, లివర్‌లలో ఎక్కువగా దొరుకుతుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

No comments:
Post a Comment