all

Thursday, November 22, 2012

తుమ్ము వస్తే..!

మన ముక్కులో సున్నితమైన మ్యూకస్ పొర ఉంటుంది. దాని మీద ధూళికణాలు వచ్చి చేరితే వాటిని బయటికి పంపే ప్రయత్నంగా వచ్చేదే తుమ్ము. ధూళికణాలు చేరినపుడు దానికి సంబంధించిన సమాచారం వెంటనే మెదడుకు అందుకుని స్పందిస్తుంది. తర్వాత మన శ్వాస్రకియను ప్రేరేపిస్తుంది. మెదడు ఆదేశాలకు అనుగుణంగా ఊపిరితిత్తులు కొన్ని సెకన్లు బిగుసుకుపోతాయి. ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడితో వాటిలోని గాలి ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ఉన్నపళంగా వేగంగా గాలి బయటకు రావడంతో ఒక ప్రత్యేకమై శబ్దం కూడా వస్తుంది.

దీన్నే మనం తుమ్ము అంటాం. దీనివల్ల మ్యూకస్‌పై పేరుకున్న వ్యర్థపదార్థాలు కూడా బయటపడతాయి. గట్టిగా తుమ్మినపుడు సుమారు 5వేల నీటి బిందువులు కూడా బయటకు చిమ్ముతాయి. తుమ్మేటపుడు చెయ్యి అడ్డుపెట్టుకోమంటారు. లేకుంటే రోగ క్రిములు వ్యాపించే అవకాశం ఉంది.

No comments: