ఎంత ఉప్పు మంచిది? ట్రేడింగ్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్ వారు నిర్వహించిన సర్వే మేరకు ఒక సంవత్సరంలోపు పిల్లలకు ప్రతిరోజూ 1 గ్రాము ఉప్పు తింటే సరిపోతుంది. 1 నుండి 3 సంవత్సరాల వయసు వారికి ప్రతిరోజూ 2 గ్రాముల ఉప్పు కావాలి, 4 నుండి 6 సంవత్సరాల వయసు వారికి రోజుకు 3 గ్రాముల ఉప్పు కావాలి. 7 నుండి 10 సంవత్సరాల పిల్లలకు రోజుకు 5 గ్రాములు వరకు సరిపోతుంది.
అయితే, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. మనం తీసుకునే ఆహారాలలో అంటే, పాలు, మాంసం, లేదా కూరగాయలు వంటి వాటిలో సహజ సోడియం లభిస్తుంది. కనుక మీ బిడ్డ కనుక పైవాటిలో ఏది తీసుకుంటున్నప్పటికి మీరు ఉప్పును ప్రత్యేకంగా ఆహారంలో వేయకండి. వాటిలో ఉండే ఉప్పు అతనికి సరిపోతుంది. లేదంటే, మీరు అదనంగా వేసే ఉప్పు బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
ఈ హాని ఎలా ఉంటుంది? పిల్లలకు అధిక ఉప్పు నష్టం కలిగిస్తుంది. వారిలో వివిధ రకాల వ్యాధులు వస్తాయి. మన శరీరంలో కిడ్నీలు కనుక సరిగా పనిచేయకపోతే, సోడియంను బ్యాలన్స్ చేయటంలో విఫలం అయితే, దాని భారం వెంటనే మీ శరీరంలోని రక్తనాళాలపై పడుతుంది. ఒత్తిడి అధికం అవుతుంది. కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇపుడు పిల్లలు తినే అధిక ఉప్పు ఆహారాలు వారి తర్వాతి జీవితంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉప్పు అధికమైనందున పిల్లలలో ఆస్తమా, కిడ్నీ రాళ్ళు వంటి వ్యాధులు వస్తాయని స్టడీలు చెపుతున్నాయి. అంతేకాదు, పిల్లలలో ఊబకాయం వచ్చేస్తుంది. కనుక మీ బిడ్డ ఆహారంలో ఉప్పును నియంత్రించి అతడిని సోడియం అధికమైతే కలిగే నష్టాలనుండి కాపాడండి.
తగినంత ఉప్పు అంటే...మీ బిడ్డ కిడ్నీ అధిక ఉప్పు తీసుకోలేదు. కనుక ఒక సంవత్సరం వరకు బిడ్డ ఆహారంలో ఉప్పు వేయకండి. అతను తాగే తల్లిపాలలో ఉండే ఉప్పు శరీరానికి సరిపోతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే, సాస్, గ్రేవీ, కర కరలు వంటివి సోడియం కలిగి ఉంటాయి. కనుక మీ బిడ్డ ఆహారం మంచి గింజలు, కూరలు, పండ్లతో నింపండి. వాటిలో సోడియం తగినంత మాత్రమే ఉంటుంది.
మీ బిడ్డ ఎదుగుదలకు తగినంత సోడియం మాత్రమే మంచిది. అది ఏ మాత్రం సరిగా నియంత్రణ చేయకున్నా హాని కలిగిస్తుంది.
No comments:
Post a Comment