all

Thursday, November 22, 2012

గోరింటాకు ఎర్ర గులాబీలా పండాలంటే....?

పంటలేని గోరింటను అరచేతుల్లో పూయించడం అంటే అతివలకు అత్యంత ఇష్టమైనది. మందారంలా పూసినా, గులాబీలా పూసినా... చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. పెళ్లిళ్లలో, పండగల్లో మగువల మనసుల్లో వెంటనే మెదిలేది మెహిందీ. అసలు ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టకోవడం కూడా ఒక వేడుకే కదా. అయితే ఏదో చేతికొచ్చింది కాకుండా మనసుపెట్టి గీయడానికి అరచేతులను కాన్వాస్‌గా మలుచుకోవాలనుకునేవారికి వెబ్‌సైట్లలో లెక్కకు మించి డిజైన్ల ఉన్నాయి. అరబిక్, పాకిస్తానీ, ఇండియన్, బ్రైడల్, రాజస్థానీ...ఒకటేమిటి

how darken the colour mehendi

అందమైన ఆకుపచ్చని హెన్నా డిజైన్లు... చేతులకు, కోమల పాదాలకు ఇనుమడింపజేసే ఈ అందం..చూసి తీరవలసిందే కాని మాటల్లో చెప్పలేనిది. గోరింటా అరచేతుల్లో పెట్టుకుంటే కలలు నిజం చేస్తుందన్నది నమ్మకం. ఇక కేశాలకు పట్టిస్తే చక్కటి రంగుతో జుట్టు మెరిసేలా చేస్తుందన్నది వాస్తవం... ప్రాచీన కాలం నుండి నేటి రకు చక్కటి రంగు కోసం గోరింటాకు పేస్ట్ తయారీలో ఎన్నో రకాల పద్దతులను అనుసరిస్తూ వచ్చారు. గోరింటాకు అందంగా, ఎర్రగా పండి చేతులకు, పాదాలకు చక్కని అందం రావాలంటే ముందుగా గోరింటాకు నాణ్యనతను పరిశీలించాలి. గోరింటాకు మిశ్రమాన్నా సరైన పద్దతిలో తయారు చేసుకోవాలి. అంతే కాదు గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు మీకోసం...
గోరింటాకు(మెహిందీని)రాత్రంతా నానబెట్టాలి: గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడినీళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్ టీలో కనుక కలిపి నానబెట్టినట్లైతే మరింత డార్క్ కలర్ తో గోరింట పండుతుంది.
మెహిందీకి కాఫీపౌడర్ మిక్స్: మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్ కలిపుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు పెట్టుకొన్నట్లైతే కాఫీ బ్రౌన్ కలర్ లో పండుతుంది.
నిమ్మరసం మరియు పంచదార: నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్ లా తయారు చేసుకోవాలి. మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరేసమయంలో ఈ లెమన్ సుగర్ సిరఫ్ ను చేతులకు అప్లై చేయాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్.
మెహిందీని పెట్టుకొన్న తర్వాత కనీ 6గంటల సమయం అలాగే ఉంచాలి: గోరింటాకు చేతులకు పెట్టుకొన్న తర్వాత అది చేతుల మీద కనీసం ఆరుగంట సమయం అన్నా ఉండేట్లు చూసుకోవాలి. అందుకు లెమన్ సుగర్ సిరఫ్ ను మధ్య మధ్యలో రాస్తుంటే మీరు కోరుకొన్న కలర్ మీ చేతుల్లో పండుతుంది.
లవంగాల ఆవిరి పట్టించడం: లవంగాలను ఒక పాన్ లో వేసి వేయించాలి. వేయించే సమయంలో వచ్చే పొగ మీద రెండు చేతులను ఒక అంగుళం దూరంలో పెట్టి ఆవిరి పట్టించాలి. ఆ పొగ చేతులకు వేడి పుట్టించి మెహిందీ మరింత ఎర్రగా పండేలా చేస్తుంది.

నొప్పిని పోగొట్టే బామ్: మెహిందీ పెట్టుకొన్న తర్వాత ఈ పెయిన్ రిలిఫీ బామ్ ను అప్లై చేయడమనేది చాల పాత పద్దతి. దీన్ని ఉపయోగించడం వల్ల చేతులకు వేడి పుట్టించి మెహిందీ బాగా ఎర్రగా పండేలా చేస్తుంది.

No comments: