all

Thursday, November 22, 2012

స్థూలకాయం జన్యువుతో సంతోషమే సంతోషం!

స్థూలకాయానికి కారణమయ్యే జన్యువే మనిషి సంతోషంగా ఉండేలా చేస్తుందని కనుగొన్నారు కెనడాకు చెందిన మెక్‌మాస్టర్ యూనివర్సిటీవారు. 21 దేశాలకు చెందిన 17,200 డీఎన్‌ఏ శాంపిల్స్‌ను అధ్యయనం చేశాక కనుగొన్న సత్యమిది. స్థూలకాయుల్లో చాలా మంది నిత్యసంతోషులుగా ఉండటం వల్ల వాళ్లకు డిప్రెషన్ వచ్చే అవకాశమూ చాలా తక్కువ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొ. డేవిడ్ మేరే. వారు స్థూలకాయానికి డిప్రెషన్‌కూ ఏదో సంబంధం ఉందనే తలంపుతో ఈ అధ్యయనం చేశారు. కానీ డిప్రెషన్‌కూ, బాడీ మాస్ ఇండెక్స్‌కు సంబంధం లేదని తెలిపే ఆధారం వారి అధ్యయనంలో లభ్యమైంది.

No comments: