all

Thursday, November 22, 2012

ఎదిగే పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి

పిల్లలకు అన్నం తినిపించడమంటే... పేద్ద పని. చందమామను చూపుతూ తినిపిస్తే వెంటనే తినేయడానికి ఇప్పటి పిల్లలు అమాయకులు కాదు. తినడం ఎలా ఎగ్గొట్టాలో వాళ్లకు బాగా తెలుసు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఓ ఎత్తై అల్లరి పిల్లలకు అన్నం తినిపించడం మరో ఎత్తు. ఏదో టైమ్‌కు తినిపించాలి కాబట్టి బలవంతంగా పిల్లల నోట్లో పెట్టేస్తుంటాం. కానీ ఎలాంటి ఆహారం పిల్లలు ఇష్టంగా తింటారు? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలి? నిపుణుల సూచనలు మీకోసం.
healthy foods growing children

ఎదిగే పిల్లలకు సంపూర్ణ సమతుల ఆహారం తప్పనిసరి. అందుకే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, విటమిన్స్, మినరల్స్, నీరు ఇలా అన్నీ తగిన మోతాదులో కలిపిన పౌష్టికాహారం ఇవ్వాలి. రైస్, బ్రెడ్, చపాతీ, ఇడ్లీ లాంటివి తినిపించాలి. తప్పనిసరిగా పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇక పప్పు ధాన్యాలు, మాంసం కూడా పెట్టాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి. మినరల్స్‌తో కూడాని కొవ్వు పదార్థాలు, స్వీట్స్ తినిపించాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగించాలి. ఇవన్నీ తగిన మోతాదుల్లో తీసుకోవడంవల్ల పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది.
 

No comments: