all

Thursday, November 22, 2012

పిల్లి - స్నేహితులు-kids story

ఒకసారి ఒక పిల్లి తాను ఏదైనా పెద్ద జంతువుతో స్నేహంగా ఉండాలి, అప్పుడే రక్షణ ఉంటుందని భావించింది. అనుకున్నదే తడవుగా దగ్గర్లోని సింహం గుహకి వెళ్లి తన అభిప్రాయం చెప్పింది. సింహం అందుకు అంగీకరించింది. ఆ రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి.
ఒకరోజు అలా షికారుగా అడవిలో తిరుగుతుంటే ఓ పెద్ద ఏనుగు ఎదురైంది. పిల్లి భయపడి చెట్టెక్కింది. సింహం దానితో తలపడలేక అక్కడి నుండి పారిపోయింది.



వెంటనే పిల్లి కిందికి దిగి ‘నువ్వే అందరికంటే బలమైనవాడివి. నీతోనే ఉంటాను’ అంది. ఏనుగు సరేనంది. వారిద్దరూ చాలారోజులు ఎంతో స్నేహంగా ఉన్నారు. ఒకరోజు అలా తిరగుతుండగా ఒక వేటగాడు కనిపించాడు. ఏనుగు వేటగాడిని చూసి భయపడింది. అతడు బాణం ఎక్కుపెట్టగానే అడవిలోకి పారిపోయింది. ‘అయ్యో’ అనుకున్న పిల్లి పరుగున ఆ వేటగాడి దగ్గరకు వెళ్లింది.

‘ఈ లోకంలో నీకంటే బలవంతుడు లేడు. నీతోనే స్నేహం చేస్తాను’ అంది. వాడు అంగీకరించాడు. వెంటనే పిల్లిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి వేటగాని ఇంటికి వెళ్లారు.

వేటగాడు ఇంటికి వెళ్లగానే అతని భార్య బాణం తీసుకుని లోపలికి వెళ్లింది. కానీ వేటగాడేమీ అనలేదు. ఆమె తిన్నగా వంటింట్లోకి వెళ్లింది. అది చూసి, ఈమె అందరికంటే శక్తిమంతురాలు అనుకుంది. వెంటనే ఆమెను అనుసరించింది. అప్పట్నుంచి పిల్లులు వంటిల్లు పట్టుకుని వదలడం లేదని చమత్కారంగా చెబుతారు.

No comments: