all

Thursday, November 22, 2012

నిత్య యవ్వనానికి.. ఆరోగ్యానికి నవ్వే దివ్వౌషధం

నవ్వులు నాలుగు విధాల చేటు అన్నది ఒకప్పటి మాట. మనస్పూర్తిగా నవ్వకపోతే మానసికంగానే కాదు శారీరకంగాను నష్టపోతామని ఇప్పటి డాక్టర్ల మాట. ఇంటా బయటా టెన్షన్లతో బతికేస్తున్న నేటి తరానికి బలవంతంగానైనా నవ్వడం సాధ్యమేనా? ఏడిపించడం చాలా సులభం కానీ నవ్వించడం అంత ఈజీ కాదని మహామహులు సైతం ఓప్పుకుంటారు.
అందంగా కనపడాలనుకునేవారు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవటం వల్ల మానసిక వత్తిడికి దూరంగా ఉండవచ్చు. ఏ మాత్రం సమయం దొరికినా విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలసట, ఆందోళన ఎల్లప్పుడూ మన ముఖంలో కనిపిస్తుంది. అద్దంలో గమనిస్తే మనకే తెలుస్తుంది. మానసికంగా విశ్రాంతి లేకపోతే అందంగా కనిపించడం జరగని పని. ప్రతిరోజూ వ్యాయామంతో మనసులో ఎలాంటి ఆందోళనలు లేకుండా ఉంటే అందంగా ఉల్లాసంగా ఉండవచ్చు.
నవ్వు కూడా ఆరోగ్యానికి మంచిది. నవ్వడం కూడా ఒక కళ. హాయిగా నవ్వుతూ బతకడమే జీవితానికి అర్థం. నవ్వు అందానికి మిత్రుడు. నవ్వితే ఆ అందమే అందం. అందుకే చాలామంది అంటారు ఆ అమ్మాయి నవ్వితే చాలా అందంగా ఉంటుందని. నవ్వు మనిమరి హాయిగా నవ్వాలంటే ఏం చేయాలి? ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.. నవ్వుల వానలో తడుస్తారేమో...

Laughter Is The Best Medicine The Health

1. చక్కని కామెడీ సినిమాకానీ టీవి షోలు కాని చూడండి. వీలైతే విజయావారి చిత్రాలతోపాటు జంధ్యాల సినిమాల సీడీలు తెచ్చుకుని చూడండి.
2. మంచి హాస్య రచయితల పుస్తకాలు చదవండి. వార, మసాపత్రికలలో వచ్చే కార్టూన్స్ ను, హాస్య కథలను వదలకుండా చదవండి. ఎక్కడైనా నవ్వును మీరు మిస్ అయిపోవచ్చు.
3. మీకు నచ్చిన జోక్స్ ను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసుకొని వారినీ హాయిగా నవ్వనివ్వండి.
4. నవ్వొచ్చినప్పుడు దాచుకోకూడదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని మొహమాటపడకండి. హాపీగా నవ్వేయ్యండి. అలా నవ్వే మీరు ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తారు.
5. ఒక్కోసారి విచిత్రమైన మేనరిజం ఉన్న వ్యక్తులు తారసపడుతుంటారు. వారి మేనరిజం పట్టెయ్యండి. మీ వాళ్ల ముందు అనుకరించండి. ఇక నవ్వుల పండుగే.
6. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటితో ఆడుకోండి. వాటి ఆటలతో మీ మనసు ఉల్లాసభరితమవుతుంది.
7. పిల్లలతో సరదాగా ఉండేందుకు ప్రయత్నించండి. వారితో ఆడండి...పాడండి. టెన్షన్లుంటే దూరం కావడమే కాదు, మీ మధ్య బంధం కూడా బలపడుతుంది.
8. మార్నింగ్ వాక్ చేయడం మీకు అలవాటుంటే మిగిలిన వాకర్స్ తో కలిసి ఓ అరగంట పాటు జోక్స్ పంచుకోండి. పది మంది కలిస్తే నవ్వులకేం కొదవ...
9. మీకు ఆట వచ్చినా రాకున్నా పిల్లలతో సరదాగా క్రికెట్, టెన్నిస్ వంటివి ఆడండి. మీ చేష్టలతో అందరినీ నవ్వించండి...
10. భోంచేసేటప్పుడు కూడా కోపంగా బాధగా- ఏడుస్తూ తినకండి. తినే ఆహా రం విషంలా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కనుక ప్రతి ముద్ద ముద్దనూ-సంతో షంగా-చిరునవ్వుతో భోంచేయండి. తిన్న ఆహారం వంటబట్టి మీరు మరింత ఆరోగ్యవంతులుగా ఆకర్షింపబడతారు.

No comments: