all

Thursday, November 22, 2012

మీ పిల్లల ‘పళ్ల’ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకొంటున్నారా...?

మనం మన పళ్ల ఉనికి ఏ మాత్రం పట్టించుకోం పొద్దున్న ఒకసారి బ్రష్ చేసుకున్నతర్వాత వాటి గురించి విస్మరిస్తాం. కానీ అవి మనం జీవించిఉంచడానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడానికి నిత్యం సహాయం చేస్తుంటాయి. వాటికి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు తప్ప పంటి ఆరోగ్యం గురించి పట్టించుకోము. అలాంటి పళ్ళు అన్ని కాలాల్లో అందంగా ఉండాలంటే పాటించాల్సిన ఆరు సూత్రాల గురించి నిపుణులు చెబుతున్న సంగతులను మీ పిల్లలకు అలవర్చండి.
1. ప్రతి రోజూ రెండు పూటలా బ్రష్ చేసుకోవడం. ప్రతి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు... రాత్రి డిన్నర్ తర్వాత తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి.

How Are You Taking Care Your Kids Teeth
2. రోజూ బ్రష్ చేసుకునే సమయంలో బ్రష్ ను పళ్లపై ఏదో ఒకవైపు గట్టిగా రుద్దడం గాక... బ్రష్ ను మృదువుగా గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్లు శుభ్రమవుతాయి. అదే పనిగా గట్టిగా రుద్దేయడం వల్ల జరిగే మేలు కంటే హాని ఎక్కువ.
3.రాత్రిపూట దారం సహాయంతో పళ్లలో చిక్కుకున్న ఆహారపదార్థాలను తొలగించే ప్రక్రియ అయిన ఫ్లాసింగ్ చేసుకోండి. ప్రతిరాత్రీ ఫ్లాసింగ్ తర్వాతే నైట్ బ్రషింగ్ చేసుకోవాలి. (మన దేశంలో ప్రజలు ఇంకా ఫ్లాసింగ్ కు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇకనైనా ఫ్లాసింగ్ ప్రయోజనాలు తెలుసుకొని రాత్రి భోజనం తర్వాత ఫ్లాసింగ్ చేసుకోవడం అవసరం.)
4. బ్రషింగ్ పూర్తయ్యాక తప్పనిసరిగా నాలుకను శుభ్రం చేసుకోవాలి. నోటి దుర్వాసనకు దోహదపడే బ్యాక్టీరియాను పెంపునకు అవసరమైన ఆహారపదార్థాల ముక్కుల ప్రధానంగా నాలుకపై వెనకభాగంలో ఉంటాయని గుర్తుంచుకోవాలి.
5. ఆహారం తీసుకున్న ప్రతిసారీ తేటగా ఉన్న నీటితో నోరు పుక్కిలించి శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత చిగుళ్ళపై మాలిష్ చేసుకున్నట్లుగా ఒకసారి వేలితో రాయాలి. దీనివల్ల చిగుళ్ల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
6. ఒకవేళ ఆహారం తిన్న వెంటనే నోరు కడుక్కోలేకపోతే .. చక్కెరలేని బబుల్ గమ్ ను (అందుబాటు లో ఉంటే)నమలాలి. నోటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాల ముక్కల తొలగింపునకు ఇది బాగా దోహదపడుతుంది. పిల్లలెలాగూ బబుల్ గమ్ ను ఇష్టంగానే నములుతారు.

No comments: