all

Thursday, November 22, 2012

పెరిగే పిల్లల తిండి అవసరాలు!

పిల్లల తిండి అలవాట్లు చాలా విచిత్రంగా వుంటాయి. వీరిది ఎదిగే వయసు. కనుక మంచి ఆహార పోషణ వీరికి కావాలి. సాధారణంగా పిల్లలకు రెండు నుండి పది సంవత్సరాల వయసు వరకు తిండి అలవాట్లు కష్టంగానే వుంటాయి. ఈ సమయంలో వీరిలో శారీరక పెరుగుదల మరియు మానసిక పెరుగుదల ఏర్పడుతుంది. చాలామంది పిల్లలు ఈ వయసులో సరైన ఆహారం తినరు. ప్రతి పదార్ధానికి ఇష్టం అయిష్టం చూపుతారు. కొన్ని ఆహారాలంటే ఆకలి ఉండదంటారు. కనుక మీ పిల్లలు సరిగా ఆహారం తినకుంటే, అది పోషకాహారలేమికి దోవతీస్తుంది. వారి పెరుగుదల అరికడుతుంది. మరి కింది అంశాలు పరిశీలించి మీ పిల్లవాడు ఏ దశలో వున్నాడో గ్రహించండి.
మీ బిడ్డ అతి కొద్దిగా తింటున్నాడా?
మీ బిడ్డ కొన్ని ఆహారాలు మాత్రమే తింటున్నాడా?
కొత్త ఆహారాలు తినటానికి ప్రయత్నం చేయటంలేదా?
కూరగాయలు లేదా మరి కొన్ని ఆహారాలు తినేందుకు నిరాకరిస్తున్నాడా?
ఆహారాలపై ఇష్టాలు అయిష్టాలు, తీవ్రంగా చూపుతున్నాడా?
భోజన సమయంలో పిల్లవాడు ఆగం ఆగం చేస్తున్నాడా?

పై ప్రశ్నలలో రెండింటికి కనుక మీ సమాధానం అవును అయితే, మీ పిల్లవాడు సరిగా ఆహారం తిననివాడుగాను, అతనికి పోషకాహార లేమి వుందని గ్రహించండి.

సరిగా తినకపోవటమనే ఈ అలవాటును పిల్లవాడికి త్వరగా మాన్పించాలి.
ఒక పేరెంట్ గా మీ పిల్లవాడికి పోషకాహారం ఎలా వుండాలనేది మీరు తెలుసుకోవాలి. అతని ఎదుగుదలకు సహకరించే చర్యలు చేపట్టాలి. పోషకాహారం తినటానికి విసుగుగానే వుంటుంది. అయితే దానిని పిల్లవాడు తినే విధంగా ఆకర్షణీయంగా, ఆసక్తి కరంగా వుండేలా చేయాలి. కొత్త ఆహారాలు మెల్లగా అలవాటు చేయండి. ఇది మీ బిడ్డ అభివృధ్ధికి కొత్త రుచులు ఆనందించేందుకు తోడ్పడుతుంది.
5 నుండి 10 సంవత్సరాల పిల్లలకు సూచించదగిన ఆహార ఎంపికలు
బ్రేక్ ఫాస్ట్ - ఒక ఎగ్ భుర్జి, బ్రెడ్, లేదా ఆనియన్ టమాట ఊతప్ప లేదా గోధుమ బ్రెడ్ కేప్సికం టోస్ట్, లేదా పరోటా కొంచెం కర్రీ, మరియు అరటిపండు.
మధ్యాహ్న ముందు భోజనం - ఒక్క గ్లాసు పండ్ల రసం
లంచ్ - కార్న్ సూప్ తో రొట్టె, లేదా చపాతీలు, ఒక కప్పు ఆకు కూర లేదా ఒక కప్పు పెద్దది వెజిటబుల్ పులావ్ మరియు 1 కప్ చికెన్ వంటకం, కొంచెం పెరుగు అన్నం.

Foods Kids Growing Years



సాయంత్రం ముందు సమయం - ఒక గ్లాసు పండ్లరసం
డిన్నర్ - రెండు మీడియం సైజు చపాతీలు, ఒక కప్పు కూర. మరియు రైస్ మరియు అరకప్పు పప్పు, లేదా చేప లేదా చికెన్ కర్రీ, లేదా కిచిడి ఒక కప్పు బటర్ మిల్క్ లేదా తీపి పెరుగు
ఈ ఆహారం సూచించినదే, ప్రతి పిల్లవాడికి అవసరాలు మారుతూంటాయి. అవసరమనుకుంటే, పిల్లల పోషకాహార నిపుణులను సంప్రదించండి.


 
 
 
 

No comments: